728X90

0

0

0

ఈ వ్యాసంలో

కోవిడ్-19: సరిగ్గా నిద్ర పట్టడం లేదా.. ఎందుకో తెలుసుకోండి
39

కోవిడ్-19: సరిగ్గా నిద్ర పట్టడం లేదా.. ఎందుకో తెలుసుకోండి

కొంతమంది వ్యక్తులు కోవిడ్-19 ప్రభావం నుంచి పూర్తిగా కోలుకోగా, మరికొందరు ఇప్పటికీ కోవిడ్ దీర్ఘకాలిక ప్రభావాలతో ఇబ్బందిపడుతున్నారు.
కోవిడ్ కేసులు పెరగడంతో ఆందోళనలో ప్రజలు

కోవిడ్-19 మహమ్మారి సృష్టించిన విలయం నుంచి అనేక దేశాలు ఇప్పటికీ పోరాడుతున్నాయి. గతంలో కరోనా వైరస్‌తో బాధపడిన వ్యక్తులు కొన్ని రోజులు లేదా వారాల తర్వాత కోలుకున్నారు. వారిలో నిద్ర కూడా సాధారణ స్థితికి చేరుకుంది. అయితే దీర్ఘకాలంగా కోవిడ్‌తో బాధపడుతున్న కొంతమందిలో శ్వాస సంబంధిత సమస్యలు, అలసట వంటి ఇతర సంక్రమణ లక్షణాలు ఎక్కవ కాలం నిద్రను ప్రభావితం చేశాయి.

ముఖ్యంగా నిద్రను ప్రభావితం చేసే రెండు అంశాలు ఉన్నాయి – ఒకటి ట్రిగ్గర్ కారకం, మరొకటి దీర్ఘకాలిక కారకం. దీర్ఘకాలిక కోవిడ్ ఇన్ఫెక్షన్ విషయంలో.. వారు నిద్ర, ఇన్ఫెక్షన్ వంటి కారకాలతో బాధపడుతున్నారు అని బెంగళూరులోని అపోలో ఆస్పత్రి పల్మోనాలజీ హెడ్ డాక్టర్ రవీంద్ర మెహతా చెప్పారు.

మెడికల్ ఇంటర్నెట్ రీసెర్చ్ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో, కోవిడ్ ఉన్నవారిలో మరియు కోవిడ్ లేని వ్యక్తుల్లో నిద్ర నాణ్యతను పరిశోధకులు విశ్లేషించారు. కోవిడ్‌తో బాధపడుతున్న కొంతమందికి నిద్ర భంగం ఎక్కువగా ఉందని, మరికొందరికి నిద్ర నాణ్యత తగ్గిందని వారు కనుగొన్నారు. కొందరికి విపరీతమైన అలసట, మరికొందరికి నిద్రలేమి. కొందరికి రాత్రి నిద్రపట్టక ఇబ్బంది, మరికొందరికి పగటిపూట నిద్రపట్టక, ​​మరికొందరికి లేవగానే రిఫ్రెష్‌గా అనిపించడం లేదన్నారు.

దీర్ఘకాల కోవిడ్ నిద్రకు సంబంధించిన సమస్యలను కలిగిస్తుందా?

కోవిడ్ సోకిన వారిలో ఆందోళన, శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి. ఇవి నిద్రకు అంతరాయం కలిగించడంతో పాటు నిద్రలేమి వంటి రుగ్మతలకు కారణమవుతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నిద్ర సంబంధిత సమస్యల వ్యవధి అనేది వ్యక్తి నుంచి వ్యక్తికి మారవచ్చు. కొంతమంది వ్యక్తులు ఇన్పెక్షన్ నుంచి కోలుకున్న తర్వాత కూడా కొన్ని వారాలు లేదా నెలలపాటు అలసట, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలతో బాధపడ్డారు. కొన్ని సందర్భాల్లో, ఈ లక్షాలు శ్వాసవ్యవస్థ పనితీరును లేదా వ్యక్తి యొక్క మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేయొచ్చు. ఫలితంగా నిద్రా భంగం ఎక్కువ కాలం ఉంటుంది అని బెంగళూరులోని ఆస్టర్ సీఎమ్ఐ ఆస్పత్రిలోని ఇంటర్వెన్షనల్ పల్మోనాలజీ ప్రధాన సలహాదారు డాక్టర్ సునీల్ కుమార్ కె చెప్పారు.

