728X90

0

0

0

అంశాలకు వెళ్లండి

healthy kidneys: ఆరోగ్యకరమైన మూత్రపిండాల కోసం మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
29

healthy kidneys: ఆరోగ్యకరమైన మూత్రపిండాల కోసం మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు మనం పొటాషియం మరియు సోడియం తక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. వీటితో పాటూ అత్యంత నాణ్యమైన ప్రొటీన్ సైతం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఒక జత ఆరోగ్యకరమైన మూత్రపిండాల కోసం తీసుకోవాల్సిన ఆహారం

మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు మనం పొటాషియం మరియు సోడియం తక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. వీటితో పాటూ అత్యంత నాణ్యమైన ప్రొటీన్ సైతం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

 బెంగుళూరుకి చెందిన 22 ఏళ్ల శ్రీజ బసు వంట గదిలో కళ్లు తిరిగి పడిపోవడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమెకు 104 డిగ్రీల జ్వరం కూడా ఉంది. శ్రీజ డీహైడ్రేట్ అయిందని పాలిపోయిన ఆమె ముఖం సూచిస్తుంది. వెంటనే ఆమెని IV (ఇంట్రావీనస్ ఫ్లూయిడ్) డ్రిప్స్ మీద పెట్టారు. శ్రీజకు వరుసగా కొన్ని టెస్టులు చేయగా ఆమె మూత్రనాళం పై భాగం మరియు మూత్రపిండ ఇన్‌ఫెక్షన్స్ సమస్యతో బాధపడుతుందని తెలిసింది. 

 తన అనారోగ్యం నుంచి కోలుకున్న రెండు వారాల తర్వాత శ్రీజ మాట్లాడుతూ – ‘‘నా సెమిస్టర్ పరీక్షలు జరిగే సమయంలో తీసుకున్న ఆహారం మరియు నీరు విషయంలో నేను కాంప్రమైజ్ అయ్యాను. అలాగే మొదట్లో కనిపించిన నీరసం, విరేచనాలు.. వంటి లక్షణాలను కూడా పట్టించుకోలేదు. అందుకే నా పరిస్థితి మరింత కఠినతరమైంది’’ అన్నారు. 

 నిజానికి మనం ఊహించినదాని కంటే మన కిడ్నీల కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా సులభమే. అవసరమైనంత నీరు తాగుతూ, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ కాస్త యాక్టివ్‌గా ఉంటే చాలు.. మన కిడ్నీలు చాలా చక్కగా పని చేస్తాయి. ‘‘సమయానికి ఆహారం తీసుకోవడం, సరిపడా విశ్రాంతి తీసుకోవడం మరియు ఎక్కువ మొత్తంలో ద్రవాలను తీసుకోవడం ద్వారా నేను కోల్పోయిన శక్తి మరియు సామర్థ్యాలను తిరిగి పొందాను’’ అంటారు బసు. 

మన శరీరంలోని విషపదార్థాలను వడపోయడంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. అవసరం లేని పదార్థాలను తొలగిస్తూ ముఖ్యమైన వాటిని తిరిగి గ్రహిస్తూ మూత్రపిండాలు సమస్థితి (శరీరంలో మొత్తం ద్రవాలను బ్యాలెన్స్) ఉండేలా చేస్తాయి. మనం జీవించడానికి అవి కూడా ప్రధాన కారణమే. అయితే అత్యంత సున్నితమైన ఇవి పని చేసే విధానం మన జీవన విధానాల్లో చేసుకునే మార్పుల వల్ల బాగా ప్రభావితం అవుతున్నాయి. 

 మూత్రపిండాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే జీవన విధాన కారకాలు 

 బాగా ప్రాచుర్యం పొందిన ఫ్రాంటీయర్స్ ఇన్ జెనెటిక్స్ అనే జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం జన్యుపరమైన ఉద్యుక్తత కారణంగా కిడ్నీ వ్యాధులు వచ్చే రిస్క్ 30 నుంచి 70 శాతం మరింత పెరుగుతుంది. అలాగే ‘‘క్రమతీరు లేని నిద్ర, ఆహారం సరిగా తీసుకోకపోవడం, వ్యాయామం చేయకపోవడం, జంక్ పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, మాంసాహారం మరియు ప్యాకేజ్డ్ పదార్థాలు అధికంగా తీసుకోవడం, మన రోజువారీ ఆహారంలో ఉప్పుని మోతాదుకి మించి తీసుకోవడం వంటి అలవాట్లు కారణంగా కిడ్నీలు చాలా త్వరగా వ్యాధుల బారిన పడతాయి’’ అంటారు మహారాష్ట్రలోని పుణెలో ఆదిత్యా బిర్లా మెమోరియల్ హాస్పిటల్‌లో ఛీఫ్ డైటీషియన్‌గా పని చేస్తున్న వైశాలీ మరాఠే. 

