728X90

0

0

0

ఈ వ్యాసంలో

Whooping cough: కోరింత దగ్గు: లక్షణాలు, కారణాలు, వ్యాధి నిర్థారణ మరియు చికిత్స
5

Whooping cough: కోరింత దగ్గు: లక్షణాలు, కారణాలు, వ్యాధి నిర్థారణ మరియు చికిత్స

కోరింత దగ్గు బోర్డెటెల్లా పెర్టుసిస్ అనే బ్యాక్టిరియా కారణంగా వస్తుంది. ఇది శ్వాస కోశ మార్గాలలోని రోమాలకు అంటుకుని, వాటిని నాశనం చేసే టాక్సిన్‌లను విడుదల చేస్తుంది.

సాధారణంగా కోరింత దగ్గు అని పిలవబడే పెర్టుసిస్ అనేది తీవ్రమైన బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్. ఇది ఊపిరితిత్తులు అలాగే శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఇది చాలా త్వరగా ఒకరి నుండి మరొకరికి సంక్రమిస్తుంది. కొన్ని నెలల పాటు ఎక్కువ సేపు ఆగకుండా దగ్గు రావడం దీని లక్షణం. దగ్గుకు మధ్యలో ఊపిరితీసుకునేటప్పుడు వచ్చే శబ్దం కారణంగా దీనిని వూపింగ్ కాఫ్ అని కూడా అంటారు.

పెర్టుసిస్ తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగించగలదు, ప్రత్యేకించి శిశువులు అలాగే ఆరు నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న చిన్నారులలో. వ్యాక్సిన్ చాలా ప్రభావవంతమైనది అయినప్పటికీ, కొన్ని సంవత్సరాల తర్వాత రోగనిరోధక శక్తి క్షీణిస్తుంది. పెర్టూసిస్ అనేది ఏ వయస్సు వారికైనా రావచ్చు, కానీ కొందరికి ఈ ఇబ్బంది కలిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది:

  • 6 నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న చిన్నారులు
  • కోరింత దగ్గు వ్యాక్సిన్ వేయించుకోని వారు
  • వైద్య రంగంలో పనిచేసేవారు, చిన్నారుల సంరక్షకులు అలాగే గత 10 సంవత్సరాలలో బూస్టర్ డోస్ వేయించుకోని వారు

లక్షణాలు

శరీరంలో వ్యాధి వ్యాపించే సమయం (మొదటి లక్షణం కనిపించినప్పటి నుండి) వారం నుండి పది రోజులు ఉంటుంది.

  • కోరింత దగ్గు ప్రారంభ లక్షణాలు సాధారణ జలుబు లక్షణాల మాదిరి ఉంటాయి: ముక్కు కారడం, ముక్కు మూసుకుపోవడం, కళ్ళ నుండి నీరు కారడం, జ్వరం అలాగే గొంతు నొప్పి.
  •  లక్షణాలు ప్రారంభమయిన ఒకటి రెండు వారాల తర్వాత, ఈ వ్యాధి వలన ప్రభావితమైన వారిలో తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి, విపరీతమైన, నియంత్రణ అవ్వని దగ్గు. ఇది కొన్ని వారాల పాటు ఉంటుంది. దీనితో పాటు వాంతులు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది అలాగే నీరసం వస్తాయి.
  • శిశువులలో దగ్గు ఉండకపోవచ్చు, కానీ వారికి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది (యాప్నియా) అలాగే సయనోసిస్ రక్తంలో ఆక్సిజన్ తగ్గడం కారణంగా (చర్మం అలాగే గోర్లు నీలి రంగులోకి మారడం) కనిపిస్తాయి. సాధారణంగా వ్యాక్సిన్ వేయించుకున్న శిశువులు అలాగే చిన్నారులలో ఈ లక్షణాలు కూడా కనిపించవు.

 వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో లక్షణాలు మధ్యస్థంగా ఉంటాయి, అంటే కేవలం కొన్ని రోజుల పాటు దగ్గు ఉండటం; వాంతులు చాలా అరుదుగా ఉంటాయి. అయితే, వ్యాక్సిన్ వేయించుకోని వారిలో తీవ్రమైన దగ్గు, నిద్రలో సమస్యలు అలాగే ఇతర ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి.

