728X90

0

0

0

ఈ వ్యాసంలో

ఆరోగ్యవంతమైన లైంగిక జీవితానికి చిట్కాలు
1285

ఆరోగ్యవంతమైన లైంగిక జీవితానికి చిట్కాలు

వ్యక్తిగత పరిశుభ్రత అనేది ఆరోగ్యకరమైన లైంగిక జీవితంలో శక్తివంతమైన కామోద్దీపనగా ఉంటుంది. మీ శరీరం వాసన మీ భాగస్వామిని మీతో సాన్నిహిత్యం వైపు ఆకర్షిస్తుంది.

ఆరోగ్యకరమైన లైంగిక జీవితం అనేది శారీరక మరియు మానసిక శ్రేయస్సు రెండింటినీ గణనీయంగా ప్రభావితం చేస్తుంది. అయితే వ్యక్తిగత పరిశుభ్రత అనేది ఆరోగ్యకరమైన లైంగిక జీవితంలో శక్తివంతమైన కామోద్దీపనగా ఉంటుంది. మీ శరీరం వాసన మీ భాగస్వామిని మీతో సాన్నిహిత్యం వైపు ఆకర్షిస్తుంది. అదే ఆహ్లాదకరమైన వాసన ఒక్కోసారి ఇబ్బందికరంగా మారితే అది మీ లైంగిక జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనేది కొసమెరుపు. వ్యక్తిగత పరిశుభ్రతను చాలా కాలంపాటు విస్మరించినట్లయితే అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంది. మరికొన్ని సందర్భాల్లో వంధ్యత్వానికి దారితీస్తుంది.

వ్యక్తిగత పరిశుభ్రత లైంగిక జీవితానికి ఎలా సహాయపడుతుంది?
లైంగిక జీవితంలో వ్యక్తిగత పరిశుభ్రతపై నిపుణులు మనతో కొన్ని విషయాలను పంచుకున్నారు. అయితే ఇందులో కొన్ని విషయాలు మీకు ఇప్పటికే తెలిసి ఉండొచ్చు. కొన్ని తెలిసినా మీరు వాటిని విస్మరించి ఉండొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. చన్నీటి స్నానం లైంగికపరమైన కోరికలను పెంచుతుంది

షవర్ కింద భాగస్వాములిద్దరూ కలిసి స్నానం చేయడం ద్వారా వారిలో టెస్టోస్టెరాన్ ఉత్పత్తి, లైంగిక పరమైన కోరికలు పెరుగుతాయని లైంగిక ఆరోగ్య నిపుణులు డాక్టర్ మొహ్సిన్ చెప్పారు. అమెరికన్ జర్నర్ ఆఫ్ మెన్స్ హెల్త్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, చల్లని నీటితో స్నానం చేయడం వల్ల పురుషులలో టెస్టోస్టెరాన్ స్థాయిలలో ఐదుశాతం పెరుగుదలను చూపించింది.

2. వదులుగా ఉండే దుస్తులు ధరించండి

వేడిగా మరియు చెమటతో నిండిన ప్రదేశాలు బ్యాక్టీరియా మరియు ఈస్ట్‌లకు సంతానోత్పత్తి ప్రదేశాలు. అందువల్ల బిగుతుగా ఉండే లో దస్తులు లేదా ప్యాంటీ హౌస్‌ల కంటే వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించండం ఉత్తమమైన ఎంపిక. ఇవి తేమను గ్రహించడంతో పాటు గాలి సులభంగా ప్రసరించడానికి సహాయపడతాయని అని ఇంటిమసీ కోచ్ రాధ సలూజా చెప్పారు.

బెడ్ మీద ఉన్నప్పుడు లో దుస్తులు ధరించకపోవడమే మంచిదని డాక్టర్ మొహ్సిన్ చెప్పారు.

3. నీళ్లు ఎక్కువగా తాగుతుండాలి మరియు మూత్రాశయాన్ని కూడా ఖాళీ చేయండి

నిపుణుల అభిప్రాయం ప్రకారం, సెక్స్‌కు ముందు మీ మూత్రాశయాన్ని ఖాళీ చేయడం మంచి పద్ధతి. బాక్టీరియా అప్పుడు మీ మూత్రనాళంలోకి ప్రవేశించవచ్చు (శరీరం నుండి మూత్రాన్ని బయటకు తీసుకెళ్లే గొట్టం). దీనివల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. మీరు మూత్ర విసర్జన చేసినప్పుడు, మీరు క్రిములను బయటకు పంపిస్తారు. కాబట్టి లైంగిక జీవితాన్ని ఆనందించండి. అయితే ఆ తర్వాత బాత్రూమ్‌కి వెళ్లడం మర్చిపోవద్దు.
“నీరు పుష్కలంగా తాగడం మర్చిపోవద్దు” అని మొహ్సిన్ చెప్పారు. హైడ్రేటెడ్‌గా ఉండటం వల్ల మూత్ర విసర్జన సులభమవుతుంది మరియు ఎక్కువ బ్యాక్టీరియా కూడా బయటకు వెళ్లిపోతుంది.

