728X90

0

0

0

ఈ వ్యాసంలో

మైగ్రేన్ నుంచి ఉపశమనం పొందండిలా
28

మైగ్రేన్ నుంచి ఉపశమనం పొందండిలా

భయంకరమైన మైగ్రేన్ తలనొప్పులను తగ్గించడానికి అందుకు తగిన కారణాల్ని గుర్తించడం, సరిగా చికిత్స చేయడం మరియు తిరిగి రాకుండా నిరోధించడానికి కఠినమైన నియమాలను పాటించడం వంటి సమగ్ర వ్యూహాలు అవసరం.

భయంకరమైన తలనొప్పులను తగ్గించడానికి అందుకు తగిన కారణాల్ని గుర్తించడం, సరిగ్గాచికిత్సచేయడం మరియు తిరిగి రాకుండా నిరోధించడానికి కఠినమైన నియమాలను పాటించడం వంటి సమగ్ర వ్యూహం అవసరం.

రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన గ‌ృహిణి గరిమా సింగ్, చాలా సంవత్సరాలుగా తనను ఇబ్బంది పెడుతున్న మైగ్రేన్ నుంచి విజయవంతంగా బయటపడ్డారు. ఆమె హ్యాపియెస్ట్ హెల్త్‌తో మాట్లాడుతూ.. దీర్ఘకాలిక నొప్పి మరియు అనారోగ్యసమస్యలు నన్ను నిరంతం అలసిపోయేలా చేశాయని చెప్పింది. ఈ అనుభవాలు నా జీవితాన్ని మరింత సవాలుగా మార్చాయి.

ఆమె ఆరోగ్య సమస్యలకు భయపడి కొన్ని మందులు వాడేది. అయితే ఒకానొక సమయంలో ఆమె వైద్య సలహా తీసుకుంటున్న వైద్యుడు బొటాక్స్ చికిత్స తాత్కాలికంగా తీసుకోవాలని సలహా ఇచ్చారు. దీంతో సింగ్ భయపడి, ఆయుర్వేదాన్ని పరిపూర్ణమైన చికత్సగా భావించి అటువైపు ఆకర్షితురాలైంది.

ఆయుర్వేద వైద్యుడు ఆమెకున్న మైగ్రేన్ లక్షణాలు, మైగ్రేన్‌లకు కారణమయ్యే ఆమె జీవనశైలి మధ్య సంబంధాన్ని నిశితంగా పరిశీలించారు. ”నా డైట్‌లో డైజెస్టివ్ హెర్బ్స్ జోడించడం, ఆయుర్వేద మార్నింగ్ రొటీన్‌ని అనుసరించడం ద్వారా నా రోజువారీ జీవింతలోక్రమంగా మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించాను అని గరిమా చెప్పారు. దీని కారణంగా నేను గతంకంటే ఎక్కువ శక్తివంతమైన అనుభూతిని పొందడం ప్రారంభించాను. క్రమంగా మైగ్రేన్ లేని రోజులు కూడా నా జీవితంలో రావడం చూశాను.
ప్రాథమిక చికిత్స సుమారు 21 రోజులపాటు కొనసాగింది. ఇక్కడ గరిమాకు శిరోధార (ప్రత్యేక ఔషద తైలాలలో తల స్నానం), నాస్య(ముక్కు ద్వారా ఔషద నూనెల కషాయం) ఇవ్వబడింది. గరిమా పరిస్థితి మెరుగుపడేందుకు ఆహారం, జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని సూచించారు.

మైగ్రేన్ నొప్పి ఎందుకు వస్తుంది?

ముంబైలోని సోహమ్ స్టూడియోలోని సోమాటిక్ వెల్‌నెస్ ఫెసిలిటేటర్ హేతల్ లోధావియా మాట్లాడుతూ.. మైగ్రేన్ కేవలం తలనొప్పి కంటే ఎక్కవు. ఇన్‌కమింగ్ ఇంద్రియ సమాచారంతో మెదడు ఎలా వ్యవహరిస్తుందనే దానిపై అస్థిరత ఇది అని చెప్పారు. నిద్ర, వ్యాయామం, ఆకలి, అతిగా ఆలోచించడం వంటి అనేక శారీరక కారకాలు ఈ అస్థిరతకు దోహం చేస్తాయి.

