728X90

0

0

0

ఈ వ్యాసంలో

మీ పిల్లలు స్మార్ట్ ఫోన్ వదలడం లేదా? నియంత్రించండిలా
330

మీ పిల్లలు స్మార్ట్ ఫోన్ వదలడం లేదా? నియంత్రించండిలా

పిల్లలలో గాడ్జెట్ మితిమీరిన వినియోగం వల్ల కమ్యూనికేషన్ లేకపోవడం, సామాజిక ఒంటరితనం, తగినంతగా ఆటలు ఆడకపోవడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి.

ఆధునిక జీవన విధానంలో గాడ్జెట్‌లు మన జీవితంలో అనివార్యంగా మారాయి. అయితే గాడ్జెట్‌లు మరియు ఇంటర్నెట్‌తో సంబంధాలను పూర్తిగా విచ్ఛిన్నం చేయడం అనేది ఆచరణాత్మకంగా అసాధ్యం. కాకపోతే బాధ్యతాయుతమైన గాడ్జెట్ వాడకాన్ని ప్రోత్సహించడం మరియు పిల్లల్లో మితిమీరిన వాడకాన్ని తగ్గించడం అత్యవసర ప్రాధానత్యలుగా మారాయి.

సెప్టెంబర్ 22న జరిగిన హ్యాపియెస్ట్ హెల్త్ చిల్డ్రన్స్ వెల్‌నెస్ సమ్మిట్ ‘గెట్ సెట్, గ్రో!’లో.. బెంగళూరు నిమ్హాన్స్‌లోని సర్వీస్ ఫర్ హెల్తీ యూజ్ ఆఫ్ టెక్నాలజీ(షట్) క్లినిక్, క్లినికల్ సైకాలజీ ప్రొఫెసర్ మరియు కోఆర్డినేటర్ డాక్టర్ మనోజ్ శర్మ మాట్లాడుతూ.. గాడ్జెట్‌లతో పిల్లల అవసరాలు పెరుగుతున్నాయి అనేది వాస్తవం. అయితే మొబైల్‌లను బాధ్యతాయుతంగా ఉపయోగించడం.. అవసరానికి తగినట్లు వాడటం నేర్పించాలని అన్నారు.

చాలా మంది పిల్లల్లో గాడ్జెట్‌ల మితిమీరిన వినియోగం కనిపిస్తుండగా, గాడ్జెట్ వ్యసనం 2 నుంచి 3 శాతం కంటే ఎక్కువ మంది పిల్లల్లో కనిపించడం లేదని ఆయన చెప్పారు.

ఇక్కడ సమస్య ఏమిటంటే వినోదం కోసం గాడ్జెట్‌ల వినియోగం అనేది మళ్లీ మళ్లీ ఉపయోగించే విధంగా చేస్తోంది. ఇది సమస్యాత్మకమైన లేదా వ్యసనంగా మారిపోతుంది అని చెప్పారు.

గాడ్జెట్స్ మితిమీరిన వాడకం వల్ల పిల్లలకు.. కుటుంబంతో కమ్యూనికేషన్ లేకపోవడం, సామాజిక ఒంటరితనం, బహిరంగంగా ఆటలు ఆడకపోవడం, నిశ్చల జీవనశైలిని ఆశ్రయించడం.. తగినంత నిద్ర లేకపోవడం వంటి పరిణామాలని చూడవచ్చని డాక్టర్ శర్మ చెప్పారు.

గాడ్జెట్‌లు మరియు కోల్పోయిన ఆనందం

డాక్టర్ శర్మ ప్రకారం, గాడ్జెట్‌లతో ఆరోగ్యకరమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడంలో కీలకమైన అంశాలలో ఒకటి FOMO (తప్పిపోతాననే భయం) నుండి JOMO (తప్పిపోయిన ఆనందం) భావానికి చేరుకోవడం.

