728X90

0

0

0

అంశాలకు వెళ్లండి

మధుమేహం మీ గుండెను ఎలా ప్రభావితం చేస్తుంది?
49

మధుమేహం మీ గుండెను ఎలా ప్రభావితం చేస్తుంది?

మధుమేహం మరియు గుండె వైఫల్యం మధ్య గల సంబంధం గురించి తెలుసుకునేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం ఇది
గుండె ఆరోగ్యం – మధుమేహం వల్ల కలిగే ప్రభావం

మధుమేహం మరియు గుండె వైఫల్యం మధ్య గల సంబంధం గురించి తెలుసుకునేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం ఇది.

68 ఏళ్ల టిఆర్ రోహిణి బ్లడ్ రీడింగలు డయాబెటిక్ సరిహద్దులకు దగ్గరగా ఉన్నాయి. కొద్దిగా కండరాల అసౌకర్యాన్ని పక్కన పెడితే ఆమె ఏ డాక్టర్‌ను కలవాల్సిన అవసరం లేదని సంతోషంగా ఉంది.  

‘‘కానీ కోవిడ్-19 మొదటి లాక్‌డౌన్ సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడాన్ని నేను గమనించాను. అప్పుడే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిర్ణయించుకున్నాం’’ అంటారు కేరళలోని ఇడుక్కిలో నివసించే రోహిణి. ‘‘ఛాతీలో మంట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా యాంజియోగ్రఫీ వంటి కొన్ని టెస్ట్స్ చేయించుకున్నాను. కానీ యాంజియోగ్రఫీలో నాకు మూడు బ్లాక్స్ ఉన్నాయని, వెంటనే జాగ్రత్తపడాలని తెలిసింది. అదే రోజు నాకు యాంజియోప్లాస్టీ కూడా జరిగింది. రెండు రోజుల్లోగా నేను టైప్2 మధుమేహం బారిన కూడా పడినట్లు నిర్ధారణ జరిగింది’’ 

అప్పట్నుంచి వైద్యుల సూచనల మేరకు రోహిణి చక్కెర తినడం పూర్తిగా మానేసింది. అలాగే తాను తీసుకునే కార్బోహైడ్రేట్ మొత్తాన్ని కూడా పరిమితం చేసింది. 

డయాబెటిస్ మరియు హృదయ సంబంధిత వ్యాధులు చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటాయి. ముఖ్యంగా హృదయ సంబంధిత వ్యాధులు లేదా గుండె నొప్పి వచ్చే రిస్క్‌ని డయాబెటిస్ రెట్టింపు చేస్తుంది. డయాబెటిస్ ఎంత ఎక్కువ సమయం ఉంటే అంత ఎక్కువగా మీకు హృదయ సంబంధిత వ్యాధులు తలెత్తే అవకాశం ఉంటుంది.

 అయితే శుభవార్త ఏమిటంటే మీరు మీ జీవనశైలిలో కొన్ని అలవాట్లను మార్చుకోవడం ద్వారా గుండె జబ్బుల బారిన పడే ప్రమాదాన్ని మీరు తగ్గించుకోవచ్చు. అలాగే మీ గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచుకోవచ్చు. ఈ మార్పులు మీ మధుమేహాన్ని మెరుగ్గా నిర్వహించడంలో కూడా మీకు సహాయపడతాయి. 

మధుమేహం మరియు గుండె వైఫల్యం చెందడం

 కాలక్రమేణా రక్తంలో అధికంగా ఉండే చక్కెర స్థాయిలు గుండెను నియంత్రించే రక్త ధమనులు మరియు నాడులకు హాని చేస్తాయి. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్.. వంటి ఇతరత్రా అనారోగ్యాల కారణంగా హృదయ సంబంధిత వ్యాధులు వచ్చే రిస్క్ మరింత పెరుగుతుంది. 

 ధమనుల్లో ప్రవహించే రక్తం యొక్క వేగాన్ని అధిక రక్తపోటు మరింత పెరిగేలా చేస్తుంది. ఫలితంగా ధమనుల గోడలు క్షీణిస్తాయి. ఒక వ్యక్తికి అధిక రక్తపోటు మరియు మధుమేహం రెండూ ఉంటే గుండె జబ్బుల ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. రక్తప్రవాహంలో చాలా తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL లేదా చెడుకొలెస్ట్రాల్) ఫలకం ఏర్పడటానికి కారణమవుతుంది, ఇది ధమని గోడలను దెబ్బతీస్తుంది. 

 అధిక ట్రైగ్లిజరైడ్స్ (రక్త కొవ్వు) మరియు తక్కువ అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (HDL లేదా మంచికొలెస్ట్రాల్) లేదా అధిక LDL ధమనులు గట్టిపడటానికి దోహదం చేస్తాయి. 

