728X90

0

0

0

0

0

0

0

0

0

ఈ వ్యాసంలో

తుమ్ము వస్తే వెంటనే కూర్చోవాలా లేదంటే ఆగాలా? ఎందుకు?
16

తుమ్ము వస్తే వెంటనే కూర్చోవాలా లేదంటే ఆగాలా? ఎందుకు?

తుమ్ముతో కలిగే ఉపశమనం అనిర్వచనీయం. అయితే, పదిమందిలో ఉన్నపుడు తుమ్మును ఆపుకోవడంపై కొందరు తరచూ సందిగ్ధంలో పడుతుంటారు.
తుమ్ము వస్తే ఏం చేయాలి?
తుమ్ము సాధారణమేనా!

తుమ్ము వస్తే ఆపకూడదన్నది ఒక నియమం… అయితే, హెర్నియా సమస్య ఉన్నవారు తుమ్మకూడదని నిపుణులు సూచిస్తారు.

తుమ్ముతో కలిగే ఉపశమనం అనిర్వచనీయం. అయితే, పదిమందిలో ఉన్నపుడు తుమ్మును ఆపుకోవడంపై కొందరు తరచూ సందిగ్ధంలో పడుతుంటారు. తుమ్ము ఎంత సహజమో, దాన్ని ఆపాలనే కోరిక కూడా అంతే సహజం- అందునా కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన నేపథ్యంలో ఇదొక సంప్రదాయంలా వ్యాపించింది. అయితే, తుమ్మును ఆపే ప్రయత్నం శరీరంపై ప్రమాదకర ప్రభావం చూపవచ్చు. ఒకవేళ ఆగకుండా తుమ్ములు వస్తుంటే అది ‘అలెర్జిక్రైనైటిస్‌’ రుగ్మతకు సంకేతం కావచ్చు. 

కాబట్టి తుమ్ములు ఎందుకు వస్తాయో… వచ్చినపుడు ఆపకూడదని ఎందుకంటారో తెలుసుకోవడం ముఖ్యమే మరి! 

మన ముక్కుమీద దాడిచేసే దుమ్ము- ధూళి వంటి బాహ్య కణాలను, ముక్కులో చిరాకు కలిగించే వాటిని బయటకు నెట్టేసే శరీర ప్రతిచర్యనే తుమ్ము అంటాం. కానీ, కొన్నిసార్లు ఇది శరీరం లోపలి అస్వస్థతకు… సాధారణంగా అలెర్జిక్‌ రైనైటిస్‌ వంటి రుగ్మతకు సంకేతం కూడా కావచ్చు. అమెరికా ప్రభుత్వ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం- అలెర్జిక్‌ రైనైటిస్‌ అనేది ముక్కును ప్రభావితం చేసే కొన్ని సామూహిక లక్షణాలతో ముడిపడి ఉంటుంది. ఎడతెగని తుమ్ములు ఆ లక్షణాల్లో ఒకటి. శ్వాసద్వారా ఏదైనా అలెర్జీ కారకం (ప్రతిచర్యను ప్రేరేపించేది) ముక్కులో ప్రవేశిస్తే వెంటనే ఈ సంకేతం కనిపిస్తుంది. 

తుమ్ము వెనుక జరిగేది ఇదే 

తుమ్ము రావడానికి కారణాలను బెంగళూరులోని ‘బిజిఎస్‌ గ్లెనెగల్స్ గ్లోబల్ హాస్పిటల్స్‌ చీఫ్ ENT -ఎండోస్కోపిక్ స్కల్ బేస్ సర్జన్ డాక్టర్ ప్రశాంత్ రెడ్డి ‘హ్యాపీయెస్ట్ హెల్త్‌’కు వివరించారు. “ముక్కు లోపల ‘టర్బినేట్లు’ అనే చిన్న నిర్మాణాలుంటాయి. ముక్కు ముందు భాగంలోని దిగువ టర్బినేట్ చాలా సున్నితమైనది. కాబట్టి ఏదైనా చికాకు ఎదురైతే అది తుమ్ము వచ్చేలా చేస్తుంది. ఆ విధంగా బాహ్య లేదా చికాకు కలిగించే కణాలు మన శ్వాసమార్గంలో ప్రవేశించకుండా రక్షించే యంత్రాంగం ఇది” అని చెప్పారు. 

హర్యానాలోని గురుగ్రామ్‌లోగల పారస్ హాస్పిటల్స్‌ పల్మోనాలజీ విభాగాధిపతి, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అరుణేష్ కుమార్- “తుమ్ము ఒక రక్షణ విధానం. మీ శరీర ప్రతిచర్య (తుమ్ములు) అధికంగా ఉంటే అదొక సమస్య అవుతుంది. మీ వాయునాళాలు ఎంత సున్నితమైనవైతే అంత ఎక్కువగా తుమ్ములు వస్తాయి. అందువల్ల మీరు తరచూ తుమ్ముతుంటారు” అన్నారు. 

కొందరు ఎప్పుడూ ఎందుకు తుమ్ముతుంటారు? 

