728X90

0

0

0

ఈ వ్యాసంలో

మీ పేగు ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అల్పాహార అలవాట్లు
36

మీ పేగు ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అల్పాహార అలవాట్లు

అల్పాహారంలో ప్రీ మరియు ప్రోబయోటిక్ ఆహారాలను చేర్చడం ద్వారా గట్ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ప్రోబయోటిక్ ఆహారాలకు కొన్ని ఉదాహరణలు పెరుగు, మజ్జిగ, ఇడ్లీ, దోస, ధోక్లా, కిమ్చి, కొంబుచా మరియు కొన్నిరకాల చీజ్‌లు.

ఎక్కువ మంది ప్రజలు ఉదయాన్నే అల్పాహారాన్ని ఇంట్లో కాకుండా బయట తినడం అలవాటు చేసుకోవడం వల్ల భారతీయుల అల్పాహార అలవాట్లు మారిపోయాయి. ఫ్రాంఛైజ్ ఇండియా సర్వే ప్రకారం, ప్రతి ముగ్గురిలో ఒకరు వారంలో రెండు రోజుల కంటే ఎక్కవుగా బయట అల్పాహారం తీసుకుంటారు.

భారతీయులు అల్పాహారంగా తమ మెనూలో పూరీలు, దోసెలు, ఇడ్లీలు మరియు పోహాలకు మాత్రమే పరిమితం కాలేదు. పాన్ కేక్‌లు, కార్న్ ఫ్లేక్స్, సాసేజ్‌లు, బేగెల్స్ మరియు మఫిన్స్ వంటి ప్రాసెస్ చేయబడిన చక్కెరతో కూడిన టిఫిన్లు కూడా జనాదరణ పొందాయి.

హైదరాబాద్‌లోని నెట్‌రిన్ స్పోర్ట్స్ టెక్నాలజీస్‌లో పోషకాహార నిపుణుడు స్వాస్థీ ఉపాధ్యాయ మాట్లాడుతూ.. సాధారణంగా అల్పాహారంలో తృణధాన్యాలు ప్రాసెస్ చేయబడతాయి. ఇందులో ఎక్కువ చక్కెరలు ఉంటాయి. ప్రాసెస్ చేయబడిన ఆహారపదార్థాలు అధిక కొలెస్ట్రాల్, పేగుకు ముప్పుతో పాటు గుండె సమస్యలకు దారితీస్తాయి.

”సరైన సమతుల అల్పాహారం తినడం ముఖ్యం అని ఉపాధ్యాయ చెప్పారు. బలవర్ధకమైన అల్పాహారం ఉదయం అంతా క్రమంగా శక్తిని విడుదల చేస్తుంది.

అల్పాహారం రోజులో మనకు ముఖ్యమైన భోజనం. ఎందుకంటే ఇది శారీరక, మానసకి కార్యకలాపాలను నిర్వహించడానికి శరీరానికి ఇంధనం వలే పనిచేస్తుంది. తాజా అధ్యయనాలు మనకు రోజూవారీ శక్తి తీసుకోవడంలో 15 నుంచి 25 శాతం మొదట మనం తీసుకునే అల్పాహారం నుంచే వస్తాయని సూచిస్తున్నాయి. అల్పాహారం విషయానికి వస్తే మహిళలకు సూచించబడిన కేలరీలు 300-500, పురుషులకు 375-625కి సమానం.

న్యూఢిల్లీకి చెందిన డైటీషియన్ డాక్టర్ ఉమంగ్ బెహ్ల్ ఉదయం సంపూర్ణ భోజనంతో ఉపవాసాన్ని వివరమించుకోవాలని చెప్పారు. ” సాధారణంగా అల్పాహారం సంక్లిష్ట కార్బోహైడ్రేట్ల ఆధారితంగా లేదా ప్రోటీన్ మరియు సంక్లిష్ట పిండి పదార్థాల కలయికంగా ఉండాలి”. ఉదాహరణకు: పెరుగు, వెజ్ పోహా లేదా దలియా, ఓట్ మీల్ లేదా పన్నీరుతో రోటీ, నారింజ జ్యూస్‌తో కలిసి ఉండాలి.

