ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక

దాదాపు 103 ఏళ్ల డేటా ప్రకారం ఏప్రిల్ నెలలో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరుకోవడం ఇదే తొలిసారి. రానున్న ఐదు రోజుల్లో ఏపీ, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వాతావరణం మరింత వేడెక్కనుందని ఐఎండీ హెచ్చరించింది.

సాధ్యమైనంతవరకూ నీరు, వాటర్ కంటెంట్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి.

ఇంట్లోనే ఉండి కిటికీలు, తలుపులు మూసి ఉంచుకోవాలి. 

ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఇంట్లోనే ఉండాలి. అత్యవసరమైతే జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.

వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS, లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలి.

ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలి.  

వేడిని అధిగమించడానికి 6 సాంప్రదాయ డ్రింక్స్

Next>>