4. జఘన జుట్టుకు ఒక ప్రయోజనం ఉంది!

లైంగిక సాన్నిహిత్యం సమయంలో భాగస్వాములిద్దరూ ఒకరి శరీర భాగాలను మరొకరు తాకడం సాధారణమైన విషయమని కోచ్ సలూజా చెప్పారు. అయితే వెంట్రుకలు మరియు అపరిశుభ్రంగా ఉండే శరీర భాగాలు సూక్ష్మక్రిములకు సంతానోత్పత్తి ప్రదేశాలుగా మారతాయి. అందువల్ల జుట్టును తీసివేయడం లేదా శుభ్రంగా కట్ చేయడం తప్పనిసరి.

ఇది మంచి ప్రక్రియే అయినప్పటికీ జఘన జుట్టుతో కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఒకరినొకరు ఆకర్షించుకోవడానికి సహాయపడే ఫేరోమోన్‌లను విడుదల చేస్తుంది అని లైంగిక ఆరోగ్య నిపుణులు మొహ్సిన్ సూచిస్తున్నారు.

5. రసాయనాల వాడకాన్ని నిషేదించండి

ఓరల్ సెక్స్ అనేది లైంగిక సాన్నిహిత్యంలో ముఖ్యమైన అంశం. అయితే అపరిశుభ్రమైన, దుర్వాసనగల శరీర అవయవాలతో భాగస్వాములు ఇలా చేయడానికి అయిష్టంగా ఉంటారు అని డాక్టర్ సలూజా చెప్పారు. శరీర దుర్వాసనను దూరం చేయడానికి లైంగికంగా కలవడానికి ముందు రీఫ్రెష్‌గా ఉండటానికి స్నానం చేయమని ఆమె సలహా ఇస్తుంది.

సలూజా ప్రకారం, శారీరకంగా సన్నిహితంగా ఉండటం వలన మీరు ఒకరి శరీరంలోని చర్మం మరియు శరీర ద్రవాలతో సంబంధం కలిగి ఉంటారు. ఇందులో వైరస్‌లు లేదా బ్యాక్టీరియా ఉండవచ్చు. అందువల్ల, ఆరోగ్యకమైన లైంగిక జీవితం కోసం గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్య విషయాలను మనతో పంచుకున్నారు.

గోరువెచ్చని నీటితో మీ జననాంగాల చుట్టూ ఉన్న ప్రాంతాన్ని (లోపల కాదు) సున్నితంగా కడగాలి. తేలికపాటి సబ్బులు కూడా వాడవచ్చు. సున్నితమైన చర్మం లేదా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు సబ్బులోని రసాయనాలు చర్మాన్ని చికాకు పెడతాయి. ముందరి చర్మం ఉన్న పురుషులు దానిని మెల్లగా వెనక్కి లాగి కింద కడగాలి.

కొంతమంది మహిళలు సెక్స్ తర్వాత నీటితో తమ యోని లోపలి భాగాన్ని శుభ్రం చేస్తారు. ఈ ప్రక్రియను డౌచింగ్ అంటారు. డౌచింగ్ అనేది యోనిని రక్షించే బాక్టీరియా యొక్క సహజ సమతుల్యతను దెబ్బతీస్తుంది. కాబట్టి ఎక్కువ ఇన్ఫెక్షన్‌లకు దారితీస్తుందనేది అంతగా తెలియని వాస్తవం. సంభోగం తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే.. దానిని అలా వదిలేయాలి. ఎందుకంటే దానికి అదే సహజంగా శుభ్రపరుస్తుంది.
ఈ ప్రక్రియలో తేలికపాటి వాసన అనేది సాధారణం. ఇది సమస్యకు సంకేతం కాదనే విషయాన్ని గమనించాలి. డౌచెస్‌తో పాటు ప్రైవేట్ ప్రదేశాలను శుభ్రం చేయడానికి అనేక వైప్స్, క్రీమ్‌లు, స్ప్రేలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని మీ చర్మాన్ని చికాకు పెట్టే కఠినమైన రసాయనాలు ఉండొచ్చు. కాబట్టి టాంపాన్లు, ప్యాడ్‌లు, ప్యాంటీ లైనర్‌లు, పౌడర్‌లు మరియు స్ప్రేల వాడకాన్ని నివారించాలి అని మొహ్సిన్ సలహా ఇస్తున్నారు.

