728X90

0

0

0

అంశాలకు వెళ్లండి

winter skincare: చలికాలంలో చర్మం పొడిబారకుండా చూసుకోవడం ఎలా?
2

winter skincare: చలికాలంలో చర్మం పొడిబారకుండా చూసుకోవడం ఎలా?

చలి పెరుగుతున్న తరుణంలో పొడి బారి, గరుకుబారే తత్వాన్ని నిరోధించడానికి నిపుణులు కొన్ని విధానాల్ని సూచిస్తున్నారు.
చలికాలంలో చర్మసంరక్షణ

చలి పెరుగుతున్న తరుణంలో పొడిబారి, గరుకుబారే తత్వాన్ని నిరోధించడానికి నిపుణులు కొన్ని విధానాల్ని సూచిస్తున్నారు.

శీతాకాలం చలి మొదలవ్వగానే మనం ఉన్ని దుస్తులు, మప్లర్లు బయటికి తీస్తాం. చలి గాలి నుండి రక్షణ కల్పించుకుని  చలి వాతావరణం కారణంగా చర్మం పొడిబారటం, తేమని కోల్పవడం నుంచి కాపాడుకుంటాం. పొడిబారిన చర్మం పొట్టుఊడిపోవడానికి దారి తీస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే చర్మం తేమని నిలుపుకునే తత్వాన్ని, దానికదే మరమ్మత్తులు చేసుకునే సామర్థ్యాన్ని కోల్పోతుంది. పొడిగా, గరుకుగా, పొట్టు లేస్తున్నట్టు ఉండడం పొడి చర్మానికి సంకేతాలు. ఇవి చర్మంలో ఉండే సెరామిడ్స్(చర్మంలో ఉండే ఈ కొవ్వులు తేమను నిలిపి ఉంచుతాయి 

 చర్మాన్ని తేమగా ఉంచుకోండి 

 ఢిల్లీకి చెందిన సౌందర్య నిపుణురాలు జెన్నిఫర్ నోస్కోర్ ఏం చెబుతున్నారంటే ‘‘చలికాలంలో పొడిగా వీచే చల్లని గాలి చర్మంలోని తేమను తగ్గిస్తుంది. దాంతో పొడిబారడం, దురదలతో చర్మం ఇబ్బంది పడుతుంది.”   

చర్మాన్ని తేమగా, తేమని పీల్చుకునే విధంగా ఉంచడానికి ఆమె ఇచ్చే సలహాలు: 

 సున్నితమైన హైడ్రేటింగ్ క్లెన్సర్ వాడండి: హైడ్రేటింగ్ క్లెన్సర్‌ని ఉపయోగించడం వల్ల చర్మంలోని తేమని నిలిపి ఉంచుకోడానికి సహాయపడుతుంది. దానిలోని చర్మం నుంచి సహజమైన తేమ వెళ్లిపోకుండా చూస్తుంది. అలాగే చర్మం పొడిబారకుండా, బిగుతుగా మారకుండానే మృత చర్మాన్ని కూడా తొలగిస్తుంది. దీంతో శుభ్రం చేసుకోవడం వల్ల రక్త ప్రసరణ కూడా పెరిగి, విషపదార్థాలు బయటికి వెళ్తాయి. కనీసం రోజుకి రెండుసార్లు చర్మాన్ని దీంతో శుభ్రం చేసుకోవాలి.   

 సన్ స్క్రీన్ వాడడం తప్పనిసరి: అన్ని సీజన్లలో మన చర్మానికి సన్ స్క్రీన్ అవసరం. ఏడాదిలో ఏ కాలంలో అయినా UV కిరణాల వల్ల చర్మం దెబ్బతింటుంది. ఖనిజాల ఆధారిత SPFలు ఎండ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి.  

హ్యాలురోనిక్ యాసిడ్ ఆధారిత ఉత్పత్తుల్ని వాడండి: హ్యాలురోనిక్ యాసిడ్లో నీటిని నిలుపుకునే సామర్థ్యం ఎక్కువ. దాని ప్రాథమిక పాత్ర తేమతో, సాగే గుణంతో కలిగి ఉండడం. 

