728X90

0

0

0

అంశాలకు వెళ్లండి

వృద్ధాప్యాన్ని ఆలస్యం చేసే ఆహారాాలు ఇవే
14

వృద్ధాప్యాన్ని ఆలస్యం చేసే ఆహారాాలు ఇవే

యాంటీ ఏజింగ్ ఫుడ్స్ మాత్రమే తీసుకోవడం వల్ల శరీర సమతుల్యత దెబ్బతింటుందని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ ఆహారాలు తీసుకోవడం వల్ల వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయవచ్చని సూచిస్తున్నారు.
యాంటీ ఏజింగ్ ఫుడ్స్

వృద్ధాప్యం ప్రతిఒక్కరికీ వస్తుంది. అయితే చాలా మంది వృద్ధాప్యం ఛాయలు లేకుండా ఉండాలని భావిస్తుంటారు. వృద్ధాప్యాన్ని నిరోధించే ఆహారాలు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి మరియు వృద్ధాప్యాన్ని కనబడనివ్వకుండా చేయగలవని నిపుణులు అంటున్నారు.

వృద్ధాప్యం అనేది అనివార్యం. వృద్ధాప్యం అనేది అంతర్గతంగానూ, బాహ్యంగానూ ఉంటుందని నిపుణులు అంటున్నారు. అంతర్గత కండరాల బలం, బిగుతుగా ఉండే పరమాణు నిర్మాణం, లోపల బాగా పనిచేసే అవయవాలు మరియు వెలుపల కాంతివంతమైన చర్మం యవ్వనాన్ని సూచిస్తాయి. వయస్సుతో పాటు, ఈ అంశాలలో స్పష్టమైన మార్పు ఉంటుంది. 

శరీరంలోని అతి పెద్ద అవయవం అయిన చర్మం వృద్ధాప్యానికి స్పష్టమైన సూచిక. “వృద్ధాప్యం చర్మ కణాలను దెబ్బతీస్తుంది. ఇది అంతర్గత కారకాలు (జన్యువులు) లేదా బాహ్య కారకాలు (UV కిరణాలు, ధూమపానం, ఆల్కహాల్, వాయు కాలుష్యం లేదా పోషకాహార లోపం) వల్ల కావచ్చు,” అని క్లినికల్ న్యూట్రిషనిస్ట్ మరియు న్యూట్రిషన్ డిఫైన్డ్ అనే సంస్థ వ్యవస్థాపకురాలు రిధిమా బాత్రా వివరించారు. 

బెంగుళూరుకు చెందిన పోషకాహార నిపుణులు, ఇన్‌స్టాగ్రామర్ మరియు యోగా టీచర్ షాలిని అభిలాష్ మాట్లాడుతూ, “తరచుగా, బాహ్య కారకాలు వృద్ధాప్య చర్మాన్ని జన్యుపరమైన వాటికంటే ఎక్కువగా ప్రభావితం చేస్తాయి అని అన్నారు. 

కొల్లాజెన్‌లో తగ్గుదల: చర్మం వృద్ధాప్యానికి మూల కారణం 

కొల్లాజెన్ అనేది వృద్ధాప్యాన్ని నిర్ణయించే అమైనో ఆమ్లం. ఈ ప్రోటీన్ ఆధారిత కణజాలం కీళ్ళు, కండరాలు మరియు కణజాలాలను కలుపుతుంది. ఇది చర్మం యొక్క పరమాణు నిర్మాణాన్ని దృఢంగా బంధిస్తుంది,”అని షాలిని చెప్పారు. 

“25 సంవత్సరాల వయస్సు వరకు ఇది మన శరీరంలో పుష్కలంగా లభ్యమవుతుంది, 25 తర్వాత, కొల్లాజెన్ ఉత్పత్తి ప్రతి సంవత్సరం 10-15 శాతం తగ్గుతుందిఅని షాలిని వివరించారు. 