ఇడ్లీ లేదా దోస వంటి అల్పాహారం

ఇడ్లీ లేదా దోస వంటి అల్పాహారం పులియబెట్టిన అన్నం మరియు పప్పుతో తయారు చేస్తారు. ఈ పులియబెట్టిన ఆహారాలు పేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడే సూక్ష్మజీవులను కలిగి ఉంటాయి.

భారతీయ పారంతాలు (పూర్తి గోధుమలు మరియు తక్కువ నూనెతో తయారు చేయబడినవి) ఫైబర్‌ను జోడించి , గట్ మైక్రోబయోటాను అలాగే ఉంచుతాయి.

అల్పాహారంలో ప్రీ మరియు ప్రోబయోటిక్ ఆహారాలను చేర్చడం ద్వారా గట్ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ప్రోబయోటిక్ ఆహారాలకు కొన్ని ఉదాహరణలు పెరుగు, మజ్జిగ, ఇడ్లీ, దోస, ధోక్లా, కిమ్చి, కొంబుచా మరియు కొన్నిరకాల చీజ్‌లు. ప్రీబయోటిక్ ఆహారాలలో ఉల్లిపాయ, వెల్లుల్లి, ఓట్స్, బార్లీ, యాపిల్స్ మరియు అవిసె గింజలు ఉన్నాయి. ప్రోబయోటిక్స్ అధికంగా ఉండే ఆహారంలో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ప్రీబయోటిక్స్ ఈ బ్యాక్టీరియాకు ఆహారంగా ఉపయోగపడతాయి. ఈ ఆహారాలు అన్ని కలిసి ప్రేగును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.

పైన పేర్కొన్న వాటితోపాటు, సాంబార్ లేదా పోహా/ఉప్మాకు కూరగాయలు మరియు చిక్కుళ్లు జోడించి సమతుల ఆహారంగా మార్చుకోవాలని ఉపాధ్యాయ సూచిస్తున్నారు. శాకాహారులు వారి పోషకాహార లోపాలను సవరించుకోవడానికి మొలకలలో కొంత భాగాన్ని ఒక గ్లాసు పాలను జోడించవచ్చు. మాంసాహారులు అల్పాహారంలో గుడ్లను చేర్చుకోవడం మంచిది. అలాగే పండ్లను కూడా చేర్చడం ద్వారా అల్పాహారం మంచి బలవర్ధకమైన ఆహారం అవుతుంది.

లూథియానాకు చెందిన పేరొందిన న్యాయవాది చమన్ ప్రీత్ కౌర్ ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించేది. ఆమె ఉదయాన్నే గోరువెచ్చని లెమన్ వాటర్‌ని తీసుకుంటుంది. ఆ తర్వాత ఏదైనా పండు లేదా కూరగాయలు లేదా చక్కెర లేకుండా ఒక కప్పు కాఫీతో పాటు గుడ్డు/కూరగాయ/పప్పుతో వేయించిన పరాంతాన్ని తీసుకుంటుంది. మధ్యాహ్నం స్నాక్‌గా డ్రై ఫ్రూట్‌లను ఇష్టపడుతుంది మరియు మధ్యాహ్న భోజనంలో సలాడ్‌తో పాటు ఏదైనా సబ్జీతో రెండు చపాతీలను తీసుకుంటుంది. ఇక సాయంత్రం పాలు లేదా పండ్లను తీసుకుంటుంది. రాత్రి భోజనంగా రెండు చపాతీలు, చికెన్ మరియు సలాడ్ తీసుకుంటుంది. ఈ విధంగా ఆమె నిర్ధిష్టమైన వ్యాయామంతో ఆరోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉంది. ప్రస్తరతం ఆమెకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు.

