728X90

0

0

0

0

0

0

0

0

0

ఈ వ్యాసంలో

గుండెపోటు Vs కార్డియాక్ అరెస్ట్: రెండింటి మధ్య తేడా ఏంటి?
3510

గుండెపోటు Vs కార్డియాక్ అరెస్ట్: రెండింటి మధ్య తేడా ఏంటి?

గుండెకు రక్త సరఫరా ఆగిపోవడం వల్ల గుండెపోటు వస్తుంది, అయితే కార్డియాక్ అరెస్ట్‌లో గుండె అకస్మాత్తుగా కొట్టుకోవడం ఆగిపోతుంది.

గౌహతికి చెందిన గృహిణి సంగీత చౌదరి(47), హ్యాపియెస్ట్ హెల్త్‌తో మాట్లాడుతూ.. ఆగస్టు 2015లో, రిటైర్డ్ ప్రొఫెసర్ అయిన మా తండ్రి నబిన్ సి బోరా 80 ఏళ్ల వయసులో కన్నుమూశారు. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో నిద్రనుంచి లేవగా ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది, చెమటలు పట్టాయి. చివరికి మా కళ్ల ముందే క్షణాల్లో కుప్పకూలిపోయాడు. అతను తను మరణించడానికి పడుకునే ముందు రాత్రి కూడా కడుపునిండా భోజనం చేశారు. అతను జీవితాంతం ఆరోగ్యకరమైన, చురుకైన జీవనశైలిని అనుసరించారు. అతనికి మధుమేహం, కొలెస్ట్రాల్ లేదు. తను ఎక్కువగా ఇంట్లో వండిన భోజనాన్నే తింటారు. ఎర్రమాంసాన్ని తినడం మానేశాడు. రోజు ఎక్కువసేపు నడుస్తూ క్రమం తప్పకుండా యోగా చేశాడు. ముఖ్యంగా శ్వాససంబంధిత వ్యాయామాలు చేసేవాడు. ”తన తండ్రి పడిపోయినప్పుడు, అతనికి గుండెపోటు వచ్చిందని తాను అనుకున్నానని, అయితే అది సడన్ కార్డియాక్ అరెస్ట్ అని డాక్టర్ చెప్పారని సంగీత పేర్కొన్నారు.

”అతడు మరణానికి 5 సంవత్సరాల ముందు, సాధారణంగా నడిచేటప్పుడు లేదా మెట్లు ఎక్కేటప్పుడు ఎక్కువ అలసిపోయేవాడు. దీర్ఘకాలిక అలసటను వృద్ధాప్యం యొక్క దుష్ప్రభావంగా తెలుసుకోలేకపోయాను. నేను అతనిని డాక్టర్ వద్దకు తీసుకెళ్లి కొన్ని పరీక్షలు చేయించాను. అతనికి ఆంజినా అనే గుండె సంబంధిత వ్యాధి ఉందని నిర్ధారణ అయింది. మందులు, ఆహారం మరియు వ్యాయామం విషయంలో అతని ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ సూచించారు. సకాలంలో రోగ నిర్ధారణ అతని జీవితాన్ని మరికొన్ని సంవత్సరాలు పొడిగించిదని నేను నమ్ముతున్నాను. దీంతో అతనితో మరికొంత విలువైన సమయాన్ని గడిపే అవకాశం నాకు లభించింది.”

ఆంజినా అనేది గుండె కండరాలకు రక్త ప్రసరణ తగ్గడం వల్ల వచ్చే ఛాతి నొప్పి. ఇది సాధారణంగా ప్రాణాపాయం కాదు, కానీ ఎవరైనా గుండెపోటు లేదా స్ట్రోక్‌కు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిక సంకేతం. స్థిరమైన ఆంజినా దాడులు సాధారణమైనవి. ట్రిగ్గర్(ఒత్తిడి లేదా వ్యాయామం వంటివి) కలిగి ఉంటాయి. విశ్రాంతి తీసుకున్న నిమిషాల్లోనే ఆగిపోతాయి. చికిత్స మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులతో, ఆంజినాను నియంత్రించడం మరియు దీని ద్వారా మరింత తీవ్రమైన సమస్యల ప్రమాదాన్ని తగ్గించడం సాధ్యమవుతుంది.

గుండెపోటు మరియు గుండె ఆగిపోవడం ఒకటేనా?