ది లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో ఆసుపత్రిలో చేరిన కోవిడ్ రోగులలో నిద్ర సమస్యలు సాధారణమని పరిశోధకులు కనుగొన్నారు. కోవిడ్ యొక్క మరొక దీర్ఘకాలిక లక్షణమైన శ్వాసకోశ సమస్యతో నిద్ర భంగం కలగడానికి ఈ అధ్యయరం ముడిపెట్టింది. కోవిడ్ అనంతరం అనేక మందిలో నిద్రసమస్యలు, కండరాల పనితీరు తగ్గడంతో పాటు దీర్ఘకాలిక కోవిడ్ ఇన్ఫెక్షన్‌తో సంబంధం కలిగి ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు.

గతంలో డిప్రెషన్ లేదా ఆందోళనతో బాధపడుతున్న వారిలో నిద్రకు సంబంధించిన సమస్యలను ఈ అధ్యయనం హైలైట్ చేసింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా ఉన్నట్లు నిర్ధారించింది. వీరిలో చాలామంది ధూమపానం లేదా మధుమేహం, అధిక రక్తపోటు మరియు మూత్రపిండాల సమస్యలు వంటి వ్యాధులు కలిగి ఉన్నారు.

దీర్ఘకాలిక కోవిడ్ లక్షణాలే నిద్రలేమికి కారణం

అంతర్జాతీయ సహకార అధ్యయనంలో నిద్రలేమి, దీర్ఘకాలిక కోవిడ్ మధ్య సంబంధంపై డిసెంబర్ 2023 జర్నల్ స్లీప్ మెడిసిన్ ఎడిషన్‌లో ప్రచురించబడింది, నిద్రలేమి, దీర్ఘకాలిక కోవిడ్ సంబంధం అనేది ద్విదిశాత్మకమైనదిగా కనుగొన్నారు. దీర్ఘకాలిక కోవిడ్ లక్షణాల నుంచి బయటపడటంతోనే నిద్ర సమస్యలకు చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఒత్తిడితో కూడిన పరిస్థితులలో, ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారి మనల్ని చుట్టుముట్టిన సమయంలో మంచి నిద్రను పొందడం అనేది సవాలుగా మారింది. మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయంలో ఒక వ్యక్తిలోని మహమ్మారి ప్రేరేపిత ఆందోళనల వల్ల కలిగే నిద్రఅంతరాయాలను వివరించడానికి కరోనా సోమ్నియా అనే పదం సృష్టించబడింది అని డాక్టర్ కుమార్ వివరించారు. నిపుణులు కూడా కరోనా సోమ్నియా మన నిద్రపై ప్రభావం చూపుతుందనడానికి కొన్ని మఖ్యమైన విషయాలను హైలైట్ చేశారు.

– మనలో ఆందోళన పెరగడంతో క్రమంగా నిద్ర దూరమైంది.
– మారిన ఆహారపు అలవాట్లు మన జీవనక్రియలను ప్రభావితం చేస్తాయి.
– శ్వాసకోశ సమస్యలైన కరోనా మహమ్మారి సంబంధిత ఆరోగ్య సమస్యలు నిద్రకు అంతరాయం కలిగిస్తాయి.
– ఆర్థిక అనిశ్చితి మరియు సామాజిక ఒంటరితనం ఒత్తిడి సంబంధిత సమస్యలను మరింత తీవ్రతరం చేస్తాయి.

దీర్ఘకాలిక కోవిడ్ సంబంధిత నిద్ర సమస్యలను ఎదుర్కోవడం ఎలా?

దీర్ఘకాల కోవిడ్ కారణంగా సంభవించే నిద్రసమస్యలు.. మీ హృదయనాళాలు మరియు జీవక్రియల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఇది ఊబకాయం, రక్తపోటు మరియు మధుమేహం ప్రమాదాన్ని పెంచుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. శారీరక, మానసిక కారకాలతో సహా మీ ఆరోగ్యంపై సమగ్ర మూల్యాంకనం అవసరం. కోవిడ్-19 కారణంగా ఏర్పడిన దీర్ఘకాలిక నిద్రసమస్యలను దూరం చేసే కొన్ని మార్గాలను ఇక్కడ పరిశీలించండి.

