728X90

0

0

0

అంశాలకు వెళ్లండి

food for lungs: ఊపిరితిత్తుల ఆరోగ్యానికి సరైన ఆహారం
23

food for lungs: ఊపిరితిత్తుల ఆరోగ్యానికి సరైన ఆహారం

మీ ఆహారం అలాగే ఊపిరితిత్తుల సమస్యలకు సంబంధం ఉంది. సమతుల ఆహారం శ్వాసకోశ వ్యవస్థకు వచ్చే సమస్యలను నివారించడమే కాకుండా ఆస్తమా, COPD అలాగే ప్రమాదకరమైన ఇన్‌ఫ్లమేషన్‌లను నివారిస్తుంది.
ఊపిరితిత్తులు మరియు ఆహారం రెండింటి మధ్య సంబంధం
మీ ఆహారంలో ఊపిరితిత్తులకు మంచి చేసేవి

ఈ రోజుల్లో వాయుకాలుష్యం తీవ్రం అవుతోంది. దీపావళి వస్తుందంటే చాలు కొద్దిరోజుల ముందు నుంచే పిల్లలు టపాకాయలు పేలుస్తుంటారు. దీని వల్ల వాతావరణంలో గాలి నాణ్యత తగ్గుతుంది. ఈ క్రమంలో మంచి ఆహారం, వ్యాయామాలు అనేవి మన ఆరోగ్యాన్ని కాపాడతాయి.

వ్యాయామం ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తుంది?

“క్రమబద్ధమైన వ్యాయామం కండరాలకు మెరుగైన ఆక్సిజనేషన్‌కు దారితీస్తుంది, ఇది కండరాల పనితీరును పెంచుతుంది. దీని వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటుంది” అని బెంగళూరులోని నారాయణ హెల్త్‌(Narayana Health)లో పల్మోనాలజిస్ట్ డాక్టర్ మంజునాథ్ పిహెచ్ చెప్పారు. వ్యాయామాల్లో భాగంగా బ్రిస్క్ వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ , యోగా వంటి వాటిని ఎంచుకోవచ్చు.

ఉదయం వ్యాయామం చేయడం ఎందుకు ప్రయోజనకరంగా ఉంటుంది?

అస్సాంకు చెందిన 66 ఏళ్ల రిటైర్డ్ నేవీ అధికారి ఉదయ్ చంద్ర బర్మాన్, ఉదయం రొటీన్‌గా స్థిరపడ్డారు: పార్క్‌కి సైకిల్ తొక్కడం దాదాపు 20 నిమిషాలు పడుతుంది, 20 నిమిషాల పాటు వేగంగా నడవడం మరియు సాగదీయడం. ఇంట్లో, అతను దాదాపు 40 నిమిషాల పాటు ప్రాణాయామం యొక్క ఐదు లోతైన శ్వాస వ్యాయామాలను నిత్యం అభ్యాసం చేస్తాడు. అతను భస్త్రికా (వేగవంతమైన ఉచ్ఛ్వాసము మరియు నిశ్వాసం), అనులోమ విలోమ (ప్రత్యామ్నాయ నాసికా శ్వాస), భ్రమరి (హమ్మింగ్ బీ శ్వాస) మరియు కపాలభాతి (పుర్రె క్రియాశీలక శ్వాస) వంటి ప్రాణాయామం యొక్క పద్ధతులను నిశితంగా అనుసరిస్తున్నట్లు చెప్పాడు.

“ఉదయం వ్యాయామం తర్వాత, నేను రోజుకి రిఫ్రెష్‌గా ఉన్నాను. నేను ఈ రొటీన్‌ని అనుసరించకపోతే నేను చాలా నీరసంగా ఉన్నాను” అని బర్మాన్ చెప్పారు.

గాలి నాణ్యత మెరుగ్గా ఉన్నందున ఉదయం వ్యాయామం చేయడం సాయంత్రం కంటే మెరుగైనదని డాక్టర్ మంజునాథ్ చెప్పారు. ” నగరాలలో వాయు కాలుష్యం ఎక్కువగా వాహనాల కదలికల కారణంగా సంభవిస్తుంది, ఇది రోజు గడుస్తున్న కొద్దీ మరింత తీవ్రమవుతుంది” అని ఆయన చెప్పారు.

నిద్రవేళకు చాలా దగ్గరగా వ్యాయామం చేయడం నిద్రను ప్రభావితం చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు .

ఊపిరితిత్తులు మరియు ఆహారం:మీరు తినే ఆహారం, మీరు తీసుకునే శ్వాసపై ప్రభావం చూపవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం శ్వాసకోస సమస్యలను వాపులను తగ్గించవచ్చు. 