”అవి రెండు వేర్వేరు విషయాలు” అని బెంగళూరులోని ఆస్టర్ సీఎంఐ ఆస్పత్రి ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ప్రదీప్ కుమార్ చెప్పారు. ”గుండెపోటు అనేది మయోకార్డియల్ ఇన్ఫార్షన్ యొక్క సంఘటన, దీనిలో ఒక వ్యక్తి యొక్క గుండె కండరాలు దెబ్బతినడం ప్రారంభమవుతాయి. రక్తసరఫరా అకస్మాత్తుగా ఆగిపోతుంది. వ్యక్తి ఛాతినొప్పి, శ్వాస ఆడకపోవడం మరియుమూర్ఛ వంటి లక్షణాలను అనుభవిస్తారు. కొన్నిసార్లు, చాలా మంది వృద్ధులు లేదా మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఛాతి నొప్పి అనిపించకపోవచ్చు. లేదా వారు దానిని అనుభవించినప్పటికీ వారు దానిని ఎసిడిటీగా భావిస్తారు. మరోవైపు కార్డియాక్ అరెస్ట్ పేరు సూచించినట్లుగా గుండె పనిచేయడం ఆగిపోతుంది. దాదాపు అన్ని మరణాలలో, చివరి సంఘటన కార్డియాక్ అరెస్ట్ అవుతుంది. గుండె పరంగా, బలహీనమైన గుండెతో సహా గుండె వైఫల్యానికి కారణమయ్యే అనేక పరిస్థితులు ఉన్నాయి. ఇది దీర్ఘకాలిక గుండెపోటు, కండరాల వ్యాధులు, అధిక మరియు తక్కువ పొటాషియం స్థాయిల వల్ల కూడా కావచ్చు.

ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో, సీనియర్ కన్సల్టెంట్ మరియు కార్డియో ఫిజియాలజిస్ట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ డాక్టర్ వనితా అరోరా రెండు పరిస్థితుల మధ్య తేడాలను వివరిస్తున్నారు. ”ఇంటి నిర్మాణ సమయంలో, దానిని సజావుగా పనిచేయడానికి రెండు ముఖ్యమైన వ్యవస్థలు ఉన్నాయి- నీరు మరియు విద్యుత్. అవి వ్యక్తిగతంగా ముఖ్యమైనవి. పరస్పరం అనుసంధానించబడిన స్వతంత్ర సంస్థలు. ఇక్కడ ఇల్లు అంటే హృదయం. ఇంటికి నీరు అందినట్లే గుండెకు రక్తం అందుతుంది. పైపులలో (ధమనుల) అడ్డంకి ఏర్పడితే, అడ్డంకిని తొలగించడం ప్లంబర్ లేదా వైద్యుని పని. గుండె యొక్క ఎలక్ట్రికల్ నెట్ వర్క్(పల్స్) పోయినప్పుడు ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుంది. ఇది గుండెలో ఏర్పడే విద్యుత్ షార్ట్ సర్క్యూట్”.

గుండెపోటుతో బాధపడేవారిలో 95 శాతం మంది దాని గురించి అవగాహన పెంచుకోవడం వల్లే బతుకుతారని డాక్టర్ అరోరా చెప్పారు. ప్రజలు సమయానికి మందులు తీసుకుంటారు మరియు యాంజియోప్లాస్టీ, శస్త్రచికిత్స మొదలైన వాటికి ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి చేరుకోవడానికి ప్రయత్నిస్తారు. లక్షనాలు కనిపించడానికి కూడా సమయం పడుతుంది. కాబట్టి వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోవచ్చు. ”దీనికి విరుద్ధంగా, గుండె ఆగిపోయిన వారిలో 95 శాతం మంది మనుగడ సాగించరు. ఎందుకంటే అసాధారణ వేగంతో కొట్టుకోవడం ప్రారంభిస్తుంది(నిమిషానికి 300-400 బీట్స్). అది రక్తపోటును సున్నాకి తగ్గిస్తుంది. ఇది మెదడుకు రక్తసరఫరాను నిలిపివేస్తుంది మరియు ప్రతీది మూసివేయడం ప్రారంభమవుతుంది” అని డాక్టర్ అరోరా చెప్పారు.

గుండె ఆగిపోయే ప్రమాదం ఎవరికి ఉంది?

