వయసు పెరగడంలో వచ్చే సాధారణ సంకేతం, సెబోరిక్ కెరటోసిస్ అనే చర్మ లక్షణం. ఇది హానికరం కాదు, ఎలాంటి చికిత్స అవసరం లేదు.
బెంగుళూరు వాసి అయిన 58 ఏళ్ళ చిత్ర(ఇంటిపేరును గోప్యంగా ఉంచాం) ఒక రోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత ఆమె చెంప మీద లేత గోధుమ రంగు మచ్చను గమనించారు. వంట చేసే సమయంలో తెలియకుండానే తన ముఖం మీద కాలి ఉంటుందేమో అనుకున్నారు. ఉద్యోగానికి వెళ్ళి, తన సహోద్యోగుల్ని కలవడానికి ఆందోళనపడ్డారు.
‘‘నా మెడ మీద అండాకారంలో ఉన్న మచ్చ ఏర్పడింది. అది హఠాత్తుగా ఎలా వచ్చిందో అర్థం కాలేదు’’ అని చిత్ర అన్నారు. ‘‘మొదటి రోజు దాన్ని చూసినప్పుడు, నేను చాలా షాకయ్యాను. కన్సీలర్ ఉపయోగించి దాన్ని కవర్ చేశాను. వంట చేసేటప్పుడు కాలి ఉంటుంది లేదా వేడి నూనె చింది పడి ఉంటుంది అనుకున్నా. కొన్ని రోజుల పాటు కాలిన గాయాలకు పూసే ఆయింట్మెంట్ కూడా ఉపయోగించాను అని చెప్పారు.
అయితే చిత్రకి అసలైన ఉపశమనం కొన్ని రోజుల తర్వాత దొరికింది ‘‘ఆ మచ్చ కాస్త నల్లగా మారింది. నేను ఒక డెర్మటాలజిస్టుని కలిశాను. అది క్యాన్సర్ కాదని, ముసలితనంలో వచ్చే హాని లేని పులిపిరి అని ఆ డాక్టర్ నిర్ధారించారు’’ అని ఆమె చెప్పారు.
సెబోరిక్ కెరటోసిస్ అంటే ఏంటి?
చర్మం మీద బయటికి కనిపించే ప్రదేశాల్లో గోధుమ లేదా నలుపు రంగులో ఏర్పడే మచ్చలు ముఖ్యంగా వయసు మళ్ళిన వాళ్ళలో ఇవి వస్తాయి. వీటి వల్ల ఏ హానీ ఉండదు. ముసలితనానికి ఇవి సాధారణ సంకేతాలు. చర్మం మీద వచ్చే ఈ మచ్చలకు ఎలాంటి చికిత్స అవసరం లేదు. వీటిని సెబోరిక్ కెరటోసిస్ లేదా ఎస్కే అంటారు. ఇది క్యాన్సరేతర ఒక చర్మ లక్షణం. వయసు మళ్ళిన వారిలో ఒకటి రెండు లేదా కొందరిలో ఎక్కువ సంఖ్యలో ఇలాంటి మచ్చలు ఏర్పడతాయి.
సెబోరిక్ కెరటోసిస్‌ని ముసలితనంలో వచ్చే పులిపిర్లు లేదా జ్ఞాన పులిపిర్లు అని కూడా అంటారని కర్నాటకలోని మంగళూరు KMC హాస్పిటల్ లో డెర్మటాలజీ కన్సల్టెంట్ గా పని చేస్తున్న డాక్టర్ గతా ఎమ్ ఉపాద్యా అన్నారు. ముసలితనంలో వచ్చే పులిపిర్లను వెంటనే గుర్తించొచ్చు. వాటి వల్ల ఎలాంటి సమస్యలూ తలెత్తవని ఆమె తెలిపారు. ‘‘ముఖం, మెడ, బయటికి కనిపించే ఇతర శరీర భాగాల్లో ఈ పులిపిర్లు ఏర్పడతాయి కాబట్టి కొందరు వాటిని తొలగించుకోడానికి డాక్టర్ని సంప్రదిస్తుంటారు’’ అని ఆమె అన్నారు.
కేరళలోని అరీకోడ్లో ఉన్న ఆస్టర్ మథర్ హాస్పిటల్కి చెందిన డెర్మటాలజిస్ట్ డాక్టర్ ఆర్యా జేమ్స్ ఇలా చెబుతున్నారు. సెబోరిక్ కెరటోసిస్ చర్మం మీద కనిపించే సాధారణమైన గడ్డలు. ‘‘వయసు పెరిగే కొద్ది కొందరిలో ఇవి ఎక్కువగా వస్తుంటాయని, పురుషులైనా, మహిళలైనా వీటి వల్ల సమానంగానే ప్రభావితం అవుతారు’’ అని ఆయన తెలిపారు.