సరైన ఆహారం తీసుకోవడం వలన మీరు శ్వాస తీసుకునే విధానంలో మార్పు వస్తుంది అని మీకు తెలుసా? మీరు రోజూ ఏం తింటారు అనే దానిపై మీ శ్వాసకోశ వ్యవస్థ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది అని నిపుణులు అంటున్నారు ఊపిరితిత్తుల కణజాలం పనితీరు నుండి శ్వాసకోస వ్యవస్థకు వచ్చే ఇన్‌ఫెక్షన్‌లను తరిమికొట్టడానికి మీ రోగనిరోధక శక్తిని పెంచడం వరకు ఇది కీలకం. 

న్యూఢిల్లీలోని ఇండియన్ స్పైనల్ ఇంజ్యూరీస్ సెంటర్ (ISIC)లోని గ్యాస్ట్రోఎంటిరాలజిస్ట్ సీనియర్ కన్సల్‌టెంట్ డాక్టర్ అంకుర్ జైన్ ఇలా అన్నారు: “సమతుల ఆహారం తీసుకోవడం వలన శ్వాసకోస వ్యవస్థకు వచ్చే ప్రమాదాలను నివారించి ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేసేలా చేయవచ్చు. 

ఊపిరితిత్తులు మరియు ఆహారం: సంబంధం ఏమిటి? 

ఆస్తమా, క్రోనిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీస్ (COPD) అలాగే ఊపరితిత్తుల క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యల విషయంలో ఒక వ్యక్తి తీసుకునే ఆహారం చాలా కీలకం అని చెప్పారు హైదరాబాద్ యశోద హాస్పిటల్‌లో సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్‌వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ గోపీ క్రిష్ణ యడ్లపాటి. మీరు తీసుకునే ఆహారం మీ ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండటానికి మూడువంతుల పాత్ర పోషిస్తంది. కాబట్టి ఇన్‌ఫెక్షన్‌లను నివారించడంలో ఆహారం చాలా కీలకం అని చెప్పారు. 

విటమిన్లు (A, C మరియు E), ఖనిజాలు (మెగ్నీసియం మరియు సెలీనియం) అలాగే యాంటీఆక్సిడెంట్ల వంటి కీలక పోషకాలను సరైన మోతాదులో తీసుకోవడం వలన  ఊపిరితిత్తుల కణజాలం ఆరోగ్యకరంగా ఉండటంలో సహాయపడుతూ, కాలుష్యం మరియు విషపూరిత పదార్థాల వలన జరిగే ఆక్సిడేటివ్ ప్రమాదాన్ని నివారిస్తుంది. పండ్లు, కూరగాయలు, ధాన్యాలు మరియు ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటాయి. మీ రోజు వారీ ఆహారంలో వీటిని తీసుకోవడం వలన అనేక ఊపిరితిత్తుల సమస్యలకు కారణమయ్యే ప్రమాదకరమైన ఇన్‌ఫ్లమేషన్‌లను తగ్గిస్తాయి అని డాక్టర్ జైన్ వివరించారు. 

బెంగుళూరులో ఉన్న సక్ర వరల్డ్ హాస్పిటల్ పల్మనాలజీ మరియు క్రిటికల్ కేర్ మెడిసిన్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ సచిన్ కూమార్ మాట్లాడుతూ ఇప్పటికే టీబీ, ఊపిరితిత్తుల అబ్‌సిస్ లేదా దీర్ఘకాలిక శ్వాసకోస వ్యాధులు ఉన్న వారిలో ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది. వారిలో ప్రోటీన్ లోపం ఉంటుంది కాబట్టి దీనిని సూచిస్తాము. సోయా బీన్స్, మొలకలు వంటివి తీసుకోవడం మంచిది. 

అయితే, వంటకు ఉపయోగించే నూనెల వలన ఊపిరితిత్తులకు సమస్య వచ్చే అవకాశం ఉంది అంటున్నారు డాక్టర్ యడ్లపాటి. ధాన్యం పొట్టు నుండి తీసిన నూనె లేదా ఆలివ్ లేదా పామ్ ఆయిల్ వాడమని సూచిస్తాము. ఈ నూనెలలో సమర్థవంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉండటం వలన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అని అన్నారు. 

ఊపిరితిత్తులకు అనుకూలంగా ఉండే ఆహారం: ఆస్తమా COPD వంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వారు ఏం తినాలి, ఏం తినకూడదో చూద్దాం. 