అస్సాంలోని గౌహతిలో నివసించే 47 ఏళ్ల బిహు డ్యాన్సర్ మౌషుమీ పాఠక్ 20 ఏళ్లుగా అలెర్జీలతో బాధపడుతున్నారు. నిరంతరం తుమ్ముతూండే వ్యక్తిగా మిత్రులు, కుటుంబ సభ్యులకు ఆమె తెలుసు. దుమ్ము, దుమ్ము పురుగులు, పుప్పొడి  సహా ఇప్పటిదాకా దాదాపు 35 కారకాలు ఆమెకు అలెర్జీ కలిగిస్తాయని పరీక్షల్లో నిర్ధారణ అయింది. రుతువులు మారే సమయంలో ఆమె అలెర్జీ బాధలు గరిష్ఠ స్థాయికి చేరుతుంటాయి. 

“ఈ కారకాల వల్ల నాకు పదేపదే తుమ్ములు వస్తుంటాయి” అని పాఠక్ చెప్పారు. “ఒక సందర్భంలో కళ్లు వాచి, నీరు కారడం, విపరీతమైన అలసటతో బాధపడ్డాను. అందువల్ల  ఎప్పుడైనా వరుసబెట్టి తుమ్ములు వస్తుంటే దాన్ని ఆపడానికి వైద్యులు సూచించిన అలెర్జీ నివారణ మాత్రలను ఎప్పటికీ నాతో ఉంచుకుంటాను” అని ఆమె చెప్పారు.. 

రోజులో ఎప్పుడైనా ఒకటిరెండు సార్లు తుమ్ములు రావడం సహజమేగానీ, పదేపదే తుమ్మడం మాత్రం ‘అలెర్జిక్ రైనైటిస్‌’కు సంకేతమని డాక్టర్ కుమార్ చెప్పారు. “తుమ్ములు ఎక్కువగా బాధిస్తున్నపుడు వైద్యుల వద్దకు వెళ్తే అలెర్జీ నివారణ మందులు సూచిస్తారు. తద్వారా మీ జీవన నాణ్యత మెరుగవుతుంది” అని ఆయన చెప్పారు. 

డాక్టర్ రెడ్డి ఏమంటారంటే- “కొన్ని అలెర్జీ కారకాలు ముక్కును చికాకు పెట్టినప్పుడు, అది హిస్టామైన్‌ విడుదలకు సంకేతాలను పంపుతుంది. అది విడుదల కావడమే ముక్కు లోపల అసలు చికాకు లేకపోయినా అలెర్జీకి ప్రతిచర్యలో భాగంగా నిరంతరం తుమ్ములు రావడానికి కారణం” అని వివరించారు 

“అలెర్జిక్‌ రైనైటిస్‌ను అదుపులో ఉంచాలంటే అలెర్జీ కారణమయ్యే వాటికి దూరంగా ఉండటమే మంచి మార్గం” అని ఢిల్లీలోని మాక్స్ హాస్పిటల్స్‌ పల్మోనాలజీ-స్లీప్ మెడిసిన్ సీనియర్ డైరెక్టర్ డాక్టర్ ఇందర్ మోహన్ చుగ్ చెప్పారు. 

కొందరు ఎందుకు మరీ గట్టిగా తుమ్ముతారు 

కొందరు ఇతరులకన్నా గట్టిగా తుమ్ముతుంటారు. దీనిపై డాక్టర్ రెడ్డి- “బలంగా ఉండే పురుషుల్లో ఊపిరితిత్తుల సామర్థ్యం ఎక్కువ కాబట్టి చాలా గట్టిగా తుమ్ముతారు. అందుకే వారి తుమ్ము శబ్దం కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే – వ్యక్తి శరీర నిర్మాణం, ఊపిరితిత్తుల సామర్థ్యంపైనా తుమ్ము పరిమాణం ఆధారపడి ఉంటుంది” అని చెప్పారు. 

“వ్యక్తుల బరువు, శరీర నిర్మాణం, మెడ-నోరు పరిమాణం వంటివి తుమ్ము తీరును నిర్ణయిస్తాయి” అని డాక్టర్‌ కుమార్‌ చెప్పారు. “కొందరు చిన్నతనం నుంచే ఒక తరహాకు అలవాటు పడతారు. ఉదాహరణకు పాశ్చాత్య సమాజాల్లో వీలైనంత మెల్లగా తుమ్మడం అలవాటు చేస్తారు. అయితే, వీలైనంత వరకూ ఎవరికి సహజమైన తీరులో వారు తుమ్మడం మంచిదని నా సలహా” అన్నారు. 