సెబోరిక్ కెరటోసిస్‌కి కారణం ఏంటి?
‘‘ఇది వయసు మళ్ళిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. తరచుగా 60 ఏళ్ళు పైబడిన వారికి వస్తుంది. చాలా కేసుల్లో ఈ ముసలితనంలో వచ్చే పిలిపిర్లు శరీరం మీద అంతటా కనిపిస్తుంటాయి’’ అని డాక్టర్ ఉపాధ్యాయ అన్నారు. ‘‘ఎక్కువగా ఎండ తాకే శరీర భాగల మీద కనిపిస్తాయి. అలాగే నేరుగా ఎండలో పని చేసే వారికి ఎక్కువగా వస్తాయి. ఇలాంటి స్థితికి సరిగ్గా కారణం అనేదేదీ లేదు. దీర్ఘకాలికంగా సూర్య కిరణాలు చర్మానికి కలిగించిన నష్టం ఫలితంగా ఏర్పడొచ్చు’’ అని ఆమె తెలిపారు.
సెబోరిక్ కెరటోసిస్ సాధారణంగా ఎలాంటి లక్షణాలు లేకుండా అండాకారంలో ముదురు గోధుమ నుంచి నలుపు రంగు మచ్చలతో ఏర్పడి చర్మం మీద అతుక్కున్న పెచ్చుల్లాగా కనిపిస్తాయని డాక్టర్ జేమ్స్ అన్నారు. ‘‘సాధారణంగా ముఖం, తల, మెడ, చర్మం మడతల్లో, బయటకి కనిపించే చర్మం మీద, కొన్నిసార్లు మర్మావయవాల దగ్గర కూడా ఏర్పడతాయి’’ అని ఆమె అన్నారు.
బెంగుళూరు వాసి అయిన చిత్రకి మొదటి మచ్చ ఆమె మీద ఏర్పడింది. కొన్ని నెలల తర్వాత ఆమె దాన్ని గమనించారు. ‘‘నేను మా వారితో మాట్లేటప్పుడు మొదటి పిలిపిరిని ఆయన చూపించారు. అది నా మెడ వెనక భాగంలో ఉంది. దాన్ని నేను తొలగించుకోవాలని మా వారు అనుకోవడం లేదు. కానీ నేను మాత్రం దాన్ని తొలగించుకోవాలనుకుంటున్నా’’ అని ఆమె అన్నారు.
ఇతర చర్మ సమస్యలు
ఇదే లక్షణాలతో ఉండే ఇతర చర్మ సమస్యల్ని ఎలా గుర్తించాలో డాక్టర్ ఉపాద్యా చెప్పారు. పులిపిర్లు చర్మం మీద పైకి లేచి ఉంటే వాటిని సెబోరిక్ కెరటోసిస్ అంటారు. ఒకవేళ అది కేవలం చర్మం రంగు మారడం అయితే దాన్ని స్టకో కెరటోసిస్ అంటారు. కొన్నిసార్లు చర్మం ఉపరితలం నుంచి పులిపిర్లు వేలాడుతూ కూడా ఉంటాయి. ప్రధానంగా మెడ మీద ఇలా కనిపిస్తాయి. వీటిని డీపీఎన్(డెర్మటోసిస్ పాపులోసా నీగ్రా) అంటారు.
డెర్మోస్కోపీ ద్వారా పులిపిర్ల లక్షణాల్ని సరిగ్గా నిర్దారించొచ్చని డాక్టర్ జేమ్స్ తెలిపారు. ‘‘అసాధారణంగా కనిపించే మచ్చలు, పులిపిర్లను బయోప్సీ చెయ్యాలి. సెబోరిక్ కెరటోసిస్ని పులిపిర్లు, పుట్టుమచ్చలు, స్కిన్ ట్యాగ్స్, మెలనోమా(ఒక తీవ్రమైన చర్మ క్యాన్సర్) మెలనోసైటిక్ నెవీ(పుట్టుమచ్చ), పిగ్మెంటెడ్ బాసల్ సెల్ కార్సినోమా(ఒకరకమైన చర్మ క్యాన్సర్) అలాగే పిగ్మెంటెడ్ బోవెన్స్ డిసీజ్(మరొక రకమైన చర్మ క్యాన్సర్ గా పొరబడుతూ ఉంటారు)’’ అని ఆమె అన్నారు.
హఠాత్తుగా సెబోరిక్ కెరటోసిస్ రావడం
ముసలితనంలో వచ్చే పులిపిర్లు హఠాత్తుగా మొదలైనప్పుడు, ముఖ్యంగా అవి మొండెం మీద వస్తే వాటి చికిత్స, మందుల వాడకం కోసం వెంటనే డాక్టర్లను సంప్రదించడం మంచిది అని డాక్టర్ ఉపాద్యా చెప్పారు. హఠాత్తుగా సెబోరిక్ కెరటోసిస్ రావడాన్ని లెజెర్-ట్రెలాట్ అంటారు.
