
పోషకాహారం: తినే పదార్థాలలోని పోషక విలువలను తెలుసుకోవడం వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలకు సరైన పోషకాలను అందించడంలో సహాయపడుతుంది
పిల్లల కోసం ఆరోగ్యకరమైన లంచ్ బాక్స్‌ను తయారు చేయడం తల్లిదండ్రులు ఎదుర్కొనే కష్టతరమైన పని. జంక్ ఫుడ్ లేని చిరుతిండిని ప్యాక్ చేసేటప్పుడు గందరగోళం మరింత తీవ్రమవుతుంది. ఇలాంటి సందర్భాల్లో ఆహార పదార్థాల పోషక విలువలు తెలుసుకోవడం వల్ల పని సులువవుతుంది. పిల్లలను జంక్ ఫుడ్స్ నుండి దూరంగా ఉంచడానికి, తద్వారా వారి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి పిల్లలలో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించడం చాలా అవసరం అని నిపుణులు అంటున్నారు.
పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం
హ్యాపీయెస్ట్ హెల్త్ నిర్వహించిన ది ఎడ్జ్ ఆఫ్ న్యూట్రిషన్ సమ్మిట్‌లో పిల్లల పోషకాహారం గురించి మాట్లాడుతూ, బెంగళూరులోని ఢీ హాస్పిటల్స్‌లో పీడియాట్రిక్ సర్వీసెస్ డైరెక్టర్, సీనియర్ పీడియాట్రిషియన్ మరియు ఇంటెన్సివిస్ట్ డాక్టర్ సుప్రజా చంద్రశేఖర్ మాట్లాడుతూ, “తల్లిదండ్రులు ఏది మంచి ఆహారంగా పరిగణించబడుతుందో మరియు ఏది జంక్ అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. మాంసకృత్తులు, ఫైబర్, విటమిన్లు మరియు మినరల్స్ ఉన్న ఏ ఆహారమైనా పిల్లలకు మంచిది. దీనికి విరుద్ధంగా, అధిక ఉప్పు, చక్కెర, ప్రిజర్వేటివ్‌లను మరియు ఫ్యాట్స్ కలిగిన ఆహార పదార్థాలు జంక్‌గా పరిగణించబడతాయి. తల్లిదండ్రులు పోషక విలువలపై అవగాహన కలిగి ఉంటే సరైన ఆహారాన్ని ఎంచుకోవడం సులభం అవుతుంది” అని అన్నారు.
పోషణ యొక్క వివరాల ప్రదర్శన
ఐరన్, విటమిన్ D, విటమిన్ B12, జింక్ మరియు కాల్షియం వంటి పోషకాల లోపం సాధారణంగా పిల్లలలో కనిపిస్తుంది, ఇది బలహీనమైన రోగనిరోధక శక్తిని కలిగిస్తుంది మరియు వారు అలెర్జీలు, మలబద్ధకం మరియు త్వరగా యుక్తవయస్కులు అవుతారని డాక్టర్ చంద్రశేఖర్ చెప్పారు.
“పప్పులు, మాంసాలు మరియు గింజలు వంటి అన్ని ముదురు రంగు ఆహారాలు (ముఖ్యంగా ఆకుపచ్చ, ఎరుపు మరియు గోధుమ) ఐరన్ యొక్క గొప్ప వనరులు, మరియు సరైన ఆరోగ్యం కోసం అలాంటి ఆహార పదార్థాలను ఎంచుకోవడానికి పిల్లలకు తప్పక నేర్పించాలి,” పిల్లలు తెలుపు-రంగు ఆహార పదార్థాలైన ఉప్పు, పంచదార, మైదా మరియు వైట్ రైస్ వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి అని ఆమె వివరించారు.
