
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇటీవల ప్రచురించిన కథనం 2011 నుండి 2021 వరకు దేశంలో అల్ట్రా ప్రాసెస్డ్ ఆహార వినియోగ తీరు దానికి కారణమవుతున్నట్లు కనబడుతోంది.
628 వేల టన్నులు! ఇది అక్షరాల 2021లో భారతీయులు తిన్న ఇన్‌స్టంట్ నూడుల్స్ బరువు. ఆ సంవత్సరంలో అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారంపై (UPF) అక్షరాల 2,535 బిలియన్ రూపాయలు, ఇది అంతకు ముందు సంవత్సరం ఖర్చు చేసిన దాని కంటే 267 బిలియన్ రూపాయలు ఎక్కువ. గడిచిన దశాబ్దంలో భారతదేశంలో అల్ట్రా ప్రాసెస్డ్ ఆహార వినియోగం విపరీతంగా పెరిగింది, దీనినే ఇక్కడ డయాబెటిస్ అలాగే గుండెసంబంధిత వ్యాధులు గణనీయంగా పెరగడానికి కారణంగా భావిస్తున్నారు.
“ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం అనేది అనేక ఆహార సమస్యలకు ప్రధాన కారణం” అని అన్నారు డాక్టర్ ప్రమోద్ వి సత్య. ఈయన బెంగుళూరు మిల్లర్స్ రోడ్‌లోని మణిపాల్ హాస్పిటల్(Manipal Hospital) ఇంటర్నల్ మెడిసిన్ కన్సల్టెంట్ మరియు డయాబెటాలజిస్ట్.
భారతదేశంలో 2011-2021 మధ్య UPF వినియోగ ధోరణులపై WHO-ICRIER ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్(Indian Council for Research on International Economic Relations) ప్రచురించిన నివేదిక ప్రకారం, ప్రజలలో అల్పాహార చిరుధాన్యాలు, రెడీ-టు-ఈట్(తినడానికి సిద్దంగా ఉండే ప్యాక్ చేసిన) ఆహారాలు అలాగే ఉప్పు ఎక్కువ ఉండే చిరుతిళ్ళపై మక్కువ పెరిగింది. ప్రత్యేకించి కరోనా మహమ్మారి కారణంగా 2019లో విధించిన లాక్ డౌన్ తర్వాత బాగా పెరిగింది.
భారతదేశంలో UPFల మార్కెట్ అయిదు మూలస్తంభాలు
ఆ నివేదికలు భారతదేశ UPF మార్కెట్‌ను అయిదు వర్గాలుగా విభజించాయి. ప్రతి వర్గంలోను అనేక ఆహార పదార్థాలు ఉన్నాయి:
- బ్రేక్‌ఫాస్ట్ తృణధాన్యాలు
భారతదేశంలో స్థిరంగా పెరుగుతున్న బ్రేక్‌ఫాస్ట్ తృణధాన్యాల(అల్పాహార చిరుధాన్యాలు) అమ్మకాలను గమనించిన WHO, వీటికి తక్కువ చక్కెర అలాగే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉండే ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను తక్షణమే సూచించాల్సిన అవసరం ఉందని హెచ్చరించింది. భారతదేశంలో పెరుగుతున్న డయాబెటిస్ కేసులకు, పెరుగుతున్న UPF వినియోగానికి సంబంధం ఉందని తెలిపింది.
“భారతదేశంలో యుక్తవయస్కులు అలాగే యువకులలో ప్రీడయాబెటిక్ కేసులలో కూడా గణనీయమైన పెరుగుదల ఉంది. కాబట్టి ఉత్పత్తుల ఫార్ములాలను తిరిగి పరిశీలించ వలసిన అవసరం ఉంది, దీనిని తయారుచేయడం సులభం అవడం వలన భవిష్యత్తులో డిమాండ్ పెరుగుతుంది” అని పేర్కొంది నివేదిక.
అల్పాహారం తృణధాన్యాలలో, ఓట్స్, గంజి మరియు మ్యూస్లీ 2021 లో అత్యధిక అమ్మకాలను కలిగి ఉన్నాయి. 2011లో భారతదేశంలో సుమారు 12,000 టన్నుల కార్న్ ఫ్లేక్స్ అమ్ముడయ్యాయి, ఇది 2021 లో 40,000 టన్నులకు (రూ .14,008 మిలియన్ల విలువ) పెరిగింది.