 చాలామందిలో వయసు పెరిగే కొద్దీ కార్డియోవాస్కులర్ వ్యాధి (గుండె మరియు రక్త నాళాలను ప్రభావితం చేసే అన్ని వ్యాధులు) వస్తుంది. అయితే దీనిని నివారించడం సాధ్యమే. 

 చిన్నప్పట్నుంచే ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా కార్డియో వాస్కులర్ వ్యాధిని రాకుండా నివారించవచ్చు. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ వంటి గుండె సంబంధిత సమస్యలకు కారణమయ్యే కారకాలను కూడా జీవన శైలిలో మార్పులు మరియు మందుల ద్వారా తగ్గించుకోవచ్చు. హృదయ సంబంధ వ్యాధులు ఆరోగ్యకరమైన వ్యక్తుల కంటే మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తులను త్వరగా ప్రభావితం చేస్తాయి. 

 సగటు జీవితకాలంలో, గుండె దాదాపు 2.5 బిలియన్ సార్లు కొట్టుకుంటుంది. శరీరం అంతటా కొన్ని మిలియన్ల గ్యాలన్ల రక్తాన్ని సరఫరా చేస్తుంది. ఈ స్థిరమైన ప్రవాహం వివిధ రకాల కీలకమైన కణాలతో పాటు ఆక్సిజన్, ఇంధనం, హార్మోన్లు మరియు ఇతర పదార్ధాలను కలిగి ఉంటుంది. అదనంగా, ఇది జీవక్రియ వ్యర్థాలను తొలగిస్తుంది. గుండె ఆగిపోయినప్పుడు అవసరమైన ప్రక్రియలు విఫలమవుతాయి, కొన్ని ప్రక్రియలు అయితే దాదాపు వెంటనే ఆగిపోతాయి. 

 మధుమేహ వ్యాధిగ్రస్తులలో 22 శాతం వరకు పెరుగుతున్న సంభావ్య రేటు కారణంగా గుండె ఆగిపోవడం అనేది మధుమేహం యొక్క సాధారణ పర్యవసానంగా గుర్తించడం జరిగింది. 

 మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్‌లోని ప్రముఖ డయాబెటాలజిస్ట్ మరియు డయాబెటిస్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ వి మోహన్ మాట్లాడుతూ మధుమేహం గుండెను అనేక విధాలుగా ప్రభావితం చేస్తుందని చెప్పారు. “గుండె పోటుకు దారితీసే పుపుస ధమని వ్యాధి మధుమేహం ఉన్నవారిలో చాలా సాధారణం” అని ఆయన హ్యాపీయెస్ట్ హెల్త్‌తో చెప్పారు. “టైప్ 2 డయాబెటిస్ ఉన్న వ్యక్తులు చిన్న వయస్సులోనే గుండె జబ్బుల బారిన పడవచ్చు. అలాగే వారిలో సమస్య కూడా తీవ్రంగా ఉండే అవకాశాలున్నాయి. అయితే మధుమేహం లేని వ్యక్తుల్లో ఒకటి లేదా రెండు మూత్ర నాళాలు మూసుకుపోవచ్చు. మధుమేహం ఉన్నవారిలో మూడు లేదా అంతకంటే ఎక్కువ నాళాలు మూసుకుపోవడం సర్వసాధారణం. బ్లాక్‌ల తీవ్రత కూడా ఎక్కువగా ఉండవచ్చు.” 

 మధుమేహం లేని వ్యక్తులలో సమస్యలు 60 లేదా 65 సంవత్సరాల వయస్సులో సంభవిస్తాయి. అలాగే మధుమేహం ఉన్నవారిలో 45 లేదా 50 సంవత్సరాలలో సమస్యలు ఉత్పన్నం కావచ్చు. “అంతేకాకుండా, మధుమేహం నేరుగా హృదయ కండరాలను ప్రభావితం చేస్తుందిఅని ఆయన చెప్పారు. “దీన్నే డయాబెటిక్ కార్డియోమయోపతి అంటారు. ఇది మధుమేహం ఉన్నవారిలో గుండె ఆగిపోయే ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది మధుమేహం లేనివారి కంటే రెండు నుండి మూడు రెట్లు ఎక్కువ అని డాక్టర్ మోహన్ వివరించారు. 

