728X90

0

0

0

0

0

0

0

0

0

ఈ వ్యాసంలో

pranayama: ప్రాణాయామతో శ్వాస సులభంగా
6772

pranayama: ప్రాణాయామతో శ్వాస సులభంగా

బెంగళూరుకు చెందిన పి.పార్వతి 20 ఏళ్లప్పుడు శ్వాస తీసుకోవడంలో చిన్నప్పుడు ఇబ్బంది పడేది. పరీక్షలు చేయించగా ఆమెకు ఆస్తమా ఉన్నట్లు నిర్దారించబడింది. ఇప్పుడు అది జరిగి 32 సంవత్సరాలు గడిచింది. 54 సంవత్సరాల వయస్సులో, పార్వతి తన కుమార్తె మరియు తనకంటే సగం వయస్సు కలిగిన స్నేహితులతో ట్రెక్‌లకు చాలా ఈజీగా వెళ్లగలుతుతోంది.

ప్రాణాయామం అనేది మనస్సుతో శరీరాన్ని సమన్వయపరిచే ఒక శ్వాస విధానం. ప్రాణ అంటే ప్రాణం, ప్రాణశక్తి(లేదా గాలి); మరియు ఆయమ అంటే నిగ్రహం లేదా నియంత్రణ.

సరిగ్గా శ్వాస తీసుకునే మరియు వదిలే పద్ధతుల గురించి తెలుసుకోండి

బెంగళూరుకు చెందిన  పి.పార్వతి 20 ఏళ్లప్పుడు శ్వాస తీసుకోవడంలో చిన్నప్పుడు ఇబ్బంది పడేది. పరీక్షలు చేయించగా ఆమెకు ఆస్తమా ఉన్నట్లు నిర్దారించబడింది. ఇప్పుడు అది జరిగి 32 సంవత్సరాలు గడిచింది. 54 సంవత్సరాల వయస్సులో, పార్వతి తన కుమార్తె మరియు తనకంటే సగం వయస్సు కలిగిన స్నేహితులతో ట్రెక్‌లకు చాలా ఈజీగా వెళ్లగలుతుతోంది.

అదే యవ్వనంలోనేే ఒక ఫ్రెండ్ సూచన మేరకు కొన్ని నియమాలు పాటించినందు వల్ల, పార్వతి గురక మరియు శ్వాస సరిగా ఆడకపోవడం వంటి సమస్యలు తగ్గాయి. అవి ఇప్పుడు గతం. “ప్రాణాయామం గురించి తెలుసుకుని, దానిని ప్రాక్టీస్ చేయడం ప్రారంభించినప్పటి నుండి నా జీవితమే మారిపోయింది” అని ఆమె చెప్పింది. గత 32 సంవత్సరాలలో, “ఇది నా శ్వాసకోశ వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా, నా మొత్తం శరీరాన్ని తేలికగా మరియు ఆరోగ్యంగా ఉంచింది.”

యుక్తవయసులో ఒక మిత్రుని సూచనను పాటించడం వల్ల పార్వతికి శ్వాస ఆడకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం గతం. “ప్రాణాయామం గురించి తెలుసుకుని, దానిని ప్రాక్టీస్ చేయడం ప్రారంభించినప్పటి నుండి నా జీవితమే మారిపోయింది” అని ఆమె చెప్పింది. గత 32 సంవత్సరాలలో, “ఇది నా శ్వాసకోశ వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా, నా మొత్తం శరీరాన్ని తేలికగా మరియు ఆరోగ్యంగా ఉంచింది.”

“నా రోజు సూర్యనమస్కారములు (సూర్య నమస్కార భంగిమలు) మరియు కపాలభాతి* మరియు అనులోమ -విలోమ ప్రాణాయామం* వంటి శ్వాస వ్యాయామాలతో ప్రారంభమవుతుంది. నేను శ్వాస వ్యాయామాలను ప్రాక్టీస్ చేయడం ప్రారంభించిన తర్వాత నుంచి నేను సరిగ్గా శ్వాస తీసుకోగలిగాను, ”అని ఆమె చెప్పింది.

ప్రాణాయామం అంటే ఏమిటి?

ఢిల్లీకి చెందిన అంతర్జాతీయ యోగా శిక్షకురాలు మరియు సంపూర్ణ ఆరోగ్యం మరియు సంక్షేమం కోసం డిజిటల్ ప్లాట్‌ఫారమ్ అయిన యోయోగిక్ వ్యవస్థాపకురాలు షైనీ నారంగ్ ప్రాణాయామం గురించి వివరిస్తున్నారు.

ఏకాగ్రత లేదా యోగ శ్వాస అని ప్రసిద్ది చెందిన ఈ ప్రక్రియ అష్టాంగ యోగాలోని ఎనిమిది విభాగాల్లో ఒకటి.

