728X90

0

0

0

ఈ వ్యాసంలో

నేల మీద పడుకోవడం మంచిదా? కాదా?
21

నేల మీద పడుకోవడం మంచిదా? కాదా?

ఎటువంటి అనారోగ్య సమస్యలు లేనివారు నేలపై నిద్రించడానికి ప్రయత్నించవచ్చని నిపుణులు అంటున్నారు. అయితే పెలుసు చర్మం ఉండే వ్యక్తులు, మారుతున్న ఉష్ణోగ్రతలకు అనుగుణంగా సున్నితంగా ఉండే పిల్లలు మరియు వృద్ధులు దీనిని నివారించాలి.

నేలపై పడుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్రక్రియ రక్తప్రసరణతో కూడా ముడిపడి ఉంది. అయితే మారుతున్న జీవనశైలి, అవసరాలకు అనుగుణంగా తర్వాతి కాలంలో బెడ్లు, పరుపులు అందుబాటులోకి రావడంతో చాలా మంది నిద్ర అలవాట్లు మారిపోయాయి. అయినప్పటికీ ఇప్పటికి కూడా అనేక మంది నేలపై పడుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నమ్ముతున్నారు.

కొంతమంది వృద్ధులు నేలపై పడుకోవడం వల్ల ఎటువంటి నొప్పులు రాకుండా ఉండొచ్చని నమ్ముతారు. అయితే, ఇలా చేయడం వల్ల వెన్నెముక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయం గురించి బెంగళూరులోని డీహెచ్ఈఈ ఆస్పత్రి సీఈఓ మరియు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ చంద్రశేఖర్ చిక్కమునియప్ప వివరిస్తూ.. అప్పుడప్పుడు నేలపై పడుకోవడం అలవాటు ఉన్నవారిలో వెన్నుపై ఒత్తిడిని తగ్గించడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే 40 నుంచి 50 ఏళ్లలోపు వారికి ఇది అంత సౌకర్యవంతంగా ఉండకపోవచ్చు. ఒక వేళ ప్రయత్నించాలని చూస్తే మాత్రం మీకు ప్రస్తుతం ఉన్న నొప్పులను భరించే బదులు, కొత్త వాటిని కూడా భరించాల్సి వస్తుంది.

నేలపై పడుకోవడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయా?

బెంగళూరుకు చెందన నరేష్ బాబు (38) అనే వ్యాపారవేత్త హ్యాపియెస్ట్ హెల్త్‌తో మాట్లాడుతూ.. ”నా వ‌ృత్తిలో భాగంగా నేను ఒక్కోసారి 16 గంటలకు పైగా పనిచేయాల్సిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే నా పని పూర్తి చేసుకొని ఇంటికి వచ్చాక తరచుగా వెన్ను నొప్పి వస్తుంద. అయితే నేను నేలమీద సన్నని చాప వేసుకుని దిండు లేకుండా పడుకున్నాను. ఇది నాకు కొంత ప్రయోజనకరంగా అనిపించింది. అయితే నాకు క్రమం తప్పకుండా నేలపై పడుకొనే అలవాటు అయితే లేదు” అని చెప్పారు.

డాక్టర్ చిక్కమునియప్ప ఇలా పంచుకున్నారు, “మీరు నేలపై పడుకునే చాలా మందిని చూసి ఉండవచ్చు మరియు వారు ఎంత సుఖంగా ఉన్నారో తెలుసుకుని మీరు ఆశ్చర్యపోవచ్చు. ఎవరైనా చాలా సేపు నేలపై నిద్రిస్తున్నట్లయితే, వారు దానిని కొనసాగించవచ్చు. వారి శరీరం ఇప్పటికే స్థానానికి సర్దుబాటు చేయబడింది. అయినప్పటికీ, తీవ్రమైన వెన్నునొప్పి లేదా మెడ నొప్పితో బాధపడేవారికి ఇది మంచిది కాదు, ఎందుకంటే ఇది తీవ్రమవుతుంది. అంతేకాకుండా, నేలపై పడుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను హైలైట్ చేసే సమాచారం అందుబాటులో ఉండవచ్చని, దీనికి సంబంధించి ఎటువంటి ఆధారాలు అందుబాటులో లేవని ఆయన చెప్పారు.

