
రుచికరమైన చాక్లెట్ చియా పుడ్డింగ్ వంటకం మీ రుచిని సంతృప్తి పరుస్తుంది అలాగే మీరు మంచి ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది.
డెసెర్ట్లను చక్కెరతో, అధిక క్యాలరీలతో ఉండే ఆహారంగా మనం పరిగణిస్తాం. అందుకే ఒక న్యూట్రిషనిస్ట్ ఆమోదించిన చాక్లెట్ చియా పుడ్డింగ్ వంటకాన్ని మీ ముందుకి తీసుకొస్తున్నాం. అది ఆరోగ్యానికి, రుచికి రెండింటికి సంతృప్తికరమైంది.
చియా సీడ్స్ వినియోగం చాలా కాలం నుంచి ఉంది. 2010 నుంచి అవి ప్రధానంగా చాలా మంది దృష్టిని ఆకర్షించడం మొదలైంది. ఈ మధ్య వాటి వినియోగం వల్ల ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు చాలా రకాల స్నాక్స్లో వాటిని ముఖ్యమైన పదార్థంగా మార్చాయి.
చియా సీడ్స్ వల్ల ఉన్న బహుళ ప్రయోజనాలు, రకరకాల వంటకాల్లో వాటిని తేలిగ్గా చేర్చుకోగలగడం వల్ల సౌకర్యవంతంగా, రుచికరంగా పోషకాల్ని పొందే మార్గంగా మారాయి.
అసలు చియా అంటే ఏంటి?
చియా సీడ్స్లో పుష్కలంగా ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ రక్తంలోని ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయిని ఎదుర్కోవడం ద్వారా గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. కర్నాటకలోని బెంగళూరుకి చెందిన పోషకాహార నిపుణురాలు విద్యాప్రియా ఆర్ ఇలా చెబుతున్నారు ‘‘ఫైబర్, కాల్షియం, ఐరన్, పొటాషియం, ఫాస్పరస్, జింక్లకు అవి మంచి వనరులు, వాటిని క్రియాశీలమైన ఆహారాల జాబితాలో పెట్టొచ్చు’’
2020లో మాలిక్యూల్స్ అనే జర్నల్ లో ప్రచురితం అయిన రివ్యూ ఆర్టికల్లో చియా సీడ్స్ గుండెని కాపాడే, గుండె లయను క్రమబద్దీకరించే, హైపర్ టెన్షన్ తగ్గించే లక్షణాలున్న పదార్థం అని చెప్పారు. గర్భంతో ఉన్న వాళ్ళు చియా సీడ్స్ తీసుకుంటే శిశువు మెదడు, రెటీనా అభివృద్ధి చెందడానికి సహాయపడతాయిని కూడా పరిశోధకులు చెప్పారు.
‘‘ఈ గింజల్లో గ్లూటెన్ ఉండదు, మానసిక ఆందోళనను తగ్గిస్తాయి, రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి’’ అని విద్యాప్రియ అన్నారు.
అయితే, చియా సీడ్స్ ఆరోగ్యకరమైన ఆహారానికి పోషకాలతో నిండిన పదార్థమే అయినప్పటికీ సమతులమైన, వైవిధ్యమైన ఆహారంలో భాగంగా వాటిని మితంగా మాత్రమే తీసుకోవాలి అనే విషయం గుర్తుంచుకోవాలి. రోజుకి 48 నుంచి 50 గ్రాముల వరకూ తీసుకోవడం సురక్షితం అని నిపుణులు సూచిస్తున్నారు.
మరొక విషయం ఏంటంటే చియా సీడ్స్ గొంతున పడకుండా ఉండాలంటే వాటిని ఏ వంటకంలోనైనా కలపడానికి ముందు 15 నిమిషాల పాటు నీటిలో నానబెట్టి వాడుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
ఈ వంటకాన్ని ఇకపై మేం రహస్యంగా ఉంచదలుచుకోలేదు, ఇక చదవండి:
వంట మొదలుపెడదాం.
కావల్సిన పదార్థాలు
- 1 ½ కప్పుల బాదం పాలు
- ½ కప్పు చియా సీడ్స్
- 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల మ్యాపిల్ సిరప్
- 1 టీ స్పూన్ వెనీలా ద్రావకం
ఇది ఐదుగురికి సరిపోతుంది
తయారీ విధానం
- నాన్ డెయిరీ మిల్క్(సోయా మిల్క్ వంటివి), చియా సీడ్స్, మ్యాపిల్ సిరప్, వెనీలా ద్రావకం ఒక గిన్నెలో కలపాలి.
- గిన్నెకి మూత పెట్టి రాత్రంతా లేదా కనీసం 6 గంటలపాటు అది చిక్కగా, క్రీమ్లా మారేదాకా రిఫ్రిజిరేటర్లో ఉంచాలి.
- పుడ్డింగ్ గనక సరిపడా చిక్కదనంతో లేకపోతే అదనంగా చియా సీడ్స్ వేసి మళ్ళీ తిప్పొచ్చు. తర్వాత మళ్ళీ గంటపాటు రిఫ్రిజిరేటర్లో ఉంచాలి.
- పుడ్డింగ్ రెడీ అయిన తర్వాత దాన్ని అచ్చం అలా తినెయ్యొచ్చు లేదా మీకు ఇష్టమైన పండ్లు, ఫ్రూట్ మిక్సర్ మీద పొరలా వేసుకుని తినొచ్చు.
ఈ వంటకంలో తయారయ్యే రుచికరమైన, ఆరోగ్యకరమైన పుడింగ్ రిఫ్రిజిరేటర్లో ఉంచితే ఐదు రోజులు నిలవ ఉంటుంది.
ఒక్కో సెర్వింగ్ కి లభించే పోషకాలు:
కేలరీలు | 100.4 కిలోక్యాలరీలు |
ప్రోటీన్ | 3గ్రాములు |
కొవ్వు | 5.9 గ్రాములు |
కార్బోహైడ్రేట్లు | 9.8 గ్రాములు |
పైబర్ | 5.8 గ్రాములు |