
పని బాధ్యతలు పెరగడం వల్ల తల్లిదండ్రులు వారం చివరి రోజుల్లో మాత్రమే పిల్లలతో సమయాన్ని గడపవలసి వస్తుంది. వారాంతంలోనైనా తమ కుటుంబంతో గడిపే క్షణాలు చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
నేటి పరుగుల ప్రపంచంలో, పని ఒత్తిడి, డెడ్‌లైన్‌లు మరియు రోజువారీ రాకపోకలు వంటి కారణాలు ఎక్కువ అవ్వడం వల్ల ప్రజలు ఎక్కువ సమయాన్ని వాటికి కేటాయిస్తూ వారి తల్లిదండ్రులకు, పిల్లలకు చాలా తక్కువ సమయాన్ని కేటాయించవలసిన పరిస్థితిలో ఉంటున్నారు.
తల్లిదండ్రులు ఇద్దరూ రోజులో ఎక్కువ సమయాన్ని ఉద్యోగం కోసం కేటాయించడం వల్ల వారికి పిల్లలపైన ఎంతో ప్రేమ ఉన్నప్పటికీ సమయాభావం వల్ల అది పిల్లలను నిర్లక్ష్యం చేస్తున్నామనే భావనకు కారణమవుతుంది. వారి యొక్క తీవ్రమైన పని షెడ్యూల్‌లు వల్ల ఇలాంటి బాధలను ఎదుర్కోవాల్సి ఉంటారు. పీక్-అవర్ ట్రాఫిక్‌లో ప్రయాణించడం మరియు ఆలస్యంగా ఇంటికి చేరుకోవడం ఇలా చేరుకొనే సమయానికే నిద్రిస్తున్న తమ పిల్లలతో మాట్లాడలేకపోవడం వంటి వాటి వల్ల పిల్లలు, తల్లిదండ్రుల మధ్య కావలసిన ముఖ సమయాన్ని గడపలేకపోతున్నారు. ఇలాంటి పలు పరిస్థితుల వల్ల తల్లిదండ్రులు పిల్లలకు వారాంతపు తల్లిదండ్రులుగా మారడానికి కారణమవుతుంది.
తమ పిల్లలతో సమయాన్ని గడపలేకపోవడం వల్ల కలిగే అపరాధ భావాలు మరియు ఆందోళన భావాల వంటివి తల్లిదండ్రులలో మానసిక రుగ్మతకు దారి తీయవచ్చు. ఇలాంటి పరిస్థితి తల్లిదండ్రులకు వారి పిల్లలను బాగా చూసుకోవాలి అనుకోవడం, వారు భవిష్యత్తులో ఉన్నతంగా జీవించాలి, వారు అనుకున్న విజయాలను సాధించాలి అనుకోవడం మొదలైన విజయాలు మరియు అపజయాలలో ఇమిడి ఉంటాయి.
“తల్లిదండ్రులు తప్పక అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, సంతాన సాఫల్యం అనేది సరైన విధానంతో సమతుల్యతను చూపించే నైపుణ్యం, ఇది అభ్యాసం యొక్క వినికిడి విధానాల కంటే గొప్పది. తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య మంచి, ఆరోగ్యకరమైన మరియు పరస్పర సంభాషణను కలిగి ఉండటమే ఈ సమతుల్యతను సాధించడంలో కీలకం” అని ఫోర్టిస్ హెల్త్‌కేర్‌లోని మానసిక ఆరోగ్యం మరియు ప్రవర్తనా శాస్త్రాల విభాగం, ఫోర్టిస్ స్కూల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ హెడ్, క్లినికల్ సైకాలజిస్ట్ మరియు హెడ్ మిమాన్సా సింగ్ తన్వర్ చెప్పారు.