ప్రాణాయామం అనేది మనస్సుతో శరీరాన్ని సమన్వయపరిచే ఒక శ్వాస విధానం. ప్రాణ అంటే ప్రాణం, ప్రాణశక్తి(లేదా గాలి);  మరియు ఆయమ అంటే నిగ్రహం లేదా నియంత్రణ

ప్రాణాయామం యొక్క నియంత్రిత శ్వాస అభ్యాసం మనం పీల్చే ప్రాణశక్తి (ప్రాణం) యొక్క నాణ్యతను పెంచడానికి మొత్తం విధానాన్ని అందజేస్తుంది. దీనిని క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల శ్వాసకోశ వ్యవస్థ పునరుత్తేజం పొందడానికి మరియు సరైన శ్వాస పద్ధతుల వల్ల కలిగే పరిస్థితులను నివారించడానికి సహాయపడుతుంది..

“ప్రాణాయామంలో మూడు ప్రక్రియలు ఉంటాయి. పూరక లేదా నియంత్రిత ఉచ్చ్వాసము, కుంభక లేదా నియంత్రిత ఉచ్ఛ్వాసను ఆపడం, మరియు రేచక లేదా నిశ్వాసం అనే విధంగా ఉంటుంద” ని నారంగ్ చెప్పారు. పీల్చిన గాలిని కొన్ని సెకన్ల పాటు నిలుపుకోవడం అనేది ఛాతీ గోడ గరిష్టంగా విస్తరించే కీలకమైన దశ, మరియు ఇది ఊపిరితిత్తుల మొత్తం సామర్థ్యం ఉపయోగించడాన్ని అనుమతిస్తుంది.

అనేక ప్రయోజనాలు

  • ఊపిరితిత్తులను బలపరుస్తుంది

ఆరు వారాల ప్రాణాయామ చేస్తే ఊపిరితిత్తులపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే అంశాన్ని అంచనా వేయడానికి తమిళనాడులోని వినాయక మిషన్స్ మెడికల్ కాలేజీకి చెందిన పరిశోధకుల బృందం ఒక అధ్యయనాన్ని నిర్వహించింది.

ఆరు వారాల స్వల్పకాలిక ప్రాణాయామ అభ్యాసంతో శ్వాస వ్యవస్థ పరీక్ష విలువలు మెరుగుపడ్డాయని ఇది నిర్ధారించింది. అస్తమా, అలర్జీ ఆధారిత బ్రాంఖైటిస్, నిమోనియా తర్వాత కోలుకోవడం, క్షయ, వృత్తిపరమైన వ్యాధులకు సంబంధించి మనిషి ఆరోగ్యాన్ని, అలాగే ఊపరితిత్తులను బలపరిచే సాధనంగా ప్రాణాయామాన్ని ప్రోత్సహించవచ్చని పరిశోధన పేర్కొంది.

  • శ్వాస వ్యవస్థలు

బెంగళూరులోని రామయ్య మెడికల్ కాలేజ్ అండ్ టీచింగ్ హాస్పిటల్ పరిశోధకులు తేలికపాటి నుండి మితమైన ఉబ్బసం ఉన్న 12-15 సంవత్సరాల వయస్సు గల 49 మంది పాఠశాల పిల్లలపై ఏడాది పాటు అధ్యయనం చేశారు. ప్రాణాయామం అభ్యసించడం ద్వారా కౌమారదశలో ఉబ్బసం ఉన్న వారికి చికిత్స చేయడానికి తగిన చికిత్స అని వారు తేల్చారు, ఎందుకంటే ఇది వారి ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది మరియు పరిస్థితి యొక్క తీవ్రమైన తీవ్రతను తగ్గిస్తుంది.   

  • హైపర్‌వెంటిలేషన్‌ను నిర్వహించడం

హైపర్‌వెంటిలేషన్ అనేది ఒక వైద్య పరిస్థితి, ఇక్కడ ఒకరు ఎక్కువగా ఊపిరి పీల్చుకుంటారు మరియు ఇది కార్బన్ డయాక్సైడ్ (CO2) విడుదలకు దారితీస్తుంది; మరియు ఇది రక్తంలో CO2 గాఢతను గణనీయంగా తగ్గిస్తుంది.  లక్షణాలలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన అలసట మరియు విశ్రాంతి లేకపోవడం ఉంటాయి. దీనికి సంబంధించిన లక్షణాలను చూస్తే శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన అలసట విశ్రాంతి లేమి వంటివి ఉంటాయి.

బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలోని ఆయుర్వేద అధ్యాపకులు ప్రచురించిన ఒక కేస్ స్టడీ ప్రకారం, ఒక్కో నాసికా రంధ్రంతో కొద్ది సేపు శ్వాసతీసుకొని, విడిచి పెట్టే విధానం వల్ల ఈ పరిస్థితిని అధిగమించేందుకు దారి దొరుకుతుందని వెల్లడైంది.