మనిషి వయసు పెరిగే కొద్దీ చర్మంపై కనిపించే మార్పులకు కొల్లాజెన్ తగ్గడమే ప్రధాన కారణమని రిధిమా వివరిస్తున్నారు. కొల్లాజెన్ తగ్గుదలకు కొన్ని ప్రమాద కారకాలు ధూమపానం, మద్యం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ప్రాసెస్ చేయబడిన ఆహారం, అధిక చక్కెర తీసుకోవడం మరియు సక్రమంగా నిద్రించకపోవడం. 

నిద్ర లేకపోవడం లేదా సమయానికి నిద్రపోని అలవాట్లు కూడా వృద్ధాప్యానికి దారితీస్తాయని షాలిని హెచ్చరించారు. 

వృద్ధాప్య ప్రారంభ సంకేతాలు

చర్మ వృద్ధాప్యం యొక్క ప్రారంభ సంకేతాలు వీటి ద్వారా సూచించబడతాయని రిధిమా వివరించారు: 

  • హైపర్ పిగ్మెంటేషన్ 
  • వదులుగా ఉండే చర్మం లేదా చర్మం స్థితిస్థాపకత కోల్పోవడం 
  • జుట్టు తెల్లబడటం లేదా జుట్టు రాలడం 

అధిక కొల్లాజెన్ ఉత్పత్తి అంటే వృద్ధాప్యం  ఆలస్యం కావడం 

కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడం వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తుంది. సహేతుకమైన ఆహారం మరియు సమతుల్య పోషకాహారం ద్వారా దీనిని సాధించవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కొల్లాజెన్‌ను కలిగి ఉండే ఆహారం మాంసం మాత్రమే అయితే, యాంటీ ఏజింగ్ కోసం మాంసాన్ని తీసుకోవడం మంచిది కాదని షాలిని స్పష్టం చేశారు. ఫైబర్‌తో పాటు శాఖాహారం తీసుకోవడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచవచ్చు, అని షాలిని చెప్పారు. 

“100 గ్రాముల మాంసంలో దాదాపు 0.3% కొల్లాజెన్ ఉంటుంది” అని ఆమె చెప్పారు. 

యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ మరియు విటమిన్ C, జింక్, కాపర్, సిలికాన్, గ్లైసిన్, లైసిన్ సమృద్ధిగా ఉండే ఆహారాలు కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయని రిధిమా చెప్పారు. 

యాంటీ ఏజింగ్ ఫుడ్స్: మ్యాజిక్ కషాయం ఏమైనా ఉందా? 

శాఖాహారంలో ఎక్కువ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. కానీ, కొన్ని ఆహారాలు యాంటీఆక్సిడెంట్లు మరియు/లేదా ఫైబర్‌లో కొన్ని మిల్లీగ్రాముల మేర అధికంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన జీవనశైలితో యవ్వనాన్ని ప్రారంభించడం వృద్ధాప్యం ఆలస్యం అవడానికి కీలకంఅని షాలిని చెప్పుకొచ్చారు. 

బెంగుళూరుకు చెందిన 42 ఏళ్ల IT ప్రొఫెషనల్ ఆశా ఆర్, హ్యాపీయెస్ట్ హెల్త్‌తో మాట్లాడుతూ, ఆమె ఆరోగ్యం బాగా ఉండటం కోసం ఒక సంవత్సరం పాటు ఉసిరికాయ జ్యూస్ తీసుకోవడం ప్రారంభించాను. “నేను ఉదయం ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ తాగుతాను. నా శక్తి స్థాయిలు మెరుగ్గా ఉన్నాయని నేను భావిస్తున్నాను. నా చర్మం కూడా ఒక సంవత్సరం క్రితం కంటే ఆరోగ్యంగా మరియు మరింత ప్రకాశవంతంగా అనిపిస్తుంది అని అన్నారు. 

యాంటీ ఏజింగ్ ఫుడ్స్ జాబితాలో చాలానే ఉన్నాయి, అందులో కొన్ని ఏమిటంటే : 

  • కలబంద 

కలబంద గుజ్జులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కలబంద రసాన్ని ఉదయాన్నే తీసుకుంటే మంచిదని షాలిని అభిప్రాయపడ్డారు. మొరింగ ఆకులు, గోధుమ గడ్డి మరియు బెర్ముడా గడ్డితో తయారు చేయబడిన ఇతర మొక్కల ఆధారిత రసాలను కూడా ఆరోగ్యకరమైన పోషకాల కోసం తప్పనిసరిగా తినాలని ఆమె సూచిస్తున్నారు. 