 బాడీ బటర్ ఉపయోగించండి: షియా, కోకోవా లాంటి పదార్థాలతో తయారైన బాడీ బటర్ చర్మాన్ని తేమతో ఉండేలా చేస్తుంది. వాటి చిక్కనైన క్రీమ్ చర్మాన్ని మృదువుగా చేస్తుంది. శీతాకాలంలో పొడి చర్మానికి అవి ఉత్తమం.  

పెదాలు, కళ్ల కింద చర్మం సంరక్షణ: పొడి బారిన పెదాలు: చలికాలంలో గమనించి మొదటి సంకేతాల్లో పొడిబారిన పెదాలు ఒకటి. చర్మంలో తేమ తగ్గిందని, తేమని తక్కువగా పీల్చుకుంటోందని సూచిస్తుంది. మాయిశ్చరైజింగ్ లిప్ బామ్స్ పెదాలను సంరక్షిస్తాయి. కంటి కింద చర్మం చాలా సున్నితమైంది, తేమని అందించే ఐ క్రీమ్స్తో దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. పగలు, రాత్రి ఆ క్రీంని ఉపయోగించాలి.  

 చెయ్యాల్సినవి, చెయ్యకూడనివి:  

ఓహియోలోని డేటన్లో జనరల్ డెర్మటాలజిస్ట్, ఎండీగా పని చేస్తున్న డాక్టర్ కింబర్లీ షావో ఇలా వివరించారు ‘‘శీతకాలంలో రెటినాయిడ్స్ తరచుగా వినియోగించడాన్ని తగ్గించాలని మీరు అనుకుంటూ ఉండొచ్చు. మాయిశ్చరైజర్ శాండ్‌విచ్ విధానం ఉపయోగించమని నేను సలహా ఇస్తాను(చర్మంలో తేమని నిలిపి ఉంచేలా ఉత్పత్తులను పొరలుగా వెయ్యడం). రెటినాయిడ్స్ విటమిన్ ఆధారిత క్రీములు. చర్మం ఉపరితలంలోని కణాలు, కొలాజెన్ పెరుగుదలను అవి ప్రోత్సహిస్తాయి. డాక్టర్ షావో సలహా ఏంటంటే, పలచగా ఉండే లోషన్ ఆధారిత మాయిశ్చరైజర్లకు బదులు చిక్కనైన క్రీమ్లు లేదా జిడ్డుగా ఉండే క్రీమ్‌లు ఉపయోగిస్తే అవి చర్మం మీద భౌతికమైన అడ్డుగోడగా పని చేస్తూ తేమ కోల్పోకుండా సహాయపడతాయి.  

 ‘‘ఆల్కహాల్ ఆధారిత టోనర్లను మీ CTM(క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజర్) దినచర్య నుంచి తొలగించండి. అవి చర్మంలో తేమని తగ్గిస్తాయి’’ అని నోస్కర్ అన్నారు. చలి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసించే వారు రూమ్ హీటర్ని ఉపయోగించే సమయంలో హ్యుమిడిఫయర్ ఉపయోగించాలని షావో సూచించారు. హీటర్ ఉత్పత్తి చేసేది వేడి మాత్రమే కాదు, అది చాలా పొడిగాలిని ఉత్పత్తి చేస్తుంది. ‘‘అందుకే రాత్రిపూట హ్యుమిడిఫయర్ వాడాలి. అలాగే వాటిని తరచుగా శుభ్రం చేసుకోవాలి’’ అని ఆమె చెప్పారు. 

  ముఖ్యంగా చలికాలంలో మనం తక్కువ నీటిని తీసుకునేటప్పుడు హైడ్రేటెడ్‌గా ఉండటం ముఖ్యం అని నోస్కోర్ అంగీకరించారు.  వాతావరణం చల్లగా ఉన్నా సరే వేడి నీటి స్నానాలు ఎక్కువ సేపు చెయ్యకుండా ఉండడం మంచిది. ఎందుకంటే దాని వల్ల చర్మం పొడిబారుతుంది. ‘‘ముఖ్యంగా బాగా చలిగా ఉన్నప్పుడు వేడినీటి స్నానం అంత సౌకర్యాన్ని మరేదీ ఇవ్వలేదు. వేడి నీటి స్నానం వల్ల చర్మంలోని సహజమైన జిడ్డు పోయి పొడిబారడానికి దారి తీస్తుంది. కాబట్టి వేడి నీటి స్నానాలు చెయ్యకూడదు’’ అని నోస్కోర్ అన్నారు.  