నిద్రకు సరైన సమయాన్ని కేటాయించడం

మనం రోజూ పడుకొని లేచే సమయాలను(వారంతపు రోజులతో సహా) స్థిరంగా ఏర్పాటు చేసుకోవడం వల్ల నిద్రకు సంబంధించిన జీవక్రియలు మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

ప్రశాంతంగా ఉండే మార్గాలను అన్వేషించండి

మనసును ప్రశాంతంగా ఉంచుకోవడంతోపాటు లోతైన శ్వాస సడలింపు పద్ధతులను అభ్యసించడం ద్వారా రక్తపోటును తగ్గించుకోవచ్చు. తద్వారా నిద్ర సమస్యలను దోహదం చేసే ఒత్తిడి మరియు ఆందోళన నుంచి ఉపశమనం పొందవచ్చు.

వ్యాయామం చేయడం ద్వారా

రోజూవారీగా శారీరక శ్రమను పెంచడం ద్వారా నిద్ర సమస్యలను దూరం చేయొచ్చు. కోవిడ్ నుంచి బయటపడిన తర్వాత వ్యాయామాలు చేయడానికి ముందు రెండు వారాల విశ్రాంతి అవసరమని నిపుణులు చెబుతున్నారు.

మందు మరియు కాఫీలను తక్కువ చేయడం ద్వారా

ఆల్కహాల్(మందు) లేదా కాఫీలను తీసుకోవడం ద్వారా నిద్రకు భంగం కలిగే అవకాశం ఉంది. ఇవి ఒక వ్యక్తి యొక్క రోగనిరోధక వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది.

మెలటోనిన్ సప్లిమెంట్లను తీసుకోవడం

కోవిడ్-19 ఉన్న వ్యక్తులలో నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో మెలటోనిన్ సప్లిమెంట్స్ సహాయపడతాయి. మెలటోనిన్ సప్లిమెంట్లు సాధారణంగా సురక్షితమైనవి అయినప్పటికీ, దానిని తీసుకునే ముందు డాక్టర్‌ని సంప్రదించడం మంచిది.

వైద్యసాయం తీసుకోండి

నిద్ర సమస్యలు చాలా కాలం పాటు కొనసాగితే, ఆ వ్యక్తి తక్షణమే వైద్య నిపుణుడి సహాయాన్ని కోరడం మంచిది.

గుర్తుంచుకోవాల్సిన అంశాలు

– కొంతమంది వ్యక్తులు కోవిడ్-19 ప్రభావం నుంచి పూర్తిగా కోలుకోగా, మరికొందరు ఇప్పటికీ కోవిడ్ దీర్ఘకాలిక ప్రభావాలతో ఇబ్బందిపడుతున్నారు.
-కరోనా సోమ్నియా అనేది కోవిడ్ -19 మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో దీనివల్ల ఏర్పడే నిద్ర అంతరాయాలను వివరించడానికి సృష్టించబడిన పదం.
– నిద్రకు సంబంధించి ఒక స్థిరమైన షెడ్యూల్‌‌ను ఏర్పాటు చేసుకోవడం, ఆల్కహాల్ మరియు కెఫిన్ తీసుకోవడం పరిమితం చేయడం ద్వారా దీర్ఘకాలిక కోవిడ్ నిద్ర సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు.

మీ అనుభవాన్ని లేదా వ్యాఖ్యలను పంచుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ట్రెండింగ్

వ్యాసాలు

0

0

0

Opt-in To Our Daily Newsletter

* Please check your Spam folder for the Opt-in confirmation mail

Opt-in To Our
Daily Newsletter

We use cookies to customize your user experience, view our policy here

మీ అభిప్రాయం విజయవంతంగా సమర్పించబడింది.

హ్యాపీయెస్ట్ హెల్త్ టీమ్ వీలైనంత త్వరగా మిమ్మల్ని సంప్రదిస్తుంది