728X90

0

0

0

0

0

0

0

0

0

ఈ వ్యాసంలో

నొప్పి నివారణలో దీని ప్రభావంతో అద్భుతాలు
58

నొప్పి నివారణలో దీని ప్రభావంతో అద్భుతాలు

ఈ నొప్పి నియంత్రణ విధానంలో నొప్పి విషయంలో రోగి దృష్టిని మార్చి, దానిని తగ్గించడానికి రోగి మనోబలాన్ని ఉపయోగిస్తారు.
ప్లేసిబో అనాల్జేసియా
ప్లెసిబో అనాల్జేసియా

ఈ నొప్పి నియంత్రణ విధానంలో నొప్పి విషయంలో రోగి దృష్టిని మార్చి, దానిని తగ్గించడానికి రోగి మనోబలాన్ని ఉపయోగిస్తారు.  

అనేక నొప్పి నిర్వహణ పద్ధతులు ఉన్నప్పటికీ, వైద్యులు ఎప్పుడూ అత్యంత ప్రభావవంతమైనదానిని ఎంచుకుంటారు. అవి నొప్పి యొక్క స్వభావం మరియు వ్యక్తిగత అంశాల ఆధారంగా మారతాయి – నొప్పి సహించే స్థాయి నుండి శారీరక మరియు మానసిక ప్రతిస్పందనల వరకు. మెదడు లేదా మనస్సు శారీరక అనుభూతులను ఎలా నమోదు చేసుకుంటుంది, ఎలా ప్రతిస్పందిస్తుంది అనేదానికి ఒక మానసిక ప్రక్రియ కాబట్టి, వైద్యులు కూడా బాధ నుండి ఉపశమనం పొందేందుకు మనిషి మనస్సు యొక్క శక్తిని ఉపయోగించేందుకు ప్రయత్నిస్తారు. ప్లెసిబో అనల్జీసియా ద్వారా నొప్పి నిర్వహణ – ఒక వ్యక్తి చికిత్సా ప్రభావం లేకుండా చికిత్స పొందిన తర్వాత నొప్పి తగ్గుదలని అనుభవించినప్పుడు – వ్యక్తి యొక్క విశ్వాసం లేదా దాని సమర్థతపై విశ్వాసం దీనికి కారణం అయ్యి ఉంటుంది. ఇది తరచుగా క్లినికల్ సెట్టింగ్‌లలో ఉపయోగించబడుతుంది, మెరుగైన ఫలితాలను పొందడానికి సాంప్రదాయిక చికిత్సలను పూర్తి చేస్తుంది. ఇది ఉత్తమ నొప్పి చికిత్సల యొక్క సామర్థ్యాన్ని అంచనా వేయడానికి పరిశోధనల్లో ఉపయోగించబడుతుంది, నొప్పి నిర్వహణ కోసం కొత్త మార్గాలను అందిస్తుంది. 

ప్లెసిబో అనాల్జెసియా అంటే ఏమిటి?

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న HCG మల్టీస్పెషాలిటీ హాస్పిటల్, సైకియాట్రీ డిపార్ట్‌మెంట్ చీఫ్ హన్సల్ బాషెక్ చెప్పిన దాని ప్రకారం ఒకరు అనుభవించే నొప్పి వారి మానసిక అనుభవానికి సంబంధించిన విషయం కాబట్టి, వారి నమ్మకం వారి దృష్టి కోణాన్ని మార్చగలుగుతుంది. నేను నొప్పి ఇంక తగ్గదు అని బలంగా నమ్మితే నేను దానికి ప్రతికూలంగా ఆలోచిస్తాను. అలాగే, ఒక వ్యక్తి నొప్పిని ఆరోగ్యకరమైన సంకేతంగా భావించినప్పుడు దానికి కారణం ఏమిటో తెలుసుకుని సరైన చర్య తీసుకోగలుగుతారు. అలాగే వారికి నొప్పి అంతగా బాధించదు. ఎందుకంటే వారికి చికిత్సపై నమ్మకం ఉంటుంది. 

నమ్మకం లేదా విశ్వాసం అనేది కీలక పాత్ర పోషించినప్పటికీ, ఇతర న్యూరోలాజికల్ విధానాలు కూడా ప్లెసిబో అనాల్జెసియాకు దోహదపడతాయి. చెన్నైకి చెందిన కావేరీ హాస్పిటల్ న్యూరాలజిస్ట్ కన్సల్టెంట్ డాక్టర్ సుభా సుబ్రమనియన్ ప్లెసిబో అనాల్జెసియాను కేంద్ర నాడీ వ్యవస్థ అలాగే పైన జరిగే శారీరక చర్యల సంక్లిష్ట సైకో-న్యూరోబయోలాజికల్ విధానంగా వర్ణించారు. అవి రెండు కూడా నొప్పిని చూసే విధానాన్ని అలాగే క్లినికల్ లక్షణాలను ప్రభావితం చేస్తూ చురుకుగా ఉన్న ఎనాల్‌జెసిక్స్‌కు (నొప్పి అలాగే వాపును తగ్గించడానికి ఉపరితరల కణజాలం అలాగే కేంద్ర నాడీ వ్యవస్థపై పని చేసే పదార్ధాలు లేదా మందులు) వచ్చే ప్రతిస్పందనను మారుస్తాయి అని అన్నారు. 

