728X90

0

0

0

ఈ వ్యాసంలో

ఆరోగ్యకరమైన గుండె కోసం ఐదు రకాల ఆహార పదార్థాలు
35

ఆరోగ్యకరమైన గుండె కోసం ఐదు రకాల ఆహార పదార్థాలు

గుండె సంబంధిత వ్యాధులకు హానికర ఆహార పదార్థాలు కారణమనే విషయం అందరికీ తెలిసిందే. దీనికితోడు ఈ వ్యాధులకు పోషక ఆహార లోపం అనేది కూడా కారణమనే దురాభిప్రాయం ఉందని యూరోపియన్ హార్ట్ జర్నల్ పేర్కొంది.

గుండె సంబంధిత వ్యాధులకు హానికర ఆహార పదార్థాలు కారణమనే విషయం అందరికీ తెలిసిందే. దీనికితోడు ఈ వ్యాధులకు పోషక ఆహార లోపం అనేది కూడా కారణమనే దురాభిప్రాయం ఉందని యూరోపియన్ హార్ట్ జర్నల్ పేర్కొంది. ఈ ఏడాది జూలై ఎడిషన్‌లో తన అధ్యయనాన్ని ప్రచురించింది. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, గింజలతో గుండె సంబంధిత వ్యాధులు రావని తన అధ్యయనంలో తేల్చి చెప్పింది. కొవ్వు పదార్థాలు అధికంగా ఉండే పాల పదార్థాలు, చేపలతో గుండెపోటు ప్రమాదం అత్యధికంగా ఉందనే విషయాన్ని వ్యాసంలో వెల్లడించింది.

ఈ విషయంపై బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రి కార్డియాలజిస్ట్ డాక్టర్ సునీల్ ద్వివేది స్పందిస్తూ.. ‘నేడు డైట్ అనేది క్రమం తప్పింది. మనం తీసుకునే ప్రాసెస్డ్ ఫుడ్‌(Ex: బియ్యం పాలిష్ పట్టడం)లో అతి తక్కువగా సూక్ష్మ పోషకాలు, విటమిన్లు, లవణాలు ఉంటున్నాయి. ఈ సమయంలో సరైన డైట్ అవసరం. తక్కువ కొవ్వు, పిండి పదార్థాలతో పాటు ప్రొటీన్ ఉండే ఆహారం తీసుకోవాలి. కేలరీలను సమతూకం చేస్తూ మెటాబాలిజం కొనసాగించడం తప్పనిసరి. ఇది మనల్ని మధుమేహం, అధిక రక్తపోటు నుంచి రక్షణ ఇస్తుంది. తాజా పండ్లలో సూక్ష్మ పోషకాలు, యాంటీయాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెపోటు నుంచి రక్షిణ కల్పిస్తాయి’ అని తెలిపారు.

ఎస్జీహెచ్ఎస్ కార్డియాలజీ విభాగం అధిపతి డాక్టర్ హర్ ప్రీత్ సింగ్ గిల్హోత్రా ఇదే విషయాన్నితెలిపారు. ‘కేలరీల నియంత్రణ, కొవ్వు పదార్థాల స్థాయి తగ్గించడానికి పీచు పదార్థాలు అవసరం. కొవ్వు పదార్థం లేని గింజల్లో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. అవి శరీరంలోని వేడిని (మంట) తగ్గిస్తుంది. ఫ్యాటీ యాసిడ్స్ లేకపోతే వేడి వలన రక్తనాళాలు దెబ్బతినడంతోపాటు గుండెపోటుకు కారణమవుతాయి ’అని డాక్టర్ హర్ ప్రీత్ సింగ్ వెల్లడించారు.

ఆరోగ్యకరమైన గుండె కోసం ఐదు ముఖ్యమైన ఆహారమైన పదార్థాలు..