ఇదే విషయాన్ని డాక్టర్ చిక్కమునియప్ప వివరిస్తూ.. ”మీరు నేలపై పడుకునే చాలా మందిని చూసి ఉండొచ్చు. వారు ఎంత సౌకర్యవంతంగా ఉన్నారో తెలుసుకుని మీరు ఆశ్చర్యపోయి ఉండొచ్చు కూడా. ఎందుకంటే వారు చాలాసేపు నేలపై నిద్రిస్తున్నట్లయితే వారి శరీరం అందుకు అనుగుణంగా సర్దుబాటు చేయబడి ఉంటుంది. అయితే ఇది ఇప్పటికే తీవ్రమైన వెన్నునొప్పి లేదా మెడనొప్పితో బాధపడేవారికి అంత మంచిది కాదు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఇది మరింత తీవ్రమవుతుంది. ఏదిఏమైనా నేలపై పడుకోవడం వల్ల ప్రయోజనాలు ఉన్నా అందుకు తగిన ఆధారాలు అయితే అందుబాటులో లేవు” అని ఆయన చెప్పారు.

నేలపై పడుకోవడం పిల్లలు, వ‌ృద్ధులకు మంచిది కాదు

ఎటువంటి అనారోగ్య సమస్యలు లేనివారు నేలపై నిద్రించడానికి ప్రయత్నించవచ్చని నిపుణులు అంటున్నారు. అయితే పెలుసు చర్మం ఉండే వ్యక్తులు, మారుతున్న ఉష్ణోగ్రతలకు అనుగుణంగా సున్నితంగా ఉండే పిల్లలు మరియు వృద్ధులు దీనిని నివారించాలి. ఉదాహరణకు.. రుమటాయిడ్ ఆర్థరైటిస్ (కీళ్లను ప్రభావితం చేసే దీర్ఘకాలిక వ్యాధి)తో బాధపడుతున్న వారి ఆరోగ్యం వారు నేలపై నిద్రించడం వల్ల మరింత క్షీణించవచ్చు.

నేలపై పడుకోవడం గురించి సైన్స్ ఏమి చెబుతుంది?

చెన్నైలోని ఫోర్టిస్ మలార్‌లోని ఎముకలు మరియు కీళ్ల నిపుణుడు డాక్టర్ శరత్ కుమార్.. నేలపై నిద్రించడం చాలా వివాదాస్పదమని చెప్పారు. దాదాపు 70 నుంచి 80 శాతం మంది ఆర్థోపెడిక్ సర్జన్లు నేలపై పడుకునే ఆలోచనను సమర్థించకపోవచ్చు. ‘వ్యక్తిగత ప్రాధాన్యతలతోపాటు, నేలపై పడుకునే వారు మెరుగైన ఆరోగ్యాన్ని కలిగి ఉంటారనే అపోహలను ప్రజలు విశ్వసిస్తారని’ ఆయన పేర్కొన్నారు.

అయితే, ప్రస్తుత జీవనశైలి మరియు ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని డాక్టర్ కుమార్ ఇలా పంచుకున్నారు. ఉదాహరణకు.. నిర్మాణ రంగంలో పనిచేసే వ్యక్తులు మంచం మీద కాకుండా నేలపై పడుకోవడం సుఖంగా ఉండొచ్చు. కాబట్టి, కొన్ని సందర్భాల్లో.. నేలపై పడుకోవడం అనేది వెన్నునొప్పి నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.

గుర్తుంచుకోవాల్సిన అంశాలు

– నేలపై పడుకోవడం అనేది కొత్తేమీ కాదు. అయినప్పటికీ, ఇది ప్రయోజనకరంగా ఉండకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బదులుగా, ఇది మీ వెన్నెముక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.

– కొన్నిసార్లు, నేలపై పడుకోవడం అనేది వెన్నునొప్పి నుండి ఉపశమనం పొందటానికి సహాయపడుతుంది, అయితే ఇది అలవాటు పడినవారికి మాత్రమే.

– నేలపై పడుకోవడం అనేది పిల్లలు మరియు వృద్ధులకు సరైనది కాదు. ఏదేమైనా, ఎటువంటి అనారోగ్య సమస్యలు లేనివారు నేలపై పడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

మీ అనుభవాన్ని లేదా వ్యాఖ్యలను పంచుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ట్రెండింగ్

వ్యాసాలు

0

0

0

Opt-in To Our Daily Newsletter

* Please check your Spam folder for the Opt-in confirmation mail

Opt-in To Our
Daily Newsletter

We use cookies to customize your user experience, view our policy here

మీ అభిప్రాయం విజయవంతంగా సమర్పించబడింది.

హ్యాపీయెస్ట్ హెల్త్ టీమ్ వీలైనంత త్వరగా మిమ్మల్ని సంప్రదిస్తుంది