728X90

0

0

0

0

0

0

0

0

0

ఈ వ్యాసంలో

చిన్నపిల్లల్లో  తలనొప్పి
60

చిన్నపిల్లల్లో  తలనొప్పి

ఏదేమైనా, మైగ్రేన్ లక్షణాలు కళ్లు సలపడం లేదా అస్పష్టమైన దృష్టి (ఆరా అని పిలుస్తారు) వంటి లక్షణాల ద్వారా పిల్లలు మైగ్రేన్ రాకను ఊహించవచ్చని UKలోని మైగ్రేన్‌లతో బాధపడుతున్న పిల్లల కోసం చురుకుగా ప్రచారం చేసే విధంగా పనిచేస్తున్నామని ఒక ట్రస్ట్ ప్రతినిధి చెప్పారు.
చిన్నపిల్లల్లో  తలనొప్పి
పిల్లల్లో తలనొప్పి,శాలిమా ఎం దాస్ చేత చిత్రవివరణ

చిన్నపిల్లల్లో  తలనొప్పి, తీవ్రంగా ఉన్నప్పటికీ, తరచుగా నిర్లక్ష్యం చేయబడుతుంది, ఎందుకంటే పిల్లలకు నొప్పి అని చెప్పడానికి మాటలు రావు. 

తలనొప్పి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో మనందరికీ తెలుసు, అది పోయే వరకు ప్రతిదీ భరించలేనిదిగా చేస్తుంది. తలలోని నొప్పి మన తలలో తిరుగుతూ ఒక మూలన పోయి వాలిపోవాలనించిపేలా చేస్తుంది. పెద్దలుగా, నొప్పిని యక్తపరచాలో ియు నొప్పిని ివరించాలో కు లుసు, కానీ ిల్లల టేమిటి?  

తలనొప్పి ఉన్న కొంతమంది పిల్లలు చాలా దయనీయంగా మరియు అలసిపోయినట్లు నా వద్దకు వస్తారుఅని ముంబైలోని సంజీవని మెడికల్ సెంటర్లోని శిశువైద్యురాలు డాక్టర్ మనీషా బావ్దేకర్ హ్యాపీయెస్ట్ హెల్త్తో చెప్పారు.  

పిల్లలకు కూడా తలనొప్పి ఉంటుంది 

పిల్లలు కూడా రచుగా మరియు తీవ్రమైన తలనొప్పితో బాధపడతారు, కానీ వారు ఇప్పటికీ భాష మరియు శరీర వ్యక్తీకరణలను నేర్చుకునే దశలో ఉన్నందున వారి నొప్పిని ఖచ్చితంగా ఎలా వ్యక్తపరచాలో తెలియదు. ఫలితంగా పిల్లల్లో తలనొప్పి (పీడియాట్రిక్ తలనొప్పి) తరచూ నిర్లక్ష్యం చేస్తుంటారు . 

మొదట్లో, పిల్లలలో తలనొప్పి చాలా అసాధారణమని భావించారు, కానీ అది నిజం కాదుఅని డాక్టర్ బావ్దేకర్ పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, 20 మంది పెద్దలలో ఒకరికి  నాలుగు గంటలకు పైగా పునరావృతమయ్యే తలనొప్పి ఉంది. మరొక అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు 60% మంది పిల్లలు  తీవ్ర తలనొప్పితో బాధపడుతున్నారు మరియు లనొప్పులు తక్కువగా (పెద్దలతో పోలిస్తే) వస్తాయి, వస్తే రెండు నుండి నాలుగు గంటలు రకు ఉంటాయి.  

UK, గ్లాస్గోలోని రాయల్ హాస్పిటల్ ఫర్ చిల్డ్రన్లోని పీడియాట్రిక్ న్యూరోసైన్స్ యూనిట్ కన్సల్టెంట్ డాక్టర్ ఇషాక్ అబూఅరాఫె మాట్లాడుతూపిల్లవాడు పెద్దయ్యాక తలనొప్పి యొక్క తరుచుదనము మరియు వ్యవధి పెరుగుతుంది. వారు యుక్తవయస్సులో ఉన్నప్పుడు, తలనొప్పి పెద్దల మాదిరిగానే ఉంటుంది, రోజంతా కూడా ఉంటుంది.”  

చిన్నపిల్లల్లో  తలనొప్పి: తలనొప్పికి మూల కారణాలు 

పిల్లలకు రెండు కారణాల వల్ల తలనొప్పి వస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి: ఒకటి, నొప్పిని ెలిపే మెదడు భాగాలు (నొప్పి కేంద్రాలు) అతి చురుకుగా ఉన్నప్పుడు, రెండు, గాయం కారణంగా      

మొదటిది, ప్రామిక తలనొప్పి, ఇది దగ్గరి దృష్టి ోపం, జ్వరం, సైనస్ ఇన్ఫెక్షన్, ఎక్కువగా స్క్రీన్ చూడటం, సరైన ఆహారపు అలవాట్లు ేకపోవడం లేదా మానసిక ఒత్తిళ్ల వల్ల ప్రేరేపించబడుతుంది. పదే పదే వాంతులవడం కూడా తలనొప్పికి కారణమవుతాయి.  

