728X90

0

0

0

ఈ వ్యాసంలో

జలుబు చెవి నొప్పికి కారణమవుతుందా?
332

జలుబు చెవి నొప్పికి కారణమవుతుందా?

జలుబు చెవి నొప్పికి ఎందుకు దారితీస్తుందో అర్థం చేసుకోవడానికి, చెవి యొక్క సంక్లిష్ట అనాటమీని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో, మనలో చాలా మంది జలుబు సంబంధిత వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. జలుబును సాధారణంగా వైరల్ ఇన్ఫెక్షన్లు అంటారు. ఇందులో ముక్కు కారటం, గొంతునొప్పి మరియు దగ్గు వంటి లక్షణాలు ఉంటాయి. ఇది సాధారణంగా వేధించే సమస్యే అయినా కొన్ని సందర్భాల్లో జలబు కారణంగా చెవినొప్పి కూడా ఒక సమస్య కావచ్చు. ఈ నొప్పి చలా ఇబ్బందిని కలుగజేస్తూ నిద్రకు, ఏకాగ్రతకు భంగం కలిగించవచ్చు.

జలుబుతో చెవి నొప్పి ఎందుకు?

జలుబు చెవి నొప్పికి ఎందుకు దారితీస్తుందో అర్థం చేసుకోవడానికి, చెవి యొక్క సంక్లిష్ట అనాటమీని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మన చెవి బయటి, మధ్య మరియు లోపలి చెవి అనే మూడు భాగాలుగా విభజించబడింది. మధ్య చెవి యూస్టాచియన్ ట్యూబ్ ద్వారా గొంతు వెనుకకు అనుసంధానించబడి ఉంటుంది.

”చెవి ఆరోగ్యంలో యూస్టాచియన్ ట్యూబ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ చిన్న గొట్టం మధ్య చెవిని గొంతు వెనుకకు కలుపుతుంది. ఇది గాలి ప్రసరణకు, ఒత్తిడి కలిగించడానికి అనుమతిస్తుంది. మీకు జలుబు చేసినప్పుడు, వైరస్ యూస్టాచియన్ ట్యూబ్‌ను వాపుకు గురిచేస్తుంది. దీనివల్ల అది వాచి బ్లాక్ అవుతుంది” అని కోల్‌కతాకు చెందిన ఈఎన్‌టీ కన్సల్టెంట్ డాక్టర్ నిఖత్ పర్వీన్ చెప్పారు.

ఈ అడ్డంకి గాలిని మధ్య చెవిలోకి ప్రవేశించకుండా నిరోధించడంతో పాటు ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ ఒత్తిడి వ్యత్యాసం చెవి నొప్పికి దారితీస్తుంది. ”అదనంగా ముక్కు నుంచి శ్లేష్మం మరియు ద్రవం కొన్నిసార్లు యూస్టాచియన్ ట్యూబ్‌లోకి తిరిగి రావచ్చు. ఇది అక్కడ అడ్డుపడి నొప్పిని మరింత తీవ్రతరం చేస్తుంది” అని డాక్టర్ పర్వీన్ అన్నారు.

లక్షణాలను గుర్తించడం

మొరాదాబాద్‌లోని ఈఎన్‌టీ కన్సల్టెంట్ డాక్టర్ ఉద్యాత్ భట్నాగర్ మాట్లాడుతూ.. మీరు చెవి నొప్పితో బాధపడుతున్నప్పుడు, జలుబు చెవిలో ఇతర లక్షణాలను కూడా కలిగిస్తుంది. అందులో ముఖ్యంగా..

చెవిపై ఒత్తిడి కలిగిన అనుభూతి
తల తిరగడం
చెవి నుంచి ద్రవం కారడం
చెవులు వినిపించకపోవడం
జ్వరం ( కొన్ని సందర్భాల్లో)

జలుబు కారణంగా వచ్చే చెవినొప్పి సాధారణంగా తేలకపాటిది. కొన్ని రోజులలో దానంతట అదే నయమైపోతుంది. అయితే మీ క్రింద చెప్పే వాటిలో ఏదైనా సమస్యను ఎదుర్కొంటే మాత్రం వైద్యుల సలహా పొందడం చాలా ముఖ్యం..

చెవిలో తీవ్రమైన నొప్పి
100.4°F (38°C) కంటే ఎక్కువ జ్వరం
చెవి నుంచి చీము లేదా రక్తం కారడం
వినికిడి లోపం
మెడ గట్టిపడటం
తీవ్రమైన తలనొప్పి

చికిత్స

చాలా సందర్భాలలో, జలుబు కారణంగా చెవి నొప్పిని ఎదుర్కొనే వ్యక్తులు స్వీయ విశ్వాసం కలిగి ఉంటారు. దీనిని ఎవరూ పట్టించుకోకూడదని డాక్టర్ పర్వీన్ చెప్పారు. సరైన రోగ నిర్ధారణ కోసం వైద్యుడిని సంప్రదించాలని ఆమె సిఫార్సు చేస్తోంది. వైద్యుడు కారణాన్ని తెలుసుకోవడానికి, చికిత్సను సూచించడానికి కొన్ని చర్యలు తీసుకోవచ్చు.

