728X90

0

0

0

0

0

0

0

0

0

ఈ వ్యాసంలో

పిల్లలలో వెన్నునొప్పి: తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యానికి వెన్నెముకగా ఎలా మారగలరు
19

పిల్లలలో వెన్నునొప్పి: తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యానికి వెన్నెముకగా ఎలా మారగలరు

వెన్నునొప్పి పెద్దలు మాత్రమే ఎదుర్కొనే సమస్య అని మీరు అనుకోవచ్చు. బాగా ఆలోచించండి. పిల్లలలో వెన్నునొప్పి సమస్యలు పెరుగుతున్నాయి మరియు కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ తరచుగా విస్మరిస్తున్నారు

పిల్లల్లో వెన్నునొప్పి-backpain in children explained in telugu

అసాధారణ శరీర భంగిమలు మరియు డిస్క్ హెర్నియేషన్ వంటి సమస్యలను నివారించడానికి పిల్లలలో వెన్నునొప్పి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలి. 

వెన్నునొప్పి పెద్దలు మాత్రమే ఎదుర్కొనే సమస్య అని మీరు అనుకోవచ్చు. బాగా ఆలోచించండి. పిల్లలలో వెన్నునొప్పి సమస్యలు పెరుగుతున్నాయి మరియు కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ తరచుగా విస్మరించబడుతున్నాయని నిపుణులు అంటున్నారు. బరువైన బ్యాక్‌ప్యాక్‌లు లేదా స్కూల్‌బ్యాగ్‌లు పిల్లలలో వెన్నునొప్పికి ప్రధాన కారణాలుగా చాలా కాలంగా పరిగణించబడుతున్నాయి, బ్యాగ్ బరువును తగ్గించడానికి విద్యా రంగం ప్రేరేపించబడింది. అదనంగా, ఈ రోజుల్లో పిల్లలలో నిష్క్రియాత్మక జీవనశైలి కూడా పిల్లలలో వెన్నునొప్పి పెరగడానికి కారణం. అందువల్ల, తల్లిదండ్రులు సమస్యను పరిష్కరించడం మరియు నివారణ చర్యలను అమలు చేయడం చాలా ముఖ్యం. 

పిల్లలలో వెన్నునొప్పికి సాధారణ కారణాలు

బెంగుళూరులోని DHEE హాస్పిటల్స్‌లోని సీనియర్ పీడియాట్రిషియన్ మరియు ఇంటెన్సివిస్ట్ డాక్టర్ సుప్రజా చంద్రశేఖర్ ప్రకారం, అన్ని పీడియాట్రిక్ బ్యాక్ పెయిన్ కేసులలో 20 శాతం వెన్నెముకలో అదుపు తప్పి గాయం అవ్వడం లేదా నొప్పి కలిగించడం వల్ల సంభవించవచ్చు, మిగిలిన 80 శాతం సరిగ్గా కూర్చోకపోవడం వల్ల జీవనశైలి కదలికలు లేకుండా ఉండటం వల్ల వస్తుంది. 

శిశువైద్యునిగా, టీనేజర్లు వెన్నునొప్పి గురించి ఫిర్యాదు చేసినప్పుడు నేను అప్రమత్తంగా అవుతాను” అని డాక్టర్ చంద్రశేఖర్ చెప్పారు. “కౌమారదశలో ఉన్నవారు మరియు పెద్ద పిల్లలలో నొప్పి సాధారణంగా పేలవమైన భంగిమ మరియు మందకొడి జీవనశైలి నుండి వస్తుంది. చిన్న పిల్లలలో, అయితే, నొప్పి మనం గుర్తించాల్సిన వెన్నెముకకు తప్పిపోయిన లేదా చికిత్స చేయని గాయం కారణంగా సంభవించవచ్చు. ఇది మరొక గాయాన్ని సూచించే నొప్పి కూడా కావచ్చు [సమస్య యొక్క అసలు మూలంలో కాకుండా వేరే ప్రాంతంలో నొప్పిగా అనిపించడం].” 