దీనికి తోడు పిల్లల ఆహారపు అలవాట్లు, ఆటల అలవాట్లు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నాయని డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. “ఆరోగ్యకరమైన ఆహార ప్రవర్తనలను అలవాటు చేయడానికి తినే వాతావరణం చాలా కీలకమైనది. సరైన ఆకృతి మరియు స్థిరమైన దినచర్య వారి శ్రేయస్సుపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. పిల్లలు తమ కుటుంబాలు మరియు ప్రకృతితో ఎక్కువ సమయాన్ని గడపాలి, అలా కాకుండా టీవీ, ఫోన్, కంప్యూటర్ లాంటి వాటితో ఎక్కువ సమయం గడపడం వలన వారు సోమరితనంతో కూడిన జీవనశైలికి మరియు పేలవమైన ఆహార ఎంపికలకు కారణమవుతుంది, ఇవి ఊబకాయానికి దారితీస్తాయి,” అని ఆమె అన్నారు.
పిల్లల కోసం సరియైన ఆహారం
డాక్టర్ చంద్రశేఖర్ పిల్లలకు అవసరమైన పోషకాహారాన్ని అందజేయడానికి సరైన నిష్పత్తిలో సరైన ఆహారాన్ని ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను వివరించి చెప్పారు. ఆమె ప్రకారం, సమతుల్య ఆహారంలో వీటిని కలిగి ఉండాలి:
- తృణధాన్యాలు మరియ పావు ప్లేట్ మిల్లెట్లు.
- పప్పులు, బీన్స్, సోయా, గింజలు, గింజలు, మాంసం, గుడ్డు, పౌల్ట్రీ మరియు చేపలు వంటి ప్రోటీన్ పావు ప్లేట్. లీన్ ప్రొటీన్లను ఎంపిక చేసుకోవడం ఉత్తమం.
- ఆకుపచ్చ, పిండి, ఎరుపు-నారింజ, బీన్స్ మరియు ఇతర – మొత్తం ఐదు రకాల కూరగాయలు ఒక పావు ప్లేట్. అన్ని సూక్ష్మపోషకాలు పిల్లలకు అందడానికి ఈ కూరగాయలను క్రమం తప్పకుండా మారుస్తూ ఉండాలి.
- ఒక పావు ప్లేట్ పండ్లు. జ్యూస్‌ల కంటే పండ్లనే తినడం లేదా స్మూతీలను ఎంచుకోవడం మంచిది.
- ఏదైనా పాల ఉత్పత్తి ఒక కప్పు. తాజా, ఇంట్లో తయారుచేసిన వస్తువులు సరైన ఆరోగ్యానికి అనువైనవిగా ఉంటాయి.
ఏదైనా ఆహార పదార్ధం (భారతీయ లేదా పాశ్చాత్య) అన్ని అవసరమైన పోషకాలను కలిగి ఉంటే ఆరోగ్యకరమైన వంటకంగా తయారు చేయవచ్చని ఆమె వివరించారు. “తక్కువ పోషక విలువలు కలిగిన పూరీ మరియు ఆలూతో పోలిస్తే హోల్‌గ్రైన్ క్రస్ట్ మరియు ప్రిజర్వేటివ్‌లు లేని ఇంట్లో తయారుచేసిన పిజ్జా ఆరోగ్యకరమైన ఎంపిక” అని ఆమె చెప్పారు.
పిల్లల పోషకాహార అవసరాలు
పిల్లలు వైవిధ్య భరితమైన ఆహారాన్ని తినాలి మరియు అందులో అన్ని రంగుల పండ్లు, కూరగాయలను కలిగి ఉండాలి అని బెంగుళూరులోని సెయింట్ జాన్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ యొక్క న్యూట్రిషన్ విభాగం ప్రొఫెసర్ & హెడ్ డాక్టర్ రెబెక్కా కె రాజ్ అన్నారు. “పిల్లలు అన్ని సూక్ష్మపోషకాలను పొందడానికి ఇంద్రధనస్సు రంగులో ఉండే పండ్లు మరియు కూరగాయలను తప్పనిసరిగా తినాలి. కార్బోహైడ్రేట్ల అధిక వినియోగాన్ని నివారించేటప్పుడు వారు తగిన మొత్తంలో ప్రోటీన్ మరియు కొవ్వును తీసుకోవాలి, ”అని ఆమె అన్నారు.
