728X90

0

0

0

0

0

0

0

0

0

ఈ వ్యాసంలో

మెదడులో రక్తపోటుకు జీవక్రియతో సంబంధం
1

మెదడులో రక్తపోటుకు జీవక్రియతో సంబంధం

మెదడులో రక్తపోటుకి న్యూరాలజీతో మాత్రమే కాకుండా, జీవక్రియతో కూడా సంబంధం ఉందని ఒక అధ్యయనంలో తేలింది.  

ఊబకాయంతో ఉన్న మహిళలు బరువు తగ్గితే వారి మెదడులో హైపర్ టెన్షన్(ఇడియోపతిక్ ఇంట్రాక్రానియల్ హైపర్ టెన్షన్) గణనీయంగా తగ్గిపోతుందని ఒక కొత్త పరిశోధనలో కనుగొన్నారు.   

బ్రెయిన్ హైపర్ టెన్షన్ లేదా ఇడియోపతిక్ ఇంట్రాక్రానియల్ హైపర్ టెన్షన్ (IIH) అనే సమస్యతో బాధపడే మహిళలకు నిరంతరాయమైన వెయిట్ లాస్ ప్రోగ్రామ్ వల్ల గణనీయమైన ప్రయోజనం కలుగుతుందని న్యూరాలజీ పేపర్‌లో ప్రచురితమైన ఒక కొత్త పరిశోధన చెబుతోంది.  

 బ్రెయిన్ హైపర్ టెన్షన్కి జీవక్రియకి మధ్య ఉన్న సంబంధాన్ని యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్ హామ్కి చెందిన ఒక టీం పరిశోధనలో కనుగొంది. ఆ స్థితిని ముందుగా రోగ నిర్ధారణ చేసేందుకు ఈ పరిశోధన బాటలు వెయ్యవచ్చు. దాంతో పాటు బరువు తగ్గడం వల్ల జీవక్రియలో వచ్చే అసమానతలు రివర్స్ అయ్యి, బ్రెయిన్ హైపర్ టెన్షన్‌ను తగ్గిస్తుందని పరిశోధకులు కనుగొన్నారు.   

మెదడులో సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్(మెదడు, వెన్నుపాము చుట్టూ ఉండే రంగులేని నీరు లాంటి ద్రావణం) ఎక్కువగా ఏర్పడడం వల్ల నాడీ కణాల మీద అదనపు ఒత్తిడి పడుతుంది అది బ్రెయిన్ హైపర్ టెన్షన్కి కారణం అవుతుంది.   

     బ్రెయిన్ హైపర్ టెన్షన్ సాధారణంగా ఊబకాయంతో ఉన్న మహిళలు గర్భంతో ఉన్న సమయంలో కనిపిస్తుంది. అది తలనొప్పికి, కంటి డిస్క్లో వాపుకి కారణం అవుతుంది. దృష్టి నాడిలో సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ సేకరించబడినప్పుడు అది శాశ్వతంగా కంటిచూపు కోల్పోయే ప్రమాదానికి కూడా దారితీస్తుంది. ఈ ద్రవం గనుక ఎక్కువగా చేరితే అది గుండె, రక్తనాళాల్ని ప్రభావితం చెయ్యగలదు. అయితే, బ్రెయిన్ హైపర్ టెన్షన్కి అసలైన కారణం ఏంటో ఇంత వరకూ పూర్తిగా అర్థం కాలేదు.  

 జీవక్రియలో వచ్చే అసమానతలకి, ఇడియోపతిక్ ఇంట్రాక్రానియల్ హైపర్ టెన్షన్(IIH) రావడానికి మధ్య సంబంధం గురించి ప్రొఫెసర్ అలెగ్జాండ్రా జేన్ సిన్ క్లెయిర్ అంతకు ముందు చేసిన పరిశోధనలో కనుగొన్న సంబంధం నుంచే ప్రస్తుత అధ్యయనం కూడా మొగ్గతొడిగింది. ప్రొఫెసర్ సిన్‌క్లెయిర్ న్యూరాలజీ పేపర్కి సీనియర్ రచయిత అలాగే యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్ హామ్లో న్యూరాలజీ ప్రొఫెసర్గా పని చేస్తున్నారు.  