ఇబ్బందులు

  • వ్యాక్సిన్ పూర్తిగా వేయించుకోని పిల్లలను హాస్పిటల్‌లో చేర్పించవలసి రావచ్చు.
  • ప్రాణాలకు ప్రమాదకరమైన యాప్నియాతో పాటు
  •  పెద్ద వారిలో ఉన్నట్టుండి బరువు తగ్గడం, ముక్కు నుండి రక్తం కారడం, హెర్నియా, నిమోనియా, ఛాతీ ఎముకలలో గాయం లేదా మూత్ర విసర్జనపై నియంత్రణ లేకపోవడం జరగవచ్చు. 

కోరింత దగ్గు ఉన్న వారు కోలుకోవడానికి నెలలు పట్టవచ్చు, దగ్గు తగ్గినా ఇతర శ్వాసకోశ ఇబ్బందులు ఉండవచ్చు.

కారణాలు

కోరింత దగ్గ అనేది బోర్టిటెల్లా పెర్టూసిస్ అనే బ్యాక్టీరియా వలన వస్తుంది, ఇది శ్వాస కోస అవయాల లోపల ఉంటే చిన్న వెంట్రుకల వంటి వాటికి అతుక్కుని, వాటిని దెబ్బతీసే ప్రమాదకర పదార్థాలను విడుదల చేస్తాయి. దీని వలన ఈ అవయవాలలో వాపు వస్తుంది.

  • ఈ బ్యాక్టీరియా గాలి నుండి అలాగే ఒకరికి ఒకరు బాగా దగ్గరగా ఉండటం వలన వస్తుంది. ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తులు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు లేదా ఈ బ్యాక్టీరియా ఉన్న గాలిని పీల్చినప్పుడు ఇతరులకు సోకుతుంది.
  • వ్యాధి లక్షణాలు ప్రారంభమయిన దగ్గర నుండి దగ్గు ప్రారంభమయిన రెండు వారాల వరకు ఇన్ఫెక్షన్ మరొకరికి సంక్రమించే అవకాశం ఉంటుంది.
  • వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనిపించకుండా, తమకు ఇన్ఫెక్షన్ వచ్చింది అని కూడా తెలియని వారి నుండి ఇతరులకు సంక్రమించే అవకాశం ఎక్కువ. ఇలాంటి వారు ఎత్తుకున్నప్పుడు లేదా ఆడించినప్పుడు చిన్నారులకు ఈ వ్యాధి సంక్రమిస్తుంది.

వ్యాధి నిర్ధారణ

కోరింత దగ్గును నిర్ధారించడానికి లక్షణాలు ఉన్న వారికి అత్యంత దగ్గరగా ఉండే వ్యక్తుల ఆరోగ్య సమాచారం తెలుసుకోవడం కీలకం.

శరీరంలో కనిపించే లక్షణాలతో పాటు ముక్కు లేదా గొంతు లోపలి నుండి తీసే శ్లేష్మం అలాగే రక్త పరీక్షల ద్వారా దీనిని నిర్ధారించవచ్చు.

చికిత్స

కోరింత దగ్గును నివారించడానికి యాంటీబ్యాక్టీరియా మందులను ఉపయోగించవచ్చు. వ్యాధి తీవ్రవతను అలాగే అది ఇతరులకు సంక్రమించే అవకాశాలను నియంత్రించడానికి  దగ్గు తీవ్రత పెరగక ముందే చికిత్స ప్రారంభించాలి.

వ్యాధి లక్షణాల నుండి ఉపశమనం కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు —

  • ఎక్కువ విశ్రాంతి తీసుకోవడం అలాగే వ్యాధి ఇతరులకు వ్యాపించకుండా జాగ్రత్త తీసుకోవడం
  • దగ్గుతున్నప్పుడు అలాగే తుమ్మినప్పుడు నోరు మరియు మక్కును కవర్ చేసుకోవడం. చిన్నారులకు తరచుగా సబ్బు అలాగే నీరు ఉపయోగించి చేతులు కడుక్కోవడం అలవాటు చేయాలి
  • డీహైడ్రేషన్ జరగకుండా తగినంతగా ద్రవాలు తీసుకోవడం
  • పారాసెటమాల్ లేదా NSAIDల వంటి మధ్యస్థ స్థాయి నొప్పి నివారిణులను తీసుకోవడం
  • వాంతులు అవ్వకుండా ఉండటానికి మామూలుగా తీసుకునే దాని కంటే తక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం
  • దగ్గుకు కారణమయ్యే పొగ, ధూళి అలాగే రసాయనాల వంటి కాలుష్యకారకాలకు దూరంగా ఉండటం

కోరింత దగ్గు వ్యాధి చికిత్స విషయంలో రోగి వయస్సు అలాగే వ్యాధి వచ్చి ఎంత కాలం గడిచింది అనేవి కీలకం అవుతాయి.