ప్లెసిబో అనాల్జెసియా వెనుక ఉన్న న్యూరోబయోలాజికల్ కారకాలు

మానసిక అంశాలతో పాటు న్యూరోబయోలాజికల్ కారకాలు కూడా ప్లెసిబో అనాల్జెసియాను ప్రభావితం చేస్తాయి. 

డోపమైన్, సెరోటోనిన్ మరియు కన్నాబినాయిడ్స్ వంటి ఎండోజెనస్ న్యూరోమోడ్యులేటర్‌లు (నాడీ వ్యవస్థలోని న్యూరాన్‌ల కార్యకలాపాలను మాడ్యులేట్ చేసే లేదా మార్చే రసాయనాలు) ద్వారా ప్లెసిబో అనాల్జెసియాకు దోహద పడతాయి. మానసిక ప్రతిస్పందన వల్ల ఇవి విడుదల కాగలవు” అని డాక్టర్ సుబ్రమణియన్ చెప్పారు. 

వివిధ న్యూరోమోడ్యులేటర్లు మెదడుపై వివిధ ప్రభావాలను కలిగి ఉంటాయి. డోపమైన్ ఆనందం మరియు రివార్డ్‌తో ముడిపడి ఉంది మరియు దాని విడుదల ప్లెసిబో చికిత్స పనిచేస్తుందని ప్రజల నమ్మకాన్ని బలపరుస్తుంది. సెరోటోనిన్ మనం నొప్పిని ఎలా అనుభవిస్తాము మరియు అర్థం చేసుకునే విధానాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ప్లెసిబో చికిత్సలు నొప్పి తగ్గే విధానంపై ప్రభావం చూపడం ద్వారా సెరోటోనిన్ స్థాయిలను కూడా ప్రభావితం చేస్తాయి. శరీరం కన్నబినాయిడ్స్‌ను కూడా తయారు చేస్తుంది, ఇది బాధాకరమైన ఉద్దీపనలను గ్రహించే విధానాన్ని మార్చగలదు. 

విభిన్న ప్రభావాలను అర్థం చేసుకోవడం

ప్లెసిబో అనాల్జెసియా ప్రజలలో వివిధ ప్రతిస్పందనలను కలిగిస్తుంది. అదే సమయంలో కొంత మంది విషయంలో ఎలాంటి ఫలితం కనిపించకపోవచ్చు. “ఎలాంటి ఫలితాలు ఉండకపోవచ్చు, నొప్పి కాస్త తగ్గవచ్చు లేదా పూర్తిగా తగ్గవచ్చు. ఫలితం అనేక కారకాలపై ఆధారపడి ఉంటుందిఅని వివరించారు డాక్టర్ భాషెక్.

మానసిక కారకాలు: వివిధ వ్యక్తుల మానసిక సామాజిక కారకాలు వారు ప్లెసిబోకు ఎంత బాగా స్పందించగలరు అనే దానిని ప్రభావితం చేస్తాయి. 

ప్లెసిబోకు స్పందించే తీరు వారి మానసిక స్థితి, ఆశావాద ధృక్పదం మరియు సహించే విధానాల వంటి అంశాల ద్వారా ప్రభావితమవుతుందిఅని డాక్టర్ సుబ్రమణియన్ చెప్పారు.  తిరిగి నిలదొక్కుకోవడం, అంగీకారం, ఒత్తిడిని ఎదుర్కోవడానికి మంచి మెకానిజమ్స్ మరియు సానుకూల మనస్తత్వం వంటి లక్షణాలు, మెరుగైన ఎండోజెనస్ ఓపియాయిడ్ స్రావం (శరీరం యొక్క సహజ ఉత్పత్తి మరియు నొప్పి నివారణలో పాల్గొనే  మూడ్ కంట్రోల్ మరియు ఒత్తిడి ప్రతిస్పందన వంటి వాటి ద్వారా ఓపియాయిడ్ సమ్మేళనాల విడుదల) ద్వారా ప్లెసిబోకు వారి ప్రతిస్పందనను అనుకూలంగా మార్చగలవు. 