 అపోలో హాస్పిటల్స్‌లోని రీసెర్చ్ కన్సల్టెంట్, లైఫ్‌స్టైల్ మెడిసిన్ కోచ్ మరియు ప్రింట్ మీడియా కాలమిస్ట్ అయిన డాక్టర్ ప్రియాంక రోహ్తగికు ఆరోగ్యానికి హాని కలిగించే జీవనశైలి కారకాల గురించి చెబుతూ మన శరీర కార్డియక్ రిథమ్‌తో ఒకే సింక్‌లో ఉండడం ఎంతో ముఖ్యం అన్నారు. నాణ్యత మరియు నిద్రించే సమయం ఒక క్రమం అంటూ లేకపోవడం, తగినంత నీరు తాగకపోవడం, సిగరెట్ మరియు మద్యపానం అలవాట్లు చేసుకోవడం, అధికంగా ఒత్తిడికి గురికావడం.. ఇవన్నీ వాపుకి దారి తీయడమే కాకుండా మూత్రపిండాలపై భారం పడేలా కూడా చేస్తాయి అంటారామె. 

 కిడ్నీ మరియు గుండె మధ్య గల సంబంధం 

 హృద్రోగాలు, అధిక రక్తపోటు మరియు డయాబెటిస్ వంటి మరిన్ని గుండె సంబంధిత స్థితులు కిడ్నీల పనితీరుని మరింతగా ప్రభావితం చేస్తాయి. 

 మన గుండె ఆరోగ్యానికి, మూత్రపిండాలు టాక్సిన్స్‌ను ఫిల్టర్ చేసే సామర్థ్యంతో దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. ఎప్పుడైతే మన కిడ్నీ సరిగా పని చేయడంలో అపశృతి చోటుచేసుకుంటుందో అప్పట్నుంచి మన రక్తంలో వడపోయని నీరు మరియు అవసరం లేని ఖనిజాలన్నీ వచ్చి చేరతాయి. ఈ రక్తం తిరిగి గుండెకు చేరుతుంది. 

 ‘‘గుండె సమృద్ధిగా, ప్రభావవంతంగా పంపింగ్ చేయనప్పుడు అది రక్తంతో నిండిపోతుంది. ఫలితంగా ప్రధాన సిరల్లో గోడలపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ ప్రధాన సిరలన్నీ తిరిగి కిడ్నీలకు కూడా అనుసంధానం అయి ఉంటాయి. ఫలితంగా కిడ్నీలలో కూడా రక్తం వచ్చి చేరుతుంది’’ అంటూ ఓ చర్చలో గుండె, కిడ్నీల మధ్య గల సంబంధం గురించి చెప్పుకొచ్చారు డాక్టర్ రోహ్తాగి. 

‘‘రక్తంలో అధికంగా ఉన్న నీరు మరియు ఉప్పులను తొలగించడం ద్వారా రక్తపోటుని నియంత్రించేందుకు మూత్రపిండాలు సహాయపడతాయి. అలాగే రెనిన్ అనే హార్మోన్ సహాయంతో రక్తంలో సోడియం  –  పొటాషియం సమతుల్యతను సైతం కాపాడతాయి’’ అంటారు మరాథె. ‘‘రక్తం యొక్క పరిమాణాన్ని నిర్వహించడం ద్వారా కార్డియాక్ అవుట్‌పుట్ మరియు రక్తపోటులను నియంత్రించడంలో కిడ్నీలు ముఖ్య పాత్ర పోషిస్తాయి అని చెబుతారు ఆయన. 

 డయాబెటిస్ ఉన్నవారు అయితే వారి డైట్ మరియు జీవనశైలి విషయంలో మరింత ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు వాటిని అలానే వదిలేస్తే శరీరంలోని చిన్న రక్తనాళాలతో పాటూ కిడ్నీలు దెబ్బ తింటాయి. అవి ప్రభావవంతంగా పని చేయలేవు. 

 కిడ్నీలకు మేలు చేసే ఆహార పదార్థాలు 

 మన కిడ్నీల ఆరోగ్యాన్ని మెయింటెయిన్ చేయడంలో ఆహారం ముఖ్య పాత్ర పోషిస్తుంది. 2021లో  న్యూట్రియంట్స్ అనే జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం సరిపడినంత మొత్తంలో సూక్ష్మపోషకాలను తీసుకోకపోవడం లేదా మరీ అధిక మొత్తంలో సూక్ష్మపోషకాలను తీసుకోవడం వల్ల కూడా కిడ్నీ వ్యాధులు ఉత్పన్నమవుతాయి. అందుకే, మూత్రపిండాల యొక్క సున్నితమైన పనితీరును సంరక్షించడానికి అన్ని సూక్ష్మపోషకాలను తగిన మొత్తంలో ఆహార పద్ధతుల ద్వారా తీసుకోవడం అత్యవసరం. 

 మన శరీరం లోపల ఉండే కొన్ని సూక్ష్మజీవులు కూడా కిడ్నీలను ఇన్ఫెక్షన్ల బారి నుంచి కాపాడతాయి. అయితే జీవనవిధానాల తీరు మారినప్పుడు ఇవే కిడ్నీ సంబంధిత వ్యాధులు మరియు ఇన్ఫెక్షన్లకు సైతం దారి తీస్తాయి. ‘‘బాగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు మన శరీరంలో ఉండే సూక్ష్మజీవులను ప్రతికూలంగా ప్రభావం చూపిస్తాయి. ఫలితంగా మన జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. అలాగే దీర్ఘకాలిక కిడ్నీ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది’’ అంటారు డాక్టర్ రోహ్తాగి. 

