728X90

0

0

0

ఈ వ్యాసంలో

ల్యాప్‌టాప్ ఒడిలో పెట్టుకుని పనిచేయడం వల్ల వీర్యకణాలు తగ్గుతాయా?
53

ల్యాప్‌టాప్ ఒడిలో పెట్టుకుని పనిచేయడం వల్ల వీర్యకణాలు తగ్గుతాయా?

ల్యాప్‌టాప్‌లను ఒడిలో పెట్టుకొని ఉపయోగించడం వల్ల పురుషుల పునరుత్పత్తి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. వీటిని ఒడిలో ఉంచినప్పుడు ల్యాప్‌టాప్ నుంచి వచ్చే వేడి పురుషుల సున్నిత శరీర భాగాలు(వృషణాలు)ను వేడెక్కించగలదు.

చాలా మంది ల్యాప్ టాప్ ఎక్కడపడితే అక్కడ పెట్టుకొని పనిచేస్తుంటారు. నిజానికి ల్యాప్ టాప్ ఎక్కడపెట్టినా పనిచేస్తుంది. కానీ ఇది మంచి అలవాటు కాదు. ముఖ్యంగా ల్యాప్‌టాప్ ఒడిలో పెట్టుకుని పనిచేయడం వల్ల స్పెర్మ్ కౌంట్ తక్కువ కావడం లేదా పురుషుల సంతానోత్పత్తిపై ప్రత్యక్షంగా ప్రభావం ఉంటుందా? పురుషులలో ల్యాప్‌టాప్ స్పెర్మ్ కౌంట్‌ను ఎలా ప్రభావితం చేస్తుంది అనే విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

బ‌యోమెడికల్ ఫిజిక్స్ అండ్ ఇంజినీరింగ్(2016) జర్నల్‌లో ప్రచురితమైన ”ల్యాప్‌టాప్‌ కంప్యూటర్లను ఒడిలో పెట్టుకొని ఉపయోగించకూడదనడానికి ప్రాథమిక కారణాలు” అనే వ్యాసంలో.. ల్యాప్‌టాప్‌లను ఒడిలో పెట్టుకొని ఉపయోగించడం వల్ల పురుషుల పునరుత్పత్తి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. వీటిని ఒడిలో ఉంచినప్పుడు ల్యాప్‌టాప్ నుంచి వచ్చే వేడి పురుషుల సున్నిత శరీర భాగాలు(వృషణాలు)ను వేడెక్కించగలదు. ల్యాప్‌టాప్‌లోని అంతర్గత ఎలక్ట్రానిక్ సర్క్యూట్‌ల ద్వారా ఉత్పన్నమయ్యే విద్యుదయస్కాంత క్షేత్రాలు అలాగే వైఫై రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ ప్రమాదాలు (వైఫై కనెక్ట్ చేయబడిన ల్యాప్‌టాప్) స్పెర్మ్ నాణ్యతను తగ్గించవచ్చు.

అధిక ఉష్ణోగ్రత స్పెర్మ్ కౌంట్‌ను ప్రభావితం చేయగలదా?

ల్యాప్‌టాప్‌ను ఎందుకు ఒడిలో ఉంచుకోకూడదు.. అది పురుషుల స్పెర్మ్ కౌంట్‌పై ఎలా ప్రభావం చూపుతుంది అనే విషయాల గురించి వైద్యులు ఇలా పేర్కొన్నారు. ”వ‌ృషణాలు సాధారణ శరీర ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉండేలా శరీరం వెలుపల ఉంచబడే విధంగా రూపొందించబడ్డాయి. సాధారణ పరిస్థితులలో స్పెర్మ్ ఉత్పత్తి సుమారు 93.2ºF (34ºC) వద్ద జరుగుతుంది. కాబట్టి వృషణాల ఉష్ణోగ్రత 5.4ºF (3ºC).. సాధారణ శరీర ఉష్ణోగ్రత 98.6ºF (37ºC) కంటే తక్కువగా ఉంటుంది” అని ముంబైలోని ఇన్‌లాక్స్ ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ఆశిష్ తివారీ చెప్పారు.