అదనంగా, వెన్నునొప్పి మూత్ర లేదా ప్రేగు ఇబ్బందులతో కూడా సంబంధం కలిగి ఉంటుంది, ఎందుకంటే ఈ విధులను నియంత్రించే నరాల సంకేతాలను ప్రసారం చేయడంలో వెన్నెముక కీలక పాత్ర పోషిస్తుంది. 

జీవనశైలి మరియు వెన్నునొప్పి 

మందకొడి జీవనశైలి కోర్ మరియు వెనుక కండరాల బలహీనత కారణంగా, ఫ్లెక్సిబిలిటీ తగ్గడం మరియు వెన్నెముక డిస్క్‌లు మరియు కీళ్లపై ఒత్తిడి పెరుడం వలన వెన్నునొప్పికి దారి తీస్తుంది. 

బెంగుళూరులోని అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ పవన్ చెబ్బి మాట్లాడుతూ “ఈ రోజుల్లో పిల్లలు ఒకప్పటిలాగా చాలా చురుకుగా లేరు. “వారు ఏ శారీరక శ్రమలో పాల్గొన్నా సమయం పరిమితంగా ఉంటుంది. ఉదాహరణకు, వారి డ్యాన్స్ లేదా మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ప్రతి వారం కొన్ని గంటలకే పరిమితం చేయబడింది. పెద్దవారిలో ఎక్కువగా కనిపించే సయాటికా మరియు తుంటి సమస్యలతో బాధపడుతున్న పిల్లలను నా అనుభవంలో నేను చూశాను. డ్యాన్స్ చేసే పిల్లలు తక్కువ సమయంలో ప్రాక్టీస్ ఎక్కువగా చేస్తారు మరియు క్లాస్ ముగిసిన తర్వాత, వారి దినచర్యలలో కదలికలు తక్కువగా ఉంటాయి. 

అంతేేకాకుండా, ఎక్కువసేపు కూర్చున్నప్పుడు పేలవమైన భంగిమ మరియు అసంబద్ద శరీర యంత్రాంగాలు కూడా వెన్నునొప్పిని తీవ్రతరం చేస్తాయి. 

పిల్లలు పెద్దల కంటే ఎక్కువ వశ్యతని కలిగి ఉంటారు కాబట్టి, వారు ఎక్కువ కాలం పాటు వారు కోరుకున్న ఏ భంగిమలోనైనా కూర్చోవచ్చు. అయితే, ఈ అలవాటు -పరికరాన్ని కంటికి ఎదురుగా పెట్టకుండా, కిందకు వంగి సరైన విధంగా కూర్చోవడం లేదా నిలబడటం చేయకుండా స్క్రీన్ ముందు ఎక్కువ సమయం గడపడం – దీర్ఘకాలంలో వాటిపై ప్రతికూల ప్రభావాన్ని కలగజేస్తుంది. 

Parental intervention_Telugu

విటమిన్ D లోపం మరియు వెన్నునొప్పి 

ఎముకలు మరియు కండరాల ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ D లోపం ఎముకలను బలహీనపరుస్తుంది మరియు వెన్నెముకను ఒత్తిడికి మరియు దెబ్బతినడానికి మరింత అవకాశం కలిగిస్తుంది. 

ఆర్థోపెడిక్ సమస్యల కోసం నన్ను సంప్రదించే పిల్లలలో కనీసం 60 శాతం మందికి విటమిన్ D లోపం ఉంది” అని డాక్టర్ చెబ్బి చెప్పారు. 

గతంలో, పిల్లలు ఆరుబయట ఆడేవారు, విటమిన్ D పుష్కలంగా ఉత్పత్తి అయ్యేది. ఈ రోజుల్లో, వారు ఇంటి లోపల ఎక్కువ సమయం గడుపుతున్నారు, దీని వలన విటమిన్ లోపం కలుగుతోంది మరియు వారి కండరాలు మరియు ఎముకలను బలహీనపరుస్తోంది. 