పోరాటం/కష్టపడి ప్రయత్నించటం నిజమే
పదేళ్ల కవలలు రియా మరియు సియాలకు కార్పొరేట్ ప్రొఫెషనల్ మరియు ఒంటరి తల్లి అయిన రాశి ఖాన్, సమతుల్యత కోసం చేసిన పోరాటం నిజమైనది మరియు శాశ్వతమైనది అని అంగీకరించింది. “మాతృత్వాన్ని అంగీకరించడం, వృత్తిని కొనసాగించడం ఇబ్బంది కలిగిస్తుందనే విషయం నాకు తెలియదు. ఇలా పది సంవత్సరాల నుండి ప్రతి రోజు నేను నా పని షెడ్యూల్ నుండి నా పిల్లల కోసం సమయాన్ని కేటాయించడానికి ప్రయత్నిస్తున్నాను. మరియు కొన్నిసార్లు వారాంతాల్లో కూడా, నేను ఈవెంట్లకు లేదా వర్క్ పార్టీలకు హాజరు కావాల్సి వచ్చినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది, ”అని ఖాన్ చెప్పారు.
అప్పుడు ఆమె తమ పిల్లల పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నారు? ఇంతకుముందు తన కూతుళ్లు తనను మిస్ అయ్యేవారని, అది తనను అపరాధ భావంతో పంపేదని ఖాన్ చెప్పారు. కానీ ఇప్పుడు వారు పెద్దవారైనందున, చిన్నప్పుడు ఆమె వారికి ఇవ్వని వస్తువులను వారు ఆమెను ఇప్పుడు అడిగి తీసుకోవడం నేర్చుకున్నారని ఖాన్ వెల్లడించారు. “ప్రస్తుతం నేను ఎంత మంచి తల్లిదండ్రులో నాకు తెలియదు, ఏది ఏమైనప్పటికీ ఎంత ప్రయత్నించినప్పటికీ ముందు జరిగిన విషయాలు తనను ఎంతో బాధను కలిగిస్తుంది. దాన్ని తగ్గించుకోలేకపోతున్నానని ” ఆందోళన చెందుతున్న తల్లి చెప్పింది.
వారం చివరి రోజుల్లో పిల్లలతో గడిపే తల్లిదండ్రులు చెడు తల్లిదండ్రులతో సమానమా?
మీ పిల్లలతో మీరు తక్కువ సమయాన్ని గడపడం వలన మీ పిల్లలు మిమ్మల్ని ప్రశ్నించే అవకాశం ఉన్నప్పటికీ, ఆ విషయం మిమ్మల్ని చెడు తల్లిదండ్రులుగా మార్చలేదు అని హర్యానాలోని గురుగ్రామ్‌లోని BLK-మాక్స్ హాస్పిటల్‌తో అనుబంధించబడిన చైల్డ్ సైకాలజిస్ట్ సతీందర్ కౌర్ వాలియా చెప్పారు. “నిజంగా ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు మీ పిల్లలతో తక్కువ సమయం గడుపుతున్నారని మీకు తెలుసు, కాబట్టి మీరు దానిని ముఖ్యమైన సమయంగా సద్వినియోగం చేసుకునేలా చూసుకోవాలి. చివరికి, ఇది వారి స్వభావం కంటే వ్యక్తిత్వానికి సంబంధించినదని, ”వాలియా చెప్పారు.
పిల్లలతో రోజు లేదా వారం మొత్తం గడపడం కంటే వారితో అర్థవంతమైన పనులు చేయడం చాలా ముఖ్యమైనదని నిపుణులు భావిస్తున్నారు. దీని వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు కాబట్టి, వారాంతంలో మాత్రమే మీ పిల్లలతో అన్యోన్యంగా ఉంటున్నారని మీరు బాధ పడకండి. కొన్నిసార్లు వారాంతంలో పేరెంట్‌గా ఉండటం కూడా మంచి విషయమే, ఎందుకంటే మీరు పిల్లల చుట్టూ 24/7 సంతోషంగా ఉండటం అలాకాకుండా మీ పిల్లలపై మీ దృష్టి పెట్టకుండా ఫోన్ లేదా ల్యాప్‌టాప్ స్క్రీన్ వైపు చూస్తూ ఉన్నట్లయితే మీ దృష్టి మొత్తం వాటి పైనే మీ దృష్టి ఉంటుంది.
