728X90

0

0

0

0

0

0

0

0

0

ఈ వ్యాసంలో

ఆనెలను నొక్కవద్దు: వాటిని నివారించే విధానం తెలుసుకోండి 
27

ఆనెలను నొక్కవద్దు: వాటిని నివారించే విధానం తెలుసుకోండి 

ఆనెలు అలాగే కాలస్‌లు (కిణములు) చేతులు లేదా పాదాలపై మృతకణాలు పేరుకోవడం వలన ఏర్పడే మచ్చలు వంటివి. అయితే, ఇవి చూడటానికి భిన్నంగా ఉంటాయి.
కాల్సస్ యొక్క క్లోజ్ అప్. పాదాలపై బాధాకరమైన ఆనెలు. పాదాలపై ఆనెలకు చికిత్స.

విపరీతమైన నొప్పితో, నిల్చున్నా, నడిచినా, వ్యాయామం చేసినా ఇబ్బంది పెట్టే ఆనెలను చిన్న చిన్న జాగ్రత్తలతో నివారించవచ్చు లేదా త్వరగా వైద్యం చేసి నివారించవచ్చు.

ఆనెలు అలాగే కాలస్‌లు (కిణములు) చేతులు లేదా పాదాలపై మృతకణాలు పేరుకోవడం వలన ఏర్పడే మచ్చలు వంటివి. అయితే, ఇవి చూడటానికి భిన్నంగా ఉంటాయి. ఆనెలు చిన్నగా ఉండి నిర్దిష్టంగా గట్టిపడిన చర్మంతో మధ్య బిందువుతో ఉంటే, కిణములు పరిమాణంలో పెద్దగా ఉండి బిందువు లేకుండా ఉంటాయి. ఈ రెండింటికి కూడా వైద్యం వెంటనే చేయాలి లేదంటే ఇన్‌ఫెక్షన్ వచ్చి ఇతర భాగాలకు పాకి నొప్పి కలిగించే అవకాశం ఉంది. 

 ఆనెలకు సాధారణంగా సర్జరీ లేదా సర్జరీ లేకుండా తొలగించే విధానంలో చికిత్స చేస్తారు. అయితే, అవి పూర్తిగా కనిపించే వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. మీరు చిన్న జాగ్రత్తలతో వీటిని పూర్తిగా పెరగకుండా నివారించవచ్చు అని చెప్తున్నారు నిపుణులు. 

ఆనెలు ఎలా వస్తాయి?

ఆనెలు, వీటినే హెలోమా లేదా క్లావస్ అంటారు. ఇవి చర్మంపై గట్టిగా మారిన మచ్చల వంటివి. 

 ఒకరు నడుస్తున్నప్పుడు లేదా నిలబడినప్పుడు శరీరం బరువు అంతా పాదాలపైనే పడుతుంది”, “అందువల్ల పాదంలోని కొన్ని ప్రాంతాలలో ఎక్కువ ఒత్తిడి పడుతుంది. పాదం రకాన్ని బట్టి ఒత్తిడి పడే ప్రాంతం మారుతుంది సమానంగా ఉండే పాదం లేదా అధిక వంపు ఉన్న పాదం కల వారిలో అలాగే వివిధ భాగాలలో ఒత్తిడి పడుతుంది. ఇలా ఒత్తిడి ఎక్కువ పడే ప్రాంతాలలో కిణములు పెరిగే అవకాశం ఎక్కువ, వీటిని చికిత్స చేయకుండా వదిలేస్తే మెల్లగా ఆనెలుగా మారతాయి.అని చెప్పారు ముంబై V-కేర్ క్లినిక్, పోడియాట్రిస్ట్ డాక్టర్ సారిక జంబుల్కర్ 

అయితే, ఆనెలు వచ్చే ముందు ఖచ్చితంగా కిణములు రావాలని లేదు. ఒక్కొక్క సారి నేరుగా ఆనెలు వచ్చేస్తాయి. 

ఆనెలకు కారణాలు అలాగే లక్షణాలు

 నడిచినప్పుడు, నిలబడినప్పుడు అలాగే పరుగెత్తినప్పుడు పాదాలపై పడే ఒత్తిడి ఒక కారణం. ఇరుకుగా ఉండే షూలు, ఎత్తు మడమల చెప్పుల వలన కూడా రావచ్చు అలాగే కాలివేళ్ళ నొప్పి అలాగే భంగిమలలో సమస్యలు ఇతర కారణాలు. “శరీరం బరువు పాదంపై ఎక్కడ పడుతుంది అనేది ఈ కారకాలు ప్రభావితం చేస్తాయి. దీని వలన పాదం అడుగున అలాగే వేళ్ళపై ఆనెలు పెరిగే ప్రమాదం ఉంది. అని చెప్పారు డాక్టర్ జంబుల్కర్. 

 ఒత్తిడి అలాగే రాపిడి కారణంగా చర్మం పెళుసుబారి ఆ ప్రాంతంలో ఆనెలు వచ్చే అవకాశం ఉంది. 