పిల్లల్లో  వెన్నునొప్పి: తల్లిదండ్రులు ఎలా సహాయపడగలరు 

పిల్లలలో వెన్ను సమస్యలను విస్మరించకూడదు, ఎందుకంటే అవి చిన్న వయస్సులోనే భంగిమ అసాధారణతలు లేదా  డిస్క్ కాస్త పక్కకు జరగడానికి కారణమవుతాయి. మీ చిన్నారికి వెన్నునొప్పి నిరంతరం ఉన్నప్పుడు, నొప్పికి కారణాన్ని గుర్తించడానికి నిపుణుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. 

అదనంగా, చురుకైన జీవనశైలి యొక్క ప్రయోజనాల గురించి మనందరికీ తెలుసు కాబట్టి, దానిని ఆచరణలో పెట్టాలి. 

మనం మన జీవనశైలిలో చిన్న మార్పులను అమలు చేయగలము, మన రోజువారీ జీవితంలో కదలికను ఒక అంతర్భాగంగా మార్చుకోవచ్చు, అది మన పిల్లలకు మరియు మనకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. నడవడం, లిఫ్ట్‌కి బదులు మెట్లు ఎక్కడం, బయట ఆడుకోవడం వంటి అభ్యాసాలు పిల్లల్లో చురుకైన జీవనశైలిని పెంపొందిస్తాయి” అని డాక్టర్ చంద్రశేఖర్ చెప్పారు. 

వెన్నునొప్పిని నివారించడానికి చురుగ్గా ఉండడం ఎంత కీలకమో శరీర భంగిమలను సరిగా ఉండేలా చూసుకోవడం కూడా అంతే కీలకం. “మీ పిల్లల భంగిమను ఎప్పటికప్పుడు సరిదిద్దడంతో పాటు, మీ ఇంటిని పిల్లలు ఉపయోగించుకునేలా తగిన వాతావరణం ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. ఉదాహరణకు, పిల్లలు తమ ఇంటి పనిని పూర్తి చేయడానికి లేదా కంప్యూటర్‌ని ఉపయోగించడానికి మంచం లేదా సోఫాపై పడుకునే బదులు, పిల్లలు టేబుల్ ముందు కుర్చీలో కూర్చోవాలి” అని డాక్టర్ చెబ్బి చెప్పారు. 

అంతే కాకుండా, ఎక్కువసేపు కూర్చున్నప్పుడు మధ్యలో విరామం తీసుకోవడం చాలా అవసరం. పిల్లలు ఒక గంట కూర్చున్న తర్వాత కనీసం 15-20 నిమిషాల విరామం తీసుకోవాలి. 

కీలక అంశాలు

  • కౌమారదశలో ఉన్నవారు మరియు పెద్ద పిల్లలలో వెన్నునొప్పి తరచుగా స్తబ్దమైన జీవనశైలి మరియు భంగిమ సమస్యల వల్ల వస్తుంది, అయితే చిన్న పిల్లలలో వెన్నెముకలో అదుపు తప్పి గాయం అవడం లేదా నొప్పిని కలిగించడం కలగవచ్చు. 
  •  పిల్లలలో వెన్నునొప్పి సమస్యలను విస్మరించకూడదు, ఎందుకంటే అవి చిన్న వయస్సులోనే భంగిమ అసాధారణతలు లేదా డిస్క్ కాస్త పక్కకు జరగడానికి కారణమవుతాయి. 
  • నడవడం, మెట్లు ఎక్కడం మరియు బయట ఆడుకోవడం వంటి పద్ధతులను పెంపొందించడం పిల్లలలో చురుకైన జీవనశైలిని ప్రోత్సహిస్తుంది, తద్వారా వెన్నునొప్పి నివారిస్తుంది. 

మీ అనుభవాన్ని లేదా వ్యాఖ్యలను పంచుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ట్రెండింగ్

వ్యాసాలు

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient
We use cookies to customize your user experience, view our policy here

మీ అభిప్రాయం విజయవంతంగా సమర్పించబడింది.

హ్యాపీయెస్ట్ హెల్త్ టీమ్ వీలైనంత త్వరగా మిమ్మల్ని సంప్రదిస్తుంది