728X90

0

0

0

ఈ వ్యాసంలో

ఉల్లిపాయతో గుండె జబ్బులు, డయాబెటిస్‌లకు చెక్
40

ఉల్లిపాయతో గుండె జబ్బులు, డయాబెటిస్‌లకు చెక్

ఉల్లిపాయలో పాలీఫెనాల్స్(మొక్కల ఆధారిత సూక్ష్మపోషకాలు) పుష్కలంగా ఉన్నాయని, ఇవి క్వెర్సెటిన్‌తో సహా గుండె ఆరోగ్యానికి మంచివని అభిప్రాయపడ్డారు.

”ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు” అని మన తెలుగులో ఓ సామెత ఉంది. అయితే పొట్టనిండా పోషకాలు ఉన్నా.. నిర్లక్ష్యం చేయబడిన అనేక ఆహార పదార్థాలలో ఉల్లిపాయ ఒకటి. వాస్తవానికి ఇది బహుళ పోషకాలు కలిగిన సహజ సమ్మేళనాల పవర్ హౌస్. ఇవి మీ గుండె ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మధుమేహ నివారణకు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి.

మీ రోజువారి ఆహారంలో ఉల్లిపాయను చేర్చుకోవడం వల్ల దీర్ఘకాలంలో మెరుగైన గుండె ఆరోగ్యాన్ని మరియు రక్తంలో గ్లూకోజ్ నిర్వహణను అదుపులో ఉంచవచ్చని నిపుణులు అంటున్నారు. ఉల్లిపాయలు వృక్షశాస్త్రపరంగా వెల్లుల్లితో పాటు అల్లియం వెజిటెబుల్ కేటగిరీ కింద వర్గీకరించబడ్డాయి. ఇవి గుండెకు మేలు చేసే లక్షణాలను కలిగి ఉన్నాయి. రెండింటిలోనూ మొక్కల పోషకాలు, ఫైబర్, సేంద్రీయ సల్ఫర్ అణువులు మరియు యాంటీఆక్సిడెంట్లు సమ‌ృద్ధిగా ఉంటాయి. ఇవి వాటిని సమతుల్య మరియు ఆరోగ్యకరమైన ఆహారంలో అంతర్భాగంగా చేస్తాయి.

ఉల్లిపాయ గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు

గురుగ్రామ్‌లోని నారాయణ హెల్త్ కేర్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోని కార్డియాలజీ మరియు ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ సీనియర్ కన్సల్టెంట్ మరియు అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ సంజయ్ చుగ్ మాట్లాడుతూ.. ఉల్లిపాయలోని ఆర్గానిక్ సల్ఫర్ సమ్మేళనాలు కరోనరి ధమనులలో ఫలకం ఏర్పడటాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. కొలెస్ట్రాల్ అణువులు వాటిలో కూరుకుపోకుండా చూసి, రక్త ప్రసరణ సాఫీగా సాగేలా చేస్తాయి.

‘ఉల్లిపాయలోని సేంద్రీయ సల్ఫర్ సమ్మేళనాలు రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించే మరియు మెరుగైన రక్త ప్రసరణకు తోడ్పడే ప్రతిస్కందక లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ సమ్మేళనాలు రక్తనాళాలలో ఆక్సీకరణ ఒత్తిడిని మరియు మంటను కూడా తగ్గిస్తాయి’ అని డాక్టర్ చుగ్ చెప్పారు.

ఢిల్లీకి చెందిన డైటీషియన్ అవ్నీ కౌల్ మాట్లాడుతూ.. ఉల్లిపాయలో పాలీఫెనాల్స్(మొక్కల ఆధారిత సూక్ష్మపోషకాలు) పుష్కలంగా ఉన్నాయని, ఇవి క్వెర్సెటిన్‌తో సహా గుండె ఆరోగ్యానికి మంచివని అభిప్రాయపడ్డారు. ఉల్లిపాయతో కలిగే ఇతర ప్రయోజనాలను కూడా ఆమె వివరిస్తున్నారు. ఇది వాసోడైలేషన్ (రక్తనాళాల విస్తరణ)కు సహాయపడుతుంది. నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ధమనులు గట్టిపడటాన్ని తగ్గిస్తుంది. నిజానికి ఉల్లిపాయలో డైటరీ నైట్రేట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది నైట్రిక్ ఆక్సైడ్ (మానవ శరీరం యొక్క సహజ రక్తపోటు నియంత్రకం)గా విచ్ఛిన్నమవుతుంది.

‘ఒక విధంగా, ఉల్లిపాయలు రక్తనాళాల నష్టాన్ని నివారించడంలో సహాయపడతాయి. తద్వారా రక్తప్రసరణ మరియు లిపిడ్ ప్రొఫైల్‌ను మెరుగుపరచడం ద్వారా దీర్ఘకాలంలో గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఇది రక్తాన్ని పంపింగ్ చేసేటప్పుడు గుండెపై పడే ఒత్తిడి కూడా తగ్గిస్తుంది’ అని కౌల్ చెప్పారు.