క్లినికల్ అసెస్‌మెంట్: వైద్య నిపుణులు వివిధ రకాలైన పరీక్షలను నిర్వహించి లక్షణాలు, వైద్య చరిత్ర మరియు ప్రమాద కారకాలను అంచనా వేస్తారు.
ఒటోస్కోపిక్ పరీక్ష: మంట, ఇన్ఫెక్షన్ లేదా ఇతర అసాధారణ సంకతాల కోసం చెవి చుట్టుపక్కల నిర్మాణాలను పరిశీలించడానికి డాక్టర్ ఓటోస్కోప్‌ను ఉపయోగించవచ్చు.
ఆడియోమెట్రిక్ పరీక్ష: వినికిడి పనితీరును అంచనా వేయడానికి మరియు చెవి నొప్పికి సంబంధించిన ఏదైనా వినికిడి లోపాన్ని గుర్తించడానికి ఆడియోమెట్రిక్ పరీక్షలు నిర్వహించబడతాయి.

నిర్వహణ

అదృష్టవశాత్తు, జలుుబు వల్ల వచ్చే చెవి నొప్పిని గుర్తించడానికి అనేక విషయాలు ఉన్నాయని డాక్టర్ పర్వీన్ మరియు భట్నాగర్ చెప్పారు. కొన్ని కారణాలు ఇలా ఉన్నాయి..

ఓవర్-ది-కౌంటర్ నొప్పి నివారణలు: నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీస్ వంటి ఓటీసీ మందులు వాపు మరియు నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.
డీకాంగెస్టెంట్లు: యూస్టాచియన్ ట్యూబ్‌లలో వాపు మరియు ఒత్తిడిని తగ్గించడానికి డీకాంగెస్టెంట్లు సహాయపడతాయి. ఇది చెవి నొప్పిన తగ్గించడానికి పరోక్షంగా సహాయపడుతుంది.
వెచ్చని కంప్రెస్‌లు: నొప్పి ఉన్న చెవికి వెచ్చని కంప్రెస్‌ను వర్తింపజేయడం ద్వారా నొప్పిని తగ్గించి, రక్త ప్రవాహాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది.
ఆవిరి పట్టడం: వేడినీటి గిన్నె నుంచి ఆవిరి పట్టడం వల్ల శ్లేష్మం పలుచబడి యూస్టాచియన్ ట్యూబ్‌లు తెరవబడతాయి.
ఉప్పు నీటితో పుక్కిలించడం: గోరు వెచ్చని ఉప్పు నీటితో పుక్కిలించడం గొంతు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేగాకుండా ముక్కు వెనుక భాగంలో మంటను తగ్గిస్తుంది, ఇది చెవి నొప్పికి పరోక్షంగా సహాయపడుతుంది.
విశ్రాంతి: జలుబు మరియు చెవి నొప్పి నుంచి బయటపడటానికి ఇది అత్యంత శక్తివంతమైన మార్గం. మీ శరీరం జలుబు నుంచి బయటపడటానికి మరియు ఎర్రబడిన కణజాలాలను నయం చేయడానికి పుష్కలంగా విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం.

నివారణ కోసం అదనపు చిట్కాలు

చెవి నొప్పిని పూర్తి తగ్గించడానికి కచ్చితమైన మార్గాలు లేనప్పటికీ, అనేక మార్గాలు ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
-మీ చేతులను తరచుగా కడగాలి. ఇది జలుబుకు కారణమయ్యే జర్మ్స్ వ్యాప్తిని నిరోధించడంలో సహాయపడుతుంది.
-అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో సన్నిహితంగా మెలగకుండా ఉండాలి.
-ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. తగినంత సమయం నిద్రపోవాలి. ఇది మీ రోగనిరోధక వ్యవస్థను పెంచడంలో సహాయపడుతుంది. ఇన్ఫెక్షన్‌లకు తక్కువ అవకాశం కలిగిస్తుంది.
-హ్యూమిడిపైయర్‌ను ఉపయోగించండి. ఇది గాలికి తేమను జోడించడంలో సహాయపడుతుంది. శ్లేష్మ పొరల ఉపశమనానికి సహాయపడుతుంది.
-ధూమపానం చేయరాదు. ధూమపానం యూస్టాచియన్ గొట్టాలను చికాకుపెట్టడంతో పాటు మంటకు గురి చేస్తుంది.

ముగింపు

జలుబు ద్వారా కలిగే చెప్పి నొప్పి సంక్లిష్టతలను గుర్తించడానికి నివారణ చర్యలకు సకాలంలో వైద్య సంరక్షణ అవసరం. చెవి నొప్పి కొనసాగడం లేదా తీవ్రమవడం జరిగితే వైద్య నిపుణుల్నిసంప్రదించడం చాలా ముఖ్యం.

మీ అనుభవాన్ని లేదా వ్యాఖ్యలను పంచుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ట్రెండింగ్

వ్యాసాలు

0

0

0

Opt-in To Our Daily Newsletter

* Please check your Spam folder for the Opt-in confirmation mail

Opt-in To Our
Daily Newsletter

We use cookies to customize your user experience, view our policy here

మీ అభిప్రాయం విజయవంతంగా సమర్పించబడింది.

హ్యాపీయెస్ట్ హెల్త్ టీమ్ వీలైనంత త్వరగా మిమ్మల్ని సంప్రదిస్తుంది