డాక్టర్ అరోరా ప్రకారం, గుండె 35 శాతం కంటే తక్కువగా పనిచేస్తుంటే, అకస్మాత్తుగా గుండె ఆగిపోయే ప్రమాదం పెరుగుతుంది. “ఎకోకార్డియోగ్రామ్ ద్వారా సాధారణ వైద్య పరీక్షలో దీనిని గుర్తించవచ్చు. అదనంగా, డైలేటెడ్ కార్డియాక్ మయోపతి (ఇన్ఫెక్షన్ లేదా వ్యాధి కారణంగా కండరాలు బలహీనంగా మారే పరిస్థితి) ఉన్న వ్యక్తులు కూడా ప్రమాదం కలిగి ఉంటారు. ఇవే కాకుండా జన్యుపరమైన అంశాలు కూడా ఒక ముఖ్య కారణం. ఈ కారకాలు ECG నివేదికలో సులభంగా కనిపిస్తాయి. అటువంటి సందర్భాలలో, వైద్యులు కుటుంబ చరిత్రను చూస్తారు. “నిద్రలో ఉన్నప్పుడు లేదా ఏదైనా పని చేస్తున్నప్పుడు యువ మరణం (35 ఏళ్లలోపు) సంభవించినట్లయితే, అది ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్‌కు సంకేతం కావచ్చు.”

కార్డియాక్ అరెస్ట్ తక్షణ మరణానికి కారణమవుతుందా?

డాక్టర్ కుమార్ మాట్లాడుతూ, కార్డియాక్ అరెస్ట్ విషయంలో, గుండె పనిచేయడం ఆగిపోయినప్పుడు మెదడు దెబ్బతినడానికి కేవలం మూడు నిమిషాలు పడుతుంది. అందువల్ల, కార్డియోపల్మోనరి రిసటిటేషన్(CPR) లేదా డీఫిబ్రిలేటర్స్ (సాధారణ హృదయ స్పందనను పునరుద్దరించడానికి గుండెకు విద్యుత్ పల్స్ లేదా షాక్‌ను పంపే పరికరాలు) ద్వారా తక్షణ ఉపశమనం అందించాలి. అన్ని పబ్లిక్ స్థలాల్లోనూ ఈ పరికరాలను కలిగి ఉండటానికి ఇది ఒక కారణం. ఒక వ్యక్తి ఎటువంటి ప్రతిస్పందన లేకుండా స్పృహ కోల్పోయినట్లయితే అతనికి/ఆమెకు ప్రాధాన్యతను ఇస్తూ అత్యవసర చర్యలను వేగవంతం చేయాలి.

డాక్టర్ అరోరా ఇలా జత చేస్తున్నారు.. ”సీపీఆర్ లేదా ఎలక్ట్రికల్ షాక్ వంటివి వ్యక్తిని మరలా పునరుద్ధరించడానికి తక్షణం అవసరం. ప్రజలలో రెండింటి యొక్క లభ్యత మరియు అవగాహన ప్రజలలో చాలా పరిమితం. అందువల్ల, చాలా అరుదుగా ప్రజలు మనుగడ సాధిస్తారు.

యువకుల్లో కార్డియాక్ అరెస్ట్

యువకులు మరియు ఆరోగ్యంగా ఉన్న పెద్దలలో కార్డియాక్ అరెస్ట్‌లు ఎందుకు సాధారణం అవుతున్నాయనే ప్రశ్నకు డాక్టర్ అరోరా ఇలా సమాధానమిచ్చారు. ”దీనికి జన్యుపరమైన అంశాలు కారణం కావచ్చు. వీటితో పాటు కృత్రిమ ప్రొటీన్ సప్లిమెంట్స్, స్టెరాయిడ్స్ లేదా ఇంజెక్షన్లు వారి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి లేదా వ్యాయామం చేసేటప్పుడు అలసిపోకుండా ఉండటానికి వారు తీసుకునే ఇంజెక్షన్లు కార్డియాక్ ఫ్రెండ్లీ కాదు. వీటిని తీసుకోవడం వల్ల యువతలో నిశ్శబ్దంగా అకస్మాత్తుగా గుండెపోటు వస్తుంది” అని ఆమె చెప్పారు.

