728X90

0

0

0

0

0

0

0

0

0

ఈ వ్యాసంలో

మధుమేహ నిర్వహణలో ముఖ్యమైన ఆరు ఖనిజాలు
2949

మధుమేహ నిర్వహణలో ముఖ్యమైన ఆరు ఖనిజాలు

డయాబెటిస్‌ను జాగ్రత్తగా చూసుకోవడానికి మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి, వ్యాయామం చేయాలి మరియు మీ బరువును అదుపులో ఉంచుకోవాలి. మీరు సహజ సప్లిమెంట్లను తీసుకోవడం ద్వారా మీ శరీరాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఇది చేయుటకు, ప్రతిరోజూ ఖనిజాలు అధికంగా ఉండే ఆహారాన్ని తినడం చాలా ముఖ్యం అని నిపుణులు సూచిస్తున్నారు.
6 minerals vital for diabetes management

రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సూక్ష్మపోషకాలు మరియు ఖనిజాల పాత్ర ముఖ్యమైనది. జింక్, మెగ్నీషియం, క్రోమియం వంటి ఖనిజాలను తీసుకోవడం వల్ల ఇన్సులిన్ గ్రాహకాలను (గ్లూకోజ్ మెటబాలిజంలో కీలక పాత్ర పోషించే ప్రోటీన్లు) పెంచి మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుందని ముంబైలోని జస్లోక్ ఆస్పత్రి అండ్ రీసెర్చ్ సెంటర్‌లోని ఎండోక్రినాలజిస్ట్ మరియు డయాబెటాలజిస్ట్ డాక్టర్ షైవల్ హెచ్ చండాలియా చెప్పారు.

ఈ ఖనిజాల లోపం ఆక్సీకరణ ఒత్తిడి మరియు ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది.

బెంగళూరులోని సక్రా వరల్డ్ ఆస్పత్రిలోని సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్ మరియు డయాబెటాలజీ డాక్టర్ సుబ్రతా దాస్ ప్రకారం, ఈ మధుమేహానికి అనుకూలమైన సప్లిమెంట్‌లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి మందులపై ఆధారపడటాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

ఆక్సీకరణ ఒత్తిడి మరియు ఇన్సులిన్ నిరోధకత

డాక్టర్ చందాలియా ప్రకారం, ఫ్రీ రాడికల్స్ ( సెల్యూలార్ మెటబాలిజం యొక్క ఉప-ఉత్పత్తులు) పెరుగుదల ఆక్సీకరణ ఒత్తిడికి కారణమవుతుంది. ”కొన్ని ఎంజైమ్‌లు ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించడంలో లేదా కణాన్ని నాశనం చేయకుండా నిరోధించడంలో సహాయపడతాయి. కానీ ఈ ఖనిజాల లోపం లేదా ఎంజైమ్‌లు ప్రభావితమైతే ఫ్రీ రాడికల్స్ శోషించబడవు. ఇది యాంటీడయాబెటిక్ ఔషద నిరోధకతను పెంచుతుంది. గ్లైసెమిక్ నియంత్రణను కూడా దెబ్బతీస్తుంది. దీర్ఘకాలిక ఆక్సీకరణ ఒత్తిడి మధుమేహంతో సహా దీర్ఘకాలిక పరిస్థితుల అభివృద్ధికి దోహదపడుతుందని ఆయన సూచిస్తున్నారు.

మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి తీసుకోవాల్సిన ఆహారపదార్థాలు

జింక్

ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడం ద్వారా గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరచడంలో జింక్ కీలక పాత్ర పోషిస్తుందని డాక్టర్ దాస్ అభిప్రాయపడ్డారు.

తగ్గిన చక్కెర స్థాయిలు తగ్గిన జింక్ స్థాయిలతో సంబంధం కలిగి ఉంటాయి. ”డయాబెటిస్ ఉన్నవారికి జింక్ లోపం ఎక్కువగా ఉంటుంది” అని డాక్టర్ శైవల్ చెప్పారు. ప్యాంక్రియాస్ మరియు ఇన్సులిన్ స్రావం యొక్క బీటా సెల్‌లో ఇన్సులిన్ అణువును ప్రాసెస్ చేయడం మరియు నిల్వ చేయడంలో జింక్ ముఖ్య పాత్ర పోషిస్తుందని ఆయన చెప్పారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఒక వ్యక్తి రోజుకు 25mg జింక్ తీసుకుంటే సరిపోతుంది. బెంగళూరుకు చెందిన పోషకాహార నిపుణుడు వసుంధ్రా అగర్వాల్ ప్రకారం, జింక్ ఎక్కువగా తీసుకోవం వల్ల కడుపు నొప్పి, వాంతులు, వికారం కలిగిస్తుంది. గుమ్మడికాయ గింజలు జీడిపప్పు, క్వినోవా మరియు జున్ను తీసుకోవడం వల్ల జింక్ లోపాన్ని తీర్చడంలో సహాయపడుతుందని ఆమె చెప్పింది.

