728X90

0

0

0

అంశాలకు వెళ్లండి

Heart Health: మీ గుండెకు హానిచేసే ఎనిమిది ఆహారాలు
37

Heart Health: మీ గుండెకు హానిచేసే ఎనిమిది ఆహారాలు

మీరు ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించేవారయితే మీ గుండె ఆరోగ్యానికి హాని చేసే ఆహారాలను తీసుకోకుండా ఉండటం లేదా నియంత్రించడం మంచిది.
గుండె ఆరోగ్యానికి ప్రమాదకర ఆహారాలు

అనారోగ్యకరమైన కొవ్వులు అలాగే ట్రాన్స్-ఫ్యాట్లను ఎక్కువగా తీసుకోవడం, ప్రత్యేకించి అత్యధికంగా ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్ ప్రపంచవ్యాప్తంగా గుండె సమస్యలను కారణం అవుతోంది. మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మంచి ఆహారం, చురుకైన జీవనశైలి అనేవి సులభమైన అత్యంత ప్రభావవంతమైన మార్గాలు.

మనం తీసుకునే చిరుతిండ్లు కూడా మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి కాబట్టి వాటి విషయంలో ఆరోగ్యకరమైన ఎంపికలు కీలకం అని బెంగుళూరుకు చెందిన పోషకాహార నిపుణులు పాలక్ టి పునామియా అన్నారు.

శాచురేడెట్ అలాగే ట్రాన్స్ ఫ్యాట్‌లు, అధికంగా ఉప్పు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల గుండె వ్యాధుల సమస్యలు పెరుగుతాయి. ఈ ఆహారాలు ఊబకాయం అలాగే డయాబెటిస్‌కు కూడా కారణం అవుతాయి, చివరగా ఇవి కూడా గుండె వ్యాధులకు దారి తీస్తాయి.

 “సమతుల్య ఆహారంలో పచ్చ కూరగాయలు, పండ్లు, ధాన్యాలు అలాగే అప్పుడప్పుడు కోడి మాంసం, గుడ్లు ఇంకా చేపల వంటి మాంసాహారం ఉండాలి” అని అన్నారు డాక్టర్ జైదీప్ రాజ్‌బహద్దూర్ అన్నారు. వీరు ముంబైలోని SRV Hospitalsలోని కార్డియాలజీ కన్సల్టెంట్.

ఆరోగ్యకరమైన గుండె కోసం మీరు తీసుకోకూడని ఆహారం

  1.    మాంసాహారం

చెన్నైలోని ఫోర్టిస్ మలార్(Fortis Malar) హాస్పిటల్‌లోని కార్డియోథొరాసిక్ వాస్కులర్ సర్జన్ డాక్టర్ తేజస్వి ఎన్ మార్లా, రెడ్ మీట్‌లో అధిక స్థాయిలో ఎల్‌డిఎస్ (తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్లు లేదా చెడు కొలెస్ట్రాల్) మరియు ట్రైగ్లిజరైడ్లు (ఒక రకమైన కొవ్వు) ఉన్నందున అది గుండెకు హానికరంగా పరిగణించబడుతుందని వివరించారు. రెడ్ మీట్ తీసుకోవడం దీర్ఘకాలంలో మీ గుండెపై ప్రభావం చూపుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. “చేపలు, కోడి మాంసంలో మంచి మోతాదులో యాంటీఆక్సిడెంట్లు మరియు పాలీ అన్‌సాటురేడెట్ ఫ్యాటీ యాసిడ్లు ఉన్నందున రెడ్ మీట్‌కు బుదులుగా వీటని తినవచ్చు ” అని డాక్టర్ రాజ్‌బహదూర్ చెప్పారు.

 ఏ మాంసాహారం తినేటప్పుడు అయినా కేవలం కండను మాత్రమే తినడం మంచిది అని, చర్మం మరియు ఇతర అవయవాలలో కొవ్వు అధికంగా ఉంటుంది కాబట్టి వాటిని పారేయడం మంచిది అని చెప్పారు.

  1.   బ్రెడ్ మరియు ఇతర బేకరీ ఆహారాలు

బేక్ చేసిన ఆహారం ఇంట్లో చేసుకున్నది అయితే మంచిదే కానీ బయట నుండి తీసుకున్నది అయితే ప్రమాదకరం అని పునామియా అన్నారు. ఎందుకంటే బయట చేసేవారు అత్యధికంగా రిఫైన్ చేసిన (మైదా)ను ఉపయోగిస్తారు. ఇది అనారోగ్యకరం అలాగే దీనిలో కార్బోహైడ్రేట్‌లు అధికంగా ఉంటాయి. “హోల్ గ్రెయిన్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్ లేదా మైదా లేని బ్రెడ్ తీసుకోవచ్చు” అని అన్నారు డాక్టర్ రాజ్‌బహద్దూర్.

