728X90

0

0

0

ఈ వ్యాసంలో

పులియబెట్టిన అన్నం ఐబీఎస్ రోగులకు వరం
48

పులియబెట్టిన అన్నం ఐబీఎస్ రోగులకు వరం

ప్రతిరోజూ ఉదయాన్నే పులియబెట్టిన అన్నం తినడం వల్ల ఉమాధేశ్వరి సమస్య తీరిపోయి రెండు నెలల్లోనే మార్పు కనిపించింది. గత ఏడేళ్లుగా ఏం తినాలి, ఏమి తినకూడదు అనే దాని గురించి నేను నిరంతరం ఆందోళన చెందాల్సి వచ్చింది.

చెన్నైకి చెందిన 48 ఏళ్ల ఉమాధేశ్వరికి ఇంట్లో సాధారణంగా పులియబెట్టిన అన్నం తీసుకోవడం ద్వారా ఆమె తరచూ వాష్‌రూమ్‌కు వెళ్లే సమస్య నుంచి ఉపశమనం కలిగింది. ఆమె గత ఏడేళ్లుగా ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్(ఐబీఎస్)తో బాధపడుతుండడంతో ప్రశాంతంగా భోజనం చేయడం కూడా అసాధ్యంగా మారింది.

ఐబీఎస్ అనేది ఆహారం తీసుకున్న వెంటనే ప్రేగును చికాకు పెట్టే పరిస్థితి. ఈ పరిస్థితి అనేది కడుపు నొప్పి, మారుతున్న ప్రేగు కదలికలు సహా వివిధ లక్షణాల సమూహాన్ని సూచిస్తుంది. వీటిలో విరేచనాలు, మలబద్ధకం లేదా రెండూ ఉంటాయి.

ఉమాధేశ్వరి హ్యాపియెస్ట్ హెల్త్‌తో మాట్లాడుతూ.. డయేరియా కారణంగా తరచూ వాష్ రూమ్‌కు వెళ్లడం వల్ల తనకు ఎప్పుడూ నీరసంగా అనిపించేదని చెప్పారు. ఆహారాన్ని ఆస్వాదించడం కూడా అసాధ్యంగా ఉండేది. ఈ క్రమంలోనే వేర్వేరు ఆహారాలను ప్రయత్నించాను. అనేక రకాల మందులు తీసుకున్నాను. అయితే ఈ పులియబెట్టిన అన్నం నాకు తాత్కాలిక ఉపశమనం ఇచ్చింది, కానీ అంతకు మించి ఏమీ లేదు’ అని ఆమె చెప్పారు.

పులియబెట్టిన  అన్నం

ప్రతిరోజూ ఉదయాన్నే పులియబెట్టిన అన్నం తినడం వల్ల ఉమాధేశ్వరి సమస్య తీరిపోయి రెండు నెలల్లోనే మార్పు కనిపించింది. ”గత ఏడేళ్లుగా ఏం తినాలి, ఏమి తినకూడదు అనే దాని గురించి నేను నిరంతరం ఆందోళన చెందాల్సి వచ్చింది. ఇప్పుడు ఆరు నెలలు గడిచిపోయాయి. విరేచనాలు పూర్తిగా ఆగిపోయాయి. ఇప్పుడు నేను మునుపటి కంటే మరింత శక్తివంతంగా ఉన్నాను. అయితే ఇప్పుడు ఆ ఆహారపు అలవాట్లు కొనసాగించాల్సిన అవసరం లేనప్పటికీ, నేను ఇప్పటికీ వాటినే ఇష్టపడతాను” అని ఆమె చెప్పింది.