  • ధూమపానం మానివేయడానికి సహాయపడుతుంది

లండన్ యూనివర్సిటీ కాలేజీలో సాంక్రమిక వ్యాధులు మరియు ప్రజా ఆరోగ్య శాఖ ఒక అధ్యయనం నిర్వహించింది. అందులో పొగతాగేవారు ఆ వ్యసనం నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తూ మరియు

దాని పట్ల తీవ్రమైన కోరికతో ఉండి ఉన్నవారిని పరిగణనలోకి తీసుకున్నారు. పొగతాగాలనే తీవ్రమైన కోరికను కట్టడిచేయడంలో యోగా శ్వాస వ్యాయామాలు సానుకూల ప్రభావాన్ని చూపుతాయని వారు నిర్ధారించారు.

  • ఫీడ్ బ్యాక్:

ఈ అధ్యయనంలో పాల్గొనేవారు యోగ శ్వాస వ్యాయామాల గురించి తెలియనివారని, అధ్యయన ప్రక్రియలో భాగస్వామ్యులైన వారికి ప్రాణాయామ పద్దతుల్లో ప్రాణాయామ ప్రక్రియ గురించి ముందే శిక్షణ ఇచ్చి ఉంటే ఫలితం మరింత ప్రభావవంతంగా ఉండేదని పరిశోధకులు నొక్కి చెప్పారు.

ఒత్తిడిని తగ్గిస్తుంది

నిద్రా భంగం మరియు ఒత్తిడి నుండి బయటపడటానికి శ్వాస వ్యాయామాలు ఒక ప్రత్యామ్నాయం. అవి ఒత్తిడి హార్మోన్ల స్థాయిలను తగ్గిస్తాయి మరియు జ్ఞానం, ఆందోళన మరియు సాధారణ శ్రేయస్సును మెరుగుపరుస్తాయని అవి చూపించాయి.

నెమ్మదిగా మరియు వేగంగా చేసే శ్వాస వ్యాయామాలు రెండూ ఒత్తిడిని అధిగమించడానికి సహాయపడతాయని అధ్యయనాలు నిరూపించాయి. నెమ్మదిగా చేసే ప్రాణాయామం స్థిరమైన హృదయనాళ పనితీరు ఉన్నవారిలో ఒత్తిడిని తగ్గిస్తుందని ఒక అధ్యయనం తేల్చింది, అయితే హృదయ సంబంధ ఇబ్బందులు ఉన్నవారికి వేగవంతమైన వ్యాయామాలు సిఫారసు చేయబడవు.

దుష్ప్రభావాలు ఉన్నాయా?

“శ్వాస వ్యాయామాలు ప్రతి ఒక్కరికీ మంచివే అయినప్పటికీ, ప్రత్యేక వైద్య పరిస్థితులు ఉన్నప్పుడు నిపుణుల సలహా పొందడం మొత్తం శ్వాస వ్యాయామాలు అర్థం చేసుకొని ముందుకెళ్లడం చాలా ముఖ్యం. గర్భిణీ స్త్రీలు మరియు కొన్ని ప్రత్యేక ఆరోగ్య పరిస్థితులు కలిగిన వారు నిపుణుల సమక్షంలో వ్యాయామాలు చేయాలి ” అని నారంగ్ చెప్పారు.

వివరణలు

 

అనులోమ-విలోమ ప్రాణాయామం (ప్రత్యామ్నాయ- నోస్ట్రిల్ బ్రీథింగ్)

కుడి బొటనవేలు ఉపయోగించి కుడి ముక్కు రంధ్రాన్ని మూసివేసి ఎడమ రంధ్రం ద్వారా శ్వాస తీసుకోవాలి. అదేవిధంగా, ఎడమ ముక్కు రంధ్రాన్ని ఎడమ బొటనవేలు ఉపయోగించి మూసివేసి, కుడి రంధ్రం ద్వారా శ్వాసను వదలాలి. ఇది ఒక రౌండ్ ప్రత్యామ్నాయ- నోస్ట్రిల్ బ్రీథింగ్‌ పూర్తి అవుతుంది.
 

కపాలభాతి 

 

రెండు నాసికా రంధ్రాలతో శ్వాస తీసుకుని, శ్వాసను విడిచి పెట్టే సమయంలో నిమిషానికి వేగవంతమైన 60-120 నిశ్వాసలతో వేగంగా పొత్తికడుపును కదిలించి/జాడించి ఊపిరి విడిచి పెట్టడం ద్వారా చేయబడుతుంది.

 

మీ అనుభవాన్ని లేదా వ్యాఖ్యలను పంచుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ట్రెండింగ్

వ్యాసాలు

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient
We use cookies to customize your user experience, view our policy here

మీ అభిప్రాయం విజయవంతంగా సమర్పించబడింది.

హ్యాపీయెస్ట్ హెల్త్ టీమ్ వీలైనంత త్వరగా మిమ్మల్ని సంప్రదిస్తుంది