బ్రెడ్ అలాగే ఇతర బ్యాకరీ ఆహారాలను తీసుకోకుండా ఉండటమే మంచిది అని నిపుణులు అన్నారు. “బ్రెడ్ మరింత మృదువుగా ఉండటానికి అలాగే ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చేయడానికి అధిక మోతాదులో ఉప్పు అలాగే ఇతర పదార్థాలను కలుపుతారు.” అని అన్నారు డాక్టర్ మర్లా. దీని వలన మీ సాధారణ జీవక్రియలు దెబ్బతిని దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలకు కారణం అవుతాయి అని అన్నారు.

  1. ఐస్ క్రీమ్ మరియు చాక్లెట్లు

ఐస్ క్రీం మరియు చాక్లెట్లలో చక్కెర, కార్బోహైడ్రేట్లు మరియు చెడు కొవ్వు అధికంగా ఉంటాయి. “వీటిలో చాలా వరకు ఖాళీ కేలరీలు (పోషక విలువలు తక్కువగా ఉండటం లేదా అస్సలు ఉండకపోవడం) వీటిని ఖర్చు చేయడం కష్టం, మరియు కాలం గడిచే కొద్దీ, ఇది మీ గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది” అని డాక్టర్ రాజేబహదూర్ చెప్పారు. అప్పుడప్పుడు చాక్లెట్లు లేదా ఐస్ క్రీం తీసుకోవడం మంచిది, అయితే అది మీ ఆహారపు అలవాట్లు లేదా ఆహారంలో భాగం కాకూడదని చెప్పారు.

ఐస్ క్రీంను నెలకు ఒకసారి ఒక స్కూప్ తినడం ఆరోగ్యకరమైన మోతాదు అని డాక్టర్ మార్లా సూచించారు. “దీనిని మితంగా తీసుకోవడం మంచిది అయినప్పటికీ, ఇది ప్యాక్ చేయబడి మరియు ప్రాసెస్ చేయబడినందున, దానిని వీలైనంత వరకు తీసుకోకపోవడం ఎల్లప్పుడూ మంచిది” అని పునమియా చెప్పారు.

  1.   నూనె

శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే నూనెలకు దూరంగా ఉండటం ఉత్తమమని నిపుణులు పేర్కొంటున్నారు. ఉదాహరణకు, సాచురేటెడ్ కొవ్వు అధికంగా ఉండే కొబ్బరి నూనె మీ LDL కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా పెంచవచ్చు. “కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ (మంచి కొలెస్ట్రాల్ స్థాయిని (హెచ్‌డిఎల్) పెంచుతుంది) కార్డియాక్ సమస్య ఉన్నవారికి మంచి ఎంపిక” అని పునామియా చెప్పారు.

మార్లా చెప్పిన దాని ప్రకారం, ఏ నూనె అయిన కాస్త ప్రమాదకరమే అని. ఖచ్చితంగా మంచిది అని చెప్పగలిగే నూనె ఏదీ లేదు అని అన్నారు. వంటకు ఉపయోగించే నూనెను మితంగా ఉపయోగించాలి అని ఆయన చెప్పారు.

  1.  ఉప్పు

ఉప్పు వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించాలి అని నిపుణుల సూచన. ఇప్పటికే గుండె సమస్యలు ఉన్న వారు ఉప్పు ఎక్కువగా తీసుకోకూడదు అని సలహా ఇస్తున్నారు. “ఉప్పు వినియోగం నియంత్రణలో ఉండాలని, ఎందుకంటే దీనిలో ఉండే సోడియం క్లోరైడ్ రక్త నాళాలకు నయం చేయలేని విధంగా నష్టం చేస్తుంది” అని డాక్టర్ మర్లా అన్నారు.

గుండె సమస్యలు ఉన్న వారికి సోడియం మంచిది కాదు అన్నారు పునామియా, వీరు స్నాక్స్ ఇంకా పండ్లలో ఉప్పుకు బదులుగా ఓరిగానో, నిమ్మ రసం, మిరియాల పొడి లేదా కాస్త వెనిగర్ వంటివి ఉపయోగించడం మంచిది అని అన్నారు.

  1. ఫ్రీజ్ చేసినవి, ప్యాకెట్లలో వచ్చేవి అలాగే ఫాస్ట్ ఫుడ్

“ఫాస్ట్ ఫుడ్, మనం కొనే ప్యాకెట్ ఆహారం అలాగే ఫ్రీజ్ చేసిన ఆహారంలో MSG (మోనోసోడియం గ్లుటామేట్/అజినామోటో) ఉంటుంది” అని అన్నారు పునామియా. క్యాన్డ్ ఆహారంలో సోడియం అత్యధికంగా ఉంటుంది. ఇది గుండెకు ప్రమాదకరం అని అన్నారు.

