728X90

0

0

0

0

0

0

0

0

0

ఈ వ్యాసంలో

కంటి కింద నల్లటి వలయాలను సహజసిద్ధమైన మార్గాలతో అధిగమించండిలా..
12

కంటి కింద నల్లటి వలయాలను సహజసిద్ధమైన మార్గాలతో అధిగమించండిలా..

కంటి కింద నల్లటి వలయాలను కళ్లకు సంబంధించిన కొన్ని వ్యాయామాలు చేయడం ద్వారా; అలాగే మన వంట గదిలో అందుబాటులో ఉండే కొన్ని సహజసిద్ధమైన పదార్థాలను ఉపయోగించడం ద్వారా తరిమికొట్టవచ్చు. 

అలసిపోయిన ముఖం, చిన్నగా అయిపోయిన కళ్లు మరియు కంటి కింద నల్లటి వలయాలతో నిద్ర నుంచి మేలుకోవడానికి మీరు ఆందోళన చెందుతున్నారా? మార్పు చెందిన రంగు గల ఆ ప్యాచెస్‌ని నల్లని వలయాలు అని అంటారు. ఇవి హానికరం కాకపోవచ్చు. కానీ మానసికంగా ఇవి మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. 

నల్లని వలయాలు రావడానికి గల కారణాలు 

‘‘మన శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయులు ఉండాల్సిన స్థాయి కంటే తగ్గినప్పుడు శరీరంలోని కణజాలాలు వాటి విధులను నిర్వర్తించడంలో కాస్త నెమ్మదిస్తాయి. ముఖ్యంగా కళ్ల కింద ఉండే సన్నని తంతువులకు ఆక్సిజన్ అధిక మొత్తంలో అవసరం అవుతుంది కాబట్టి ఈ పరిస్థితికి ముందుగా అవే ప్రభావితం అవుతాయి. నల్లని వలయాలు ఉన్నవారిలో ఒక మోస్తరు నుంచి మధ్యస్థ స్థాయిలో అనీమియా (రక్తహీనత) కూడా ఉండచ్చు’’ అని అంటారు చెన్నైలోని డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రిలో ఆప్తాల్మజిస్ట్‌గా పని చేసే డాక్టర్ ఎమ్. రాజేశ్వరి. 

ఎక్కువ సమయం సూర్యరశ్మి సమక్షంలో ఉండడం వల్ల చర్మంలో మెలనిన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. రక్తప్రసరణ తగ్గడంతో పాటు; ఇలా ఉత్పత్తి అయిన మెలనిన్ కళ్ల చుట్టూ ఉన్న చర్మంలోకి వచ్చి చేరుతుంది. అయితే ఒక వ్యక్తిలో ఎంత మొత్తంలో మెలనిన్ ఉత్పత్తి అవుతుందనేది వారు ఎదుర్కొంటున్న శారీరక మరియు మానసిక పరిస్థితులు, ఒత్తిడి మీద ఆధారపడి ఉంటుంది.  

‘‘పని నిమిత్తం దీర్ఘకాలం పాటు ల్యాప్‌టాప్ ఉపయోగించడం వల్ల కళ్ల కింద నల్లని వలయాలు మరీ ఎక్కువగా ఉన్నాయి. ఇలా ల్యాప్‌టాప్‌ను ఎక్కువగా ఉపయోగించడం కూడా కళ్లకు అస్సలు మంచిది కాదు. హానికరమైన నీలం రంగు కాంతిని ఉద్గారించడం ద్వారా కంటికి అది ఒత్తిడి కలిగిస్తుంది’’ అంటారు కోయంబత్తూర్‌కు చెందిన 42 ఏళ్ల వనిత అనే ఒక ఐటీ ఉద్యోగిని. 

పిగ్మెంట్ డిజార్డర్స్ సొసైటీ యొక్క అధికారిక పబ్లికేషన్ 2018లో ప్రచురించిన పిగ్మెంట్ ఇంటర్నేషనల్ అనే ఒక అధ్యయనంలో ‘‘టీవీ చూడడం లేదా మొబైల్‌ అధిక సమయం పాటు ఉపయోగించడం, రోజుకి 6 గంటలు కంటే తక్కువ సమయం నిద్రపోవడం.. వంటివన్నీ కళ్లకు సరిపడ విశ్రాంతి అందకపోవడానికి గల కారణాలే. తద్వారా ఇవన్నీ కళ్ల కింద నల్లని వలయాలు రావడానికి కూడా కారణం అవుతున్నాయి. ఇలా అలసిపోయిన కంటి కండరాలు నల్లని వలయాలు అభివృద్ధి చెందడంలో కీలక పాత్ర పోషిస్తాయి. 