జన్యుపరమైన సంసిద్ధత: కొంతమంది వ్యక్తులు వారి తల్లిదండ్రుల నుండి సంక్రమించిన జన్యు వైవిధ్యాల కారణంగా కొన్ని లక్షణాలు లేదా లక్షణాలను అధికంగా కలిగి ఉంటారు. ఫలితంగా, కొన్ని జన్యువులు ప్లెసిబో అనాల్జెసియాకు బాగా స్పందించవచ్చు, మరికొన్ని రాకపోవచ్చు. 

మెదడు నిర్మాణం: అభిజ్ఞా మరియు భావోద్వేగ ప్రాసెసింగ్ ప్రాంతాలు ప్లేస్‌బోస్ నుండి నొప్పి తగ్గింపును ఊహించడం మరియు గ్రహించడంలో పాల్గొంటాయి కాబట్టి, బాగా అభివృద్ధి చెందిన అభిజ్ఞా మరియు భావోద్వేగ ప్రాసెసింగ్ ప్రాంతాలు ఉన్నవారు తరచుగా నొప్పి నివారణలో ప్లెసిబోలో భారీ ప్రభావాలను ప్రదర్శిస్తారు. “ప్లెసిబో అనాల్జేసిక్ ప్రతిస్పందనలను నియంత్రించడంలో మెదడులోని శరీర నిర్మాణ సంబంధమైన భాగాలు, ప్రిఫ్రంటల్ కార్టెక్స్ మరియు యాంటీరియర్ సింగ్యులేట్ కార్టెక్స్ (మెదడు ప్రాంతాలు) చాలా అవసరం” అని డాక్టర్ సుబ్రమణియన్ చెప్పారు. ప్లెసిబో అనాల్జెసియాను ఉపయోగించడం నైతికంగా సరైనదేనా?

రోగికి వారి నొప్పికి ప్లెసిబోను ఇస్తున్నట్లు తెలియజేయడం చికిత్సపై వారి నమ్మకంపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది. క్రమంగా, ఇది ప్లెసిబోకు వారి ప్రతిస్పందనను ప్రభావితం చేస్తుంది. ఇది క్లినికల్ సందర్భాలలో ప్లెసిబో అనాల్జెసియాను ఉపయోగించడం గురించి నైతికపరమైన సమస్యల పెరుగుదలకు దారితీస్తుంది. 

కాంటెంపరరీ క్లినికల్ ట్రయల్స్‌లో ప్రచురించబడిన ఒక పరిశోధనా పత్రం ప్రకారం, శాస్త్రీయంగా అవసరమైనప్పుడు, నైతిక విశ్లేషణ మరియు అంతర్జాతీయ నైతిక మార్గదర్శకత్వం ద్వారా వివరించబడిన కొన్ని పరిస్థితులు యాదృచ్ఛిక ట్రయల్స్‌లో ప్లెసిబో నియంత్రణలను ఉపయోగించడాన్ని అనుమతిస్తాయి. ప్రభావవంతమైన చికిత్స లేని పరిస్థితుల అధ్యయనం, చికిత్సను నిలిపివేయడం వల్ల పాల్గొనేవారి ప్రమాదాలు తక్కువగా ఉంటాయి అనడానికి లేదా ప్లెసీబోను ఉపయోగించినప్పుడు బలమైన విధానపరమైన సమర్థనలు ఉన్నాయి మరియు చికిత్సను నిలిపివేయడం వలన వ్యక్తులకు హాని కలిగే ప్రమాదం లేదు. 

గుర్తుంచుకోవాల్సిన అంశాలు

  • రోగులు మందులు వంటివి వాడకుండా చేసిన చికిత్స తర్వాత నొప్పి తగ్గినప్పుడు అనుభవించేది ప్లెసిబో అనాల్జెసియా. అయితే దీని విజయం రోగికి వైద్యంపై ఉండే నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. 
  • ఒక వ్యక్తి విశ్వాసాలు ప్లెసిబో అనాల్జెసియాలోని కీలక అంశం అయినప్పుడు, ఎండోజెనస్ న్యూరోమాడ్యులేటర్లు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. 
  • ఒక వ్యక్తి ప్లెసిబో అనాల్జెసియాకు స్పందించే విధానం, వారి మానసిక అంశాలు, జన్యుపరమైన కారకాలు, మెదడు నిర్మాణంపై ఆధారపడి ఉంటుంది.

మీ అనుభవాన్ని లేదా వ్యాఖ్యలను పంచుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ట్రెండింగ్

వ్యాసాలు

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient
We use cookies to customize your user experience, view our policy here

మీ అభిప్రాయం విజయవంతంగా సమర్పించబడింది.

హ్యాపీయెస్ట్ హెల్త్ టీమ్ వీలైనంత త్వరగా మిమ్మల్ని సంప్రదిస్తుంది