దీపావళి అంటే పిల్లలకు, పెద్దలకు ఎంతో సరదా. అది ఎన్నో అనుభూతులను మిగులుస్తుంది. దసరా తర్వాత వచ్చే దీపావళి పండుగ కోసం పిల్లలకు ఎంతో ఆసక్తి ఉంటుంది. ఎక్కడ చూసినా దీపాలు, వెలుగులు, ఆకాశ దీపాలు, వారమంతా టపాసులు, స్వీట్లు, కుటుంబ సభ్యులకు ఆనంద క్షణాలు. దీపాలు, బాణసంచా కాల్చడంతో ఈ పండుగను జరుపుకుంటారు. మునుపటిలా సంప్రదాయబద్ధంగా ఈ పండుగను జరుపుకోవడమే కాకుండా, ఆధునిక ప్రపంచానికి అవసరమైన మార్పులతో జరుపుకుంటాం. మీరు ఇప్పటికే పండుగను జరుపుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకొని ఉంటారు, కదా? ఎలాంటి వంటకాలు తయారు చేసుకోవాలి? ఎవరిని ఆహ్వానించాలి? ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో మీకు పూర్తి జాబితా ఉండటం సాధారణం. కానీ ఈసారి హ్యాపీయెస్ట్ హెల్త్ మీకు సరళమైన మరియు సులభంగా ఉంచుకోగల ‘దీపావళి కిట్’ సమాచారాన్ని అందిస్తోంది.
చిన్న పిల్లలున్న ఇంట్లో దీపాలు వెలిగించడం వల్ల కాలిన గాయాలు, పిల్లలతో ఆడుకునే సమయంలో పడిపోవడం లేదా ఇతరత్రా గాయాలు, ఇంట్లో వృద్ధులు ఉన్నప్పుడు తీసుకోవాల్సిన వారు పడే ఇబ్బందులకు జాగ్రత్తలు, టపాసులు కాల్చేటప్పుడు సంభవించే కాలిన గాయాలు వంటి అనేక ప్రమాదాలు వంటివి సాధారణం. పండుగ యొక్క ఆనందకరమైన వేడుక సమయంలో మీకు అవసరమైన వస్తువులను కనుగొనడం అంత సులభమైన పని కాదు. మీ ఇంట్లో ఇప్పటికే ‘ఫస్ట్ ఎయిడ్ బాక్స్’ ఉండవచ్చు. కానీ దీపావళి కోసం ఈ ప్రత్యేక ప్రిపరేషన్ మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని కాపాడుతుంది.
‘హ్యాపీయెస్ట్ హెల్త్ దీపావళీ కిట్’ – మీరు సురక్షితంగా పండుగ జరుపుకునేందుకు సిద్దమవ్వండిలా:
1. కాలిన గాయాలకు చికిత్స:
దీపాలు వెలిగించేటప్పుడు, టపాసులు పేల్చేటప్పుడు గాయాలయ్యే అవకాశం ఉంది. చిన్నస్థాయిలో కాలిన గాయానికి ఎటువంటి చికిత్స అవసరం లేదని, సిల్వర్ సల్ఫాడియాజైన్ పూస్తే సరిపోతుందని డాక్టర్ సుధాకర్ కుమార్ (అసోసియేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా సభ్యుడు) చెప్పారు. కాలిన భాగాన్ని చల్లని లేదా కుళాయి నీటిలో 15 నుండి 20 నిమిషాలు ఉంచండి. ఆ సమయంలో సత్వరమే ఆందోళనను నివారించడానికి ఉత్తమ మార్గం ఇంట్లో ఒక బకెట్ నీటిని నిండుగా ఉంచుకోడం. అలాగే, ప్రాధమిక చికిత్స కోసం కలబంద జెల్ మరియు క్రిమినాశక క్రీమ్ను మీ కిట్‌లో ఉంచండి.