ఆరు నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న శిశువులు అలాగే తీవ్రమైన లక్షణాలు ఉన్న పెద్ద వారిని హాస్పిటల్‌లో చేర్చాలి. వారికి ఆక్సిజన్, శ్వాస కోశ నాళాల నుండి శ్లేష్మాన్ని తొలగించడం అలాగే డిహైడ్రేషన్ తగ్గించడానికి నరాలలోకి సెలైన్ ఎక్కించడం అవసరం అవ్వచ్చు.

 చిన్నారుల విషయంలో కోరింత దగ్గుకు వ్యాక్సిన్ మంచి రక్షణ ఇస్తుంది.

  • పెర్టూసిస్ వ్యాక్సిన్‌ను డిప్తీరియా అలాగే టెటనస్‌తో కలిపి, రెండు, నాలుగు, ఆరు నెలల సమయాల్లో ఇస్తారు. తర్వాత 18 నెలలకు ఒకసారి అలాగే అయిదు-ఆరు సంవత్సరాల మధ్యలో ఇంకొకటి వేస్తారు.
  • యుక్త వయస్సు వారు, టీనేజికి రాబోతున్న వారికి ఇంతకు ముందు డోస్‌లు అన్ని పూర్తి కాకపోతే మళ్ళీ వేస్తారు.
  •  వ్యాక్సిన్ అప్పటి వరకు వేయించుకోని పెద్ద వయస్సు వారికి కూడా ప్రతీ పది సంవత్సరాలకు బూస్టర్ డోస్ వేస్తారు.
  • గర్భంతో ఉన్న స్త్రీలకు 7 నుండి 9 నెలల మధ్య కాంబినేషన్ వ్యాక్సిన్ ఇవ్వాలి. దీనిని గర్భం దాల్చిన ప్రతీ సారి ఇవ్వాలి.

సంబంధిత ట్యాగ్‌లు
సంబంధిత పోస్టులు

మీ అనుభవాన్ని లేదా వ్యాఖ్యలను పంచుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

nine − 4 =

ట్రెండింగ్

వ్యాసాలు

వ్యాసం
బెంగళూరుకు చెందిన పి.పార్వతి 20 ఏళ్లప్పుడు శ్వాస తీసుకోవడంలో చిన్నప్పుడు ఇబ్బంది పడేది. పరీక్షలు చేయించగా ఆమెకు ఆస్తమా ఉన్నట్లు నిర్దారించబడింది. ఇప్పుడు అది జరిగి 32 సంవత్సరాలు గడిచింది. 54 సంవత్సరాల వయస్సులో, పార్వతి తన కుమార్తె మరియు తనకంటే సగం వయస్సు కలిగిన స్నేహితులతో ట్రెక్‌లకు చాలా ఈజీగా వెళ్లగలుతుతోంది.
వ్యాసం
షోల్డర్ ఇంపింగ్‌మెంట్ సిండ్రోమ్ రివర్సిబుల్ అయినందున, నొప్పి యొక్క ప్రారంభ సంకేతాలను అనుభవించిన వెంటనే మీరు వైద్యుడిని సంప్రదించాలనిి సలహా ఇస్తారు.
వ్యాసం
ఎముక పునర్నిర్మాణాన్ని నిరోధించడం నుండి ఎముకల విరుగుట మరియు బోలు వ్యాధి ప్రమాదాన్ని పెంచడం వరకు, ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం ఎముకలకు శాశ్వత నష్టం కలిగిస్తుంది

0

0

0

Opt-in To Our Daily Newsletter

* Please check your Spam folder for the Opt-in confirmation mail

Opt-in To Our
Daily Newsletter

We use cookies to customize your user experience, view our policy here

మీ అభిప్రాయం విజయవంతంగా సమర్పించబడింది.

హ్యాపీయెస్ట్ హెల్త్ టీమ్ వీలైనంత త్వరగా మిమ్మల్ని సంప్రదిస్తుంది