728X90

0

0

0

అంశాలకు వెళ్లండి

fussy kids: మీ పిల్లలు సరిగ్గా భోజనం చేయడం లేదా? 
25

fussy kids: మీ పిల్లలు సరిగ్గా భోజనం చేయడం లేదా? 

భోజన సమయంలో పిల్లల చేసే అల్లరి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టవచ్చు. అయితే ఇది కేవలం వాళ్ళ అల్లరి మాత్రమే కాదు, మనం గమనించని రుగ్మత కావచ్చునని వైద్యులు చెబుతున్నారు

కొంతమంది చిన్నారులు ఆహారాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తారు, ఫుడ్ టెక్చర్స్ మరియు వాసనల విషయంలో వీళ్ళకు చాలా నియమాలు ఉంటాయి. వారు తమ భోజనాన్ని ముగించడానికి సాధారణం కంటే ఎక్కువ సమయం తీసుకుంటారు మరియు రెస్టారెంట్‌లలో లేదా మిగిలిన కుటుంబ సభ్యులతో కలిసి తినడాన్ని వ్యతిరేకిస్తారు. కానీ వారు కేవలం అల్లరి పిల్లలు లేదా గజిబిజిగా తినేవారు కాకపోవచ్చు. వారు ఆహారం తీసుకోవడం మానేసే/పరిమితంగా ఆహారం తీసుకునే రుగ్మత (ARFID) అనే ఆహార సంబంధిత రుగ్మతతో పోరాడుతూ ఉండవచ్చు.

భోజన సమయంలో పిల్లలు చేసే అల్లరి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టవచ్చు. అయితే ఇది కేవలం వాళ్ళ అల్లరి మాత్రమే కాదు, మనం గమనించని రుగ్మత కావచ్చునని వైద్యులు చెబుతున్నారు.

మానసిక అనారోగ్యాలను నిర్ధారించడానికి వైద్యులు మరియు మానసిక నిపుణులు విస్తృతంగా ఉపయోగిస్తున్న అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ (APA) ప్రచురించిన హ్యాండ్‌బుక్, డయాగ్నోస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్ (DSM) ప్రకారం, AFRID అనేది సరైన పోషకాహారం మరియు/లేదా శక్తి అవసరాలను తీర్చడంలో నిరంతర వైఫల్యం వంటి లక్షణాలు కనిపించే ఆహార సంబంధిత ఇబ్బంది అని అనుకోవాలి. అంటే తినడం లేదా ఆహారం పట్ల ఆసక్తి లేకపోవడం, ఆహారం యొక్క భౌతిక లక్షణాల ఆధారంగా తినడం మానేయడం మరియు తినడం వల్ల కలిగే ప్రతికూల పరిణామాల గురించి ఆందోళన చెందడం.

పిల్లలు చాలా ముఖ్యమైన పోషకాలను కోల్పోతారు కాబట్టి ఇది వారి ఎదుగుదలను ప్రభావితం చేస్తుంది మరియు దాని ఫలితంగా వారి మానసిక స్థితి, ప్రవర్తన మరియు శక్తి స్థాయిలను ప్రభావితం చేస్తుంది. వారు పెద్దయ్యాక అది వారి సామాజిక జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అదనంగా, ఈ రుగ్మతకు ఆందోళన జత కావచ్చు మరియు పరిస్థితిని ని కొంచెం క్లిష్టంగా మార్చవచ్చు.

ముంబైకి చెందిన కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ డాక్టర్ విలోనా అనన్సియేషన్ మాట్లాడుతూ, “పిల్లలకు ఆహారం ఇవ్వడంలో ఎదురయ్యే సవాళ్ళు మరియు ఇబ్బందులు తల్లిదండ్రులకు భారంగా మారవచ్చు.

ఈ ఫీడింగ్ డిజార్డర్ కారణాన్ని అర్థం చేసుకోవడం, దీని సంకేతాలు మరియు చికిత్స ఎంపికలు ఈ పరిస్థితితో ఇబ్బంది పడుతున్న పిల్లల తల్లిదండ్రులు మరియు సంరక్షకులకు మద్దతు ఇస్తాయని డాక్టర్ అనన్సియేషన్ చెప్పారు.