ఫోమో అనేది ఇతర వ్యక్తులు ఆనందించే ఆహ్లాదకరమైన ఈవెంట్‌లను మీరు కోల్పోవచ్చు అనే ఆత్రుత భావన. ఈ భావన ముఖ్యంగా సోషల్ మీడియాలో చూసే విషయాల ద్వారా ప్రేరేపించబడుతుంది, నిరంతరం ట్యాబ్‌లను ఉపయోగించడానికి ప్రేరేపిస్తుంది.

JOMO అనేది మరెక్కడైనా మరింత ఆసక్తికరంగా జరుగుతోందని చింతించకుండా ప్రస్తుత క్షణంలో ఉండటం మరియు సంతృప్తి చెందడం.

బాధ్యతతో కూడిన ఇంటర్నెట్ వినియోగంలో ముఖ్యమైన విషయం ఏంటంటే, సంతృప్తి పొందే ప్రత్యామ్నాయ విధానాలను కనుగొనడం. అనుబంధం మరియు గుర్తింపు కోసం, ఒకరి అవసరం కోసం మాత్రమే ఇంటర్నెట్‌ని ఆశ్రయించడం సరైనది కాదు అని డాక్టర్ శర్మ చెప్పారు.

సోషల్ మీడియా మరియు ఆన్‌లైన్ గేమ్‌ల నుంచి పిల్లలు అనుబంధం మరియు అంగీకారం పొందుతారని ఆయన అన్నారు. సోషల్ మీడియా వారి భావాలను చర్చించడానికి, బయటపెట్టడానికి వారిని అనుమతిస్తుంది. ఇది బహుశా వారి ఇళ్లలో జరగదు.

ఇంటర్నెట్ పిల్లల్లో ఉన్న అనామకతను తొలగిస్తుంది. అంతేకాకుండా ఏదైనా విషయం తప్పు అయితే కూడా వారిని శిక్షించదు అనే ఆలోచన వారిలో లేదని ఆయన అన్నారు.

గాడ్జెట్లు మరియు ఇంటర్నెట్

సైబర్ బెదిరింపులు మరియు భద్రతా చర్యలు లేని కాలంలో ఇంటర్నెట్‌ను బాధ్యతాయుతంగా ఎలా ఉపయోగించాలో పిల్లలకు నేర్పించాల్సిన అవసరం గురించి మాట్లాడుతూ.. గాడ్జెట్ వినియోగాన్ని క్రమంగా నియంత్రించడానికి పిల్లల్లో నైపుణ్యాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందని డాక్టర్ శర్మ అన్నారు. ”బాధ్యత గల ఇంటర్నెట్ మరియు సాంకేతిక వినియోగాన్ని అభివృద్ధి చేయడాన్ని తెలియజేయడం.. పరస్పరం కమ్యూనికేషన్ యొక్క నైపుణ్యాలను అభివ‌ృద్ధి చేయడం చాలా ముఖ్యం” అని ఆయన చెప్పారు.

గాడ్జెట్‌ల వినియోగాన్ని పూర్తిగా ఆపేయడం లేదా పిల్లలకు వాటిని ఇవ్వకుండా పూర్తిగా నియంత్రంచడం సరికాదు. అయితే మొబైల్ వినియోగం నియంత్రణలో ఉండాలని వారికి బోధించాలి.
”టెక్నాలజీని ఉత్పాదకంగా ఉపయోగించుకోండి. పూర్తిగా ఆపొద్దు” అని డాక్టర్ శర్మ అన్నారు. ఇది జీవన ప్రమాణాలను, శ్రేయస్సును మెరుగుపరిచినప్పుడు సామాజిక కనెక్షన్, కమ్యూనికేషన్, కోపింగ్, జ్ణానాన్ని పెంపొందించడం మరియు వినోద వినియోగం కోసం ఉపయోగించవచ్చు.