మైగ్రేన్ అనేది ఆయుర్వేదం ప్రకారం వాత-పిత్త దోషం లేదా త్రిదోష స్థితి(గాలి, అగ్ని మరియు భూమి-నీటి యొక్క శారీరక మూలకాలలో అసమతుల్యత కారణంగా వచ్చే వ్యాధి). చాలా మంది తలనొప్పి నిపుణులు మైగ్రేన్ ట్రిగ్గర్‌లను నివారించాలని సూచించారు.

ట్రిగ్గర్‌లను ఎలా పరిష్కరించాలి?

”నేను కొన్ని సంవత్సరాల క్రితం మైగ్రేన్‌తో ఇబ్బంది పడ్డాను. సాధారణంగా వారానికి రెండు లేదా మూడుసార్లు మైగ్రేన్ వచ్చేది. నన్ను నేను అర్థం చేసుకోవడం, ట్రిగ్గర్‌ను గుర్తించడం ద్వారా నేను దానిని పరిష్కరించుకోగలిగాను” అని కోయంబత్తూరుకు చెందిన ఐటీ ప్రోఫెషనల్ రోహిత్ వర్మ(28) చెప్పారు.

మైగ్రేన్ నొప్పి ప్రారంభం కావడానికి ముందు తరచుగా కళ్లు, మెడ నొప్పి మరియు తల భారాన్ని అనుభవిస్తాము. ఈ సమయంలో మనం చర్య తీసుకోగలిగితే మైగ్రేన్ అంత తీవ్రంగా ఉండదు. ఈ సమయంలో వేగంగా నడవడం, నీరు త్రాగడం, వేడినీటితో స్నానం చేయడం, నుదిటిపై ఐస్ ఉంచడం లాంటివి చేయడం ద్వారా కొంత ఉపశమనం పొందొచ్చని ఆయన చెప్పారు.

చికిత్స విధానం

బెంగళూరులోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల ఈఎన్‌టీ స్పెషలిస్ట్ డాక్టర్ సుచ్చా లక్ష్మి ఆర్ మాట్లాడుతూ.. మైగ్రేన్ చికిత్స దశలలో నిర్దిష్టమైన ఆహారాన్ని సూచించడం, ప్రత్యేకించి సమయం ప్రకారం ప్రశాంత వాతావరణంలో తినడం వంటివి ఉంటాయి.

ఇతర అంశాలలో మూలికలతో జీవక్రియను సరిచేయడం, ఇంద్రియ అవయవాల పనితీరును నిర్వహించడం, ఒత్తిడిని తగ్గించడం, జీవనశైలిలో మార్పులు మరియు రోగ నిరోధక శక్తిని పెంచడం వంటివి ఉన్నాయి.

మొదటి దశలో, లక్షణాల నుంచి ఉపశమనానికి పంచకర్మ నిర్వహిస్తారు. ఆపై మైగ్రేన్ నొప్పిని తగ్గించడానికి కాయకల్ప్ థెరపీ చేయబడుతుంది.

మైగ్రేన్‌ ఉన్నవారు ఏం తినాలి ఏం తినకూడదు?

మైగ్రేన్‌లను వదిలించుకోవాలని ప్రయత్నించే వ్యక్తులు భోజనం చేయకుండా ఉండటం లేదా క్రమం తప్పకుండా తినే షెడ్యూల్‌ను పాటించకపోవడం ఇబ్బందికరమైన అంశం.