   ఇడియోపతిక్ ఇంట్రాక్రానియల్తో బాధపడుతున్న మహిళల(18-55) నుంచి సేకరించిన రక్త, మూత్ర, సెరెబ్రోస్పైనల్ నమూనాల్ని పరిశోధకులు విశ్లేషించారు. యూకేలోని నేషనల్ హెల్త్ సర్వీస్కి చెందిన న్యూరాలజీ, ఆప్తల్మాలజీ క్లినిక్ల నుంచి ఆ శాంపిల్స్ని సేకరించారు. సాధారణ గ్రూపులతో పోలిస్తే ఇడియోపతిక్ ఇంట్రాక్రానియల్ హైపర్ టెన్షన్తో బాధపడుతున్న మహిళల్లో జీవక్రియ అసమానతలు ఉన్నట్టు ఆ విశ్లేషణలో కనుగొన్నారు.  

 ఇడియోపతిక్ ఇంట్రాక్రానియల్ హైపర్ టెన్షన్తో బాధపడుతున్న వారిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వృద్ధి చెందిందని, క్యాలరీల నిలువను పెంచి, బరువు పెరగడానికి కారణమయ్యే కొవ్వు కణజాలాల పనితీరులో మార్పులు వచ్చాయని ఒక జీవక్రియ విశ్లేషణలో కనుగొన్నారు. తర్వాత ఆ బృందం ఆ మహిళల్ని 12 నెలల పాటు వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అనుసరింపజేశారు. తర్వాత వారి జీవక్రియ ప్రమాణాల్ని మళ్లీ విశ్లేషించారు. అప్పుడు ఆ మహిళల్లో జీవక్రియ అసమానతలు రివర్స్ అయ్యాయని, బ్రెయిన్ హైపర్ టెన్షన్ తీవ్రత/ లక్షణాలు తగ్గాయని కనుగొన్నారు. దాంతో బ్రెయిన్ హైపర్ టెన్షన్ అనేది చాలా వరకూ జీవక్రియకు సంబంధించిన సమస్యే గానీ పూర్తిగా నాడీకణాల సమస్య కాదని నిర్ధారించారు.  

 ‘‘ఇడియోపతిక్ ఇంట్రాక్రానియల్ హైపర్ టెన్షన్ కలిగినవారిలో మెటాబొలైట్ గాఢత గురించి ప్రమాణీకరించిన మొదటి అధ్యయనం ఇదే. మార్పు చెందిన జీవక్రియ మార్గాల గురించి గుర్తించడానికి అది దోహదపడింది. రోగుల్లో మెదడు ఒత్తిడి, తలనొప్పి పెరగడానికి కారణమవుతున్న జబ్బు వచ్చే మార్గాల గురించి అర్థం చేసుకోడానికి ఇది మాకు సహాయపడింది’’ అని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెటబాలిజమ్ అండ్ సిస్టమ్స్ రిసెర్చ్లో పీహెచ్డీ పరిశోధకురాలిగా పని చేస్తున్న మొదటి రచయిత ఓలీవియా గ్రెచ్ ఒక ప్రకటనలో  తెలిపారు.  

సంబంధిత ట్యాగ్‌లు
సంబంధిత పోస్టులు

మీ అనుభవాన్ని లేదా వ్యాఖ్యలను పంచుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ట్రెండింగ్

వ్యాసాలు

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient
We use cookies to customize your user experience, view our policy here

మీ అభిప్రాయం విజయవంతంగా సమర్పించబడింది.

హ్యాపీయెస్ట్ హెల్త్ టీమ్ వీలైనంత త్వరగా మిమ్మల్ని సంప్రదిస్తుంది