పొగాకు యొక్క పొగలో ఉన్న విషపదార్థాలు మన కంటి చుట్టూ ఉండే సున్నితమైన కణజాలాన్ని దెబ్బతీస్తాయి. అలాగే చిన్న రక్తనాళాలు కూడా పాడవుతాయి. ఈ కారణంగా కూడా నల్లని వలయాలు ఏర్పడతాయి. 

సమకాలీన ఔషధంతో నల్లని వలయాల సమస్యను నివారించడం 

 కంటి కింద ఉండే నల్లని వలయాల సమస్యను అధిగమించేందుకు కోయంబత్తూర్‌కు చెందిన మారుతి సిద్ధా క్లినిక్‌లో సిద్ధ స్పెషలిస్ట్‌గా పని చేస్తున్న డాక్టర్ కె అంబరాసన్ ఈ కింది సలహాలు అందించారు; 

  1.   రేగు పండు అనేది ఒక సీజనల్ పండు. ఇందులో విటమిన్ A, B1, B2 మరియు C తో పాటూ ఇనుము మరియు ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. నల్లని వలయాలు నివారించడానికి దీనిని చాలా ముఖ్యంగా ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇది చనిపోయిన చర్మ కణాలను తొలగించి కొత్త చర్మ కణాలు ఏర్పడేందుకు దోహదపడుతుంది. అలాగే కళ్లను చల్లగా ఉంచడంతో పాటూ జీర్ణక్రియకు కూడా తోడ్పడుతుంది.
  2. అల్లం టీ, నిమ్మ టీ, ఉసిరి రసం, నిమ్మ రసం మరియు బొప్పాయి కూడా రక్తం యొక్క సమతాస్థితిని నిర్వహించడంలో మనకు తోడ్పడతాయి. అలాగే మన శరీరంలో జరిగే రక్తప్రసరణను కూడా పెంచుతాయి. ఇవి విటమిన్ A, B మరియు C లను కలిగి ఉంటాయి. ఈ విటమిన్లు కొలాజెన్ ఉత్పత్తి చేయడం ద్వారా నల్లని వలయాలు తగ్గుముఖం పట్టేలా చేస్తాయి.
  3. టొమాటో రసాన్ని రోజుకి రెండుసార్లు చొప్పున 25 నుంచి 30 రోజుల పాటు రాసుకోవడం ద్వారా కూడా నల్లని వలయాల సమస్యను తగ్గుముఖం పట్టించవచ్చు. ఇలా టొమాటో రసం రాసుకున్న తర్వాత దానిని 5 నుంచి 10 నిమిషాల పాటు ఆరనిచ్చి ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది నిద్రలేమి, అధిక సమయం పాటు సూర్యరశ్మికి గురి కావడం వల్ల చిన్నవయసులోనే వచ్చే వృద్ధాప్యాన్ని నివారిస్తుంది.
  4. తురిమిన కీరాదోసను సాయంత్రం సమయంలో అప్లై చేసుకోవడం ద్వారా కూడా నల్లని వలయాలు తగ్గుముఖం పట్టేలా చేయచ్చు. అయితే ఇలా 20 – 25 రోజుల పాటు క్రమం తప్పకుండా చేయాలి. ముఖ్యంగా పొగ త్రాగడం మానేసినా ఆ పొగ కారణంగా నల్లని వలయాలు ఉండిపోయిన వారికి ఈ చిట్కా బాగా ఉపకరిస్తుంది. కీరాదోస అప్లై చేసిన తర్వాత 10 నుంచి 15 నిమిషాలు ఉంచి అనంతరం శుభ్రం చేసుకోవాలి.
  1. బంగాళదుంప రసం అనేది చక్కని శీతలకారిగా మనకు ఉపయోగపడుతుంది. కళ్ల చుట్టూ జరిగే రక్తప్రసరణను పెంచడానికి ఇది బాగా తోడ్పడుతుంది. దీనిని రోజుకోసారి ముఖం మీద అప్లై చేసి 10 నుంచి 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా నెల రోజుల పాటు క్రమం తప్పకుండా చేయాలి. బంగాళదుంపలో ఉన్న పదార్థం సెరటోనిన్ విడుదలయ్యేలా చేసి మనకు నిద్ర వచ్చేలా చేస్తుంది. కాబట్టి, ఒత్తిడి కారణంగా నిద్రపట్టని వారు ఈ చిట్కాను అనుసరించవచ్చు.
  2. పెరుగుని పసుపుతో కలిపి అప్లై చేయడం ద్వారా కూడా దానిలో గల యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా నల్లని వలయాల సమస్య నెమ్మదిస్తుంది. నెలకోసారి ఈ విధంగా చేయడం ద్వారా సమస్య నుంచి క్రమంగా బయటపడచ్చు. ఈ మిశ్రమాన్ని కంటి చుట్టూ అప్లై చేసి 10 నిమిషాలు పాటు ఆరనిచ్చి ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి. పెరుగులో ఉండే కొవ్వు పసుపుతో కలిసి చర్మంలో గల లోపలి పొరల ద్వారా చాలా సులభంగా శోషించుకోబడుతుంది.