Lung friendly food-Telugu

TB ఉన్న వారికి ఆహార నియమాలు 

క్షయ మరియు ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌లు వంటి శ్వాస సంబంధిత సమస్యలు ఉన్న వారికి  చేపలు, కోడి మాంసం అలాగే ఇతర తేలికపాటి మాంసం వంటి ప్రోటిన్ అధికంగా ఉన్న ఆహారం మంచిది. అయతే ప్రాసెస్ చేసిన ఆహారానికి వీరు దూరంగా ఉండాలి. ప్రోటీన్లు అలాగ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కోడి గుడ్లు కూడా మేము సూచిస్తాము అని అన్నారు. 

ఆస్తమా ఉన్న వారికి ఆహార నియమాలు

కొన్ని రకాల ఆహారం ఆస్తమా ఉన్న వారికి మంచిది. వారి ఆహారంలో బీట్‌రూట్ అలాగే యాపిల్ ఉండాలని చెప్తాం. అవకాశం ఉన్నప్పుడు కోడిగుడ్లు అలాగే చేపలు కూడా తినమని చెప్తాం. ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయాలంటే డ్రైఫ్రూట్స్ కూడా తీసుకోవడం ముఖ్యం.అని చెప్పారు డాక్టర్ యడ్లపాటి. 

అరటిపండ్లు, పైనాపిల్, సీతాఫలం మరియు నిమ్మకాయలు వంటి పండ్లను తీసుకోకూడదని డాక్టర్ యడ్లపాటి చెప్పారు. వీటిలో ప్రత్యేకించి అరటిపండ్లలో హిస్టిడిన్ ఉన్న ప్రోటీన్లు ఉంటాయి. కాబట్టి అవి శ్లేషాన్ని పెంచుతాయి. అలాగే చాక్లెట్లు, ప్రత్యేకించి బ్రౌన్ చాక్లెట్లు తీసుకోకూడదు అని మా సూచన. అని చెప్పారు. 

ది అమెరికన్ లంగ్ ఫౌండేషన్ కూడా విటమిన్- E పుష్కలంగా ఉండే బాదంపప్పులు, పచ్చి విత్తనాలు, స్విస్ చార్డ్, మెంతికూర, కేల్, బ్రొకలి అలాగే హేజెల్‌నట్స్ వంటి తీసుకోవాలని సూచిస్తోంది. 

COPDకి ఆహార నియమాలు

డాక్టర్ యడ్లపాటి చెప్పిన దాని ప్రకారం, COPD ఉన్న వారు యాంటీఆక్సిడెంట్లు మరియు ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. గుడ్లు, చేపలు, తేలికపాటి మాంసం అలాగే టమాటాలు, గుమ్మడికాయలు, బీట్‌రూట్లు COPD సమస్య ఉన్న వారు తీసుకోదగిన ఆహారం. అయితే వీరు ప్రాసెస్ చేసిన మాంసాన్ని తీసుకోకూడదు. అని సూచించారు. ఈ సమస్య ఉన్న వారు టీ లేదా కాఫీ తాగవచ్చు, ప్రత్యేకించి గ్రీ టీ. 

ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్న వారికి ఆహార నియమాలు 

ఊపిరితిత్తుల క్యాన్సర్ విషయంలో ఇది తినకూడదు అనే నియమాలు పెద్దగా ఉండవు. అయతే, ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్న వారిని పొగాకు, మద్యం అలాగే వేపిన ఉప్పు ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోవద్దని సూచిస్తాం. అలాగే ఖర్జూరం వంటి ఎండు పండ్లను తీసుకోమని చెప్తాం. ఇవి వ్యాధితో పోరాడటంలో సహాయపడతాయి, ప్రత్యేకించి యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటాయి.అని వివరించారు డాక్టర్ యడ్లపాటి. 

అయితే, 2019లో JAMA ఆంకాలజీలో ప్రచురించిన అధ్యయం ప్రకారం పీచు పదార్థం ఎక్కువ ఉండే ఆహారం అలాగే పెరుగు తినడం వలన ఊపిరితిత్తుల క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు అని చెప్పారు. పెరుగు లేదా యోగర్ట్ తినడం వలన కఫం పెరుగుతుంది అని చాలా మందికి ఉన్న అపోహ. కానీ అది నిజం కాదు అని చెప్పారు యడ్లపాటి. మీరు చేయాల్సిందల్లా మీరు తీసుకునే పెరుగు ఫ్రిడ్జ్‌లో పెట్టినది కాకూడదు అంతే. పెరుగులో మంచి మినరల్స్ ఉంటాయి పొటాషియం మరియు కాల్షియం ఇవి ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నవారికి మేలు చేస్తాయి. 

ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండటానికి తీసుకోకూడని ఆహార పదార్థాలు

ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలి అంటే కొన్ని ఆహారాలను తీసుకోకూడదు లేదా మితంగా తీసుకోవాలి అని చెప్తూ డాక్టర్ జైన్ ఇలా వివరించారు: 

ప్రాసెస్ చేసిన మరియు వేయించిన ఆహారాలు: వీటిలో హానికరమైన ట్రాన్స్ ఫ్యాట్లు అలాగే అధిక స్థాయిలో సోడియం ఉంటాయి. ఇవి ఇన్‌ప్లమేషన్‌కు కారణం అవుతాయి. ఎక్కువగా ఉప్పు తినడం వలన ప్లూయిడ్ నిల్వ ఉండిపోయి రక్తపోటు పెరుగుతుంది, దీని వలన ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతింటుంది. 

చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలు: సోడా అలాగే ఎనర్జీ డ్రింక్‌ల వంటివి శ్వాస కోశ సమస్యలను పెంచుతాయి. కాబట్టి వీటిని ఖచ్చితంగా మానెయ్యాలి. 

కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉండే పాల ఉత్పత్తులు: వీటి వలన ఊపిరితిత్తుల సమస్యలు పెరిగి వాటి పనితీసరు దెబ్బ తింటుంది అని అన్నారు డాక్టర్ జైన్. కొవ్వు తక్కువ ఉన్నవి లేదా అసలు లేని పాల ఉత్పత్తులను తీసుకోవడం మంచిది. 

మీకు అలర్జీలను కలిగించే ఆహారం: ఆహారం వల్ల వచ్చే అలర్జీలు ఊపిరితిత్తుల సమస్యలను పెంచుతాయి. కాబట్టి మీకు అలర్జీలకు దారి తీసే ఆహారాలను గుర్తించి వాటిని తీసుకోకుండా ఉండాలి. 

గుర్తుంచుకోవాల్సిన అంశాలు 

మీ ఆహారం అలాగే ఊపిరితిత్తుల సమస్యలకు సంబంధం ఉంది. సమతుల ఆహారం శ్వాసకోశ వ్యవస్థకు వచ్చే  సమస్యలను నివారించడమే కాకుండా ఆస్తమా మరియు COPD అలాగే ప్రమాదకరమైన ఇన్‌ఫ్లమేషన్‌లను నివారిస్తుంది. కాబట్టి మీరు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవచ్చు. 

 

మీ అనుభవాన్ని లేదా వ్యాఖ్యలను పంచుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

eleven − two =

ట్రెండింగ్

వ్యాసాలు

వ్యాసం
బెంగళూరుకు చెందిన పి.పార్వతి 20 ఏళ్లప్పుడు శ్వాస తీసుకోవడంలో చిన్నప్పుడు ఇబ్బంది పడేది. పరీక్షలు చేయించగా ఆమెకు ఆస్తమా ఉన్నట్లు నిర్దారించబడింది. ఇప్పుడు అది జరిగి 32 సంవత్సరాలు గడిచింది. 54 సంవత్సరాల వయస్సులో, పార్వతి తన కుమార్తె మరియు తనకంటే సగం వయస్సు కలిగిన స్నేహితులతో ట్రెక్‌లకు చాలా ఈజీగా వెళ్లగలుతుతోంది.
వ్యాసం
షోల్డర్ ఇంపింగ్‌మెంట్ సిండ్రోమ్ రివర్సిబుల్ అయినందున, నొప్పి యొక్క ప్రారంభ సంకేతాలను అనుభవించిన వెంటనే మీరు వైద్యుడిని సంప్రదించాలనిి సలహా ఇస్తారు.
వ్యాసం
ఎముక పునర్నిర్మాణాన్ని నిరోధించడం నుండి ఎముకల విరుగుట మరియు బోలు వ్యాధి ప్రమాదాన్ని పెంచడం వరకు, ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం ఎముకలకు శాశ్వత నష్టం కలిగిస్తుంది

0

0

0

Opt-in To Our Daily Newsletter

* Please check your Spam folder for the Opt-in confirmation mail

Opt-in To Our
Daily Newsletter

We use cookies to customize your user experience, view our policy here

మీ అభిప్రాయం విజయవంతంగా సమర్పించబడింది.

హ్యాపీయెస్ట్ హెల్త్ టీమ్ వీలైనంత త్వరగా మిమ్మల్ని సంప్రదిస్తుంది