 కార్డియాక్ అటానమిక్ న్యూరోపతి కారణంగా మధుమేహం గుండె కొట్టుకునే తీరును కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి, హృదయ స్పందన రేటు సాధారణంగా పెరుగుతుంది లేదా కొందరిలో తగ్గవచ్చు కూడా. “మేము దానిని రెస్టింగ్ టాకీకార్డియా అని పిలుస్తాముఅని ఆయన చెప్పారు. “హృదయ స్పందన పెరిగినప్పుడు, గుండె అనవసరంగా ఒక నిమిషంలో చాలా సార్లు కొట్టుకుంటుంది. ఉదాహరణకు, గుండె నిమిషానికి 60 సార్లు లేదా నిమిషానికి 100 సార్లు కొట్టుకుంటే, గుండె నుండి అదే మొత్తంలో రక్తం కూడా బయటకు పంపిణీ అవుతుంది. కాబట్టి నిమిషానికి అదనంగా ఉండే ఆ 40 బీట్‌లు, శరీరానికి సంబంధించినంతవరకు అనవసరం. దాని వల్ల గుండె చివరికి అలసిపోతుంది. 

 మరొక విధంగా చూస్తే, సాధారణ గణితం ఆధారంగా లెక్కిస్తే- నిమిషానికి 40 సార్లు నుంచి గంటకు దానిని 60 సార్లు హెచ్చరిస్తే నుండి రోజుకు దానిని 24 సార్లు హెచ్చిస్తే నుండి సంవత్సరానికి 365 సార్లు హెచ్చవేస్తే, లక్షలాది సార్లు గుండె అనవసరంగా కొట్టుకుంటోందని అది కూడా ఎలాంటి ప్రయోజనం లేకుండా అని ఎవరైనా గ్రహించవచ్చు. 

ABC సిద్ధాంతం 

 మధుమేహ వ్యాధిగ్రస్తులకు గుండె జబ్బులను నివారించడం సాధ్యమవుతుంది. అయితే దీని కోసం, వారు ABC సిద్ధాంతాన్ని అనుసరించాలని డాక్టర్ మోహన్ చెప్పారు: 

  • A — A1c లేదా గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్, గత మూడు నెలల్లో మధుమేహం నియంత్రణ కొలమానం. ఇది చాలా మంచి నియంత్రణలో నిర్వహించబడాలి (అంటే, కనీసం 6 శాతం) 
  • B – రక్తపోటు. ఇది వీలైనంత సాధారణంగా నిర్వహించబడాలి (ప్రాధాన్యంగా సుమారు 120/80) 
  • C – కొలెస్ట్రాల్. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవాలి 

 యోగా, విశ్రాంతి, ప్రాణాయామం.. మొదలైనవి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటూ గుండెను ఆరోగ్యంగానూ ఉంచడంలో సహాయపడతాయి. 

గుండెకు ఆరోగ్యాన్ని చేకూర్చే ఆహారంలో పుష్కలంగా ఆకుపచ్చని ఆకు కూరలు మరియు కొన్ని పండ్లతో పాటు, కార్బోహైడ్రేట్ల మొత్తం తగ్గించి, ప్రోటీన్ కంటెంట్ అధికంగా ఉంటూ ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా భాగమవుతాయి. 

 క్రమం తప్పని వ్యాయామం కూడా చాలా కీలకం. అది నడక, జాగింగ్, ఈత కొట్టడం, సైక్లింగ్, డ్యాన్స్ చేయడం లేదా ఇతరత్రా ఏ రూపంలో ఉన్న వ్యాయామం అయినా కావచ్చు. రెసిస్టెన్స్ ట్రైనింగ్ మరియు కొన్ని ఫ్లెక్సిబిలిటీ వ్యాయామాలు కూడా ప్రయోజనం అందిస్తాయి. 

 ‘‘గుండె నొప్పికి గల ప్రధాన కారణాల్లో ధూమపానం కూడా ఒకటని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మధుమేహం ఉన్నవా రైతే పొగ తాగే అలవాటుని తప్పకుండా వదిలిపెట్టాల్సి ఉంటుంది’’ అంటారు డాక్టర్ మోహన్. ‘‘మద్యం తీసుకునే అలవాటుని కూడా నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం.’’ 

పెరిగిన ప్రమాదం 

 మధుమేహం కంటి నుండి పాదం వరకు ప్రతి అవయవాన్ని ప్రభావితం చేస్తుందని తమిళనాడు ప్రభుత్వ అవయవ మార్పిడి అథారిటీని స్థాపించి, దానికి నాయకత్వం వహించిన అనుభవజ్ఞుడైన వాస్కులర్ సర్జన్ డాక్టర్ జె అమలోర్పవనాథన్ జోసెఫ్ అన్నారు. 