తుమ్మును ఆపకూడదని ఎందుకంటారు 

‘ది అమెరికన్ జర్నల్ ఆఫ్ రైనాలజీ అండ్‌ అలర్జీ’లో ప్రచురితమైన 2019నాటి వ్యాసం ప్రకారం- తుమ్మేటపుడు సహజంగా అసాధారణ ఒత్తిడి పుడుతుంది. తుమ్మును అణచేందుకు యత్నిస్తే ఆ ఒత్తిడి సాధారణంకన్నా 5 నుంచి 24 రెట్లు అధికమవుతుంది. తుమ్మును ఆపకూడదని చెప్పడానికి కారణం ఇదే. ఊపిరితిత్తుల పరిమాణం, ఒత్తిడి పురుషులలో ఎక్కువ కాబట్టి తుమ్మును అణచివేస్తే కలిగే దుష్ప్రభావం వారిలో ఎక్కువ.  

   “తుమ్మును ఆపడానికి ప్రయత్నిస్తే హాని కారకం శరీరంలోనే ఉండిపోతుంది. అది వివిధ ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది” అని డాక్టర్ కుమార్ చెప్పారు. 

డాక్టర్ రెడ్డి వివరణ ప్రకారం- “తుమ్మును అణచుకోవడమంటే- ముక్కునుంచి వెలువడాల్సిన గాలిని అధిక పీడనంతో చెవికి మళ్లించడమే. ఫలితంగా కర్ణభేరి దెబ్బతిని వినికిడి సమస్యకు దారితీసే ముప్పుంది. కాబట్టి తుమ్మును అణచి వేయాల్సిందిగా ఎప్పుడూ సూచించం” అన్నారు. 

తుమ్మును ఎప్పుడు ఆపాలి 

 ఒక అవయవం లేదా కణజాలం పొత్తికడుపులోని బలహీన కండరాలు లేదా కణజాలాల పొరల ద్వారా కింది నెట్టబడితే ఆ పరిస్థితిని ‘అబ్డామినల్‌ హెర్నియా’ అంటారు. అటువంటి పరిస్థితి ఉన్నపుడు బలహీన ఉదర కండరాలు మరింత ఒత్తిడికి గురికాకూడదు. కానీ,  తుమ్ము వచ్చినపుడు పొత్తికడుపుపై ఒత్తిడిపడి ముప్పు కలుగుతుంది. ఎందుకంటే- తుమ్మడంలో అవి [ఉదర  కండరాలు] కీలకపాత్ర పోషిస్తాయి. 

   “మీరు శ్వాస తీసుకున్నపుడు పొత్తికడుపు ఉబ్బి, పెద్దది కావడం గమనించే ఉంటారు. ఈ ప్రక్రియలో ఊపిరితిత్తుల దిగువనగల డయాఫ్రమ్ ఉదరాన్ని కిందికి నెడుతుంది. తర్వాత ఊపిరి విడిచినపుడు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని తగ్గిస్తూ ఆ గాలిని బయటకు పంపడం కోసం డయాఫ్రమ్ ఉదర కండరాలద్వారా పైకి నెట్టబడుతుంది. అందువల్ల మనం తుమ్మినపుడు డయాఫ్రమ్‌తోపాటు పొత్తికడుపు కండరాలు ఏకకాలంలో కుదించబడి గాలిని వేగంగా బయటకు నెట్టివేస్తాయి” అని డాక్టర్ రెడ్డి చెప్పారు. 

 తుమ్ము అనేది ఛాతీ గోడలు, మెడ, ముఖం, పొత్తికడుపు కండరాల పాత్రగల ప్రక్రియ అని డాక్టర్ కుమార్ చెప్పారు. “ఇవన్నీ కలసి తుమ్ము రావడానికి దోహదం చేస్తాయి” అని ఆయన వివరించారు. “ఎవరికైనా హెర్నియా ఉంటే పొత్తికడుపులో ఒత్తిడి పెరగడం వల్ల తుమ్మినప్పుడు అది పొత్తికడుపును దెబ్బతీయవచ్చు. ఆగకుండా తుమ్ములు వస్తుంటే హెర్నియా పరిస్థితి మరింత దిగజారుతుంది” అని ఆయన స్పష్టం చేశారు. 

గుర్తుంచుకోవాల్సిన అంశాలు

   తుమ్ము అంటే- బాహ్య హానికర చికాకు కారకాలను శరీరం నుంచి నెట్టివేసే సహజ రక్షణ యంత్రాంగం. అయితే, పదేపదే తుమ్ములు వస్తుంటే అది అలెర్జిక్‌ బ్రాంకైటిస్‌ సంకేతం కావచ్చు. తుమ్మును ఎప్పుడూ ఆపకూడదని నిపుణులు సలహా ఇస్తున్నప్పటికీ, హెర్నియా ఉన్నవారిలో బలహీన ఉదర కండరాలు ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాలి కాబట్టి తుమ్ము హానికరం కాగలదు. 

మీ అనుభవాన్ని లేదా వ్యాఖ్యలను పంచుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ట్రెండింగ్

వ్యాసాలు

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient
We use cookies to customize your user experience, view our policy here

మీ అభిప్రాయం విజయవంతంగా సమర్పించబడింది.

హ్యాపీయెస్ట్ హెల్త్ టీమ్ వీలైనంత త్వరగా మిమ్మల్ని సంప్రదిస్తుంది