డాక్టర్ కర్ణికా తివారీ, నోయిడాలోని మదర్‌ల్యాండ్ హాస్పిటల్‌లో గైనకాలజిస్ట్ అయిన ఈమె స్వయంగా ఒక తల్లి, “వారాంతపు తల్లిగా ఉండటం మరచిపోండి; కొన్నిసార్లు నేను వారాంతాల్లో కూడా పని చేస్తున్నాను. నేను డాక్టర్‌ని, కాబట్టి నా పని 24 గంటలు ఉంటుంది. కాబట్టి నాకు ఏ కొద్ది సమయం దొరికినా, నా పిల్లలతో గడపటానికి ప్రయతిస్తుంటాను. వాస్తవానికి, ఇది ఇబ్బందిగా ఉన్నప్పటికీ దీని అర్థం మనం పిల్లలపై మన అశ్రద్ధ చూపడం కాదు. అది భవిష్యత్తులో ఒక సానుకూల మార్గం కావచ్చు.”
“భూవన్ మాథుర్, మార్కెటింగ్ ప్రొఫెషనల్, మరియు అతని భార్య మితు మాథుర్, ఆర్కిటెక్ట్, ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు, “మాకు ఎక్కువ తీవ్రమైన పని షెడ్యూల్ లేదు, కానీ మేమిద్దరం బిజీగా ఉన్న సమయాలు ఉంటే, మేము వారాంతంలో కూడా తల్లిదండ్రులిద్దరి బాధ్యతను ఒక పేరెంట్ భుజానికెత్తుకునేలా చూసుకొంటాం. కాబట్టి మేము హోంవర్క్‌ని తనిఖీ చేయడం, పుట్టినరోజు పార్టీలకు లేదా పార్కుకు తీసుకెళ్లడం లేదా సెలవుల్లో మా కుటుంబ సభ్యులను చూడటానికి వెళ్ళడం వంటివి చేస్తాము.
వారాంతంలో ఎక్కువ సమయాన్ని కేటాయించడం
వారాంతంలో సంతానంతో సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీరు అనేక విషయాలు చేయవచ్చు.
- కొన్నిసార్లు ఇంట్లోనే ఉండి పిల్లలతో కలిసి సినిమా చూడటం లేదా వారికి ఇష్టమైన భోజనం వండిపెట్టడం వంటివి వేరే పనులు చేయాలనే అంశాన్ని మర్చిపోయేలా చేసి ఇంటిలో చాలా సరదాగా గడిపేలా చేస్తుంది.
- మిషన్ విహారయాత్రలు: పిల్లలు ఎదురుచూసే వారాంతంలో మంచి ఆనందాన్ని పొందాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి దాని కోసం ఎక్కడికైతే వెళ్ళాలని అనుకొంటామో అక్కడకి ముందుగానే బుక్ చేసుకోని అక్కడ చేయాలనుకొనే కార్యకలాపాలను ముందుగానే అనుకొని వారాంతంలో సంతోషంగా గడపటం.
- కుటుంబ విషయాలు: కుటుంబ సభ్యులతో మాట్లాడండి మరియు వారి ఇష్టమైన బంధువు లేదా అత్త,మామలు లేదా బాబాయి, అవ్వతాతలను కలవడానికి వారిని తీసుకెళ్లండి. కలిసి వంట చేయడం లేదా విహారయాత్రకు వెళ్లడం, ఈత కొట్టడం లేదా కలిసి క్రాఫ్టింగ్ కార్యకలాపాల్లో మునిగిపోవడం వంటివి బంధంలో సహాయపడతాయి.
- తగాదాలు మరియు గొడవలను నివారించండి: గట్టిగా మాట్లాడుకోవడం, గొడవలు మరియు తగాదాలు ఇవన్నీ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే తల్లిదండ్రులు తమతో సమయం గడపవలసి వస్తే అది గొడవలకు కారణం అవుతుందని పిల్లలు భావించకూడదు.
