728X90

0

0

0

ఈ వ్యాసంలో

పీరియడ్స్ సమయంలో సెక్స్ సురక్షితమేనా?
27

పీరియడ్స్ సమయంలో సెక్స్ సురక్షితమేనా?

రుతుక్రమంలో సెక్స్ చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని కూడా నిపుణులు హైలెట్ చేశారు.

బుుతుస్రావం సమయంలో సెక్స్ చేయాలా వద్దా అనే దానిపై గందరగోళం ఉన్నప్పటికీ, నిపుణులు ఎటువంటి ఆరోగ్య ప్రమాదాలు ఉండవని అంటున్నారు. రుతుక్రమంలో సెక్స్ చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని కూడా నిపుణులు హైలెట్ చేశారు. ఉదాహరణకు, బుుతుస్రావం (పీరియడ్స్ సమయంలో గర్భాశయం నుంచి విడుదలయ్యే రక్తం మరియు ఇతర పదార్థాలు) సహజమైన కందెనగా పనిచేస్తాయి. ఇవి సంభోగాన్ని సులభతరం చేస్తాయని బెంగళూరులోని అపోలో ఆస్పత్రి ప్రసూతి మరియు గైనకాలజిస్ట్ డాక్టర్ సహానా కెపి చెప్పారు. ఉద్వేగ సమయంలో విడుదలయ్యే ఎండార్ఫిన్లు (హ్యాపి హార్మోన్లు) కూడా బుుతు తిమ్మిరి నుంచి ఉపశమనం పొందేందుకు మరియు మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

పీరియడ్స్ సమయంలో సెక్స్ చేయడం సురక్షితమేనా?

సామాజికంగా, సాంస్కృతికంగా రుతుస్రావం గురించిన ఆచారాలు, వివిధ నమ్మకాలు అన్ని ప్రాంతాలలో పాతుకుపోయాయి. కాలం మారుతున్నా బుుతుస్రావం ఇప్పటికీ కూడా అపరిశుభ్రంగా పరిగణించబడుతుంది. ఇది మహిళల శారీరక, మానసిక ఆరోగ్యం, లైంగికత మరియు సామాజిక స్థితిని ప్రబావితం చేస్తుంది.

సామాజిక కట్టుబాట్లు కాకుండా, ఈ సమయంలో మహిళలు బుుతు తిమ్మరి లేదా పొత్తి కడుపు తిమ్మిరిని ఎదుర్కోవచ్చు. బెంగళూరులోని హబీబా క్లినిక్‌లోని ప్రసూతి వైద్యుడు, స్త్రీ జననేంద్రియ నిపుణుడు, వంధ్యత్వ నిపుణుడైన డాక్టర్ షేక్ హబీబా.. మాట్లాడుతూ.. కొంతమంది స్త్రీలు పీరియడ్స్ సమయం విపరీతమైన బాధను, నొప్పిని కలిగి ఉంటారు. ప్రత్యేకించి వారికి ఎండోమెట్రియోసిస్ (గర్భాశయం యొక్క పొరను పోలిన కణజాలం గర్భాశయం వెలుపల పెరిగే పరిస్థితి) ఉన్నట్లయితే, ముఖ్యంగా బాధాకరమైన కాలాల భయంతో వారి పీరియడ్స్‌లో సెక్స్‌కు దూరంగా ఉండటానికి ప్రయత్నించవచ్చు అని చెప్పారు.

బుుతుస్రావం సమయంలో స్త్రీలు యోని ఇన్ఫెక్షన్లకు ఎక్కువగా గురవుతారు అని ఒక అధ్యయనం నివేదిస్తుంది. బహిష్టురక్తం, ఇది కొద్దిగా ఆల్కలీన్, యోని pH పెరుగుదలకు కారణమవుతుంది. ఇది హార్మోన్ల అసమతుల్యతతో పాటు, యోనిలోని మైక్రోఫ్లోరాకు భంగం కలిగించి, ఇన్ఫెక్షన్లను ఆహ్వానిస్తుంది. పీరియడ్స్‌ సమయంలో సెక్స్‌లో పాల్గొన్నప్పుడు లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్లు (ఎస్‌టిఐ) సంక్రమించవచ్చని వైద్యులు గుర్తు చేస్తున్నారు.