అదనంగా, ఒక పిల్లవాడు రోజుకు రెండు నుండి మూడు వేర్వేరు పండ్లను తినాలని డాక్టర్ రాజ్ చెప్పారు. “పెద్దల మాదిరిగానే, పిల్లలకు రోజుకు అర కిలో పండ్లు మరియు కూరగాయలు అవసరం. ఇది రోజంతటిలో ఎప్పుడైనా ఇవ్వవచ్చు మరియు అల్పాహారానికి పరిమితం చేయవలసిన అవసరం లేదు,” ఆమె అన్నారు.
బెంగళూరులోని అపోలో హాస్పిటల్స్ చీఫ్ డైటీషియన్ డాక్టర్ ప్రియాంక రోహత్గి మాట్లాడుతూ ‘53210′ సూత్రాన్ని అనుసరించడం వల్ల తగిన పోషకాహారం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి కలిగి ఉంటారు అని అన్నారు. కాన్సెప్ట్ ప్రకారం, పిల్లల దినచర్యలో వీటిని కలిగి ఉండాలి:
- పండ్లు మరియు కూరగాయల 5 సర్వింగులు.
- 3 సమతుల్య భోజనాలు.
- గరిష్టంగా 2 గంటల మాత్రమే గాడ్జెట్ సమయం (టీవి, ఫోన్, కంప్యూటర్ మొదలైనవి).
- 1 గంట శారీరక శ్రమ.
- జంక్ మరియు HFSS (అధిక కొవ్వు, ఉప్పు మరియు చక్కెర) ఆహార పదార్థాలు నివారించడం.
పిల్లలలో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించడం
పిల్లల పెరుగుదల మరియు ఆకలి బాధలను తెలుసుకోవడం చాలా ముఖ్యం అని డాక్టర్ రోహత్గి చెప్పారు. “తల్లిదండ్రులుగా మనం రోల్ మోడల్‌గా ఉండాలి మరియు మనం బోధించే వాటిని ముందుగా మనం ఆచరించాలి. పిల్లలు రుచికరమైన మరియు సంతృప్తికరంగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినేలా చూడాలి. తల్లిదండ్రులు ఆహారాన్ని బహుమతిగా ఉపయోగించకూడదు మరియు పిల్లలు సమయానికి భోజనం చేసేలా చూడాలి,” అని ఆమె అన్నారు.
రెస్టారెంట్లలో తినడం గురించి మాట్లాడుతూ, తినే పరిమాణంపై నియంత్రణ మరియు చురుకైన జీవనశైలి ముఖ్యమైనవి అని డాక్టర్ రోహత్గి చెప్పారు, రోజూ బయట తినడం పిల్లలలో ఊబకాయానికి కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు.
గుర్తుంచుకోవలసినవి
- తల్లిదండ్రులు తమ పిల్లలకు సరైన పోషకాలను అందించడానికి ఆహార పదార్థాల పోషక విలువలను తెలుసుకోవాలి.
- పిల్లలు తమ కుటుంబాలు మరియు ప్రకృతితో ఎక్కువ సమయాన్ని గడపాలి, అలా కాకుండా టీవి, ఫోన్, కంప్యూటర్ లాంటి వాటితో ఎక్కువ సమయం గడపడం పేలవమైన ఆహార ఎంపికలకు కారణమవుతుంది, ఇవి ఊబకాయానికి దారితీస్తాయి.
- ఒక పిల్లవాడికి రోజూ అర కిలో పండ్లు మరియు కూరగాయలు అవసరమవుతాయి, వీటిని రోజంతా ఎప్పుడైనా ఇవ్వవచ్చు.
- పిల్లలు ఆహారం నుండి అన్ని అవసరమైన సూక్ష్మపోషకాలను పొందడానికి ఇంద్రధనస్సు రంగులో ఉండే పండ్లు మరియు కూరగాయలను తప్పనిసరిగా తినాలి.