ఇతర విషయాలు ఏమిటి?

2018లో రోమ్‌లోని ఒక ఇటాలియన్ పీడియాట్రిక్ హాస్పిటల్‌లో 2 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు గల 113 మంది పిల్లలపై పోషకాహార లోపం మరియు సైకోపాథలాజికల్ రిస్క్ కారకాలపై సుదీర్ఘ అధ్యయనం నిర్వహించబడింది. పిల్లలు వాస్తవానికి ఇన్ఫాంటైల్ అనోరెక్సియా (IA), ఆరు నెలల నుండి మూడు సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలలో ఆహార తిరస్కరణ స్థితితో బాధపడుతున్నారు.

73 శాతం మంది పిల్లలు 11 సంవత్సరాల వయస్సులో తేలికపాటి నుండి తీవ్రమైన పోషకాహార లోపాన్ని కలిగి ఉంటున్నారని, అంతర్గతంగా మరియు బాహ్యంగా భావోద్వేగ/ప్రవర్తన సమస్యలను పెంచుతున్నారని, తద్వారా కౌమారదశలో క్లిష్టమైన అభివృద్ధి కాలంలో ARFID వంటి ఆహార రుగ్మత అభివృద్ధి చెందే ప్రమాదం ఉందని సూచిస్తుంది.

హ్యాపీయెస్ట్ హెల్త్‌తో మాట్లాడుతూ, సీనియర్ కన్సల్టెంట్, నియోనాటాలజిస్ట్, పీడియాట్రిషియన్ మరియు క్లౌడ్‌నైన్

హాస్పిటల్స్ ఇండియా వ్యవస్థాపక ఛైర్మన్ డాక్టర్ కిషోర్ కుమార్, ARFID విషయంలో చాలా ఆలోచనలు మరియు అధ్యయనాలు ఉన్నాయని, అయితే ఏదీ పెద్ద సంఖ్యలో జనాభాలో నిరూపించబడలేదని అన్నారు.

ఆహారపు అలవాట్లను ఎదుర్కోవడం: రోజుకు కొన్ని పండ్ల నుండి సరైన భోజనం వరకు

డాక్టర్ అనౌన్సియేషన్ ARFIDతో బాధపడుతున్న 12 ఏళ్ళ బాలిక కేసును ప్రస్తావించింది, ఆమె ప్రస్తుతం చికిత్స పొందుతోంది. “అమ్మాయి బరువు పెరగకుండా ఉండటానికి ఎలాంటి ఘన లేదా ద్రవ రూపంలో ఉన్న ఆహారాన్ని తినడానికి ఇష్టపడలేదు. ఆమె చికిత్స ప్రారంభించినప్పుడు ఆమె బరువు సాధారణ స్థాయి కంటే 23 కిలోల కంటే తక్కువగా ఉంది, ”డాక్టర్ అనన్సియేషన్ హ్యాపీయెస్ట్ హెల్త్‌తో చెప్పారు.

వివరణాత్మక చరిత్ర మరియు క్లినికల్ పరీక్ష తర్వాత, డాక్టర్ అనన్సియేషన్ ఆమెకు మందులలో మార్పు గురించి సలహా ఇచ్చింది మరియు వారానికొకసారి ఆమెను పర్యవేక్షించింది. మందుల మోతాదులో కొన్ని సర్దుబాట్లు, మరియు తల్లిదండ్రుల కౌన్సెలింగ్ తర్వాత ఇప్పుడు ఆమె తీసుకునే ఆహార పరిమాణాన్ని పెంచింది.