చెన్నైలోని గవర్నమెంట్ స్టాన్లీ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలోని సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం ప్రొఫెసర్ మరియు హెడ్ డాక్టర్ ఎస్ జశ్వంత్ మాట్లాడుతూ.. సాంప్రదాయంగా పులియబెట్టిన బియ్యం అనేక సంవత్సరాలు మా ఆస్పత్రి డైట్ ఫుడ్‌లో భాగమైందని, అనేక వ్యాధుల చికిత్సకు ఉపయోగించబడుతోందని అన్నారు. క్రోన్స్ వ్యాధి మరియు ప్రేగు వ్యాధుల చికిత్సలో ప్రోబయోటిక్స్ యొక్క ప్రభావాలను అధ్యయనం చేయడానికి తమిళనాడు ఆరోగ్యశాఖ వారి ఆస్పత్రిలో నియమించిన పరిశోధన ప్రాజెక్ట్‌లో ఇతను కూడా ఒక భాగం.

జోహో సీఈఓ అయిన శ్రీధర్ వెంబు ఇటీవల మాట్లాడుతూ.. గత సంవత్సరం అల్పాహారంగా పులియబెట్టిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా తన ఐబీఎస్‌కి సహాయపడిందని చెప్పారు. పులియబెట్టిన అన్నం తీసుకోవడం వల్ల ఐబీఎస్ నుంచి కోలుకోవడమే కాకుండా.. అలర్జీలు కూడా తగ్గాయని తన ట్విటర్ ఖాతా ద్వారా తెలియజేశారు.

”మన ప్రేగులలో మిలియన్ల కొద్దీ మంచి బ్యాక్టీరియా ఉంది. ఇది జీర్ణక్రియలో మరియు రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ప్రజలు యాంటీబయాటిక్స్, కెమికల్స్, ఫుడ్ కలరింగ్ ఏజెంట్లు మొదలైన వాటిని తీసుకున్నప్పుడు, వారి పేగు మైక్రోబయోటా చెదిరిపోతుంది. ఇది చివరికి ప్రేగు సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది” అని డాక్టర్ జశ్వంత్ చెప్పారు.

పులియబెట్టిన అన్నం ఎలా సహాయపడుతుంది?

డాక్టర్ జశ్వంత్ ఇలా అంటారు, ”మేము అన్నాన్ని పులియబెట్టినపుడు, అది మన ప్రేగులకు సహాయపడే మంచి బ్యాక్టీరియా మరియు ప్రోబయోటిక్‌లను పుష్కలంగా కలిగి ఉండి.. పర్యావరణం నుంచి అవసరమైన మైక్రోబయోటాను తీసుకుంటుంది. ఐబీఎస్ లేదా వాపు ఉన్న వ్యక్తులకు, పులియబెట్టిన బియ్యం.. కోల్పయిన మంచి బ్యాక్టీరియాను భర్తీ చేయడంలో సహాయపడతాయి. తద్వారా అసమతుల్యతను పునరుద్ధరిస్తుంది.

ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా ఐబీఎస్ నుంచి పూర్తిగా కోలుకోవడానికి సాంప్రదాయ చికిత్స చాలా సహాయపడిందని ఆయన చెప్పారు. ”మేము దీనిని ఐబీఎస్, ఐబీడీ, క్రోన్స్ వ్యాధి, బుుతుచక్రం నియంత్రణ, గర్భధారణ సమయంలో.. ఇలా మరెన్నో అనేక పరిస్థితుల్లో చికిత్సలకు ఉపయోగిస్తాము” అని ఆయన చెప్పారు.

పులియబెట్టిన ఆహారంలో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఐబీఎస్ లక్షణాలను నియంత్రించడంలో సహాయపడే పేగులోని మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. దీనిని తీసుకోవడం ద్వారా మంచి బ్యాక్టీరియా పెరుగుతుందని మంగళూరులోని కెఎంసీ ఆస్పత్రి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ అనురాగ్ శెట్టి చెప్పారు. అయితే, కిణ్వ ప్రక్రియ ఖర్చుతో కూడుకున్నది. కిణ్వ ప్రక్రియ అపరిశుభ్రంగా జరిగినపుడు మంచి బ్యాక్టీరియాతో చెడు బ్యాక్టీరియా కూడా పెరుగుతుందని ఆయన చెప్పారు.