మెగ్నీషియం

వసుంధర అగర్వాల్ ప్రకారం, కణాల్లోకి గ్లూకోజ్ రవాణా చేయడంలో మరియు కార్బోహైడ్రేట్ జీవక్రియకు మెగ్నీషియం ఒక ముఖ్యమైన సహకారకం. ఇది ఇన్సులిన్‌ను విడుదల చేయడానికి మీ శరీరం యొక్క సామర్థ్యానికి దోహదం చేస్తుంది మరియు కణాలు ఇన్సులిన్‌ను మరింత ప్రభావవంతంగా ఉపయోగించడంలో సహాయపడుతుంది.

డాక్టర్ శైవల్ ప్రకారం, మెగ్నీషియం లోపం వల్ల ఇన్సులిన్ నిరోధకత పెరగడంతో పాటు ఇన్సులిన్ స్రావం తగ్గుతుందని చెప్పారు. మధుమేహం ఉన్న వ్యక్తులకు హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. మెగ్నీషియం లోపం కొంతమందిలో గుండె వైఫల్యానికి దారితీస్తుంది. మెగ్నీషియం సప్లిమెంటరీ మధుమేహం ఉన్నవారికి వారి గ్లూకోజ్ స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడుతుందని మరియు మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నవారిలో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, మెగ్నీషియం యొక్క ఉత్తమ వనరులు ఓట్స్, బార్లీ, చిక్ పీస్, అవిసె గింజలు మరియు సోయాబీన్స్. అగర్వాల్ 250-350mg/రోజుకు మెగ్నీషియం తీసుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. మెగ్నీషియం పెద్ద మొత్తంలో తీసుకుంటే అది విషపూరితంగా మారొచ్చు.

క్రోమియం

గ్రీన్ బీన్స్, బ్రోకలీ, నారింజ మరియు బ్రెజిల్ నట్స్‌తో సహా అనేక ఆహార వనరులలో క్రోమియం ఉందని కొల్లంలోని ESIC హాస్పిటల్‌లోని డైటీషియన్ సౌమ్య ఎస్ నాయర్ చెప్పారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, క్రోమియం సప్లిమెంట్లు గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి మరియు మధుమేహం ఉన్నవారిలో ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడంలో సహాయపడతాయి.

”క్రోమియం ఇన్సులిన్ గ్రాహకాల వద్ద వివిధ సంకేతాల ద్వారా పనిచేస్తుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది మరియు ఇన్సులిన్ మరింత ప్రభావవంతంగా పనిచేయడంలో సహాయపడుతుంది అని డాక్టర్ చండాలియా చెప్పారు. మధుమేహం లేనివారిలో క్రోమియం లిపిడ్ లేదా గ్లూకోజ్ జీవక్రియను ప్రభావితం చేయదని ఒక అధ్యయనం వెల్లడించింది. అయితే ఇది మధుమేహం ఉన్నవారిలో గ్లూకోజ్ జీవక్రియను బాగా మెరుగుపరుస్తుంది.

సెలీనియం

సెలీనియం ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడంలో సహాయపడుతుంది మరియు యాంటీ ఆక్సిడెంట్‌గా కూడా పనిచేస్తుంది అని డాక్టర్ దాస్ చెప్పారు. ఇది శరీరం నుంచి విషపూరిత జీవక్రియలను తలొగిస్తుంది. గుండె జబ్బులు మరియు స్ట్రోక్‌లను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

సెలీనియం కాలేయంలో గ్లూకోజ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది అని నాయర్ చెప్పారు. ఇది గ్లూకోజ్ యొక్క అధిక ఉత్పత్తిని నిరోధిస్తుంది మరియు హైపర్ గ్లైసీమియా ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని ఆమె చెప్పారు.