అధ్యయనాలు: ల్యాప్‌టాప్ వాడకం వల్ల పురుషులలో తగ్గిన స్పెర్మ్ కౌంట్

ఫెర్టిలిటీ అండ్ స్టెరిలిటీ(2011) జర్నల్‌లో ప్రచురింపబడిన పరిశోధన.. లోకల్ ఏరియా నెట్‌వర్క్‌లకు వైర్‌లెస్‌లగా(వైఫై) కనెక్ట్ చేయబడిన ల్యాప్‌టాప్ ప్రభావాలను మానవ స్పెర్మటోజోపై విశ్లేషించింది. 29 మంది ఆరోగ్యవంతులైన దాతల నుంచి వీర్య నమూనాలను తీసుకున్నారు. ప్రతి వ్యక్తి నుంచి సేకరించిన నమూనాలు రెండుగా విభజించబడ్డాయి. ఇందులో ఒకటి ఇంటర్నెట్ కనెక్ట్ చేయబడిన ల్యాప్‌టాప్‌కు.. రెండవది వైర్‌లెస్ ఇంటర్నెట్ కనెక్ట్ చేయబడిన ల్యాప్‌టాప్‌కు నాలుగు గంటలపాటు ఉంచి నమూనాలను బహిర్గతం చేశారు. ఇందులో ప్రగతిశీల స్పెర్మ్ చలనశీలతలో తగ్గుదల మరియు స్పెర్మ్ డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ పెరుగుదలను చూపించాయి. అయినప్పటికీ చనిపోయిన స్పెర్మ్ స్థాయిలు రెండు సమూహాల మధ్య గణనీయమైన తేడాలను చూపించలేదు. వృషణాల దగ్గర ల్యాప్‌పై వైర్‌లెస్ ఇంటర్నెట్‌తో కనెక్ట్ చేయబడిన ల్యాప్‌టాప్‌ను ఉంచడం వల్ల పురుషుల సంతానోత్పత్తి తగ్గుతుందని అధ్యయనం నిర్ధారించింది.

ఉష్ణోగ్రత స్పెర్మ్ నాణ్యతను ప్రభావితం చేయదు

కానీ కొంతమంది నిపుణులు పురుషుల సంతానోత్పత్తిపై ల్యాప్‌టాప్‌ల ప్రభావం గురించి విభిన్నమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. ”ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకొని పనిచేయడం ద్వారా పురుషులలో సంతానోత్పత్తి ప్రభావితం అవుతుందనేది చాలా వరకు నిరాధారమైనవి. ల్యాప్‌టాప్ ఉత్పత్తి చేసే వేడి సంతానోత్పత్తిని ప్రభావితం చేసేంత ఎక్కువగా ఉండదు” అని సెక్సాలజిస్ట్, ప్రొఫెసర్ మరియు హెచ్‌ఓడీ, కెమ్ ఆస్పత్రి అండ్ సేథ్ జీఎస్ మెడికల్ కాలేజీ, ముంబైలోని డాక్టర్ రాజన్ భోంస్లే చెప్పారు.

ఎలాంటి భయం లేకుండా ల్యాప్‌టాప్ ఉపయోగించే మార్గాలు

మనం ల్యాప్‌టాప్ ఉపయోగిస్తున్నప్పుడు డాక్టర్ తివారీ చెప్పినదాని ప్రకారం నాలుగు విషయాలను గుర్తుంచుకోవాలి.
– సాధ్యమైనంత వరకూ ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకోకుండా ఉండాలి.
– ల్యాప్‌టాప్‌ను శరీరంలో సున్నిత అవయవాలు(మర్మాంగాలు) ఉన్న ప్రాంతం నుంచి దూరంగా ఉంచండి.
– ఒడిలో పెట్టుకొని ల్యాప్‌టాప్‌ను ఉపయోగించే సమయాన్ని తగ్గించాలి.
– ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకొని ఉపయోగిస్తున్నప్పుడు కాళ్లను దూరంగా ఉంచండి.

డాక్టర్ భోంస్లే అభిప్రాయం ప్రకారం.. ”ల్యాప్‌టాప్‌ల ప్రభావం గురించి ఎవరైనా భయపడితే.. వాటిని ఉపయోగించేటపుడు ల్యాప్‌టాప్ స్టాండ్, దిండు లేదా కుషన్‌ను ఉపయోగించాలి. ఏవైనా దుష్ప్రభావాలుంటే వాటిని తగ్గించాలి. అతడు స్క్రోటల్ (మర్మాంగాలు)పై చల్లటి నీటిని పోయమని కూడా సూచించాడు. ఇది స్క్రోటల్ ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా వృషణాలు ఎక్కవ స్పెర్మ్ మరియు టెస్టోస్టిరాన్‌ను ఉత్పత్తి చేయడానికి అనుమతిస్తాయి” అని పేర్కొన్నారు.

మీ అనుభవాన్ని లేదా వ్యాఖ్యలను పంచుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ట్రెండింగ్

వ్యాసాలు

0

0

0

Opt-in To Our Daily Newsletter

* Please check your Spam folder for the Opt-in confirmation mail

Opt-in To Our
Daily Newsletter

We use cookies to customize your user experience, view our policy here

మీ అభిప్రాయం విజయవంతంగా సమర్పించబడింది.

హ్యాపీయెస్ట్ హెల్త్ టీమ్ వీలైనంత త్వరగా మిమ్మల్ని సంప్రదిస్తుంది