
అసమతౌల్య ఆహారం, నెమ్మదించిన జీవన విధానాలు, ముఖ్యమైన వాటితో పాటు ఇతర కారణాలుగా ఉంటూ ప్రధానంగా పొట్ట వద్ద ఉండే కొవ్వు గుండె సంబంధిత అనారోగ్య సమస్యలకు కారణం కావడంతో పాటూ గుండెపోటు కూడా కలిగించే ప్రమాదం ఉంది.
పొట్ట వద్ద ఉండే కొవ్వు లేదా ఉదరభాగంలోని ఊబకాయం ఈ రోజుల్లో పెద్ద సమస్యగా మారింది. గత రెండేళ్లుగా మహమ్మారి కారణంగా జరిగిన లాక్డౌన్స్ మరియు ఇంటి నుంచే పని చేసే కల్చర్ పెరగడంతో యువతతో సహా మన జీవన విధానాలు బాగా నెమ్మదించాయి. దాని ఫలితమే – బరువు పెరగడం మరియు పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం. ఇది చాలామందిలో హృదయ సంబంధిత అనారోగ్యాలతో పాటూ గుండెపోటు ముప్పుని కూడా కలిగి ఉంటుంది.
గత రెండేళ్లుగా ఇంటి వద్ద నుంచే పని చేస్తున్న 34 ఏళ్ల ఐటీ ప్రొఫెషనల్ శ్రీరామ్ (పేరు మార్చడం జరిగింది) తీరిక లేని షెడ్యూల్ కారణంగా జీవన విధానం చాలా నెమ్మదించింది. రెండు నెలల క్రితం అతనికి ఊపిరి సరిగ్గా అందలేదు. ధూమపానం అలవాటు ఉన్న అతను ఊపిరితిత్తుల సమస్య కారణంగా తన శారీరక రూపు మారుతుందని భావించాడు. వైద్యులను సంప్రదించిన అనంతరం చికిత్స తీసుకోవడం కూడా ప్రారంభించారు. కానీ వారు ఇచ్చిన మందులు కేవలం ఆ క్షణానికి మాత్రమే పని చేసేవి. ఈ శ్వాస సంబంధిత సమస్యల కారణంగా శ్రీరామ్‌కి నిద్ర కూడా సరిగ్గా పట్టేది కాదు.
బెంగుళూరులోని మణిపాల్ హాస్పిటల్‌లో ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ విభాగంలో కన్సల్టెంట్ అయిన డాక్టర్ ప్రదీప్ హరణహల్లి ECG, రక్తపరీక్షలు మరియు యాంజియోగ్రామ్ పరిశోధనలను అనుసరించి అతని గుండెలో 95% బ్లాక్ ఉందని తేల్చి చెప్పారు. వెంటనే శ్రీరామ్ సర్జరీకి వెళ్లాలని సూచించారు.
‘‘నెమ్మదించిన నా జీవన విధానం, ఉదర భాగంలో ఉన్న ఊబకాయం, డైట్ మరియు ధూమపానం అనేవి నాకు బ్లాక్ ఏర్పడడానికి గల కారణాలు అని డాక్టర్ ప్రదీప్ చెప్పారు’’ అన్నారు శ్రీరామ్. ‘‘నా ఎత్తు ప్రకారం నేను సుమారుగా 75 కేజీల బరువు ఉండాలి. కానీ నేను 89 కేజీలు ఉన్నాను. అందుకే వైద్యులు నా జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోమని సూచించారు’’.
ఉదరభాగంలోని కొవ్వు అంటే ఏంటి?
ఉదరభాగంలో కొవ్వు పేరుకుపోవడం అనేది మనం తీసుకునే ఆహారం మరియు ఖర్చు చేసే క్యాలరీల మధ్య గల అసమతుల్యత అంటారు డాక్టర్ హరణహల్లి. ముఖ్యంగా శారీరక శ్రమ లేని ఒక నెమ్మదించిన జీవన విధానం మరియు అసమతౌల్యి డైట్ కారణంగా ఈ సమస్య వస్తుంది.