మైగ్రేన్ అనేది పిల్లలలో కనిపించే మరొక రకమైన ప్రామిక తలనొప్పి, ఇది తలక ఒక వైపు క్రుంగదీసే నొప్పిగా వస్తుంది. కొన్నిసార్లు, వాంతులు మరియు కాంతి ూడలేకుండా, ధ్వని ూడా వినలేనటువంటివి మైగ్రేన్ తలనొప్పితో పాటు వస్తాయి.  

మైగ్రేన్లలో వంశపారంపర్య కీలక పాత్ర పోషిస్తుందని అధ్యయనాలలో కనుగొన్నారు. “మైగ్రేన్ అనేది జన్యుపరమైన రుగ్మత. ఒకటి, కొన్నిసార్లు తల్లిదండ్రులిద్దరూ ేదా ఒకరు మైగ్రేన్తో బాధపడుతుంటే మైగ్రేన్ రావడం సహజంఅని అమెరికాలోని మెడికల్ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ రోలినాలోని పీడియాట్రిక్ న్యూరాలజీ ప్రొఫెసర్ Dr థామస్ కోచ్ చెప్పారు. వంశపారంపర్యరకం మైగ్రేన్లు మెదడులోని ట్రైజెమినల్ నరాలలో జన్యు ఉత్పరివర్తనల(చెవి వెనుక ఒక ప్రాంతం) వల్ల సంభవిస్తాయని ఆయన పేర్కొన్నారు.

ెండో రకం తలనొప్పి ఎక్కువ ఆందోళన కలిగిస్తుంది, ఎందుకంటే ది మెదడులో గాయం, రక్తస్రావం లేదా మారుతున్న రక్తపోటు వల్ల వస్తుంది. “ తలనొప్పి భయంకరమైనది, ఎందుకంటే అది అంతర్గత వ్యాదిని సూచిస్తుంది, మనం దానిని వీలైనంత త్వరగా తగ్గించుకోడానికి ప్రయత్నిస్తాముఅని డాక్టర్ బావ్డేకర్ పేర్కొన్నారు. ఇలాంటి సందర్భాల్లో సవివరంగా తెలుసుకోడానికి బ్రెయిన్ స్కాన్లు అవసరమని ఆమె పేర్కొన్నారు. 

తలనొప్పిని నిర్ధారించడానికి ప్రవర్తనను వివరించడం 

పిల్లలలో తలనొప్పిని నిర్ధారించడానికి అత్యంత కీలకమైన విషయం ఇంతకు ముందు ఏం జరిగిందో సరిగా తెలుసుకోవడంఅని Dr కాచ్ చెప్పారు. అందుకోసం కింది ప్రశ్నలు అడుగుతానని చెప్పారు: 

  • పిల్లవాడికి ఎంత కాలం నుండి ఎంత తరచుగా తలనొప్పి వస్తోంది? 
  • తలనొప్పిత పాటు జ్వరం, వాంతులు, విరేచనాలు లేదా మైకము వంటి ఇతర లక్షణాలు ఉన్నాయా 
  • తలనొప్పితో పాటు చూపు రెండుగా కనబడటం లేదా అస్పష్టంగా ఉందా?  
  • తలనొప్పి పిల్లల నిద్రను ప్రభావితం చేస్తున్నదా 

Dr అబూఅరాఫె పిల్లలలో తలనొప్పి తీవ్రత వారి ప్రవర్తనను బట్టిస్వల్పమైన , మధ్యస్థం లేదా తీవ్రమైనవిగా వర్గీకరిస్తారని పేర్కొన్నారుఉదాహరణకు, పిల్లలు ఒక స్థాయిలో తలనొప్పిని ఎదుర్కొని అప్పుడు పరిగెత్తి మరియు ఆడుకోవచ్చు. అదే మధ్యస్థంగా ఉంటే నొప్పి కారణంగా వారు పరిగెత్తలేకపోవచ్చు లేదా గెంతలేకపోవచ్చు కానీ వీడియో చూడగలరు లేదా కథను వింటారు; తీవ్రమైన తలనొప్పి ఉంటే ఒంటరిగా ఉండాలనుకుంటారు లేదా అలా పడుకొని ఉండాలనుకుంటారు. 