‘‘మన మెదడు మరియు శరీరం ఒకదాని మీద మరొకటి ఆధారపడి ఉంటాయి. మానసికంగా కలిగే ఎలాంటి ఒత్తిడి అయినా నిద్ర లేమికి దారి తీస్తుంది. అది నల్లని వలయాలు, అలసిపోవడం.. వంటి లక్షణాలను చూపిస్తుంది. కళ్లను శుభ్రం చేసుకోవడం మరియు కళ్లకు సంబంధించిన కొన్ని వ్యాయామాలు చేయడం ద్వారా కళ్లను చాలా రిలాక్స్డ్‌గా ఉంచుకోవచ్చు’’ అంటారు తమిళనాడులోని పొలాచికి చెందిన ఆక్యుపంక్చర్ థెరపిస్ట్ జె కలైకీర్తి. 

ఒక కుండ లేదా బోర్‌వెల్ నుంచి తీసుకున్న స్వచ్ఛమైన నీటితో ఒక వెడల్పాటి గిన్నెని నింపాలి. మీ తుంటి భాగం ఉన్నంత ఎత్తులో దానిని మీ ముందు పెట్టుకోవాలి. ఇప్పుడు మీ నాలుకని బయటకు తీసి నిదానంగా శ్వాస తీసుకుంటూ గిన్నె దిశగా ముందుకు వంగండి. నీరు మీ నుదుటి నుంచి గడ్డం వరకు తగులుతున్నట్లుగా ఉండాలి. కళ్లు, ముక్కు మరియు నోటి భాగాలు మాత్రం నీటిలో మూడు నుంచి ఐదు సెకన్ల పాటు ఉంచాలి. చెవులను ఇలా ఉంచాల్సిన అవసరం లేదు. ఐదు సెకన్ల తర్వాత కాస్త రిలాక్స్ అవ్వండి. మీ నాలుకను కూడా సాధారణ స్థితికి తీసుకొచ్చేయండి. 

‘‘చైనీయుల సంప్రదాయ వ్యాయామం అయిన తదేకంగా చూడడం ద్వారా కళ్లలో తిరిగి శక్తిని నింపడానికి సహాయపడుతుంది. ఉదయాన్నే పరావర్తనం చెందుతున్న సూర్యరశ్మిని 10 నిమిషాల పాటు చూడడం ద్వారా కళ్లలోని నరాలు తిరిగి ఉత్తేజం అవుతాయి. కళ్లను రిలాక్స్ చేయడానికి చీకటిలో 10 నిమిషాల పాటు చూస్తూ ఉండండి. దీని ద్వారా కళ్ల చుట్టూ జరిగే రక్తప్రసరణ మెరుగు అవుతుంది. మరియు చూపు కూడా మెరుగ్గా ఉంటుంది’’ అంటారామె. 

 

సంబంధిత ట్యాగ్‌లు
సంబంధిత పోస్టులు

మీ అనుభవాన్ని లేదా వ్యాఖ్యలను పంచుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ట్రెండింగ్

వ్యాసాలు

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient
We use cookies to customize your user experience, view our policy here

మీ అభిప్రాయం విజయవంతంగా సమర్పించబడింది.

హ్యాపీయెస్ట్ హెల్త్ టీమ్ వీలైనంత త్వరగా మిమ్మల్ని సంప్రదిస్తుంది