 అందుకే మన శరీరంలోని సూక్ష్మజీవుల ప్రాముఖ్యతను మనమంతా తెలుసుకోవాలని మరియు వాటికి అనుగుణంగా తీసుకునే ప్రోటీన్ పరిమాణాల్లో మార్పు తెచ్చుకోవాలని ఆమె సూచించారు. 

 కిడ్నీ వ్యాధులతో సతమతమయ్యేవారు ప్రోటీన్ తీసుకుంటే ఏం జరుగుతుందో చెబుతూ ‘‘మనకు 10 – 15 శాతం క్యాలరీలు ప్రొటీన్ల నుంచే రావాల్సి ఉంటుంది. ముఖ్యంగా సోయా చంక్స్, పప్పులు మరియు చిరు ధాన్యాలు శాఖాహరుల కోసం ప్రొటీన్లకు చక్కని వనరులు’’ అన్నారామె.  

 కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్న వారి గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘పాలు మరియు పాల పదార్థాలైన పెరుగు, పనీర్, సోయాబీన్ మరియు సోయా పనీర్ (టోఫు), గుడ్డులోని తెల్ల భాగం మరియు చికెన్ వంటి వాటిని సరిపడినంత మొత్తాల్లో తీసుకోవాలి’’ అంటారు మరాఠె. 

 మెరుగైన కిడ్నీ ఆరోగ్యానికి తక్కువ పొటాషియం మరియు తక్కువ సోడియం గల ఆహారాలు తినాలని డాక్టర్ రోహ్తగి సూచిస్తున్నారు. పండ్లు మరియు కూరగాయలు వంటి సహజ వనరుల నుండి పోషకాలను పొందడం మంచి మార్గం. మూత్రపిండాలు పనిచేయకపోవడం అనే సమస్య ఉన్నవారు బొప్పాయి, ఆపిల్, పియర్, జామ, పైనాపిల్ మరియు నారింజ వంటి తక్కువ పొటాషియం పండ్లను తీసుకోవచ్చని సిఫార్సు చేస్తున్నారు మరాఠే. 

పప్పు దినుసులలో భాస్వరం పుష్కలంగా ఉన్నందున వాటికి దూరంగా ఉండాలని రోహ్తగి సలహా ఇస్తుండగా, మరాఠే పప్పులు, పప్పులు మరియు ఆకు కూరలను వెచ్చని నీటిలో నానబెట్టి, ఫైటేట్స్ మరియు టానిన్‌ల వంటి యాంటీ న్యూట్రీషియన్స్‌ను వండడానికి ముందు తొలగించాలని సూచిస్తున్నారు. 

 

సంబంధిత ట్యాగ్‌లు
సంబంధిత పోస్టులు

మీ అనుభవాన్ని లేదా వ్యాఖ్యలను పంచుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

eleven + 13 =

ట్రెండింగ్

వ్యాసాలు

వ్యాసం
బెంగళూరుకు చెందిన పి.పార్వతి 20 ఏళ్లప్పుడు శ్వాస తీసుకోవడంలో చిన్నప్పుడు ఇబ్బంది పడేది. పరీక్షలు చేయించగా ఆమెకు ఆస్తమా ఉన్నట్లు నిర్దారించబడింది. ఇప్పుడు అది జరిగి 32 సంవత్సరాలు గడిచింది. 54 సంవత్సరాల వయస్సులో, పార్వతి తన కుమార్తె మరియు తనకంటే సగం వయస్సు కలిగిన స్నేహితులతో ట్రెక్‌లకు చాలా ఈజీగా వెళ్లగలుతుతోంది.
వ్యాసం
షోల్డర్ ఇంపింగ్‌మెంట్ సిండ్రోమ్ రివర్సిబుల్ అయినందున, నొప్పి యొక్క ప్రారంభ సంకేతాలను అనుభవించిన వెంటనే మీరు వైద్యుడిని సంప్రదించాలనిి సలహా ఇస్తారు.
వ్యాసం
ఎముక పునర్నిర్మాణాన్ని నిరోధించడం నుండి ఎముకల విరుగుట మరియు బోలు వ్యాధి ప్రమాదాన్ని పెంచడం వరకు, ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం ఎముకలకు శాశ్వత నష్టం కలిగిస్తుంది

0

0

0

Opt-in To Our Daily Newsletter

* Please check your Spam folder for the Opt-in confirmation mail

Opt-in To Our
Daily Newsletter

We use cookies to customize your user experience, view our policy here

మీ అభిప్రాయం విజయవంతంగా సమర్పించబడింది.

హ్యాపీయెస్ట్ హెల్త్ టీమ్ వీలైనంత త్వరగా మిమ్మల్ని సంప్రదిస్తుంది