728X90

0

0

0

ఈ వ్యాసంలో

అకస్మాత్తుగా ఛాతి నొప్పి వస్తే ఏం చేయాలి?
4

అకస్మాత్తుగా ఛాతి నొప్పి వస్తే ఏం చేయాలి?

అన్ని ఛాతి నొప్పులు గుండెపోటు కాదు. కానీ ఛాతి నొప్పిని కూడా నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే, వైద్యుల సలహా లేకుండా గుండెకు సంబంధించిన మందులు తీసుకోకపోవడం చాలా ముఖ్యం.

అకస్మాత్తుగా ఛాతి నొప్పి రావడం మనలో భయానక అనుభూతిని కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించడం, తదుపరి పరీక్షల కోసం సమీప ఆరోగ్య కేంద్రానికి చేరుకోవడం చాలా ముఖ్యం. దాని గురించి భయాందోళన చెందడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతుందని వారు అంటున్నారు. అయితే అన్ని ఛాతి నొప్పులు గుండెపోటు కాదు. కానీ ఛాతి నొప్పిని కూడా నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే, వైద్యుల సలహా లేకుండా గుండెకు సంబంధించిన మందులు తీసుకోకపోవడం చాలా ముఖ్యం.

అన్ని ఛాతి నొప్పులు గుండెపోటు కాదు

కొన్ని ప్రచారం చేయబడిన మెడికల్ కిట్‌ల నుంచి మందులు తీసుకోవడం, ప్రిస్క్రిప్షన్లు లేకుండా సోషల్ మీడియాలో సందేశాలను అనుసరించడం వల్ల అటువంటి పరిస్థితుల్లో సహాయం కంటే ఎక్కువ హాని చేస్తుంది. కాన్పూర్‌కు చెందిన ఒక వైద్యుడు ఏడు రూపాయల గుండెపోటు కిట్ గురించి ఇటీవల సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఇందులో ముఖ్యంగా ఆస్పిరిన్ ఆధారిత బ్లడ్ థిన్నర్, కార్డియాక్ మజిల్ రిలాక్సింగ్ టాబ్లెట్ మరియు కొలెస్ట్రాల్ తగ్గించే మందు ఉన్నాయి. బ్లడ్ థిన్నర్‌లు తప్ప, మిగిలిన రెండు కూడా నిజమైన గుండెపోటు రాకముందే చాలా సందర్భోచితంగా ఉన్నాయని, తర్వాత కాదని నిపుణులు సూచించారు. ఈ మందులు కూడా వైద్యుల సలహా మేరకే తీసుకోవాలి.

ఆకస్మిక ఛాతి నొప్పికి మనం మొదట ఎలా స్పందించాలంటే..

అకస్మాత్తుగా ఛాతి నొప్పి వచ్చినప్పుడు, ఒక వ్యక్తి కూర్చోవడం కానీ లేదా పడుకోవడం చేయాలి. వీలైనంత వరకూ తిరగడం మానుకోవాలని, గుండెపోటుకు గురైనట్లయితే పరిస్థితి మరింత దిగజారుతుందని వైద్యులు చెబుతున్నారు. ఛాతి నొప్పిని ఈసీజీ ద్వారా నిర్ధారించవచ్చు. అయితే ఇది గుండెకు సంబంధించినది అయితే అది ప్రాణాంతకం కావచ్చు. గుండె పోటు వచ్చాక గోల్డెన్ అవర్ లోపు ఆసుపత్రికి చేరుకుంటే 99 శాతం బతికే అవకాశం ఉంది అని గోవాలోని మణిపాల్ ఆస్పత్రిలోని ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ జ్యోతి కుస్నూర్ చెప్పారు.

బెంగళూరులోని అపోలో హాస్పిటల్స్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అభిజిత్ విలాస్ కులకర్ణి మాట్లాడుతూ.. మధుమేహం, రక్తపోటు, ఒత్తిడి మరియు గుండెకు సంబంధించిన వ్యాధులు కుటుంబంలో ఉండటం వంటి ప్రమాద కారకాలు ఉన్న వ్యక్తికి ఛాతి నొప్పి వస్తే అది గుండె సంబంధితంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఛాతి, చేయి మరియు దవడలలో నొప్పి మరియు శ్వాస ఆడకపోవడం గుండె సమస్యలను సూచిస్తాయి. కానీ ఇది అసిడిటీ, కండరాల నొప్పి, చేయి నొప్పి, స్పాండిలోటిక్ నొప్పి లేదా మానసిక సమస్యల వల్ల కూడా కావచ్చు. ఎవరికైనా ఛాతి నొప్పి వస్తే, అది ఆందోళనను పెంచడంతో పాటు, చెమటలు పట్టడం మరియు శ్వాస ఆడకపోవడాన్ని కూడా కలిగిస్తుంది. డాక్టర్ కుస్నూర్ మాట్లాడుతూ.. ”ఛాతి నొప్పి అసిడిటీ వల్ల వచ్చినట్లయితే, వ్యక్తి పడుకున్నప్పుడు అది మరింత తీవ్రమవుతుంది. అయితే అది గుండె సమస్యల కారణంగా ఉంటే మాత్రం సాధారణంగా పనిచేసే సమయంలో తీవ్రమవుతుంది” అని చెప్పారు.