- రెడీమేడ్ మరియు సౌకర్యవంతమైన ఆహారం
లాక్ డౌన్ కారణంగా 2020లో రెడీమేడ్ ఆహారం అలాగే సౌకర్యవంతమైన ఆహారాలకు డిమాండ్ పెరిగింది. అనేక కంపెనీలు ఇంటి వద్ద నుండి పని విధానానికి మారడం దీనికి కారణం అని నివేదిక పేర్కొంది.
“ఇది [UPF] అనేది తినడానికి వేగంగా అందుబాటులో ఉండే ఆహారం. కానీ ఇది ఏ మాత్రం ఆరోగ్యకరం కాదు. UPFలో అధిక శాతంలో రిఫైన్ చేసిన చక్కెర, కార్బోహైడ్రేట్‌లు అలాగే సంతృప్త కొవ్వులు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి హానికరం” అని అన్నారు డాక్టర్ సత్య.
ఈ రకమైన ఆహారంలో ఉప్పు, సోడియం అలాగే కొవ్వు పదార్థాల శాతం ఎక్కువ ఉంటుంది, ప్రత్యేకించి ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరం. 2021లో సాస్‌లు, కాండిమెంట్లు అలాగే ఫుడ్ డ్రెస్సింగ్ పదార్థాలు అత్యధికంగా అమ్ముడయిన పదార్థాలుగా నిలిచాయి (814 వేల టన్నులు), దీని తర్వాత 450 వేల టన్నులతో పదార్థాలతో ఉన్న తక్షణమే చేసుకునే, తినడానికి సిద్ధంగా ఉన్న నూడుల్స్.
3. ఉప్పు ఎక్కువ ఉండే చిరుతిండ్లు
కరోనా మహమ్మారి సమయంలో కనిపించిన మరొక ధోరణి, ఉప్పు ఎక్కువ ఉండే చిరు తిండ్లు అలాగే ఇరుక్కుపోయిన లేదా గొంతుకు అడ్డుపడిన ఆహారాలను కిందికి నెట్టే పానీయాల అమ్మకాల విలువలో 2019లో అనూహ్య పెరుగుదల. ఈ వర్గంలో బంగాళదుంప చిప్స్, టోర్టీలా చిప్స్, పఫ్ చేసిన స్నాక్స్, పాప్‌కార్న్, రుచికరమైన బిస్కెట్లు అలాగే ఇతర భారతీయ స్నాక్స్ (సేవ్ లేదా భుజియా వంటివి) ఉన్నాయి.
“చాలా ఉత్పత్తులలో ఉండే ఉప్పు అలాగే కొవ్వు పదార్థాల పరిమాణం WHO SEAR (South-East Asian Region) న్యూట్రియంట్ ప్రొఫైల్ మోడల్(NPM) నియమాలను దాటి ఉంటాయి. ఆరోగ్యకరమైన రకాలను మార్కెట్‌లోకి తీసుకురావడానికి అడ్డుపడే అనేక కీలక కారణాలలో ఒకటి ఆరోగ్యకరమైన ఆహారం విషయంలో సరైన పాలసీలు లేకపోవడం” అని నివేదిక వెల్లడించింది.
Happiest Health వీడియో సిరీస్ ‘The Why Axis’లో మాట్లాడుతూ, “డయాబెటిస్ ఉన్న వ్యక్తులు చక్కెరకు దూరంగా ఉన్నప్పటికీ ఉప్పగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటారు. మీరు ఎక్కువగా చిప్స్ లేదా ఉప్పగా ఉండే చిరు తిండి తింటూ మిమ్నల్ని మీరు డయాబెటిస్ నుండి రక్షించుకుంటున్నారు అనుకుంటే పొరపాటే” అని అన్నారు డాక్టర్ అనురా కుర్పద్. ఈయన బెంగుళూరులోని సెయింట్ జాన్స్ మెడికల్ కళాశాల ఆసుపత్రి ఫిజియాలజీ విభాగం ప్రొఫెసర్.