తరగతి గదుల్లో చదువుకునే పుస్తకాలలో భారతీయ ప్రజల్లో గుండెపోటు అనేది సాధారణంగా 45ఏళ్లు వయసు పై బడిన వారిలోనే కనిపిస్తుందని ఉంటుంది. కానీ ఆ సమాచారాన్ని మార్చి రాసేందుకు ఇదే సమయం అంటున్నారు. ‘‘మా వద్దకు వచ్చే వారిలో 35 ఏళ్లకు పైబడిన వారు కూడా హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతుండడం మేం చూస్తున్నాం’’ అంటారాయన. ‘‘వారు పొట్ట వద్ద పేరుకున్న కొవ్వుని కరిగించడంతో పాటూూ, శారీరక శ్రమ చేయాలని, చక్కని డైట్ అనుసరించాలి’’ అని ఆయన అన్నారు.
ఉదరభాగంలో ఊబకాయం అనేది ఈ రోజుల్లో చాలా కామన్ సమస్యగా మారిపోయిందంటారు చెన్నైలోని అపోలో హాస్పిటల్స్‌లో సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ మరియు ఎలక్ట్రో ఫిజియాలజిస్ట్‌గా పని చేస్తున్న డాక్టర్ ఏఎమ్ కార్తిగేశన్. దీని కారణంగా ఇన్సులిన్ స్థాయులు తగ్గడం, లిపిడేమియా (కొవ్వు స్థాయుల్లో అసాధారణత), రక్తపోటు.. వంటి సమస్యలు తలెత్తుతున్నాయి అంటారాయన. ‘‘ఈ సమస్యలన్నింటినీ కలిపి మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. ఇది దాదాపుగా గుండెపోటు సమస్యకు అతి దగ్గర సంబంధం కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న నవతరం ఈ సమస్య బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. అనారోగ్యకరమైన ఆహారం మరియు నెమ్మదించిన జీవన విధానాల కారణంగా పెరుగుతున్న ఉదరభాగంలోని ఊబకాయమే దీనికి కారణం.’’ అంటారాయన. వీటికి తోడు ధూమపానం సైతం గుండె పోటు వచ్చే ముప్పుని మరింతగా పెంచుతుంది.
‘‘పాశ్చాత్య దేశాల్లో సాధారణంగా 65 ఏళ్లకు పై బడిన వారికే గుండెపోటు వస్తుంది. కానీ భారతదేశంలో మాత్రం చిన్నవయసులో కూడా ఈ సమస్య కనిపిస్తుంది’’ అంటారు ఆయన. ‘‘ముప్పైల్లోనూ గుండెపోటు రావడం ఈ మధ్య సర్వసాధారణంగా మారిపోయింది. ఇందుకు ప్రధాన కారణం ఉదర భాగంలో ఉండే ఊబకాయం లేదా మెటబాలిక్ సిండ్రోమ్.’’
ఊబకాయాన్ని ఎలా నిర్ధారిస్తారు?
‘‘ఊబకాయాన్ని నిర్ధారించడానికి గల ఒక మార్గం బాడీ మాస్ ఇండెక్స్. ఎత్తుని, బరువు యొక్క వర్గంతో భాగిస్తారు. అలాగే ఊబకాయాన్ని నిర్ధారించే మరో మార్గం ఉదరభాగంలోని వంపు. సాధారణంగా ఆసియా ప్రాంతలోని పురుషుల్లో ఉదరభాగంలో వంపు అనేది 40 అంగుళాలు (లేదా 102 సెం.మీ.)గా ఉంటుంది. అలాగే మహిళల్లో అయితే ఇది 35 అంగుళాలు (లేదా 85 సెం.మీ.)గా ఉంటుంది. అంతకంటే ఎక్కువగా ఉంటే వారు ఊబకాయంతో బాధపడుతున్నారని అనవచ్చు’’ అంటారు డాక్టర్ హరణహల్లి. అయితే ఈ నిర్వచనం వివిధ తెగలను అనుసరించి మారుతుందని అన్నారు.
పొట్ట లావుగా ఉంటే గుండె సమస్యలు ఉన్నట్లేనా??