బెంగళూరు కావేరి ఆస్పత్రి, సీనియర్ కన్సల్టెంట్, కార్డియాలజీ డాక్టర్ దీపక్ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. గుండె లేదా ఇతర కారణాల నుంచి ఛాతి నొప్పిని వేరు చేయడం ఎవరికైనా (శిక్షణ పొందిన వైద్య నిపుణులు తప్ప) కష్టం. గ్యాస్ట్రిక్ సమస్య కారణంగా ఛాతి నొప్పి వచ్చినప్పుడు తీసుకోవలసని ఏకైక సురక్షితమైన ఔషదం ఆస్పిరిన్ లేదా యాంటాసిడ్ ఒక డోస్‌గా తీసుకోవాలి అని దీపక్ కృష్ణమూర్తి చెప్పారు. అయితే గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారికి ఆస్పిరన్ తీసుకోవడం వల్ల బర్నింగ్ సెన్సేషన్‌ను మరింత తీవ్రతరం చేస్తుంది. ఎందుకంటే ఇది ఆమ్లత్వాన్ని కలిగిస్తుంది” అని డాక్టర్ కులకర్ణి చెప్పారు.

కారణం లేకుండా కార్డియాక్ మందులు ఎందుకు తీసుకోకూడదు?

ఇప్పటికే గుండె జబ్బులు ఉన్నట్లు నిర్ధారణ అయిన వారికి మరియు గుండెపోటు వచ్చే ప్రమాదం ఉన్నవారికి సాధారణంగా బ్లడ్ థిన్నర్స్ మరియు స్టాటిన్స్ సూచించబడతాయి. కానీ ఈ మందులను వైద్యపరంగా తీసుకుంటే ప్రమాదకరమైన దుష్ప్రభావాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ”ఉదాహరణకు, గ్యాస్ట్రిక్ అల్సర్ ఉండి బ్లడ్ థిన్నర్స్ తీసుకుంటే, వారు రక్తస్రావం మరియు ఇతర సమస్యలను ఎదుర్కొంటారు. నైట్రేట్ క్లాస్ డ్రగ్స్‌లోని కొన్ని మందులు గుండె సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. అయితే గుండె సంబంధిత ఛాతి నొప్పికి తీసుకుంటే, అది తీవ్రమైన తలనొప్పికి కారణమవడంతో పాటు రక్తపోటును తగ్గిస్తుంది. దీని వల్ల వ్యక్తి స్పృహ కోల్పోతాడు అని డాక్టర్ కృష్ణమూర్తి పేర్కొన్నారు.

తీవ్రమైన ఛాతి నొప్పి విషయంలో గుండె సంబంధిత అత్యవసర పరిస్థితులకు ప్రతిస్పందించడానికి నిపుణులు సమీపంలోని ఆస్పత్రికి చేరుకోవడం లేదా సరైన సౌకర్యాలతో అంబులెన్స్‌కు కాల్ చేయడం గురించి నొక్కి చెప్పారు. ఛాతి నొప్పి గుండెకు సంబంధించినది అయితే అదిఅరిథ్మియాకు కారణమవుతుంది. కాబట్టి, అంబులెన్స్‌కు కాల్ చేయడం లేదా డీఫిబ్రిలేటర్ యాక్సెస్ ఉన్న ఆసుపత్రికి చేరుకోవడం వలన ప్రాణాలను కాపాడుతుంది. కొందరు అపస్మారక స్థితికి కూడా చేరుకోవచ్చు. అయితే ఇది కచ్చితంగా గుండె సంబంధితమైనది కాదు. ఇది నరాల వ్యాధి లేదా కొన్నిసార్లు మానసిక సమస్యలతో కూడా సంభవించవచ్చు. తనతో పాటు ఉన్న సంరక్షకుడు పల్స్‌ని తనిఖీ చేస్తుండాలి మరియు పల్స్ కనుగొనలేకపోతే సీపీఆర్ ఇవ్వగలగాలి అని డాక్టర్ కులకర్ణి చెప్పారు. వ్యక్తి స్పృహలోకి వచ్చే వరకూ లేదా వైద్య సహాయం అందే వరకు తనతో పాటు ఉన్న వ్యక్తి సీపీఆర్ ఇవ్వడం కొనసాగించాలి.

గుర్తుంచుకోవాల్సినవి

అన్ని ఛాతి నొప్పులు గుండెపోటు కాదు. కాబట్టి, తదుపరి చర్య తీసుకునే ముందు దాని వెనుక ఉన్న కారణాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
-గుండె సంబంధిత సమస్యల వల్ల ఛాతినొప్పి వచ్చిందో లేదో నిర్ధారించుకోకుండా ఏ కార్డియాక్ కిట్ నుండి మందులను తీసుకోకుండా ఉండటం ముఖ్యం. లేకపోతే అవి దుష్ప్రభావాలను కలిగిస్తాయి.
-ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఛాతి నొప్పి వస్తే వీలైనంత త్వరంగా సమీపంలోని ఆసుపత్రికి చేరుకోండి అని నిపుణులు అంటున్నారు.

మీ అనుభవాన్ని లేదా వ్యాఖ్యలను పంచుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ట్రెండింగ్

వ్యాసాలు

0

0

0

Opt-in To Our Daily Newsletter

* Please check your Spam folder for the Opt-in confirmation mail

Opt-in To Our
Daily Newsletter

We use cookies to customize your user experience, view our policy here

మీ అభిప్రాయం విజయవంతంగా సమర్పించబడింది.

హ్యాపీయెస్ట్ హెల్త్ టీమ్ వీలైనంత త్వరగా మిమ్మల్ని సంప్రదిస్తుంది