- చాక్లెట్లు మరియు పంచదార స్వీట్లు
చాక్లెట్లు అలాగే పంచదార స్వీట్ల విషయానికి వస్తే, తియ్యని బిస్కెట్లకు అత్యధిక మార్కెట్ వాటా ఉంది, రిటైల్ అమ్మకాలలోను అలాగే అమ్మిన పరిమాణంలోను కూడా. ఈ నివేదిక తియ్యని బిస్కెట్లు మీ ఆరోగ్యానికి హాని చేస్తాయి అని ఎత్తిచూపింది. ఎందుకంటే వీటిని ఎక్కువగా తినాలి అనే బలమైన కోరిక కారణంగా తింటాము(ప్రత్యేకించి చిన్నారులు) అలాగే ఇవి ఎక్కువ నిల్వ కాలం ఉంటాయి.
“సరైన విధానాల కోసం తియ్యని బిస్కెట్ల వర్గంపై దృష్టి సారించడం కీలకం. ఎందుకంటే వీటిని ఎక్కువగా చిన్నారులు తింటారు, తక్కువ ధరకు అందుబాటులో ఉంటాయి అలాగే ఆరోగ్యకరమైన ఉత్పత్తులుగా ఇలాంటి ఆహారాన్ని మార్కెటింగ్ చేయడం కూడా పెరిగింది.” అని చెప్పింది నివేదిక. ఐస్ క్రీమ్ అలాగే గడ్డకట్టించిన స్వీట్లు ఇంకా కేక్‌లు అలాగే పేస్ట్రీలు బిస్కెట్‌ల తర్వాత ఎక్కువగా అమ్ముడవుతున్న ఆహారం.
- పానీయాలు (తీయగా ఉన్నవి అలాగే లేనివి)
WHO నివేదిక ప్రకారం, కార్బోనేటేడ్ పానీయాలు మరియు కోలాలు తమ మార్కెట్ వాటాలో భారీ క్షీణతను చవిచూశాయి, అయితే ఫ్లేవర్డ్ పాలు మరియు జ్యూస్ ఉత్పత్తులు అత్యధిక మార్కెట్ వృద్ధిని నమోదు చేశాయి. 2021లో మాత్రమే రిటైల్ పరిమాణంలో చూస్తే, స్క్వాష్ పానీయాల అమ్మకాల్లో ఆధిపత్యం చెలాయించింది, ఇది మార్కెట్‌లో 77 శాతం వాటాను కలిగి ఉంది.
ఈ ఆహారాలలో చాలా వరకు రసాయన పదార్థాలు మరియు ప్రిజర్వేటివ్‌లను కలిగి ఉంటాయి, ఇవి దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. అవి పరోక్షంగా క్యాన్సర్‌కు దారితీసే సమస్యలను కూడా కలిగిస్తాయి” అని కోల్‌కతాలోని అపోలో క్యాన్సర్ కేంద్రం(Apollo Cancer Center), రేడియేషన్ ఆంకాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ సయాన్ పాల్ చెప్పారు.
మహమ్మారి కోలాలు మరియు కార్బోనేటేడ్ డ్రింక్స్ నుండి జ్యూస్‌లు మరియు ఫ్లేవర్డ్ మిల్క్‌కి మారడానికి కారణమైనప్పటికీ, ఈ ఉత్పత్తులు ఇప్పటికీ పెద్ద మొత్తంలో చక్కెరను కలిగి ఉంటాయి మరియు ఆరోగ్యకరమైన ఎంపిక కాకపోవచ్చు అని నివేదిక సూచిస్తుంది. WHO ఇటీవలే చక్కెర రహిత పానీయాలలో ఉపయోగించే ప్రసిద్ధ కృత్రిమ స్వీటెనర్ అయిన అస్పర్టమేనిని క్యాన్సర్ కారకంగా వర్గీకరించింది.
డయాబెటాలజిస్ట్ మరియు చైర్–ఎలెక్ట్ (దక్షిణాసియా), ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్(IDF), UPF వినియోగం (చక్కెర అధికంగా ఉండే పానీయాలతో సహా) అన్ని సామాజిక–ఆర్ధిక వర్గాలలోని వ్యక్తులలో అలాగే అన్ని వయస్సుల వారిలో పెరుగుతున్నందున, బలమైన నియంత్రణ చర్యలను అమలు చేయవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రస్తుతానికి, భారతదేశంలో కనీసం 101 మిలియన్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు, మరో 136 మిలియన్లు ప్రీ–డయాబెటిస్తో జీవిస్తున్నట్లు అంచనా.