ఉదరభాగంలోని ఊబకాయం గుండెపోటుకి గల ప్రధాన కారణం అంటారు డాక్టర్ కార్తిగేశన్. ‘‘ఒకవేళ గుండెపోటుకు కారణం చెప్పకుండా ఆ ఉదరభాగంలోని ఊబకాయం సమస్యని అలానే వదిలేస్తే అటువంటి వారు మరోసారి గుండెపోటుకు గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువ’’ అంటారు ఆయన. ‘‘అందుకే మేం పేషెంట్లకు జంక్ ఫుడ్ పూర్తిగా ఆపేయమనడమే కాకుండా ఉదరభాగంలోని ఊబకాయం తగ్గేందుకు నడక వంటి ఏదైనా వ్యాయామం చేయాలని సూచిస్తాం. లేదంటే వారికి గుండెపోటు మరియు నొప్పి వచ్చే ముప్పు కొనసాగుతూనే ఉంటుంది.’’
శరీరంలో అంతర్గతంగా అవయవాలను చుట్టి ఉండే కొవ్వుల్లో అత్యంత ప్రమాదకరమైన రకం పొట్ట చుట్టూ పేరుకుని పోయి ఉండే కొవ్వు. విజరల్ ఫ్యాట్ (ఉదర కుహరంలో నిల్వ ఉండే కొవ్వు) శరీరంలోని కణజాలాల వాపుకు దారి తీయడమే కాకుండా, లిపిడ్ స్థాయులను కూడా పెంచుతుంది. అలాగే రక్తనాళాలు సన్నగా అయ్యేలా చేస్తుంది. హార్వర్డ్ హెల్త్ ప్రకారం ఒక వ్యక్తి శరీరంలోని మొత్తం కొవ్వులో 10 శాతం విజరల్ ఫ్యాట్ అయి ఉంటుంది.
పొట్ట వద్ద పేరుకునే కొవ్వు ఎక్టోపిక్ ఫ్యాట్ (కాలేయం, గుండె, క్లోమం మరియు కండరాల చుట్టూ పేరుకునే కొవ్వు)తో సంబంధం కలిగి ఉంటుంది. వీటి కారణంగా అథెరోస్క్లెరోసిస్, హృద్రోగ వ్యాధులు మరియు హైపర్‌టెన్షన్ వచ్చే రిస్క్ కూడా పెరుగుతుంది.
‘‘శరీరంలో పెరిగిన కొవ్వు కణజాలాలే వాపుకు మూలం అవుతాయి. అలాగే గుండెపోటు ముప్పుని కూడా పెంచుతాయి’’ అంటారు డాక్టర్ హరణహల్లి. ‘‘పొట్ట వద్ద పేరుకునే కొవ్వు యొక్క రెండో ప్రభావం శరీర బరువు మీద పడుతుంది. శరీర బరువులోని పెరుగుదల హైపర్‌టెన్షన్‌కి దారి తీస్తుంది. మీరు పెరిగే ప్రతి 10 కేజీల బరువుకి 3 నుండి 4 mmHg రక్తపోటు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఫలితంగా గుండె నొప్పి వచ్చే అవకాశం 12 % పెరుగుతుంది’’.
2020లో జరిగిన ఒక అధ్యయనం ద్వారా ‘ఉదరభాగంలో ఊబకాయం మరియు మయోకార్డియల్ ఇన్‌ఫ్రాక్షన్ తర్వాత మళ్లీ మళ్లీ వచ్చే అథిరోస్క్లీరోటిక్ కార్డియోవాస్కులర్ వ్యాధి’ అని హనే మహమ్మది, జోల్ ఓమ్, ఆండ్రియా డిస్కసియటి ఎట్ ఆల్ వెల్లడించారు. ఈ అధ్యయనాన్ని యూరోపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీ – యూరోపియన్ కార్డియాలజీ సొసైటీలో ప్రఖ్యాతిగాంచిన జర్నల్‌లో ప్రచురించారు. దీని ప్రకారం ఉదరభాగంలో ఊబకాయం ఉన్న వ్యక్తులు మళ్లీ మళ్లీ గుండెపోటుకు గురయ్యే అవకాశాలు అత్యధికంగా ఉన్నాయట.
‘‘మా అధ్యయనంలో ఉదరభాగంలో ఊబకాయం బాగా పెరిగిన రోగుల్లో చికిత్స తీసుకుంటున్నప్పటికీ వారికి కొన్ని ఆరోగ్య సమస్యలు తిరిగి ఉత్పన్నమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయని తేలింది. ముఖ్యంగా యాంటీ హైపర్‌టెన్సివ్స్, డయాబెటిస్ మెడికేషన్ మరియు లిపిడ్‌ని తగ్గించే ఔషధాలు.. వంటివి ఈ ఊబకాయంతో సంబంధం కలిగి ఉంటాయి’’ అని ఒక పత్రికా ప్రకటనలో పరిశోధకుడు మొహమ్మది తెలిపారు.