  • క్రూసిఫెరస్ కూరగాయలు 

బ్రకోలీ, బ్రస్సెల్ మొలకలు, క్యాబేజీ మరియు ఇతర ఆకు కూరలలో యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని రిధిమా చెప్పారు. ఇది సల్ఫోరెన్స్ మరియు ఐసోథియోసైనేట్, క్రూసిఫరస్ కూరగాయలలో కనిపించే సేంద్రీయ రసాయనాలు యాంటీఆక్సిడెంట్ ప్రతిస్పందనను యాక్టివేట్ చేస్తాయి అని నిపుణులు అంటున్నారు. 

  • పుట్టగొడుగు

పుట్టగొడుగుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అయినప్పటికీ, అలర్జీలను నివారించడానికి పుట్టగొడుగులను వండి మాత్రమే తినాలని షాలిని అన్నారు. వాటి వినియోగాన్ని వారానికి రెండుసార్లు లేదా మూడుసార్లు పరిమితం చేయండి.” 

ఉసిరికాయ 

  • రాచఉసిరి అని కూడా పిలువబడే ఉసిరికాయ, విటమిన్ C పుష్కలంగా ఉండే పండు. ఉసిరికాయలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచే ఒక ప్రత్యేకమైన యాంటీ ఏజింగ్ లక్షణం ఉందని షాలిని అన్నారు. దీన్ని ఉదయాన్నే తినడం మంచిది అని ఆమె తెలిపారు.     

డార్క్ చాక్లెట్ 

కోకో బీన్స్‌తో తయారైన డార్క్ చాక్లెట్ యాంటీ ఏజింగ్‌కి కొత్త అభిరుచిగా మారింది. కోకో బీన్స్‌లో యాంటీఆక్సిడెంట్లు (పాలీఫెనాల్స్ మరియు ఫ్లేవనాయిడ్స్) పుష్కలంగా ఉన్నాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కానీ ప్రాసెసింగ్ ఈ యాంటీఆక్సిడెంట్ లక్షణాలను చాలా వరకు తొలగిస్తుంది. “డార్క్ చాక్లెట్ ఒక యాంటీఆక్సిడెంట్. అయితే, కొవ్వు మరియు చక్కెర విషయంలో కూడా జాగ్రత్త వహించండి అని షాలిని హెచ్చరించారు. 

డయాబెటిక్ కాని వ్యక్తి ఒక రోజులో ఆరు నుండి ఎనిమిది గ్రాముల డార్క్ చాక్లెట్ తినవచ్చు,” ఆమె సలహా ఇచ్చారు. 

చెన్నైలోని అతుల్య సీనియర్ కేర్‌కు చెందిన క్లినికల్ న్యూట్రిషనిస్ట్ అయిన డాక్టర్ సుగన్య ఎన్, యాంటీ ఏజింగ్ ఫుడ్‌లు ప్రతి శరీర తత్వానికి సరిపోవని అభిప్రాయపడ్డారు. ఉదాహరణకు, హైపోథైరాయిడిజం ఉన్న కొద్ది మంది వ్యక్తులు క్రూసిఫెరస్ కూరగాయలను జీర్ణం చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. కాబట్టి, దీనిని వండిన రూపంలో మరియు పరిమిత పరిమాణంలో తప్పనిసరిగా తీసుకోవాలి అని డాక్టర్ సుగన్య చెప్పారు. ప్రిజర్వేటివ్‌లను ఉపయోగించి సుదూర ప్రాంతాల నుండి సేకరించిన ఆహారాన్ని తీసుకోవడం కంటే స్థానికంగా లభించే వ్యవసాయ ఉత్పత్తులను తీసుకోవడం ఉత్తమమని ఆమె తెలిపారు. 