బహిష్టు సమయంలో సెక్స్ చేసిన తర్వాత గర్భం వస్తుందనే దాని గురించి కొందరికి ఆందోళన ఉంటుంది. ముంబైలోని ఫోర్టిస్ ఆస్పత్రి కన్సల్టెంట్, ప్రసూతి వైద్య నిపుణులు మరియు గైనకాలజిస్ట్ డాక్టర్ సుష్మా తోమర్ ఒక అరుదైన వియాన్ని పంచుకున్నారు. ముఖ్యంగా బుుతుస్రారం ఆలస్యంగా ఉన్నప్పుడు, చిన్న సైకిల్స్ ఉన్నవారిలో సంభవించవచ్చు. ఉదాహరణకు 28 రోజులకు బదులుగా 22-23 రోజులు(సుమారు మూడున్నర వారాలు) సైకిల్ ఉన్నవారిలో అండోత్సర్గము కొంచెం ముందుగానే ఉంటుంది. అందువల్ల, గర్భం దాల్చే అవకాశాలు ఉన్నాయి.

బుుతుస్రావం సమయంలో సెక్స్ వల్ల కలిగే ప్రయోజనాలు

బహిష్టు సమయంలో సెక్స్‌లో పాల్గొనడం వల్ల కొన్ని ప్రయోజనాలు పొందవచ్చు. లైంగిక చర్య ఎండార్ఫిన్‌ల విడుదలకు దారితీస్తుంది. ఇది మెరుగైన మానసిక స్థితి మరియు ఒత్తిండి తగ్గింపుకు దోహదం చేస్తుంది. ”బుుతుస్రావం రక్తం సహజమైన కందెనగా పనిచేయడంతో పాటు పీరియడ్స్ సమయంలో లైంగిక సంపర్క ప్రక్రియకు సహాయపడుతుంది అని డాక్టర్ సహానా జతచేశారు. అంతేకాకుండా పీరియడ్స్ సమయంలో, స్త్రీల లైంగిక అవయాలు చాలా సున్నితంగా మారతాయి. ఇది ఉన్నతస్థాయి ఆనందానికి దోహదపడుతుంది. బుుతుస్రావం సమయంలో సంభోగం సాధారణమని భావించి ఇద్దరూ అంగీకరించినప్పుడు లైంగిక సాన్నిహిత్యం యొక్క అన్ని ప్రయోజనాలను పొందవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.

బుుతుస్రావం సమయంలో సాన్నిహిత్యం

భద్రతా చర్యలు తీసుకోండి
లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు (STIలు) లేదా ఇతర ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించడానికి, డాక్టర్ తోమర్ సెక్స్ సమయంలో కండోమ్‌లను ఉపయోగించాలని అలాగే వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని సూచించారు.

గందరగోళాన్ని అరికట్టండి

మీ పీరియడ్స్ సమయంలో సన్నిహితంగా ఉన్నప్పుడు ఏదైనా గందరగోళాన్ని గ్రహించడానికి తువ్వాలు లేదా ముదురు రంగు స్ప్రెడ్‌లు వ్యాప్తి చెందుతాయి అని డాక్టర్ తోమర్ చెప్పారు.
పరస్పరం వారి హద్దులను గౌరవించి, బహిరంగ సంభాషణను నిర్వహించడం ఆరోగ్యకరమైన సన్నిహిత జీవితానికి ప్రాథమిక అంశాలు అని డాక్టర్ సహానా అభిప్రాయపడ్డారు.

సారాంశం

ఈ సమయంలో లైంగిక చర్యలో పాల్గొనడం సాధారణంగా వైద్య దృక్కోణంలో సురక్షితంగా పరిగణించబడుతుంది.
ఈ సమయంలో STIలు వ్యాప్తి చెందకుండా, అవాంఛిత గర్భాలను నివారించడానికి కండోమ్‌లను ఉపయోగించవచ్చు.
పీరియడ్స్ సమయంలో సాన్నిహిత్యం బుుతు తిమ్మిరి నుంచి ఉపశమనానికి, మానసికస్థితిని పెంచడానికి మరియు భాగస్వాముల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచడానికి ప్రయోజనకరంగా ఉంటుంది.

మీ అనుభవాన్ని లేదా వ్యాఖ్యలను పంచుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ట్రెండింగ్

వ్యాసాలు

0

0

0

Opt-in To Our Daily Newsletter

* Please check your Spam folder for the Opt-in confirmation mail

Opt-in To Our
Daily Newsletter

We use cookies to customize your user experience, view our policy here

మీ అభిప్రాయం విజయవంతంగా సమర్పించబడింది.

హ్యాపీయెస్ట్ హెల్త్ టీమ్ వీలైనంత త్వరగా మిమ్మల్ని సంప్రదిస్తుంది