ఆపిల్స్: మనం తీసుకునే ఆహారంలో ఆపిల్స్‌ను చేర్చుకోవడం ద్వారా ఇవి గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. యశ్వంత్‌పూర్‌లోని మణిపాల్ ఆస్పత్రి చీఫ్ డైటీషియన్ పవిత్ర ఎన్ రాజ్ మాట్లాడుతూ.. ఆపిల్స్‌లో కరిగే ఫైబర్‌లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి మానవ శరీరంలోని చెడు కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయని పేర్కొన్నారు. అంతేగాక.. ఆపిల్స్‌లో పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. ఆపిల్‌లో ఉండే ఫ్లేవనాయిడ్స్ గుండెపోటు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తాయి.

దానిమ్మ: దానిమ్మపండులో ఉండే విటమిన్ సీ యాంటీ ఆక్సిడెంట్‌గా పరిగణించబడుతుంది. ఇది మధుమేహం, గుండె సమస్యలు సహా అనేక దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన వాటితో పాటు ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడటానికి ఇది సహాయపడుతుంది.

బాదం: బాదం గింజలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ గాఢతను తగ్గించడంతో పాటు ప్లేట్‌లెట్స్ పనితీరును మెరుగుపరుస్తాయి. మనం తీసుకునే ఆహారంలో విటమిన్-ఈ చేర్చుకోవడం వల్ల ప్రాణాంతక గుండె సంబంధిత వ్యాధుల నుంచి కాపాడుతుందని ఫోర్టిస్ హాస్పిటల్ డైటీషియన్ భారతీ కుమార్ తెలిపారు.

బొప్పాయి: బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైనది. ఇది యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్‌తో నిండి ఉండి గుండెకు ఎంతో మేలు చేస్తుందని మణిపాల్ ఆస్పత్రి చీఫ్ డైటీషియన్ పవిత్ర ఎన్ రాజ్ అభిప్రాయపడ్డారు. బొప్పాయిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. తద్వారా బరువు పెరుగుదలను నియంత్రిస్తుంది. ఇవి మాత్రమే కాకుండా బొప్పాయిలో విటమిన్-సి, బీటా కెరోటిన్ ఉంటాయి. ఇవి ఒత్తిడి, వాపుతో పోరాడటానికి సహాయపడతాయి. తద్వారా గుండె సమస్యలు, స్ట్రోక్‌లను నివారిస్తుంది.

వాల్‌నట్స్: వాల్ నట్స్‌లో అధిక మోతాదులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు ఉంటాయి. ఇవి హృదయనాళాల ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతాయి. ఇవి ఎల్‌డిఎల్- కొలెస్ట్రాల్(చెడు కొలెస్ట్రాల్) స్థాయిలను తగ్గిస్తాయి. ఈ కొవ్వులే హృదయనాళాల ఆరోగ్య సమస్యలకు ప్రధాన కారణం. ఇవి రక్తం గడ్డ కట్టడాన్ని నియంత్రించడంతో కూడా సహాయపడతాయి.

మన భారతదేశంలో గుండె ఆరోగ్యానికి సంబంధించి మనం తీసుకునే ఆహారంలో పండ్లు, తృణధ్యాన్యాలు, మిల్లెట్స్, సీజనల్ పండ్లు, కూరగాయలు ఉండేలా చూసకోవాలని అదే సమయంలో ఖరీదైన ఆహారాన్ని దూరంగా ఉంచాలని డాక్టర్ ద్వివేది తెలియజేస్తున్నారు.

మీ అనుభవాన్ని లేదా వ్యాఖ్యలను పంచుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ట్రెండింగ్

వ్యాసాలు

0

0

0

Opt-in To Our Daily Newsletter

* Please check your Spam folder for the Opt-in confirmation mail

Opt-in To Our
Daily Newsletter

We use cookies to customize your user experience, view our policy here

మీ అభిప్రాయం విజయవంతంగా సమర్పించబడింది.

హ్యాపీయెస్ట్ హెల్త్ టీమ్ వీలైనంత త్వరగా మిమ్మల్ని సంప్రదిస్తుంది