 ‘‘మధుమేహం కారణంగా గుండె దెబ్బతింటే అక్కడ ఉన్న కణాలు బలహీనంగా మారిపోతాయి. కాబట్టి గుండె పరిమాణంలో కాస్త పెద్దదిగా అవుతుంది’’ అంటారు ఆయన. ‘‘రెండో విషయం ఏంటంటే – అది గుండె లోపల బ్లాక్స్‌కి కూడా కారణం అవుతుంది. మూడోది రక్తనాళాల గోడలను కూడా అది బలహీనపరుస్తుంది. – ఫలితంగా సైకిల్ ట్యూబ్‌లా గుండె కాస్త విస్తరించబడుతుంది. కాబట్టి మధుమేహం వస్తే కనుక గుండె ఈ మూడు సవాళ్లు ఎదుర్కోవాల్సి రావచ్చు. 

 ప్రస్తుతం చెన్నైలోని మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్ MGM హెల్త్ కేర్‌తో పనిచేస్తున్న డాక్టర్ జోసెఫ్, అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్) గుండెపై ఒత్తిడిని పెంచుతుందని చెప్పారు. ఫలితంగా చాలా త్వరగా గుండె వైఫల్యం చెందే అవకాశం ఉంటుంది. అలాగే హైపర్‌ టెన్షన్ కూడా గుండె నాళాలలో బ్లాక్‌లను ఉత్పత్తి చేస్తుంది మరియు రక్త నాళాలు బలహీనపడేలా చేస్తుంది. ఇది క్రమంగా గుండె సైకిల్ ట్యూబ్‌లా విస్తరించే అనూరిజంకు(రక్తనాళాలు ఉబ్బడం) దారితీస్తుంది. 

 ఇది హైపర్‌టెన్షన్‌లో కూడా జరగవచ్చు,” అని ఆయన చెప్పారు. “కాబట్టి, రక్తపోటు మరియు మధుమేహం రెండూ గుండెకు అసలు మంచివి కావు. గుండె సమస్యలతో బాధపడుతున్న వారిలో 30 నుండి 40 శాతం మందికి మధుమేహం లేదా రక్తపోటు ఉంటుంది. అధిక ధూమపానంతో పాటూ ఇవి కూడా హృదయ సంబంధ వ్యాధులకు ప్రధాన కారణాలు. వీటితో పోలిస్తే, గర్భధారణ సమయంలో పుట్టుకతో వచ్చే వ్యాధులు లేదా గుండె జబ్బులు 10 శాతం కంటే తక్కువ.’’ 

 ఉప్పు మరియు పంచదార తక్కువ తీసుకోవడం, తక్కువ కార్బోహైడ్రేట్లు, ఎక్కువ వ్యాయామం మరియు ధూమపానం మానేయడం వంటివి మధుమేహం, గుండె జబ్బులు ఉన్నవారికి సూచించే సాధారణ జీవనశైలి మార్పులని డాక్టర్ జోసెఫ్ చెప్పారు. 

మీ అనుభవాన్ని లేదా వ్యాఖ్యలను పంచుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

fifteen − 6 =

ట్రెండింగ్

వ్యాసాలు

వ్యాసం
బెంగళూరుకు చెందిన పి.పార్వతి 20 ఏళ్లప్పుడు శ్వాస తీసుకోవడంలో చిన్నప్పుడు ఇబ్బంది పడేది. పరీక్షలు చేయించగా ఆమెకు ఆస్తమా ఉన్నట్లు నిర్దారించబడింది. ఇప్పుడు అది జరిగి 32 సంవత్సరాలు గడిచింది. 54 సంవత్సరాల వయస్సులో, పార్వతి తన కుమార్తె మరియు తనకంటే సగం వయస్సు కలిగిన స్నేహితులతో ట్రెక్‌లకు చాలా ఈజీగా వెళ్లగలుతుతోంది.
వ్యాసం
షోల్డర్ ఇంపింగ్‌మెంట్ సిండ్రోమ్ రివర్సిబుల్ అయినందున, నొప్పి యొక్క ప్రారంభ సంకేతాలను అనుభవించిన వెంటనే మీరు వైద్యుడిని సంప్రదించాలనిి సలహా ఇస్తారు.
వ్యాసం
ఎముక పునర్నిర్మాణాన్ని నిరోధించడం నుండి ఎముకల విరుగుట మరియు బోలు వ్యాధి ప్రమాదాన్ని పెంచడం వరకు, ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం ఎముకలకు శాశ్వత నష్టం కలిగిస్తుంది

0

0

0

Opt-in To Our Daily Newsletter

* Please check your Spam folder for the Opt-in confirmation mail

Opt-in To Our
Daily Newsletter

We use cookies to customize your user experience, view our policy here

మీ అభిప్రాయం విజయవంతంగా సమర్పించబడింది.

హ్యాపీయెస్ట్ హెల్త్ టీమ్ వీలైనంత త్వరగా మిమ్మల్ని సంప్రదిస్తుంది