ఆమె తల్లి పంపే రోజువారీ ఆహార రిపోర్ట్‌ను కూడా డాక్టర్ అనన్సియేషన్ పర్యవేక్షిస్తుంది. “ఆహారం తీసుకోవడం అనేది కొన్ని పండ్లతో కూడిన నీటి నుండి కొన్ని స్మూతీస్ మరియు క్రమంగా సరైన భోజనంగా మార్చబడింది, అయినప్పటికీ ఇప్పటికీ పరిమాణంలో పెద్దగా మార్పు లేదు. ఆమె బరువు ఇప్పుడు 25 కిలోలు’’ అని డాక్టర్ అనన్సియేషన్ చెప్పారు. అమ్మాయి తన భావోద్వేగాలు మరియు ఆలోచనలను నిమగ్నం చేయడానికి విజువల్ ఆర్ట్స్ మెటీరియల్‌ను ఉపయోగించడంతో కూడిన వ్యక్తిగత కళ-ఆధారిత చికిత్సకు పరిచయం చేయబడింది. అంతేకాకుండా, ఆమె ప్రతీ నెల క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించడం కూడా కొనసాగుతోంది.

ఇక్కడ మంచి వార్త ఉంది

డాక్టర్ కుమార్ ప్రకారం, పిల్లలలోని చాలా ARFID కేసులు సమయానికి పిల్లల వైద్యులను సందర్శించి, పిల్లలను బాగా తినమని ప్రోత్సహించే తల్లిదండ్రుల శ్రద్ధ కారణంగా చాలా తీవ్రమైన స్థాయిలకు వెళ్ళవు.

డయాగ్నోస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్, దాని సవరించిన తాజా వెర్షన్‌లో, అనవసరంగా ఏ చిన్నారికి ఈ రుగ్మత ఉన్నట్టు నిర్ధారించలేదని తెలియచేశారు. ARFID నిర్ధారణకు సంబంధించిన ప్రమాణాల పరంగా DSM యొక్క మునుపటి వెర్షన్ మరింత సమగ్రంగా ఉందని డాక్టర్ కుమార్ అభిప్రాయపడ్డారు, అయితే తాజా ప్రమాణాలు మరింత కఠినమైనవని, ARFID బ్రాకెట్ నుండి చాలా మంది పిల్లలను విముక్తుని చేస్తుంది అని అన్నారు. “ఈ కేసులు నెలకు రెండు నుండి మూడు వరకు దాదాపుగా తగ్గినప్పటికీ, మేము తరచుగా ఇలాంటి లక్షణాలు మరియు ముఖ్యమైన ఆహార రుగ్మతలు ఉన్న పిల్లలను విస్మరించలేము” అని ఆయన చెప్పారు.

ARFID మానసిక సంబంధమైనదేనా?

FID అనేది ఆహార సంబంధిత రుగ్మత అని మరియు ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ASD), అటెన్షన్-లోటు/హైపర్యాక్టివిటీ డిజార్డర్ (ADHD) మరియు అబ్సెసివ్-కంపల్సివ్ డిజార్డర్ (OCD) వంటి ఇతర పరిస్థితులతో తరచుగా కలిసి వస్తుందని డాక్టర్ అనన్సియేషన్ చెప్పారు. మానసిక ఆందోళనలు శరీరంపై ప్రభావం చూపుతాయి అనే కోణంలో దీనిని సైకో-సోమాటిక్ అనారోగ్యంగా పరిగణించవచ్చు

జర్నల్‌లో 2017లో ప్రచురించబడిన ఒక కథనం, కరెంట్ సైకియాట్రీ రిపోర్ట్స్ మూడు ప్రాథమిక ARFID ప్రముఖ విషయాలను ప్రస్తావించింది, ఇది పిల్లలలో మానసిక రుగ్మతలను మించి లక్షణాలను సూచిస్తుంది.

అవి:

సెన్సరీ సెన్సిటివిటీ: నిర్దిష్ట టెక్చర్లు మరియు అభిరుచులకు ప్రాధాన్యత.

అసహ్యకరమైన పరిణామాల భయం: చిన్నారికి ఇంతకు ముందు ఏదైనా ఆహారం పొలమారితే లేదా కడుపు ఇన్ఫెక్షన్ అయ్యి ఉంటే లేదా ఆ ఆహార పదార్ధం కారణంగా మరొకరు బాధపడటం చూసినట్లయితే, అతను/ఆమె దానిపై విరక్తిని పెంచుకుంటారు.