చిన్నపిల్లల్లో  తలనొప్పి:పిల్లల జీవితంలోని అన్ని దశలను ప్రభావితం చేస్తుంది 

తలనొప్పి పెద్దలను ఎంత బలహీన పరుస్తుందో  పిల్లలను కూడా అంతే బలహీనపరుస్తుందని Dr కాచ్ పేర్కొన్నారు. దాని ఫలితంగా, పిల్లలు తరచుగా పాఠశాల మరియు సామాజికంగా ఇతర పనులకుకార్యకలాపాలకు దూరమవుతారు. “ తలనొప్పి ఆటలో పాల్గొనే వారి సామర్థ్యాన్ని పరిమితం చేస్తుంది, ఇది వారి తోబుట్టువులు మరియు తోటివారితో పోల్చుకుని తమను తాము భిన్నంగా భావించేలా మార్చుతుంది,” అని పేర్కొన్నారు.  

ఏదేమైనా, మైగ్రేన్ లక్షణాలు కళ్లు సలపడం లేదా అస్పష్టమైన దృష్టి (ఆరా అని పిలుస్తారు) వంటి లక్షణాల ద్వారా పిల్లలు మైగ్రేన్ రాకను ఊహించవచ్చని UKలోని మైగ్రేన్తో బాధపడుతున్న పిల్లల కోసం చురుకుగా ప్రచారం చేసే పరిశోధనఆధారిత స్వచ్ఛంద సంస్థ మైగ్రేన్ ట్రస్ట్ ప్రతినిధి పేర్కొన్నారు. తత్ఫలితంగా, పిల్లవాడు ఆందోళనకు గురయ్యి, మరియు నొప్పి వారి రోజువారీ కార్యకలాపాలను చేయడం కష్టతరం చేస్తుంది, ఇది వారిని ఒంటరిని చేసి బాధ పెడుతుంది. 

ఒక సహాయ హస్తం 

నిపుణుల అభిప్రాయం ప్రకారం, పిల్లలలో తలనొప్పి మరియు మైగ్రేన్లకు చికిత్స చేయడం సరళమైన ప్రక్రియ కాదు. “పిల్లలలో దీర్ఘకాలిక తలనొప్పిని లేకుండా చేేేసేందుకు ఆట సమయాన్ని పెంచడం, మంచి పోషకాహారం మరియు నిద్ర సరిగా ఉండేలా నిర్ధారించడం వంటి జీవనశైలి మార్పులు చాలా ముఖ్యమైనవిఅని Dr కాచ్ పేర్కొన్నారు. పిల్లవాడికి లోపాలు ఉంటే విటమిన్ B12 మరియు మెగ్నీషియంను ీసుకోమని ఆయన సూచిస్తారు.  

చిన్నపిల్లల్లో  తలనొప్పి ప్రేరేపించే కారకాలను నివారించాలని Dr బావ్‌డేకర్ నొక్కి చెప్పారు. ఉదాహరణకు, ఎక్కువగా స్క్రీన్ చూడటం వల్ల కలిగే తలనొప్పిని స్క్రీన్ చూడటం మానేయడం ద్వారా సులభంగా పరిష్కరించవచ్చు మరియు జ్వరంప్రేరిత తలనొప్పిని సాధారణ నొప్పి నివారణ మందుతో నిర్వహించవచ్చు. 

నివారించలేని ఒత్తిడి మరియు మానసిక ఆరోగ్య పరిస్థితులు కూడా పిల్లలలో తలనొప్పిని కలిగిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కౌన్సెలింగ్ అంతర్లీన ఒత్తిళ్లను పరిష్కరిస్తుంది, ఇది తలనొప్పి నుండి ఉపశమనం పొందటానికి సహాయపడుతుంది. అదే సమయంలో, తలనొప్పి యొక్క తరుచుదనమును ఎక్కించడం వలన పరిస్థితి మరింత దిగజారడానికి ంటే ముందు దానిని తగ్గించడం ఒక ప్రభావవంతమైన మార్గం.  

పిల్లలు వారి నొప్పి గురించి అర్థం చేసుకోవడం మరియు మాట్లాడటం కష్టంగా ఉన్నందున, మైగ్రేన్ ట్రస్ట్ అవసరమైన పదజాలాన్ని అందించడం ద్వారా అవరోధాన్ని తొలగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. “వారు తమ బాధను వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు వైద్యులకు వివరించడానికి మేము సమాచారాన్ని అందిస్తాము, తద్వారా వారికి అవసరమైన సహాయం పొందవచ్చుఅని ట్రస్ట్ ప్రతినిధి హ్యాపీయెస్ట్ హెల్త్తో పేర్కొన్నారు. 

 

మీ అనుభవాన్ని లేదా వ్యాఖ్యలను పంచుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ట్రెండింగ్

వ్యాసాలు

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient
We use cookies to customize your user experience, view our policy here

మీ అభిప్రాయం విజయవంతంగా సమర్పించబడింది.

హ్యాపీయెస్ట్ హెల్త్ టీమ్ వీలైనంత త్వరగా మిమ్మల్ని సంప్రదిస్తుంది