మధుమేహం, ఊబకాయం, ధూమపానం అలవాటు, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బుల కుటుంబ చరిత్ర లేదా చురుకైన జీవితాన్ని గడపని వ్యక్తికి ఛాతి నొప్పి ఉంటే, వెంటనే ఈసీజీ పరీక్ష చేయించుకుని వైద్యుడిని సంప్రదించాలని డాక్టర్ కుమార్ చెప్పారు.

చాలా సార్లు, ఈసీజీ నివేదికలు గుండెపోటును సూచిస్తాయి. కానీ ప్రజలు వాటిని డాక్టర్‌తో ధృవీకరించరు. నిర్లక్ష్యం చేస్తే, గుండెపోటు కార్డియాక్ అరెస్ట్‌కు దారితీస్తుంది. ఈసీజీ కాకుండా, ఎకో మరియు ట్రెడ్‌మిల్ వంటి ఒత్తిడి పరీక్షలు సరళమైనవి, సమర్థవంతమైనవి మరియు నాన్-ఇన్వాసివ్ స్క్రీనింగ్ సాధనాలు.

మీ హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలా?

గుండె ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని డాక్టర్ అరోరా చెప్పారు. ఇది ఈ పరిస్థితులను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. మధుమేహం మరియు హైపర్ టెన్షన్‌తో బాధపడుతున్న వారు ఎల్లప్పుడూ తమ వైద్యుడిని సంప్రదించాలి. వారి గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున వారు సూచించిన మందుల కోర్సును వారు సొంతంగా ఆపడం కానీ సవరించడం కానీ చేయకూడదు.
ఒత్తిడిని నిర్వహించడం చాలా ముక్యం అని కూడా ఆమె చెప్పింది. విశ్రాంతి తీసుకోవడానికి మరియు ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రతిరోజూ కొంత ‘మీ-టైమ్’ తీసుకోండి.
”ధూమపానం పూర్తిగా మానేయాలి మరియు మద్యం సేవించడం పరిమితం చేయాలి. ఇంట్లో వండిన ఆహారాన్ని తినడం మరియు జంక్ ఫుడ్ మానేయడం ఉత్తమం. చివరగా, ప్రతిరోజూ నాలుగు కిలోమీటర్ల నడక అనేది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది” అని ఆమె చెప్పింది.

మీ గుండె బాగుందో లేదో తెలుసుకోవడం ఎలా?

యువకులు 30 ఏళ్లు దాటిన తర్వాత ఎకో మరియు ఈసీజీ వంటి గుండె పరీక్షలను క్రమం తప్పకుండా చేయించుకోవాలని డాక్టర్ అరోరా నొక్కి చెప్పారు. ”ఇది ఏదైనా పరిస్థితిని గుర్తించడంలో మరియు తదనుగుణంగా వ్యవహరించడంలో సహాయపడుతుంది” అని ఆమె చెప్పింది.

పైన పేర్కొన్న చిట్కాలతో పాటు, భవిష్యత్తులో వచ్చే ప్రమాదాన్ని నివారించడానికి, కొలెస్ట్రాల్ స్థాయిలు, బ్లడ్ షుగర్ మరియు బ్లడ్ ప్రెజర్‌లను బాల్యం నుంచి క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని డాక్టర్ కుమార్ సూచించారు.

మీ హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి 5 మార్గాలు

  • ప్రతిరోజూ కొద్దిసేపు నడవండి.
  • ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. జంక్ మరియు ప్రాసెస్ ఆహారాలకు బదులుగా ఇంట్లో వండిన ఆహారాన్ని ఎంచుకోండి.
  • ధూమపానం మానుకోండి.
  • ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. అనవసరమైన ఒత్తిడిని దరిచేరనీయకండి.
  • రెగ్యులర్ హెల్త్ చెకప్‌లను చేయించుకోండి. రక్తంలో చక్కెర మరియు కొలెస్ట్రాల్ ఆరోగ్యకరమైన స్థాయిల్లో ఉండేలా చూసుకోండి.

మీ అనుభవాన్ని లేదా వ్యాఖ్యలను పంచుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ట్రెండింగ్

వ్యాసాలు

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient
We use cookies to customize your user experience, view our policy here

మీ అభిప్రాయం విజయవంతంగా సమర్పించబడింది.

హ్యాపీయెస్ట్ హెల్త్ టీమ్ వీలైనంత త్వరగా మిమ్మల్ని సంప్రదిస్తుంది