జీర్ణ సమస్యలు: గ్లూటెన్ పడకపోవడం, ఉదరకుహర వ్యాధి మరియు ప్రేగు సిండ్రోమ్ ఉధృతి ఉన్న పిల్లలు సాధారణంగా వారికి అనారోగ్యం కలిగించే ఆహారాన్ని వద్దు అనడం ప్రారంభిస్తారు.

“ఇది కేవలం శారీరక రుగ్మత మాత్రమే కాదు మానసిక రుగ్మత” అని డాక్టర్ కుమార్ చెప్పారు.

మొదటి రెండు ప్రెజెంటేషన్‌లలోని ‘కారణాలను’ లోతుగా పరిశోధిస్తూ, ఆహారం పట్ల అవగాహన లేకపోవడమే కారణం కావచ్చునని డాక్టర్ కుమార్ చెప్పారు. గర్భధారణ సమయంలో వారి తల్లి తీసుకునే ఆహారాన్ని పిల్లలు సహజంగా ఇష్టపడతారని మరియు అలాగే తల్లి తీసుకోని ఆహార పదార్థాల పట్ల విరుద్ధంగా ఉంటారని ఆయన చెప్పారు. పుల్లని ఆహారాలు మరియు కూరలతో పోలిస్తే పిల్లలు తీపి ఆహారాలకు జన్యుపరంగా కూడా ఇష్టపడతారు.

“జెనెటిక్స్, న్యూరోట్రాన్స్‌మిటర్ స్థాయిలు, ఆరోగ్య పరిస్థితులు వంటి వివిధ జీవ కారకాలు; వ్యక్తిత్వ శైలులు మరియు దేనినైనా తట్టుకునే విషయంలో చూపించే ప్రవర్తనలు వంటి మానసిక కారకాలు; మరియు సామాజిక మద్దతు అలాగే పర్యావరణ ప్రభావాలు వంటి సామాజిక-పర్యావరణ ప్రభావాలు పరిస్థితిని ప్రభావితం చేస్తాయి” అని డాక్టర్ అనన్సియేషన్ చెప్పారు.

“జీవపరమైన లేదా జన్యు పరమైన పరిస్థితి కారణంగా ఇప్పటికే ARFIDకి గురయిన చిన్నారులు పర్యావరణ లేదా మానసిక సామాజిక పరిస్థితుల ద్వారా ప్రేరేపించబడవచ్చు” అని ఆమె చెప్పారు.

తల్లిదండ్రుల పాత్ర

డాక్టర్ కుమార్ మాట్లాడుతూ 9 నుండి 18 నెలల మధ్య వయస్సు ఉన్న వారిలో మానసికంగా ప్రతీ విషయాన్ని పరిశోధనాత్మకంగా చూస్తారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు వివిధ రకాల ఆహారాలను పరిచయం చేయడానికి ఈ సమయాన్ని ఉపయోగించుకోవచ్చు.

పిల్లలను బలవంతం చేయకుండా ఓపికగా మరియు పట్టుదలతో ఉండాలి. రెడీమేడ్ ఫుడ్స్ వంటి షార్ట్‌కట్‌లను ఎంచుకునే బదులు వివిధ రకాల ఆహారాన్ని వినూత్నంగా అందించండి. పిల్లలను వాటికి మాత్రమే అలవాటు పడనివ్వండి అని డాక్టర్ కుమార్ చెప్పారు.

“అయితే, చిన్నారులు ఒకే రకమైన ఆహారాన్ని మాత్రమే తినాలని పట్టుబట్టి, 15-18 నెలల తర్వాత మరే ఇతర ఆహారాన్ని రుచి చూడకపోతే, తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించాలి” అని డాక్టర్ కుమార్ సూచించారు.