మైగ్రేన్‌తో బాధపడేవారు పాలు, జున్ను, నెయ్యితో పాటు ప్రోటీన్లు అధికంగా పచ్చిమిర్చి, అలసందలు మరియు సోయాబీన్, విటమిన్-ఎ, మెగ్నీషియం, జింక్, కాల్షియం, విటమిన్-డి వంటివి తీసుకోవాలని బెంగళూరుకు చెందన క్లినికల్ న్యూట్రిషనిస్ట్ దివ్య నాయక్ సూచిస్తున్నారు.
కెఫిన్, ఆల్కహాల్, కార్బోనేటెడ్ పానియాలు, పాత చీజ్ (టైరమైన్ అనేది పులియబెట్టిన ఆహారం యొక్క ఉపఉత్పత్తి, ఇది మైగ్రేన్‌లను ప్రేరేపిస్తుంది) మరియు ఉప్పగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి.

రోజువారీ వ్యాయామం

జూలై, 2022లో జర్నల్ ఆఫ్ పెయిన్‌లో ప్రచురించబడిన క్రమబద్ధమైన సమీక్ష మరియు మెటా విశ్లేషణలో, మైగ్రేన్ భారాన్ని తగ్గించడంలో రెగ్యులర్ ఏరోబిక్ వ్యాయామాలు ప్రభావంతంగా ఉన్నాయని నిరూపించబడింది. ఇందుకోసం మీరు డ్యాన్స్, సైక్లింగ్, స్విమ్మింగ్ లేదా చురుకైన నడకను ఎంచుకోవచ్చు. వీటిని మీరు నెమ్మదిగా ప్రారంభించి క్రమంగా వేగం పెంచుకోవచ్చు.

హార్మోన్ల మార్పులుకొంతమంది స్త్రీలు తమ నెలవారీ బుుతు చక్రంలో హార్మోన్ల మార్పులు కారణంగా(ప్రధానంగా ఈస్ట్రోజెన్‌తో) మైగ్రేన్ నొప్పిని కలిగి ఉంటారు. ”ఒక టేబుల్ స్పూన్ అవిసె, చియా, పొద్దు తిరుగుడు మరియు నువ్వులు వంటి నూనె గింజలను తీసుకోండి. ఈస్ట్రోజెన్‌లో హెచ్చుతగ్గుల కారణంగా స్త్రీలు హార్మోన్ల మార్పులను ఎదుర్కొనే పార్శ్వపు నొప్పి యొక్క సాధారణ లక్షణాలను ఎదుర్కోవడానికి ఇది సహాయపడుతుంది” అని నాయక్ చెప్పారు.

ఒత్తిడి తగ్గింపు మరియు యోగా

ఒత్తిడి స్థిరంగా ఉండటం వల్ల మైగ్రేన్‌కు ఇది మొదటి కారకంగా ఉంటుంది. ధ్యానం, సీబీటీ(కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ), సాంప్రదాయ మానసిక చికిత్స మరియు యోగా వంటి అనేక పద్ధతులు ఒత్తిడి మరియు సంబంధిత మైగ్రేన్‌లను తగ్గించడంలో సహాయపడతాయి.
మీరు క్రమం తప్పకుండా యోగా చేస్తున్నప్పుడు, మైగ్రేన్‌లను నిర్వహించడానికి మీకు 99 శాతం అవకాశం ఉంటుంది అని లోధావియా చెప్పారు.
పార్శ్వపు నొప్పికి వ్యతిరేకంగా ప్రభావంతమైన కొన్ని యోగాసనాలు ఉన్నాయి. వీటిలో సపోర్టెడ్ బ్రిడ్జ్ పోజ్ (సేతు బంధాసన), తలకింద దిండుతో పిల్లల భంగిమ (శిశు ఆసనం), క్యాట్ స్ట్రెచ్ ( మర్జారీ-ఆసన) ఉన్నాయి. ఒకే ముక్కు రంధ్రం ద్వార శ్వాస(నాడీ శుద్ధి ప్రాణాయామం) కూడా సహాయపడుతుంది అని ఆమె చెప్పింది.

