728X90

0

0

0

అంశాలకు వెళ్లండి

ఆహారం మరియు పోషణ గురించి ప్రాచుర్యంలోని అపోహలలో నిజమెంతో తెలుసుకోండి
12

ఆహారం మరియు పోషణ గురించి ప్రాచుర్యంలోని అపోహలలో నిజమెంతో తెలుసుకోండి

ఆహారం మరియు పోషణ : ఆహారం అనేది మనుగడకు ప్రాథమిక అంశం మరియు దానిని వ్యక్తిగత అవసరాలకు అనుకూలీకరించడం అనేది ముఖ్యమైనది.
ఆహారం మరియు పోషణ గురించి ప్రసిద్ధ అపోహలు
ఆహారం మరియు పోషణ గురించి ప్రసిద్ధ అపోహలు

ఆహారం అనేది మనుగడకు ప్రాథమిక అంశం మరియు దానిని వ్యక్తిగత అవసరాలకు అనుకూలీకరించడం అనేది ముఖ్యమైనది. 

వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణలో పోషకాహారం అనేది ఎక్కువగా చర్చించబడిన విషయాలలో ఒకటి అయితే, పుకారుల ద్వారా వ్యాపించిన తప్పుడు సమాచారం పుష్కలంగా ఉంది, దానిని చక్కదిద్దాల్సిన అవసరం ఉంది. జులై 12న జరిగిన హ్యాపీయెస్ట్ హెల్త్ ది ఎడ్జ్ ఆఫ్ న్యూట్రిషన్ సమ్మిట్‌లో సెయింట్ జాన్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లోని న్యూట్రిషన్ విభాగం ప్రొఫెసర్ మరియు హెడ్ డాక్టర్ రెబెక్కా కురియన్ రాజ్ పోషకాహారం యొక్క ప్రాథమిక అంశాలకు తిరిగి వెళ్లవలసిన అవసరాన్ని నొక్కిచెప్పారు. డాక్టర్ రెబెక్కా, ఆరోగ్యకరమైన శరీరానికి సరైన ఆహారాన్ని ఎంచుకోవడంపై అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని గురించి వివరించారు. 

జ్ఞానంతో తప్పుడు సమాచారాన్ని ప్రతిఘటిస్తూ, ఆమె ఆహారం మరియు పోషణపై అత్యంత సాధారణ అపోహలను ఇక్కడ తొలగించారు: 

అపోహ 1: కోడిగుడ్డు పచ్చసొన కొలెస్ట్రాల్  స్థాయిలను పెంచుతుంది 

వాస్తవం:కోడిగుడ్డు పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. అయితే కేవలం గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని కాదు. తీసుకునే మొత్తం ఆహారంపై ఆధారపడి ఉంటుంది. 

అపోహ 2: గర్భిణీ స్త్రీలు తల్లి, బిడ్డ ఇద్దరి కోసం తినాలి 

వాస్తవం: అలా ఏమి కాదు. గర్భిణీ స్త్రీ తినే ఆహార మొత్తం లేదా పరిమాణంలో ఏమి లేదు. ఆరోగ్యకరమైన గర్భధారణకు దోహదపడే వివిధ పోషకాలు తీసుకోవడం అనేది ముఖ్యమైనది. ఆమె వైవిధ్యమైన మరియు పోషకాలను ఇచ్చే ఆహారం తీసుకోవాలి. 

అపోహ 3: అథ్లెట్లు చాలా ప్రోటీన్ తీసుకోవాలి 

వాస్తవం: అథ్లెట్లకు ప్రొటీన్ల అవసరం ఎక్కువగా ఉంటుంది, కానీ వారు తగినంత వ్యాయామం చేస్తే తప్ప ఆ ప్రొటీన్ల వల్ల ఉపయోగం ఉండదు. 

అపోహ 4: తీవ్రమైన వ్యాయామాలు మాత్రమే మీ బరువు తగ్గించవచ్చు 

వాస్తవం: లేదు, మంచి సమతుల్యతతో మనం ఏమి తింటామో మరియు ఎంత వ్యాయామం చేస్తామో అది ఖచ్చితంగా మీ బరువు తగ్గడంలో సహాయపడుతుంది. 

అపోహ 5: మీకు వ్యాయామానికి ముందు మరియు తర్వాత అల్పాహారం అవసరం 

వాస్తవం: అవును, ఎవరైనా వ్యాయామం ద్వారా కండరాలను నిర్మించాలనుకుంటే, కండరాలను నిర్మించడంలో మరియు సంరక్షించడంలో మీకు తగినంత శక్తిని అందించగల స్నాక్స్ ఉన్నాయి. 

అపోహ 6: కిడ్నీ సమస్యలు ఉన్నవారు అరటిపండ్లు తినకూడదు 

వాస్తవం: కిడ్నీ సమస్యలు ఉన్నవారు అరటిపండ్లను తినవచ్చు, కానీ మొత్తంగా అరటిపండ్లు మాత్రమే కాకుండా మొత్తం ఆహారంలో భాగంగా పొటాషియం కంటెంట్‌ను మితంగా తీసుకోవాలి. 

మీ అనుభవాన్ని లేదా వ్యాఖ్యలను పంచుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ట్రెండింగ్

వ్యాసాలు

వ్యాసం
బెంగళూరుకు చెందిన పి.పార్వతి 20 ఏళ్లప్పుడు శ్వాస తీసుకోవడంలో చిన్నప్పుడు ఇబ్బంది పడేది. పరీక్షలు చేయించగా ఆమెకు ఆస్తమా ఉన్నట్లు నిర్దారించబడింది. ఇప్పుడు అది జరిగి 32 సంవత్సరాలు గడిచింది. 54 సంవత్సరాల వయస్సులో, పార్వతి తన కుమార్తె మరియు తనకంటే సగం వయస్సు కలిగిన స్నేహితులతో ట్రెక్‌లకు చాలా ఈజీగా వెళ్లగలుతుతోంది.
వ్యాసం
షోల్డర్ ఇంపింగ్‌మెంట్ సిండ్రోమ్ రివర్సిబుల్ అయినందున, నొప్పి యొక్క ప్రారంభ సంకేతాలను అనుభవించిన వెంటనే మీరు వైద్యుడిని సంప్రదించాలనిి సలహా ఇస్తారు.
వ్యాసం
ఎముక పునర్నిర్మాణాన్ని నిరోధించడం నుండి ఎముకల విరుగుట మరియు బోలు వ్యాధి ప్రమాదాన్ని పెంచడం వరకు, ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం ఎముకలకు శాశ్వత నష్టం కలిగిస్తుంది

0

0

0

Opt-in To Our Daily Newsletter

* Please check your Spam folder for the Opt-in confirmation mail

Opt-in To Our
Daily Newsletter

We use cookies to customize your user experience, view our policy here

మీ అభిప్రాయం విజయవంతంగా సమర్పించబడింది.

హ్యాపీయెస్ట్ హెల్త్ టీమ్ వీలైనంత త్వరగా మిమ్మల్ని సంప్రదిస్తుంది