 ‘‘మీరు తీసుకునే ఆహారం మీద దృష్టిపెట్టండి. పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం’’ అని తెలిపారు. పొడిబారిన పెదాలకు కోసం షావో ఏం చెప్పారంటే, సాదా పెట్రోలియం జెల్లీ బాగా పని చేస్తుందని, ముఖ్యంగా నిద్రపోయే ముందు మందపాటి పొరలా పూసుకుంటే మంచిది అన్నారు. పెదాలు పొడిబారి పగలకుండా ఉండాలంటే మ్యాట్ లిప్ స్టిక్, క్రీమ్ లిప్ స్టిక్, గ్లోస్ వాడొద్దని నోస్కోర్ సూచించారు.  

 కింబర్లీ షావో అందించిన కొన్ని టిప్స్: 

 మీ బ్యాగులో, కారులో, సింక్ పక్కన ట్రావెల్ సైజ్ కంటెయినర్లు ఉంచుకోండి. వాటిని తరచుగా వాడండి. 

  • గ్లిజరిన్, సిరామైడ్స్, డైమెతికోన్ లాంటి పదార్థాలున్న ఉత్పత్తులు చర్మం తేమ పీల్చుకోడానికి, చర్మం మీద పొరలాగా పని చెయ్యడంలో సహాయపడతాయి.  
  • క్లెన్సింగ్ ఉత్పత్తులను వాడేటప్పుడు, గిన్నెలు కడిగేటప్పుడు గ్లోవ్స్ ధరించండి. 
  • మీ ముఖానికి తాకే స్కార్ఫ్‌ల లాంటి దుస్తుల్ని ఉతకడం మర్చిపోకండి.  
  • మృత చర్మం వల్ల ప్రయోజనం కొంత ఉంటుంది కాబట్టి అతిగా దాన్ని వదిలించుకోవద్దు.  

మీ అనుభవాన్ని లేదా వ్యాఖ్యలను పంచుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

3 × four =

ట్రెండింగ్

వ్యాసాలు

వ్యాసం
బెంగళూరుకు చెందిన పి.పార్వతి 20 ఏళ్లప్పుడు శ్వాస తీసుకోవడంలో చిన్నప్పుడు ఇబ్బంది పడేది. పరీక్షలు చేయించగా ఆమెకు ఆస్తమా ఉన్నట్లు నిర్దారించబడింది. ఇప్పుడు అది జరిగి 32 సంవత్సరాలు గడిచింది. 54 సంవత్సరాల వయస్సులో, పార్వతి తన కుమార్తె మరియు తనకంటే సగం వయస్సు కలిగిన స్నేహితులతో ట్రెక్‌లకు చాలా ఈజీగా వెళ్లగలుతుతోంది.
వ్యాసం
షోల్డర్ ఇంపింగ్‌మెంట్ సిండ్రోమ్ రివర్సిబుల్ అయినందున, నొప్పి యొక్క ప్రారంభ సంకేతాలను అనుభవించిన వెంటనే మీరు వైద్యుడిని సంప్రదించాలనిి సలహా ఇస్తారు.
వ్యాసం
ఎముక పునర్నిర్మాణాన్ని నిరోధించడం నుండి ఎముకల విరుగుట మరియు బోలు వ్యాధి ప్రమాదాన్ని పెంచడం వరకు, ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం ఎముకలకు శాశ్వత నష్టం కలిగిస్తుంది

0

0

0

Opt-in To Our Daily Newsletter

* Please check your Spam folder for the Opt-in confirmation mail

Opt-in To Our
Daily Newsletter

We use cookies to customize your user experience, view our policy here

మీ అభిప్రాయం విజయవంతంగా సమర్పించబడింది.

హ్యాపీయెస్ట్ హెల్త్ టీమ్ వీలైనంత త్వరగా మిమ్మల్ని సంప్రదిస్తుంది