అయితే అందరూ ఒకేలా ఉండరు. ఆసియా పసిఫిక్ దేశాల్లో చేసిన సర్వేల్లో ఉదయం అల్పాహారం మానేసే ధోరణి పెరుగుతోందని తేలింది. అల్పాహారం మానేయడానికి కారణాలు కూడా చాలా సాధారణమైనవిగా గుర్తించబడ్డాయి. ఉదయాన్నే సమయం దొరకకపోవడం, వంట చేయలేకపోవడం, ఆకలి లేకపోవడం, ఆలస్యంగా లేవడం ముఖ్య కారణాలు.

అల్పాహారాన్ని తీసుకోకపోవడం అనేది దీర్ఘకాలంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందని ఓ పరిశోధనలో తేలింది. ఉదాహరణకు ఒక అధ్యయనంలో అల్పహారం మానేసిన అమెరికన్లలో కరోనరీ హార్ట్ డిసీజ్ 27శాతం పెరిగిందని డాక్యుమెంట్ చేసింది. అల్పాహారం మానేయడం ద్వారా కడుపులో మంట పెరుగుతుందని మరో అధ్యయనం పేర్కొంది.

ఉదయం అల్పాహారంలో చక్కెర పదార్థాలు కాకుండా పండ్లు తినాలని ఉపాధ్యాయ సూచిస్తున్నారు. శుద్ధి చేసిన చక్కెరలతో కూడిన ఆహారాల కంటే పండ్లలోని సహజ చక్కెరలు ఎప్పటికైనా మంచివన్నారు. టిఫిన్‌గా చక్కెరలు మరియు కొవ్వులతో కడుపు నింపుకోవడం కంటే బిన్నంగా వ్యవహరించాలన్నారు. అల్పాహారంలో పుచ్చకాయ, సీజనల్ ఫ్రూట్స్, మామిడి, ద్రాక్ష చీకూ, బొప్పాయి వంటి అధిక నీటి శాతం కలిగిన తాజా సీజనల్ పండ్లను చేర్చుకోవాలి. అదనంగా పైన పేర్కొన్న వాటితో పాటు రాత్రిపూట నానబెట్టిన చియా ఫుడ్డింగ్‌ను తీసుకోవచ్చు. చియా, గుమ్మడికాయ, పొద్దుతిరుగుడు పువ్వుల గింజలను జోడించడం వల్ల అల్పాహారం మరింత ఆరోగ్యవంతంగా ఉండడమే కాక పొట్ట మరింత ఎక్కవుసేపు నిండుగా ఉంటుంది.

ఎవరైనా సరే ప్రధాన ఆహారపు అలవాట్లను వారి సౌలభ్యం ప్రకారం మార్చుకోకూడదని ఉపాధ్య అన్నారు. అల్పాహారాన్ని మిస్ చేయడం, ముందుగానే భోజనం చేయడం శరీర క్రియలకు భంగం కలిగిస్తుందన్నారు.
అల్పాహారం తినకుండా పాఠశాలకు వెళ్లే పిల్లలు వారి అభిజ్ణా మరియు విద్యా సామర్థ్యాలపై ప్రభావం ఉంటుంది.

ఆహార మార్పులే కాకుండా రోజు 6-7గంటల పాటు మంచి నిద్ర, చుట్టూ ఉన్న పరిసరాల పరిశుభ్రత, శారీరక శ్రమ వంటి రోజువారీ పనులను సక్రమంగా అనుసరించడం ద్వారా జీవితాన్ని ఆనందంగానూ ఆరోగ్యంగానూ ఉంచుతాయి.

మీ అనుభవాన్ని లేదా వ్యాఖ్యలను పంచుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ట్రెండింగ్

వ్యాసాలు

0

0

0

Opt-in To Our Daily Newsletter

* Please check your Spam folder for the Opt-in confirmation mail

Opt-in To Our
Daily Newsletter

We use cookies to customize your user experience, view our policy here

మీ అభిప్రాయం విజయవంతంగా సమర్పించబడింది.

హ్యాపీయెస్ట్ హెల్త్ టీమ్ వీలైనంత త్వరగా మిమ్మల్ని సంప్రదిస్తుంది