నోమోఫోబియా ఒక వాస్తవం

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ నోమోఫోబియా(మొబైల్ ఫోన్ ఫోబియా)తో బాధపడుతున్నారని డాక్టర్ శర్మ పేర్కొన్నారు. మొబైల్ ఫోన్ వినియోగదారుల్లో ఫోన్‌లకు దూరంగా ఉండాలనే భయం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఫోన్ ఉపయోగించనప్పుడు ఏదైనా మిస్ అవుతుందనే భయం మరియు ఆందోళన కూడా ఉందని చెప్పారు. నోమోఫోబియాలో ముఖ్యమైన అంశం ఏంటంటే.. ఇక్కడ పిల్లలే కాదు పెద్దలు కూడా మొబైల్ ఫోన్ ఫోబియాతో బాధపడుతున్నారు.

గాడ్జెట్ మితిమీరిన వినియోగాన్ని అధిగమించడానికి మార్గాలు

పిల్లలలో ఆరోగ్యకరమైన గాడ్జెట్ వినియోగాన్ని ప్రోత్సహించడానికి డాక్టర్ శర్మ 4D వ్యూహం గురించి మాట్లాడారు..

డిజిటల్ అక్షరాస్యత: పిల్లల గాడ్జెట్ వినియోగాన్ని నియంత్రించడంలో సహాయపడే నియంత్రణ లక్షణాల గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాలి. ఉదాహరణకు యూట్యూబ్ వంటి యాప్‌లు పిల్లల కోసం రూపొందించిన కంటెంట్‌తో పిల్లలకు అనుకూలమైన సంస్కరణలను కలిగి ఉంటాయి.

డిజిటల్ పరిశుభ్రత: గాడ్జెట్‌లను ఉపయోగించన తర్వాత తరచుగా విరామం తీసుకునేలా పిల్లలను ప్రోత్సహించాలి. గాడ్జెట్ ఉపయోగించిన ప్రతి 30 నిమిషాల తర్వాత, వారు రెప్ప వేయడం, మెడను సాగదీయడం మరియు మణికట్టును తిప్పడం వంటి వ్యాయామాలలో పాల్గొనాలి.

డిజిటల్ ఉపవాసం: ఇందులో పిల్లలు టెక్నాలజీకి దూరంగా ఉండే కాలాలు ఉంటాయి. బదులుగా వారు వ్యక్తిగతంగా మాట్లాడటంలో పాల్గొంటారు. వర్చువల్ ప్రపంచం వెలుపల అర్థవంతమైన సంబంధాలను బలపరుచుకుంటారు.

డిజిటల్ స్థితిస్థాపకత: డిజిటల్ స్థితిస్థాపకతను నిర్మించడం అనేది వారి జీవితాలను మెరుగుపరచడానికి సాంకేతికతను ఉత్పాదకంగా ఉపయోగించడం గురించి జ్ఞానంతో పిల్లలను సన్నద్ధం చేయడం. ప్రతి విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరాన్ని విడనాడాలని పిల్లలకు కౌన్సెలింగ్ ఇవ్వాలి.

గుర్తుంచుకోవాల్సినవి

పిల్లలలో గాడ్జెట్ మితిమీరిన వినియోగం వల్ల కమ్యూనికేషన్ లేకపోవడం, సామాజిక ఒంటరితనం, తగినంతగా ఆటలు ఆడకపోవడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి. గాడ్జెట్‌ల ఆరోగ్యకరమైన మరియు అనారోగ్యకరమైన ఉపయోగం మధ్య ఎల్లప్పుడూ సన్నని గీత ఉన్నప్పటికీ, వాటి వినియోగాన్ని నియంత్రించడం వల్ల మార్పు ఉంటుందని నిపుణలు అంటున్నారు.

మీ అనుభవాన్ని లేదా వ్యాఖ్యలను పంచుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ట్రెండింగ్

వ్యాసాలు

0

0

0

Opt-in To Our Daily Newsletter

* Please check your Spam folder for the Opt-in confirmation mail

Opt-in To Our
Daily Newsletter

We use cookies to customize your user experience, view our policy here

మీ అభిప్రాయం విజయవంతంగా సమర్పించబడింది.

హ్యాపీయెస్ట్ హెల్త్ టీమ్ వీలైనంత త్వరగా మిమ్మల్ని సంప్రదిస్తుంది