నాయర్ ప్రకారం, సెలీనియం సప్లిమెంట్ల వినియోగం మితంగా ఉండాలి. సెలీనియం అధిక మోతాదులో విషపూరితం కావచ్చు. పెద్దలకు 50 మైక్రోగ్రాముల సెలీనియం రోజుకు సిఫార్సు చేయబడింది.

మీ ఆహారంలో ఆకుకూరలు, గుడ్లు, పాలిష్ చేయని బియ్యం(బ్రౌన్ రైస్) మరియు పుట్టగొడుగులను చేర్చుకోవడం వల్ల తగినంత మొత్తంలో సెలీనియం అందించడంలో సహాయపడుతుంది అని ఆమె పేర్కొన్నారు.

వనాడియం

ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడం మరియు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం ద్వారా డయాబెటిస్ నిర్వహణలో వనాడియం సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజంలో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో వనాడియం ఆరోగ్యకరమైన వ్యక్తులలో మరియు టైప్ 2 మధుమేహం ఉన్నవారిలో ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుందని కనుగొంది.

అధిక మొత్తంలో వెనాడియం తీసుకోవడం (రోజుకు 100mg కంటే ఎక్కువ) రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ఇది హైపోగ్లైసీమియా ప్రమాదాన్ని పెంచుతుందని అగర్వాల్ చెప్పారు. పుట్టగొడుగులు, షెల్ఫిష్, నల్లమిరియాలు మరియు పార్స్లీ.. వనాడియం యొక్క అద్భుతమైన వనరులు అని ఆమె జతచేశారు.

కాల్షియం

“ప్యాంక్రియాటిక్ బీటా కణాల ద్వారా ఇన్సులిన్ స్రావానికి రక్తం మరియు కణజాలాలలో కాల్షియం సాంద్రతలు కీలకం” అని అగర్వాల్ చెప్పారు. విటమిన్ డి మరియు కాల్షియం కలిపి తీసుకోవడం గ్లూకోజ్ జీవక్రియను ఆప్టిమైజ్ చేయడంలో సహాయపడుతుందని ఒక అధ్యయనం చూపిస్తుంది.

ఆకు కూరలు, పాల ఉత్పత్తులు మరియు సోయాబీన్స్ కాల్షియం యొక్క మంచి వనరులు, “సిఫార్సు చేయబడిన రోజువారీ కాల్షియం 1,000 మరియు 1,200 mg/రోజు మధ్య ఉంటుంది, నాయర్ చెప్పారు. మధుమేహం ఉన్న వృద్ధులలో సాధారణంగా కనిపించే బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో కాల్షియం సహాయపడుతుంది.

సహజ వనరులు vs సింథటిక్ సప్లిమెంట్స్

నిపుణులు ఈ ఖనిజాలను సహజ వనరుల నుండి తీసుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. “డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా సప్లిమెంట్లను తీసుకోకూడదు,” డాక్టర్ దాస్ చెప్పారు. ఈ ఖనిజాలను అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలోని వివిధ అవయవాలపై హానికరమైన ప్రభావం ఉంటుందని ఆయన చెప్పారు.

డాక్టర్ శైవా ప్రకారం, పండ్లు మరియు కూరగాయలు వంటి సహజ వనరుల నుండి ఈ ఖనిజాలను తీసుకోవడం వలన మీరు వాటిని అధికంగా తీసుకోకుండా చూసుకోవచ్చు.

గుర్తుంచుకోవాల్సిన అంశాలు

టైప్ 2 డయాబెటిస్‌ను జాగ్రత్తగా చూసుకోవడానికి మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి, వ్యాయామం చేయాలి మరియు మీ బరువును అదుపులో ఉంచుకోవాలి. మీరు సహజ సప్లిమెంట్లను తీసుకోవడం ద్వారా మీ శరీరాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఇది చేయుటకు, ప్రతిరోజూ ఖనిజాలు అధికంగా ఉండే ఆహారాన్ని తినడం చాలా ముఖ్యం అని నిపుణులు సూచిస్తున్నారు.

మీ అనుభవాన్ని లేదా వ్యాఖ్యలను పంచుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ట్రెండింగ్

వ్యాసాలు

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient
We use cookies to customize your user experience, view our policy here

మీ అభిప్రాయం విజయవంతంగా సమర్పించబడింది.

హ్యాపీయెస్ట్ హెల్త్ టీమ్ వీలైనంత త్వరగా మిమ్మల్ని సంప్రదిస్తుంది