 ఆనెల నొప్పి లక్షణాలు అలాగే ప్రభావాలు

 కాలివేళ్ళపై ఉండే గట్టి ఆనెలు అలాగే వేళ్ళ మధ్య వచ్చే మెత్తని ఆనెలు కూడా నొప్పి లేకుండా ఉండవచ్చు. అయితే ఏదైనా పని చేస్తూ లోడ్ పడినప్పుడు నొప్పి వచ్చే అవకాశం ఉంది అంటే నిలబడినప్పుడు, నడిచినప్పుడు లేదా పరుగెత్తినప్పుడు. చికిత్స ఆలస్యం అయితే నొప్పి ఎక్కువ అవుతుంది. 

 ఆనెలు ఉన్న వ్యక్తులు నడవటానికి కూడా ఇబ్బందిపడతారు కాబట్టి, శారీరక శ్రమ తగ్గుతుంది అలా వారి ఫిట్‌నెస్‌పై ప్రభావం పడుతుంది.అని డాక్టర్ జంబుల్కర్. 

ఆనెలు రాకుండా నివారించడం ఎలా? 

 నివారణకు కీలకం సమస్య యొక్క కారణాన్ని సరిదిద్దడం. సరైన పాదరక్షలు లేకపోవడం ఒక కారణం కాబట్టి, సరైన సైజ్ పాదరక్షలను ఉపయోగించడం కీలకం.అని వివరిస్తూ ఎత్తు మడమల చెప్పులు వేసుకోవడం లేదా చెప్పులు లేకుండా నడవటం చేయవద్దు. సాధారణ వాటి కంటే కాస్త మందంగా ఉండే సాక్స్‌లు వేసుకోండి. దీని వలన రాపిడి తగ్గి, ఎదైనా పని చేస్తున్నప్పుడు మీ పాదాలకు రక్షణగా ఉంటాయి.అని చెప్పారు డాక్టర్ జంబల్కర్. 

సరైన చర్మ సంరక్షణ కూడా కీలకం. అంటే క్రమం తప్పకుండా శుభ్రం చేయడం, మాయిశ్చరైజ్ చేయడం వంటివి. దీని వలన ఒక వేళ ఎలాంటి ఆనెలు ఏర్పడటం ప్రారంభమయినా, అవి పూర్తిగా పెరగకుండానే తొలగిపోతాయి. 

ఆనెలకు చికిత్స ఏమిటి? 

ఆనెలను సర్జరీ ప్రక్రియలో లేదా సర్జరీ లేకుండా కూడా తొలగించవచ్చు. సాధారణంగా ప్రజలు ఆనెలపై ఏర్పడి గట్టిగా ఉన్న చర్మాన్ని తొలగించడానికి చూస్తారు. ఇలా చేయడం కిణముల విషయంలో పని చేసినా, ఆనెల విషయంలో చేయకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే ఇవి చర్మం లోపలికి బాగా పెరిగి ఉంటే ఇలా పై చర్మం తొలగించడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ అవుతుంది. 

కొంత మంది పైపూతలు అలాగే కార్న్ క్యాప్‌లు ఉపయోగిస్తారు, ఇవి ఆనెల చికిత్స విషయంలో అంత ప్రభావవంతం కాకపోవచ్చు.” “పాదాలపై పడే ఒత్తిడిని ఆనెలు ఉన్న ప్రాంతం నుండి సమానంగా అన్ని ప్రాంతాలకు మార్చే సరైన పాదరక్షలు వేసుకోవడం కీలకం. ఇలా చేస్తూనే ఆనెలను వాటి చుట్టూ ఉన్న ఆరోగ్యకరమైన చర్మానికి ఎలాంటి హాని చేయకుండా తొలగించవచ్చు. 

ఆనెలను పూర్తిగా తొలగించడం వలన అవి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అయితే, మీ పోడియట్రిస్ట్ ఇచ్చే సూచనలను తప్పక పాటించాలి. అంటే సరైన సైజ్ పాదరక్షలు వేసుకోవడం, ఒత్తిడి అలాగే రాపిడిని తగ్గించుకోవడం. 

గుర్తుంచుకోవాల్సిన అంశాలు

  • ఆనెలు అంటే పాదంపై ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఏర్పడే మృత కణాల సమూహం వంటివి. ఇవి గట్టిగా, పెళుసుగా ఉండి మధ్యలో బిందువు ఉంటుంది. 
  • పాదంపై ఏ ప్రదేశంలో బరువు ఒత్తిడి ఎక్కువ పడుతుందో ఆ ప్రదేశంలో చర్మం కణజాలం గట్టిగా అయిపోయి, ఆనెలు ప్రారంభమవుతాయి. 
  • సరైన సైజ్ షూలు వాడకపోవడం వలన రాపిడి ఏర్పడి ఆనెలు వస్తాయి. 
  • వీటిని సర్జరీ లేదా సర్జరీ లేకుండా కూడా తొలగించవచ్చు. పాదాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ, చర్మాన్ని మృదువుగా ఆరోగ్యంగా ఉంచుకోవడం ద్వారా ఆనెలను నివారించవచ్చు. 

 

మీ అనుభవాన్ని లేదా వ్యాఖ్యలను పంచుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ట్రెండింగ్

వ్యాసాలు

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient
We use cookies to customize your user experience, view our policy here

మీ అభిప్రాయం విజయవంతంగా సమర్పించబడింది.

హ్యాపీయెస్ట్ హెల్త్ టీమ్ వీలైనంత త్వరగా మిమ్మల్ని సంప్రదిస్తుంది