728X90

0

0

0

అంశాలకు వెళ్లండి

గర్భవతులలో ఫ్యాటీ లివర్(కొవ్వు కాలేయం): ప్రమాదాలను అర్థం చేసుకోవడం
136

గర్భవతులలో ఫ్యాటీ లివర్(కొవ్వు కాలేయం): ప్రమాదాలను అర్థం చేసుకోవడం

సాధారణంగా మూడవ త్రైమాసికంలో సంభవించే, గర్భవతుల యొక్క  ఫ్యాటీ లివర్ అనేది కాలేయ కణాలలో కొవ్వు ఆకస్మిక నిక్షేపణ వలన సంభవించే సంభావ్య ప్రాణాంతక పరిస్థితి
గర్భవతులలో ఫ్యాటీ లీవర్
గర్భవతులలో ఫ్యాటీ లీవర్

సాధారణంగా మూడవ ట్రైమిస్టర్‌లో సంభవించే, గర్భవతుల యొక్క  ఫ్యాటీ లివర్ అనేది కాలేయ కణాలలో కొవ్వు ఆకస్మిక నిక్షేపణ వలన సంభవించే సంభావ్య ప్రాణాంతక పరిస్థితి.

గర్భవతులలో కొవ్వు కాలేయం (AFLP) అనేది గర్భవతులలో మూడవ త్రైమాసికంలో సాధారణంగా సంభవించే తీవ్రమైన సమస్య. ఇది చాలా అరుదు అయితే, నిపుణులు ఈ పరిస్థితిని అత్యంత తీవ్రమైన గర్భధారణ సంబంధిత ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో ఒకటిగా జాబితా చేస్తారు.

ముంబయిలోని నానావతి మాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని కాలేయం, ప్యాంక్రియాస్ మరియు ప్రేగుల మార్పిడి కోసం అడల్ట్ హెపటాలజీ మరియు ట్రాన్స్‌ప్లాంట్ మెడిసిన్ సెంటర్, DM హెపటాలజిస్ట్ మరియు ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ చేతన్ రమేష్ కలాల్, AFLP అంటే కాలేయ కణాలలో కొవ్వు అకస్మాత్తుగా నిక్షేపణ, ఇది కాలేయం పనిచేయకపోవడం మరియు చివరికి కాలేయ వైఫల్యానికి దారితీస్తుంది అని వివరించారు. కాలేయం యొక్క తీవ్రమైన పసుపు క్షీణత అని కూడా పిలువబడే ఈ పరిస్థితి తల్లి మరియు పిండం ఇద్దరికీ ప్రాణాపాయాన్ని కలిగిస్తుంది.

AFLPకి కారణమేమిటి?

చెన్నైలోని ఫోర్టిస్ మలార్,  గ్యాస్ట్రోఎంటరాలజీ మరియు కాలేయ మార్పిడి శస్త్రవైద్యుడు ప్రొఫెసర్ డాక్టర్ నీలమేకం తొప్పా కపాలి, ప్రెగ్నెన్సీ సమయంలో ఫ్యాటీ యాసిడ్‌ల జీవక్రియలో ఏర్పడే సమస్యల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుందని, ఊహించడం కష్టంగా ఉంటుందని చెప్పారు. AFLP కారణం యొక్క ఖచ్చితమైన స్వభావాన్ని ఇంకా నిర్ధారించలేదు. అయినప్పటికీ, కొవ్వు ఆమ్లాల విచ్ఛిన్నం సమయంలో మైటోకాండ్రియా పనిచేయకపోవడం వల్ల ఇది సంభవించవచ్చని ఇటీవలి పరిశోధనలు కొన్ని సూచిస్తున్నాయి. కొవ్వు ఆమ్లం విచ్ఛిన్నానికి కీలకమైన ఎంజైమ్‌లలో ఒకటి తప్పిపోయి, అదనపు కొవ్వు నిక్షేపణకు దారితీస్తుందని డాక్టర్ కలాల్ అభిప్రాయపడ్డారు. గర్భధారణ సమయంలో హార్మోన్ల సమతుల్యత కూడా ఈ పరిస్థితి యొక్క అభివ్యక్తిలో పాత్రను కలిగి ఉండవచ్చని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.

“ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టీరాన్ వంటి హార్మోన్లు గణనీయమైన ఒడిదుడుకులకు లోనవుతాయి, ఇవి కొవ్వు జీవక్రియతో సహా వివిధ జీవక్రియ ప్రక్రియలను ప్రభావితం చేస్తాయి. అవి కొవ్వు నిక్షేపణకు దారితీస్తాయి మరియు కాలేయ పనితీరును అకస్మాత్తుగా క్షీణింపజేస్తాయి, ”అని డాక్టర్ కలాల్ జోడించారు.

కాలేయంలో సాధారణ కొవ్వు పదార్ధం దాదాపు ఐదు శాతం ఉండాలి. అయినప్పటికీ, AFLP ఉన్న మహిళల్లో, ఇది 13 నుండి 19 శాతం వరకు పెరుగుతుంది. హెపటోసైట్స్ (లిపిడ్ బ్రేక్‌డౌన్‌లో పాల్గొన్న కాలేయ కణాలు) ద్వారా ఉత్పత్తి చేయబడిన అమ్మోనియాతో పాటుగా ఈ అదనపు కొవ్వు నిక్షేపాలు కాలేయ వైఫల్యానికి దారితీసే ప్రధాన కారకాలు.

ముందు జాగ్రత్తలు

గర్భం దాల్చడం అనేది స్త్రీ శరీరంలో పెను మార్పులకు కారణమవుతుందని డాక్టర్ కపాలి వివరిస్తున్నారు. అందువల్ల, ఆల్కహాల్ వినియోగాన్ని తగ్గించడం, బరువును అదుపులో ఉంచుకోవడం మరియు ఆరోగ్యకరమైన ఆహారంతో బాగా సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా అవసరం. తీవ్రమైన కాలేయ సమస్యలను నివారించడానికి వ్యక్తి సురక్షితంగా ఉండాలి మరియు గర్భధారణ సమయంలో తనను తాను పర్యవేక్షించుకోవాలి మరియు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి.

ప్రీనాటల్ కేర్ అనేది చాలా ముఖ్యమైన విషయం అని డాక్టర్ కలాల్ అభిప్రాయపడ్డారు. రెగ్యులర్ చెకప్ తల్లి మరియు పిండం రెండింటి ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి డాక్టర్‌ను అనుమతిస్తుంది. ఇంకా, ఉత్తేజాన్ని కలిగించే మాదకద్రవ్యాలు మరియు మాదకద్రవ్య దుర్వినియోగాన్ని నివారించడం చాలా ముఖ్యం. తగినంత విశ్రాంతి, ఒత్తిడి నిర్వహణ, తక్షణ వైద్య సంరక్షణ మరియు ముందస్తుగా గుర్తించడం కూడా గణనీయమైన వ్యత్యాసాన్ని కలిగిస్తుంది.

పిండం లేదా బిడ్డను ప్రభావితం చేస్తుందా?

“ఇది సంభవించే మూడవ ట్రైమిస్టర్ యొక్క నెలపై ఆధారపడి, AFLP శిశువుపై వివిధ ప్రభావాలను కలగచేస్తుంది” అని డాక్టర్ కపాలి తెలియజేసారు. ఏడవ నెలలో జరిగే ముందస్తు సంఘటనల వల్ల అకాల డెలివరీ వలన నవజాత శిశువు అభివృద్ధిపై ప్రభావం పడుతుంది.

అదనంగా, పిండం సాధారణంగా హైపోగ్లైసీమియా (తక్కువ షుగర్) కోసం గమనించబడాలని డాక్టర్ కలాల్ హైలైట్ చేశారు. “ఫ్యాటీ యాసిడ్ జీవక్రియలో లోపం కారణంగా, పిండంలో షుగర్ మరియు మూర్ఛలకు గురవుతుంది,” అని ఆయన చెప్పారు. కాబట్టి, మనం చాలా అప్రమత్తంగా మరియు వాటిని పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది.

గర్భవతులలో తీవ్రమైన కొవ్వు కాలేయానికి చికిత్స

AFLPలో  ముందస్తుగా గుర్తించడం మరియు సత్వర వైద్య జోక్యం చాలా ముఖ్యమైనవి. వ్యక్తిలో అది నిర్ధారణ అయిన తర్వాత, తల్లి మరియు పిండం రెండింటిపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి అని డాక్టర్ కలాల్ వివరిస్తున్నారు.