- క్రమశిక్షణ మరియు హోంవర్క్: వారాంతపు తల్లిదండ్రులు పిల్లలకు కండిషన్ పెట్టి చెడ్డ వ్యక్తులుగా మారకూడదు. ఎప్పుడూ కఠినంగా ఉండకుండా అప్పుడప్పుడు బహుమతులు ఇవ్వడం చేయాలి. ఒక్కోసారి కండిషన్లు పెట్టడం అనేది వల్ల కూడా సానుకూల ప్రభావం చూపి, పిల్లలు కూడా కొన్ని పరిమితులను నేర్చుకుంటారు. తద్వారా పిల్లలు మరింత స్వతంత్రంగా మారతారు.
వారితో ఆ క్షణంలో ఉండటం
“మీ బిడ్డపై మీ పూర్తి శ్రద్దను ఉంచండి. మీరు ఆ సమయాన్ని వారితో గడపాలని ఎంచుకున్నప్పుడు ఏవైనా వేరే విషయాలు వస్తే వాటిని నివారించండి. మీరు పిల్లలతో సంభాషించే విధానం – కంటిచూపు, చురుగ్గా వినడం, మౌఖిక సూచనలు మరియు సమూహ సమస్యను పరిష్కరించడం ద్వారా – మీరు వారితో పూర్తిగా నిమగ్నమై ఉన్నారని వారికి తెలుస్తుంది. వారి జీవితాలు, తరగతి గది, ప్లే గ్రౌండ్ మరియు సోషల్ మీడియాలో అనుభవాలు, అలాగే సహచరులతో వారి పరస్పర చర్యల గురించి మరింత తెలుసుకోవడానికి ప్రయత్నించండి. విద్యావేత్తలకు మించిన అనేక సామాజిక మరియు భావోద్వేగ సవాళ్లను తెలుసుకునేలా చేయడానికి మరియు ఎదుర్కోవడానికి పిల్లలకు సాధనాలు అవసరం, ”అని డాక్టర్ సింగ్ చెప్పారు.
ఢిల్లీకి చెందిన న్యాయవాది గరిమా బజాజ్ మాట్లాడుతూ, మొదట్లో, తన బిడ్డకు ప్రాధాన్యత ఇవ్వలేకపోయినందుకు తాను గిల్టీగా భావించేవాడిని. “దాని వల్ల వారితో కలిసి ఉండటం కంటే నాణ్యమైన సమయాన్ని గడపడం మంచిదని నేను గ్రహించాను. వారాంతాలు నా కొడుకు కోసం కేటాయించాను ; మేము ఉదయం నుండి రాత్రి వరకు కలిసి ఉన్నాము. అతనితో గడిపిన రోజులు చదువుకోవడం, కబుర్లు చెప్పుకోవడం, చదవడం, మనకు ఇష్టమైన భోజనం పెట్టుకోవడం వల్ల సరదాగా గడపడం” వంటివని బజాజ్ చెప్పారు.
ఒక్కమాటలో చెప్పాలంటే, ఈ సున్నితమైన సామరస్యాన్ని సాధించడంలో పని-జీవిత సమతుల్యత కీలక పాత్ర పోషిస్తుంది. “ఒక పిల్లవాడు చదువు పూర్తి చేసి, అతని/ఆమె బాటలో పయనించిన తర్వాత, తల్లిదండ్రులు తమ పిల్లల కోసం తమ జీవితంలో ఎదుగుదలతో పాటు చాలా వదులుకున్నారని భావించకూడదు. కాబట్టి, ఒకరి అభిరుచి కోసం పని చేయడం మరియు పిల్లల కోసం నాణ్యమైన సమయాన్ని గడపడం అనేది ప్రారంభంలో ఇబ్బందిగా ఉన్నప్పటికీ సంతోషకరమైన సంతాన సాఫల్యానికి అనువైన వంటకం, అని ”బజాజ్ సంక్షిప్తంగా చెప్పారు.