డాక్టర్ జేమ్స్ ఏం చెబుతున్నారంటే, హఠాత్తుగా ఎక్కువ సంఖ్యలో సెబోరిక్ కెరటోసిస్ రావడాన్ని లెజెర్-ట్రెలాట్ సిండ్రోమ్ గా పరిగణించాలి, ముఖ్యంగా మొండెం మీద ఎక్కువగా రావడానికి కారణం ఏంటంటే, అది అంతర్గతంగా ఉన్న ఎడినో కార్సినోమా(ఒక రకమైన క్యాన్సర్)కి సంబంధించింది అయ్యి ఉండొచ్చు. అది పొట్ట, పెద్ద పేగు, అన్నవాహిక, రొమ్ము, ఊపిరితిత్తులకు సంబంధించింది. మైకోసిస్ ఫంగాయిడ్స్, సెజరీ సిండ్రోమ్లకు సంబంధించిన కొన్ని కేసుల్లో లెజర్-ట్రెలాట్ లక్షణాలు కనిపిస్తాయి. అలాంటి కేసులకు ట్యూమర్ స్క్రీన్ చేయించుకోవడం మంచిది.
డాక్టర్ సహాయం ఎప్పుడు తీసుకోవాలి?
‘‘సాధారణంగా ఈ సెబోరిక్ కెరటోసిస్ అనేది కాలక్రమేణా వస్తుంది. నెలకి ఒకటి రెండు పిలిపిర్లు లేదా కొన్నేళ్ళలో మెల్లిగా వాటి సంఖ్య పెరుగుతుంది’’ అని డాక్టర్ ఉపాద్య అన్నారు. ‘‘సెబోరిక్ కెరటోసిస్ అసలైన కేసుల్ని డెర్మటాలజిస్ట్ చూడగానే గుర్తించగలుగుతారు. అయితే పరీక్షలు చేయించుకుని, నిర్ధారించుకోవడం మంచిది’’ అని ఆమె చెప్పారు.
డాక్టర్ ఉపాద్యా ఇంకా ఏం చెప్పారంటే, చర్మం రంగు మారడం ద్వారా వచ్చే ఎలాంటి పులిపిరి అయినా అతిగా దురదతో పాటు రక్తం కారడం లేదా రంగులు మారడం లేదా రసికారుతూ ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఎందుకంటే అది అంతర్గతంగా ఉన్న మెలనోమాకి స్పష్టమైన సంకేతం. దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే దాని సైజు పెరుగుతుంది. శరీరం మీద విస్తరిస్తుంది. అయితే దాని వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలూ, ఇబ్బందులు ఉండవు.
‘‘సెబోరిక్ కెరటోసిస్ ప్రమాదకరం కాదు. అయితే చర్మం మీద పెరిగే వాటిని ఎవరూ నిర్లక్ష్యం చెయ్యకూడదు’’ అని డాక్టర్ జేమ్స్ అభిప్రాయపడ్డారు. ‘‘అపాయం లేని, ప్రమాదకరమైన చర్మ లక్షణాల మధ్య తేడాని గుర్తించడం కష్టం. సెబోరిక్ కెరటోసిస్ లాగా కనిపించేది మెలనోమా కూడా అవ్వొచ్చు. కొత్తగా పెరుగుతూన్నా లేదా ఉన్నదాని రూపం మారుతున్నా డెర్మటాలజిస్ట్ ని సంప్రదించడం మంచిది.
సెబోరిక్ కెరటోసిస్ ని తొలగించడం ఎలా?
డాక్టర్లకు అనుమానం వచ్చినప్పుడు, వాళ్ళు బయాప్సీ చేస్తారు. దాని తగ్గట్టుగా చికిత్సని అందిస్తారని డాక్టర్ ఉపాద్య తెలిపారు. ‘‘ సన్ స్క్రీన్ ని ఉపయోగించడం వల్ల అది పెరగడం, శరీరమంతా వ్యాపించడం తగ్గుతుంది. కానీ పూర్తిగా ఆగదు’’ అని ఆమె అన్నారు. ‘‘దాని వల్ల వాటి సంఖ్య తగ్గుతుంది. ముసలితనంలో వచ్చే పులిపిర్లు రావడం మొదలైతే ఇక అవి ఆగడం ఉండదు. అయితే కాల్చడం లేదా వారానికొకసారి నైట్రోజన్ థెరపీ ఇవ్వడం ద్వారా వాటిని తొలగించొచ్చు. ఎలక్ట్రికల్ కరెంట్ ద్వారా కొన్ని మచ్చలు, పిలిపిర్లను తొలగించొచ్చు’’ అని ఆమె తెలిపారు.