అత్యవసరమైన చికిత్స ముందస్తు ప్రసవం మాత్రమే. “AFLP ప్రసవం తర్వాత పరిష్కరించబడుతుంది మరియు తల్లి ఆరోగ్యం సాధారణ స్థితికి వస్తుంది” అని డాక్టర్ కపాలి వివరించారు. కాలేయం పనిచేయకపోవడం శ్వాసకోశ మరియు మూత్రపిండాల సమస్యలకు దారి తీస్తుంది, ఇది తల్లి మరియు బిడ్డ ఇద్దరికీ ప్రాణాంతకం కావచ్చు కాబట్టి డెలివరీ చాలా ముఖ్యమైనదని ఆయన చెప్పారు.

“చాలా సందర్భాలలో తగిన వైద్య సంరక్షణ, ముందస్తు రోగ నిర్ధారణ మరియు వెంటనే డెలివరీ చేయడం ద్వారా నిర్వహించవచ్చు” అని డాక్టర్ కలాల్ పంచుకున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో గర్భం యొక్క తీవ్రమైన కొవ్వు కాలేయం చాలా ఆలస్యంగా నిర్ధారణ అయినట్లయితే మరియు కాలేయ వైఫల్యం సంభవించినట్లయితే, గర్భిణీ స్త్రీకి కాలేయ మార్పిడి అవసరం కావచ్చు.

గుర్తుంచుకోవలసినవి

  • గర్భం ఉన్నప్పుడు ఫ్యాటీ లీవర్ అనేది అరుదైన కానీ తీవ్రమైన పరిస్థితి. సాధారణంగా ఇది మూడవ ట్రైమిస్టర్‌లో కనిపిస్తుంది.
  • కామెర్లు ఈ పరిస్థితికి ఒక సాధారణ లక్షణం. వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత, తల్లి మరియు పిండం ఇద్దరినీ నిరంతరం పర్యవేక్షించాలి.
  • ఇది తల్లికి మరియు బిడ్డకు ప్రాణాంతకం కావచ్చు మరియు వెంటనే ప్రసవం జరగాల్సి ఉంటుంది.
  • ముఖ్యంగా గర్భధారణ సమయంలో ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించడం మరియు సంక్లిష్టతలను నివారించడానికి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.

సంబంధిత ట్యాగ్‌లు
సంబంధిత పోస్టులు

మీ అనుభవాన్ని లేదా వ్యాఖ్యలను పంచుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ట్రెండింగ్

వ్యాసాలు

వ్యాసం
బెంగళూరుకు చెందిన పి.పార్వతి 20 ఏళ్లప్పుడు శ్వాస తీసుకోవడంలో చిన్నప్పుడు ఇబ్బంది పడేది. పరీక్షలు చేయించగా ఆమెకు ఆస్తమా ఉన్నట్లు నిర్దారించబడింది. ఇప్పుడు అది జరిగి 32 సంవత్సరాలు గడిచింది. 54 సంవత్సరాల వయస్సులో, పార్వతి తన కుమార్తె మరియు తనకంటే సగం వయస్సు కలిగిన స్నేహితులతో ట్రెక్‌లకు చాలా ఈజీగా వెళ్లగలుతుతోంది.
వ్యాసం
షోల్డర్ ఇంపింగ్‌మెంట్ సిండ్రోమ్ రివర్సిబుల్ అయినందున, నొప్పి యొక్క ప్రారంభ సంకేతాలను అనుభవించిన వెంటనే మీరు వైద్యుడిని సంప్రదించాలనిి సలహా ఇస్తారు.
వ్యాసం
ఎముక పునర్నిర్మాణాన్ని నిరోధించడం నుండి ఎముకల విరుగుట మరియు బోలు వ్యాధి ప్రమాదాన్ని పెంచడం వరకు, ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం ఎముకలకు శాశ్వత నష్టం కలిగిస్తుంది

0

0

0

Opt-in To Our Daily Newsletter

* Please check your Spam folder for the Opt-in confirmation mail

Opt-in To Our
Daily Newsletter

We use cookies to customize your user experience, view our policy here

మీ అభిప్రాయం విజయవంతంగా సమర్పించబడింది.

హ్యాపీయెస్ట్ హెల్త్ టీమ్ వీలైనంత త్వరగా మిమ్మల్ని సంప్రదిస్తుంది