చికిత్స

డాక్టర్ కుమార్ ప్రకారం, చికిత్సలో పోషకాహార నిపుణులు మరియు ‘ప్లే’ థెరపిస్ట్‌లు ఉంటారు. పిల్లలకు తగిన పోషకాహారం అందేలా తల్లిదండ్రులకు వినూత్న వంటకాలతో పోషకాహార నిపుణుడు సహాయం చేస్తారు మరియు ప్లే థెరపీ అనేది భోజన సమయాలను మరింత సరదాగా ఎలా చేయాలో తల్లిదండ్రులకు మార్గనిర్దేశం చేస్తుంది మరియు పిల్లలు ఆనందంగా భావించే కుటుంబ వ్యవహారం మరియు ఇతరులను అనుకరించడానికి మరియు బాగా తినడానికి ప్రేరేపించబడుతుంది. ARFIDని ప్రేరేపించే జీర్ణాశయ రిఫ్లక్స్, ఉదరకుహర వ్యాధి మరియు ప్రేగు సిండ్రోమ్ ఉధృతి వంటి వైద్య పరిస్థితుల చికిత్సకు మాత్రమే మందులు అవసరమని ఆయన చెప్పారు.

 

“చికిత్సకు సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్ మరియు ఆక్యుపేషనల్ థెరపిస్ట్‌లు అందించే ప్రత్యేక శ్రద్ధ అవసరం” అని డాక్టర్ అనన్సియేషన్ వెల్లడించారు.

ఈటింగ్ డిస్టర్బన్స్ ఏదైనా నిర్దిష్ట వైద్య పరిస్థితి వల్ల లేదా నిర్దిష్ట ఆహారం పట్ల విపరీతమైన విరక్తి కారణంగా వచ్చినది కాకపోతే, ఈ పరిస్థితి వెనుక ఉన్న మానసిక కారణాలు పరిగణించబడతాయి. ఈ పరిస్థితి వయస్సు పెరిగే కొద్దీ మెల్లగా సర్దుకుంటుంది అని డాక్టర్ కుమార్ తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు.

 

మీ అనుభవాన్ని లేదా వ్యాఖ్యలను పంచుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

two × two =

ట్రెండింగ్

వ్యాసాలు

వ్యాసం
బెంగళూరుకు చెందిన పి.పార్వతి 20 ఏళ్లప్పుడు శ్వాస తీసుకోవడంలో చిన్నప్పుడు ఇబ్బంది పడేది. పరీక్షలు చేయించగా ఆమెకు ఆస్తమా ఉన్నట్లు నిర్దారించబడింది. ఇప్పుడు అది జరిగి 32 సంవత్సరాలు గడిచింది. 54 సంవత్సరాల వయస్సులో, పార్వతి తన కుమార్తె మరియు తనకంటే సగం వయస్సు కలిగిన స్నేహితులతో ట్రెక్‌లకు చాలా ఈజీగా వెళ్లగలుతుతోంది.
వ్యాసం
షోల్డర్ ఇంపింగ్‌మెంట్ సిండ్రోమ్ రివర్సిబుల్ అయినందున, నొప్పి యొక్క ప్రారంభ సంకేతాలను అనుభవించిన వెంటనే మీరు వైద్యుడిని సంప్రదించాలనిి సలహా ఇస్తారు.
వ్యాసం
ఎముక పునర్నిర్మాణాన్ని నిరోధించడం నుండి ఎముకల విరుగుట మరియు బోలు వ్యాధి ప్రమాదాన్ని పెంచడం వరకు, ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం ఎముకలకు శాశ్వత నష్టం కలిగిస్తుంది

0

0

0

Opt-in To Our Daily Newsletter

* Please check your Spam folder for the Opt-in confirmation mail

Opt-in To Our
Daily Newsletter

We use cookies to customize your user experience, view our policy here

మీ అభిప్రాయం విజయవంతంగా సమర్పించబడింది.

హ్యాపీయెస్ట్ హెల్త్ టీమ్ వీలైనంత త్వరగా మిమ్మల్ని సంప్రదిస్తుంది