6. ముందు నుంచి వెనుకకు కడగాలి

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు(UTI) మహిళల్లో సాధారణం అయితే వీటిని విస్మరించకూడదని మొహ్సిన్ తెలియజేశారు. పొరపాటున విస్మరిస్తే స్త్రీలు కిడ్నీ ఇన్‌ఫెక్షన్‌కి సులభంగా గురవుతారు. కాబట్టిపాయువు నుంచి సూక్ష్మక్రిములు యోని లేదా మూత్రనాళానికి ప్రయాణించకుండా అడ్డుకోవడానికి చర్యకు ముందు, తర్వా ఎల్లప్పుడూ ముందు నుంచి వెనుకకు శుభ్రం చేయడం చాలా ముఖ్యం అని ఆయన సలహా ఇస్తున్నారు. మలద్వారం శరీరంలోని చివరి భాగంగా ఎప్పుడూ చూసుకోవాలని లైంగిక ఆరోగ్య నిపుణులలు అంటున్నారు. ఇది శరీరంలోని ఇతర భాగాలకు క్రిములు చేరకుండా నిరోధిస్తుంది.

7. సెక్స్ టాయ్స్‌తో ఈ జాగ్రత్తలు అవసరం

సెక్స్ టాయ్స్‌ను ఉపయోగించిన తర్వాత.. సురక్షితమైన ప్రదేశంలో ఉంచడం ఎంత ముఖ్యమో దానిని సరిగ్గా శుభ్రపరచడం కూడా అంతే ముఖ్యమని డాక్టర్ సలూజా చెప్పారు. ఉపయోగించిన తర్వాత వాటిని అపరిశుభ్రంగా వదిలేస్తే.. శిలీంధ్రాలు, వైరస్‌లు, బ్యాక్టీరియా వీటి చుట్టూ తిరుగుతాయి. అంటువ్యాధులు లేదా లైంగికంగా సంక్రమించే వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. ముఖ్యంగా దురద, మందపాటి తెల్లటి ఉత్సర్గ లేదా మంట వంటి లక్షణాలు కనిపిస్తే అలర్ట్ అవ్వాలని సలోజ సలహా ఇస్తున్నారు.

8. తాజా శ్వాస

సెక్స్ సమయంలో అసౌకర్యానికి గురిచేసే ప్రధాన కారణాలలో నోటి దుర్వాసన ఒకటి. మీరు లైంగికంగా కలవాలనుకునే ముందు శుభ్రంగా పళ్లు తోముకోవడం మంచిది. మౌత్ ఫ్రెష్‌నర్ తీసుకోవడం లేదా పుదీనా నమలడం ద్వారా నోటి దుర్వాసనను వదిలించుకోవచ్చు అని ముంబైకి చెందిన కోచ్ సలుజా చెప్పారు.

9. గోళ్లను శుభ్రంగా ఉంచుకోవడం

హైదరాబాద్‌కు చెందిన లైంగిక ఆరోగ్య నిపుణుడు షీబా మొహ్సిన్ ప్రకారం.. ఆరోగ్యకరమైన లైంగిక జీవితానికి అత్యంత ముఖ్యమైన వ్యక్తిగత పరిశుభ్రత చిట్కా మీ చేతులు మరియు గోళ్లను శుభ్రంగా ఉంచుకోవడం అంటారు. చేతులు లేదా గోళ్లు మురికిగా ఉండే వాటిలో హానికరమైన సూక్ష్మజీవులు ఉండే అవకాశం ఉంది.

మీ అనుభవాన్ని లేదా వ్యాఖ్యలను పంచుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ట్రెండింగ్

వ్యాసాలు

0

0

0

Opt-in To Our Daily Newsletter

* Please check your Spam folder for the Opt-in confirmation mail

Opt-in To Our
Daily Newsletter

We use cookies to customize your user experience, view our policy here

మీ అభిప్రాయం విజయవంతంగా సమర్పించబడింది.

హ్యాపీయెస్ట్ హెల్త్ టీమ్ వీలైనంత త్వరగా మిమ్మల్ని సంప్రదిస్తుంది