ఊబకాయం మరియు గుండె వ్యాధి మధ్య గల సంబంధం
హృదయ సంబంధిత సమస్యల రిస్క్ తగ్గించుకోవాలంటే డయాబెటిస్, కొలెస్ట్రాల్, రక్తపోటుని నిర్వహించుకుంటూ పొట్ట వద్ద ఉన్న కొవ్వుని కూడా తగ్గించుకోవాలని అన్నారు డాక్టర్ హరణహల్లి. ఎందుకంటే:
- పొట్ట వద్ద ఉండే కొవ్వు అసాధారణ కొలెస్ట్రాల్ స్థాయిలకు దారి తీస్తుంది. ఇది మంచి కొలెస్ట్రాల్‌ని తగ్గించి చెడు కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్ల స్థాయిలను పెంచుతుంది. HDL లేదా మంచి కొలెస్ట్రాల్ కూడా చెడు కొలెస్ట్రాల్ లేదా LDL స్థాయిలు తగ్గడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.
- ఊబకాయంతో ఉన్నవారిలో ఆక్సిజన్, పోషకాల సరఫరా అధికంగా అవసరం అవుతుంది కాబట్టి అది రక్తపోటు పెరిగేందుకు దారి తీస్తుంది. గుండె పోటుకు గల కారణాల్లో రక్తపోటు కూడా చాలా ముఖ్యమైంది.
- ఉదరభాగంలో ఊబకాయం ఉన్న వ్యక్తుల్లో డయాబెటిస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా వీరిలో హృదయ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు రెండు నుంచి నాలుగు రెట్లు ఎక్కువగా కూడా ఉంటాయి.
- విజరల్ మరియు ఎక్టోపిక్ ఫ్యాట్‌తో ఇది నేరుగా సంబంధం కలిగి ఉంటుంది. శరీరంలో అంతర్గత అవయవాల మీద కొవ్వు పేరుకోవడం, వాపు రావడం మరియు గుండె పోటు వచ్చే ముప్పు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.
పొట్ట వద్ద కొవ్వు మరియు గుండె నొప్పి రిస్క్
ఉదరభాగంలోని ఊబకాయం గుండెపోటు మళ్లీ మళ్లీ వచ్చేందుకు ఒక ప్రమాద కారకం అవుతుందని నిపుణులు అంగీకరిస్తున్నారు. అలాగే గుండెపోటుకు గురైన వ్యక్తులు వెనువెంటనే శారీరకంగా శ్రమించడం అంతగా మంచిది కాదు. దాని నుంచి కోలుకునేందుకు తగిన సమయం ఇవ్వడం మరియు గుండెకు విశ్రాంతి ఇవ్వడం కూడా చాలా ముఖ్యం అని గుర్తుంచుకోవాలి.
స్థిరంగా కోలుకోవడమే తక్షణ లక్ష్యంగా ఉంటుంది అంటారు డాక్టర్ హరణహల్లి. ‘‘గుండె పోటు అనేది హృదయ కండరాలకు జరిగిన గాయం వంటిది. దాని నుంచి కోలుకునేందుకు సమయం పడుతుంది’’ అంటారు ఆయన. ‘అలా కోలుకునే సమయంలో దానికి సపోర్ట్ అందించడం చాలా ముఖ్యం. కాబట్టి దీర్ఘకాలిక మరియు మధ్యంతర లక్ష్యాలు పెట్టుకుని వాటి దిశగా అడుగులు వేయాలి. ముందుగా తగినంత విశ్రాంతి తీసుకుంటూ దాని నుంచి కోలుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. అనంతరం నెమ్మది శారీరకంగా శ్రమ మొదలుపెట్టడం లేదా డైట్ పాటిస్తూ బరువు తగ్గడం.. వంటివి చేయడం ద్వారా మరొక గుండెపోటు బారిన పడకుండా జాగ్రత్తపడవచ్చు.’’