సంతులనం సాధించడానికి 

యాంటీ ఏజింగ్ ఫుడ్స్ మాత్రమే తీసుకోవడం వల్ల శరీర సమతుల్యత దెబ్బతింటుందని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆహారంలో పండ్లు, కూరగాయలు మరియు ప్రోటీన్‌లతో సహా యాంటీఆక్సిడెంట్ అధికంగా ఉండే ఆహారాన్ని రోజుకు కనీసం నాలుగు నుండి ఐదు సర్వింగ్‌లు తప్పనిసరిగా ఆస్వాదించాలని రిధిమా చెప్పారు. 

ఒకే భోజనంలో అవసరమైన మొత్తంలో సంతులనాలను తినడం సవాలుతో కూడుకున్నదని షాలిని అన్నారు. ఒక రోజులో మూడు నుండి ఆరు భాగాల పరిమాణంగా భోజనంలో తీసుకోవడం సహాయపడుతుంది. “ప్రతి భోజనంలో ఫైబర్ అధికంగా ఉండే 100 గ్రాముల ఉడికించిన కూరగాయలు వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తాయి” అని ఆమె వివరించారు. ఉచితంగా లభించే మరియు ఎక్కువగా చాలామంది ఉపయోగించని ఒక యాంటీ ఏజింగ్ డ్రగ్ నిద్ర అని శాలిని చెప్పారు. 

గుర్తుంచుకోవలసిన అంశాలు 

  • కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచే ఆహారాలు వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయగలవు. 
  • క్రూసిఫెరస్ కూరగాయలు, పుట్టగొడుగులు, డార్క్ చాక్లెట్ మరియు గూస్‌బెర్రీలు కొల్లాజెన్‌ని ఉత్పత్తి చేయగలవు. 
  • ఆరోగ్యకరమైన జీవనశైలితో యవ్వనంలోనే ప్రారంభించడం వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయడానికి కీలకం. 
  • కేవలం తీసుకొనే ఆహారం మరియు నిద్రలేమి కూడా వృద్ధాప్య చర్మానికి దారి తీస్తుంది. 

సంబంధిత ట్యాగ్‌లు
సంబంధిత పోస్టులు

మీ అనుభవాన్ని లేదా వ్యాఖ్యలను పంచుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ట్రెండింగ్

వ్యాసాలు

వ్యాసం
బెంగళూరుకు చెందిన పి.పార్వతి 20 ఏళ్లప్పుడు శ్వాస తీసుకోవడంలో చిన్నప్పుడు ఇబ్బంది పడేది. పరీక్షలు చేయించగా ఆమెకు ఆస్తమా ఉన్నట్లు నిర్దారించబడింది. ఇప్పుడు అది జరిగి 32 సంవత్సరాలు గడిచింది. 54 సంవత్సరాల వయస్సులో, పార్వతి తన కుమార్తె మరియు తనకంటే సగం వయస్సు కలిగిన స్నేహితులతో ట్రెక్‌లకు చాలా ఈజీగా వెళ్లగలుతుతోంది.
వ్యాసం
షోల్డర్ ఇంపింగ్‌మెంట్ సిండ్రోమ్ రివర్సిబుల్ అయినందున, నొప్పి యొక్క ప్రారంభ సంకేతాలను అనుభవించిన వెంటనే మీరు వైద్యుడిని సంప్రదించాలనిి సలహా ఇస్తారు.
వ్యాసం
ఎముక పునర్నిర్మాణాన్ని నిరోధించడం నుండి ఎముకల విరుగుట మరియు బోలు వ్యాధి ప్రమాదాన్ని పెంచడం వరకు, ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం ఎముకలకు శాశ్వత నష్టం కలిగిస్తుంది

0

0

0

Opt-in To Our Daily Newsletter

* Please check your Spam folder for the Opt-in confirmation mail

Opt-in To Our
Daily Newsletter

We use cookies to customize your user experience, view our policy here

మీ అభిప్రాయం విజయవంతంగా సమర్పించబడింది.

హ్యాపీయెస్ట్ హెల్త్ టీమ్ వీలైనంత త్వరగా మిమ్మల్ని సంప్రదిస్తుంది