మంచి నిద్ర

రోజువారి నిద్రవేళలు దినచర్యలో ఎక్కువగా మార్పులు ఉంటే వారాంతంలో అధికంగా నిద్రపోవడం లేదా మధ్యాహ్నం నిద్రపోవడం కూడా మైగ్రేన్ లక్షణాలను ప్రేరేపిస్తుంది.
మంచి నిద్ర అలవాటు అంటే మీరు రాత్రి 10 గంటలలోపు బెడ్‌పైకి రావడానికి ప్రయత్నించాలి. సూర్యోదయానికి అరగంట ముందే సహజంగా మేల్కోవాలి. పెద్దవారు ప్రతిరోజూ కనీసం ఏడు నుంచి 8 గంటలు నిద్రపోవాలి. పిల్లలు, యుక్తవయస్కులకు కనీసం తొమ్మిది గంటల నిద్ర అవసరం.

పంచకర్మ మరియు మూలికలు

శిరోధార మైగ్రేన్ తలనొప్పిని తగ్గించడానికి ఒక గొప్ప చికిత్స. ఇది ఓదార్పుతో కూడిన సౌకర్యవంతమైన ప్రక్రియ అని ఉత్తరప్రదేశ్‌లో నోయిడాలోని వీసీసీ ఆయుర్వేద మరియు పంచకర్మ సెంటర్ చీఫ్ కన్సల్టెంట్ మరియు మెడికల్ డైరెక్టర్ డాక్టర్ గ్రీష్మా థామస్ చెప్పారు.

నాసికా చికిత్సలో ఔషద తైలాలు ముక్కు ద్వారా చొప్పించడం కూడా నొప్పి తీవ్రత, ఫోనోఫోబియా, విరామాలు మరియు తలనొప్పి వ్యవధిని కూడా తగ్గిస్తుంది. పసుపు, త్రిఫల, గిలోయ్, కలబంద, వేప మైగ్రేన్ చికిత్సకు ఉపయోగించే కొన్ని మూలికలు.

మైగ్రేన్ నివారణకు చిట్కాలు

  • ఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లను కలిగి ఉండాలి.
  • శీతల పానీయాలు మానుకోండి.
  • భోజన సమయంలో నీటిని తీసుకోవడం తగ్గించాలి. పాలు మరియు టీ మానుకోండి. అల్లం, కొత్తిమీర, బ్లాక్ టీ తాగండి.
  • జీలకర్ర, కొత్తిమీర వేసి మరిగించిన నీరు తాగాలి.
  • ఒక గ్లాసు మజ్జిగలో ఇంగువ, కరివేపాకు, రాళ్ల ఉప్పు, అల్లం కలిపి తాగాలి.
  • మైగ్రేన్‌తో బాధపడేవారిలో సాధారణంగా కనిపించే మలబద్ధకాన్ని నివారించడానికి మూడు సేర్విన్గ్స్కూ
  • కూరగాయలు, రెండు సేర్విన్గ్స్ పండ్లను చేర్చండి. ఇది మైగ్రేన్ ఉన్న వ్యక్తులలో సాధారణం.
  • ఆవాల పేస్ట్‌ను నుదుటిపై రాసి 10-15 నిమిషాలపాటు అలాగే ఉంచాలి.
  • ప్రతిరోజూ కనీసం 15 నిమిషాలు సహజ కాంతిని పొందండి.

మీ అనుభవాన్ని లేదా వ్యాఖ్యలను పంచుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ట్రెండింగ్

వ్యాసాలు

0

0

0

Opt-in To Our Daily Newsletter

* Please check your Spam folder for the Opt-in confirmation mail

Opt-in To Our
Daily Newsletter

We use cookies to customize your user experience, view our policy here

మీ అభిప్రాయం విజయవంతంగా సమర్పించబడింది.

హ్యాపీయెస్ట్ హెల్త్ టీమ్ వీలైనంత త్వరగా మిమ్మల్ని సంప్రదిస్తుంది