”పెరుగు మరియు మజ్జిగ వంటి ప్రోబయోటిక్స్ తీసువాలని ప్రజలకు సూచించాము. ఇవి పుల్లగా ఉన్నప్పుడు తీసుకుంటే తప్ప మిగిలిన సందర్భాల్లో ఎటువంటి దుష్ప్రభావలు ఉండవు. ఇది కొన్ని సందర్భాల్లో గ్యాస్ట్రిక్ సమస్యలకు దారి తీస్తుంది. కానీ సాంప్రదాయంగా పులియబెట్టిన బియ్యంతో, ప్రజలకు ఇన్ఫెక్షన్ మరియు ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంది. ఇది పరిశుభ్రత ప్రమాణాలను పాటించకపోతే వారి పరిస్థితి మరింత దిగజారిపోయే అవకాశం ఉంది” అని డాక్టర్ శెట్టి చెప్పారు.

పులియబెట్టడం ఎలా?

వండిన  అన్నాన్ని నీటిలో నానబెట్టి మట్టికుండలో రాత్రంతా వేసవిలో అయితే ఎనిమిది గంటలు, శీతాకాలంలో అయితే 12 గంటలు ఉంచాలని డాక్టర్ జశ్వంత్ చెప్పారు. ”ప్రజలు దీనిని మరుసటి రోజు ఉదయం.. అలాగే తినడం కానీ లేదా వేరే సైడ్ డిష్‌తో కలిపి అయిన తీసుకోవచ్చు. ఇందులో మనం నీటికి బదులుగా మజ్జిగ లేదా పెరుగు కూడా వాడుకోవచ్చు. ఈ రకమైన ఆహారాన్ని మనం అల్పాహారంగా తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి” అని ఆయన పేర్కొన్నారు.

  • ఏ పాత్రలోనైనా కిణ్వ ప్రక్రియ చేయవచ్చని ఉమాధేశ్వరి తెలిపారు. అయితే, అది మట్టి కుండలో
    చేసినప్పుడు మరితం ప్రభావవంతంగా ఉంటుందని ఆమె తన అనుభవాన్ని చెప్పారు.
  • ఈ రకమైన ఆహారాన్ని ప్రతిరోజూ తీసుకుంటే, ఐబీఎస్ నుంచి పూర్తిగా కోలుకోవడానికి మూడు నెలల నుంచి రెండు సంవత్సరాల వరకూ పడుతుందని డాక్టర్ జశ్వంత్ తెలిపారు.

గుర్తుంచుకోవాల్సిన అంశాలు

-పులియబెట్టిన ఆహారం తీసుకోవడం ద్వారా ఐబీఎస్ ఉన్నవారిలో మైక్రోబయోటా అసమతుల్యతను పునరుద్ధరించడానికి సహాయపడుతుంది.
-పులియ బెట్టిన అన్నంలో ఉండే మంచి బ్యాక్టీరియా కడుపుని శాంతపరచడంలో సహాయపడుతుంది. అయితే ఉదయాన్నే తీసుకోవడం వల్ల మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.
-మట్టి కుండలో ఆహారాన్ని పులియబెట్టడం వలన ఆహారం యొక్క ఆమ్ల విలువను తటస్థీకరిస్తుంది. దానికి సహజ ఖనిజాలను జత చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

సంబంధిత ట్యాగ్‌లు
సంబంధిత పోస్టులు

మీ అనుభవాన్ని లేదా వ్యాఖ్యలను పంచుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ట్రెండింగ్

వ్యాసాలు

0

0

0

Opt-in To Our Daily Newsletter

* Please check your Spam folder for the Opt-in confirmation mail

Opt-in To Our
Daily Newsletter

We use cookies to customize your user experience, view our policy here

మీ అభిప్రాయం విజయవంతంగా సమర్పించబడింది.

హ్యాపీయెస్ట్ హెల్త్ టీమ్ వీలైనంత త్వరగా మిమ్మల్ని సంప్రదిస్తుంది