డయాబెటిస్ ఫ్రెండ్లీగా ఉల్లిపాయ

వైట్‌ఫీల్డ్ మణిపాల్ ఆస్పత్రి డయాబెటిస్ అండ్ ఎండోక్రినాలజీ కన్సల్టెంట్ డాక్టర్ శ్రీదేవి అట్లూరి మాట్లాడుతూ.. ఉల్లిపాయను మధుమేహానికి అనుకూలమైన కూరగాయగా మార్చేది దానిలో ఉండే గ్లైసెమిక్ ఇండెక్స్ (GI ఆఫ్ 12) అంటే అది శరీరంలో నెమ్మదిగా శోషించబడుతుంది. దీనివలన గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరగవు. ఉల్లిపాయను డయాబెటిస్ ఫ్రెండ్లీగా మార్చే వాటిలో సల్ఫర్ మరియు క్వెర్సెటిన్ ఉంటాయని ఆమె చెప్పారు. దీనిని ఆహారంలో చేర్చుకోవచ్చని కూడా అన్నారు.

డాక్టరి అట్లూరి వివరిస్తూ.. ఉల్లిపాయకు బలమైన వాసన మరియు రుచి సల్ఫర్ కారణంగా వస్తుంది. ఉల్లిపాయలో ఉండే కొన్ని ఇతర పోషకాలు మరియు సల్ఫర్ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. ఇది ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడంతో పాటు గ్లైసెమిక్ నియంత్రణను మెరుగుపరుస్తుంది అని తెలియజేశారు.

బెంగళూరు చెందిన డైటీషియన్ రంజనీ రామన్ ఉల్లిపాయ వలన కలిగే ఇతర ప్రయోజనాలను పంచుకున్నారు. ఇవి మంచి మొత్తంలో ఫైబర్ కూడా కలిగి ఉంటాయి. ఇది మధుమేహ నియంత్రణలో సహాయపడటానికి గ్లూకోజ్ విడుదలను నెమ్మదిస్తుంది.

“ఉల్లిపాయలలో ఫోలేట్, విటమిన్లు బి మరియు సి, పొటాషియం, విటమిన్ కె వంటి అన్ని ప్రయోజనకరమైన సూక్ష్మపోషకాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి మంచివి. ఉల్లిపాయలలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది మధుమేహం ఉన్నవారికి కీలకమైనది, ” అని రామన్ వివరించారు.

ఉల్లిపాయలను వండే సరైన మార్గం

సలాడ్లు, సూప్‌లు, శాండ్‌విచ్‌లు లేదా సల్లాలలో ఉల్లిపాయలను పచ్చిగా లేదా తక్కువగా ఉడికించి తినడం ఉత్తమమని నిపుణులు అంటున్నారు. పచ్చి ఉల్లిపాయలు క్వెర్సెటిన్ మరియు సల్ఫర్ వంటి ముఖ్యమైన సమ్మేళనాలను పుష్కలంగా కలిగి ఉంటాయి అని కౌల్ పేర్కొన్నారు.

ఉల్లిపాయతో గరిష్ట ఆరోగ్య ప్రయోజనాలను పొందాలంటే కూరలో ఎక్కువ ఉడికించకపోవడం ఉత్తమం. ఎందుకంటే అధిక వేడితో చేసే వంట కొన్ని ఉపయోగకరమైన మూలకాలను తగ్గించవచ్చు లేదా నాశనం చేయవచ్చు.

జాగ్రత్తలు

ఉల్లిపాయల్లో ఎఫ్ఓడిఎమ్ఏపీఎస్ లేదా షార్ట్ చైన్ కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. జీర్ణక్రియ సమయంలో చిన్న ప్రేగులు వాటిని గ్రహించడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలకు దారితీస్తుంది. ఇప్పటికే గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు తరచుగా ఉల్లిపాయల వాడకం తగ్గించి డాక్టర్ సలహాతోనే తినమని సూచిస్తారు.

‘ఉల్లిపాయలు కొంతమంది వ్యక్తుల్లో జీర్ణక్రియలో కూడా అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ఇది గ్యాస్, కడుపు ఉబ్బరం లేదా గుండెల్లో మంట వంటి లక్షణాలకు దారితీస్తుంది’ అని కౌల్ చెప్పారు.

గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ డిసీజ్ (GERD) వంటి కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడే వారు ఉల్లిపాయలను తిన్న తర్వాత కొంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కోవచ్చు. అందుకే వారు డాక్టర్ల సూచనమేరకే ఉల్లిపాయలు తీసుకోవడం ఉత్తమం.

గుర్తుంచుకోవాల్సిన అంశాలు

ఉల్లిపాయలలో ఉండే క్వెర్సెటిన్, క్రోమియం మరియు సల్ఫర్ వంటి మొక్కల సమ్మేళనాలు ర్తకంలో గ్లూకోజ్‌ను నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
అలెర్జీ లేదా జీర్ణసమస్యలు ఉన్న వ్యక్తులు వారి ఆహారంలో ఉల్లిపాయ వినియోగాన్ని పర్యవేక్షించాలి లేదా డైటీషియన్‌ను సంప్రదించాలి.

వైద్య పరిస్థితులతో బాధపడుతున్న వ్యక్తులు ఉల్లిపాయలను తిన్న తర్వాత తీవ్ర లక్షణాలను అనుభవించవచ్చు మరియు వారి తీసుకోవడం పర్యవేక్షించాలి.

మీ అనుభవాన్ని లేదా వ్యాఖ్యలను పంచుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ట్రెండింగ్

వ్యాసాలు

0

0

0

Opt-in To Our Daily Newsletter

* Please check your Spam folder for the Opt-in confirmation mail

Opt-in To Our
Daily Newsletter

We use cookies to customize your user experience, view our policy here

మీ అభిప్రాయం విజయవంతంగా సమర్పించబడింది.

హ్యాపీయెస్ట్ హెల్త్ టీమ్ వీలైనంత త్వరగా మిమ్మల్ని సంప్రదిస్తుంది