తినడానికి సిద్ధంగా ఉన్న ఆహారం, ప్యాక్ చేసిన జ్యూస్‌లు, క్యాన్డ్ ఫుడ్, సాల్టెడ్ బటర్, ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ చీజ్ మరియు ప్రిజర్వ్‌డ్ మాంసానికి దూరంగా ఉండాలి, ఎందుకంటే వాటిలో కొలెస్ట్రాల్ మరియు కార్బోహైడ్రేట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. సాస్ మరియు ఊరగాయలకు దూరంగా ఉండటం కూడా మంచిది. “అధికమైన ఉప్పు లేదా ఇతర ప్రిజర్వేటివ్‌ల వంటి అవాంఛిత పదార్ధాలను అధిక మొత్తంలో కలిగి ఉంటాయి కాబట్టి ఇవి మంచివి కాదు” అని డాక్టర్ రాజేబహదూర్ చెప్పారు. కొన్నిసార్లు మనం ఈ ఆహారాలను కూడా వేయించుకుంటాము, కాబట్టి అవి చాలా అనారోగ్యకరమైనవిగా మారతాయి అని ఆయన చెప్పారు.

  1. దుంప కూరలు

చిలగడ దుంపలు, బంగాళదుంపలు అలాగే ఎర్ర దుంపలలో కార్బోహైడ్రేట్‌లు అలాగే చక్కెరలు ఎక్కువగా ఉంటాయి అని నిపుణులు అన్నారు. కాబట్టి, వీటిని వీలైనంత తక్కువగా తీసుకోవాలి. వీటిని పూర్తిగా మానేయడం సాధ్యం కాదు అనుకున్నప్పుడు, వీటిని వేయించడం కంటే కాల్చినవి తినడం మంచిది” అని అన్నారు డాక్టర్ మర్లా. కొంత మందికి ఇది రోజువారీ ఆహారం కావచ్చు, కాబట్టి వీటిని వేయించకుండా ఉడికించి తినడం మంచిది అని ఆయన సూచించారు.

  1. పంచదార

అధికంగా తీసుకునే ఏ ఆహారం అయినా సరే గుండెకు మంచిది కాదు, ఎందుకంటే కాలం గడిచే కొద్దీ ఇవి మీ గుండె ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి అని అన్నారు. చక్కెరలు ఎక్కువగా ఉండే పానీయాలు అలాగే ఆహారాలకు దూరంగా ఉండాలి అని అన్నారు.

“బెల్లం, ఫ్రక్టోజ్, కార్న్ సిరప్ మరియు పంచదార వంటి సరళమైన చక్కెరలకు దూరంగా ఉండాలి” అని అన్నారు పునామియా. వీటికి బదులుగా ధాన్యాలు, కూరగాయల వంటి క్లిష్టమైన కార్బోహైడ్రేట్‌లు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి అని అన్నారు.

 

మీ అనుభవాన్ని లేదా వ్యాఖ్యలను పంచుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

14 + thirteen =

ట్రెండింగ్

వ్యాసాలు

వ్యాసం
బెంగళూరుకు చెందిన పి.పార్వతి 20 ఏళ్లప్పుడు శ్వాస తీసుకోవడంలో చిన్నప్పుడు ఇబ్బంది పడేది. పరీక్షలు చేయించగా ఆమెకు ఆస్తమా ఉన్నట్లు నిర్దారించబడింది. ఇప్పుడు అది జరిగి 32 సంవత్సరాలు గడిచింది. 54 సంవత్సరాల వయస్సులో, పార్వతి తన కుమార్తె మరియు తనకంటే సగం వయస్సు కలిగిన స్నేహితులతో ట్రెక్‌లకు చాలా ఈజీగా వెళ్లగలుతుతోంది.
వ్యాసం
షోల్డర్ ఇంపింగ్‌మెంట్ సిండ్రోమ్ రివర్సిబుల్ అయినందున, నొప్పి యొక్క ప్రారంభ సంకేతాలను అనుభవించిన వెంటనే మీరు వైద్యుడిని సంప్రదించాలనిి సలహా ఇస్తారు.
వ్యాసం
ఎముక పునర్నిర్మాణాన్ని నిరోధించడం నుండి ఎముకల విరుగుట మరియు బోలు వ్యాధి ప్రమాదాన్ని పెంచడం వరకు, ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం ఎముకలకు శాశ్వత నష్టం కలిగిస్తుంది

0

0

0

Opt-in To Our Daily Newsletter

* Please check your Spam folder for the Opt-in confirmation mail

Opt-in To Our
Daily Newsletter

We use cookies to customize your user experience, view our policy here

మీ అభిప్రాయం విజయవంతంగా సమర్పించబడింది.

హ్యాపీయెస్ట్ హెల్త్ టీమ్ వీలైనంత త్వరగా మిమ్మల్ని సంప్రదిస్తుంది