2. శబ్ద కాలుష్యం:
పట్టణ ప్రాంతాలతో సహా దేశంలోని అన్ని ప్రాంతాల్లో పండుగ సీజన్లో వెలువడే శబ్దం చిన్న పిల్లలు మరియు వృద్ధులకు హాని కలిగిస్తుంది. పండుగ సమయంలో మీరు ఈ శబ్దం నుండి తప్పించుకోలేకపోయినా, మీరు ముందు జాగ్రత్త చర్యగా చెవికి కాటన్ బాల్స్ ఉపయోగించవచ్చు మరియు ఇయర్‌ప్లగ్స్ ధరించవచ్చు.
3. టపాసులు పేల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
గ్లౌజులు: టపాసులు పేల్చే ముందు అవసరమైతే గ్లౌజులు ధరించండి.
కంటి రక్షణ: టపాసులు పేల్చేటప్పుడు రక్షణ కళ్లజోళ్లు ధరించండి. కంటి చుక్కలను ముందుగానే నిల్వ చేసుకోండి.
వీలైనంత వరకు కాటన్ దుస్తులు ధరించండి. మీ బట్టలు సౌకర్యవంతంగా ఉండనివ్వండి.
4. ముందుగా ఉంచుకోవాల్సిన ప్రథమ చికిత్స కిట్
ఈ పెట్టెలో బ్యాండ్ ఎయిడ్, గాజు, ప్లాస్టర్లు ఉండాలి. గాయం అయినప్పుడు తుడవడానికి అవసరమైన కాటన్, కత్తెర మరియు గాయం ఆయింట్‌మెంట్ సేకరించండి. అవసరమైన పెయిన్ కిల్లర్స్ తలనొప్పి, జ్వరం వచ్చినప్పుడు తీసుకునే మందులను మర్చిపోవద్దు. మీరు క్రమం తప్పకుండా ఉపయోగించే ఏవైనా మందులను అదనంగా సేకరించండి.
5. ఎమర్జెన్సీ నెంబర్లు:
ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ల జాబితా ఉంచుకోవాలి. మీ కుటుంబ వైద్యుడు, సమీపంలోని ఆసుపత్రుల సంఖ్య, అంబులెన్స్, అగ్నిమాపక దళం నంబర్లను ఆ జాబితాలో చేర్చండి.
పెద్ద పెద్ద బాణా సంచాలను కాల్చే సమయంలో చిన్నల వెన్నంటే పెద్దలు ఉండటం మంచిది. పెద్దల సమక్షంలోనే వారు వాటిని కాల్చేలా చూసుకోవాలి. వారికి కావాల్సిన సహాయం పెద్దలు అందించాలి. ఒంటరిగా వదిలి వేసే ప్రయత్నం చేయొద్దు.
టపాసులు కాల్చే సమయంలో పాదరక్షలు ధరించాలి. ఏమైన గాయాలు అయితే వెంటనే సమీపంలోని వైద్యుల వద్దకు వెళ్ళి చికిత్స పొందాలి. నాణ్యతకలిగిన, లైసెన్సు కలిగిన దుకాణాల్లో మాత్రమే దీపావళి మందుగుండు సామాగ్రిని కొనుగోలు చేయాలి.
కీలక అంశాలు:
దీపావళి సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మీరు మొదటి దశలో దీనిని నివారించడానికి ప్రయత్నాలు చేయవచ్చు.
టపాసులు పేల్చే ముందు రక్షణ అద్దాలు ధరిస్తే మంచిది. పిల్లలతో పాటు పెద్దలు పక్కనే ఉంటూ సూచనలు చేస్తూండటం మంచిది.
ప్రాధమిక చికిత్సకు అవసరమైన బ్యాండ్-ఎయిడ్, గాజు మరియు ప్లాస్టర్లు, గాయపడినప్పుడు తుడవడానికి అవసరమైన పత్తి, కత్తెర మరియు గాయం పొడి లేదా ఆయింట్‌మెంట్ సేకరించండి.
ఏదైనా అత్యవసర పరిస్థితికి అవసరమైన ఫోన్ నంబర్లను ముందుగానే రాసుకుని జాబితా తయారు చేసి ఒక దగ్గర ఉంచుకోవాలి.