728X90

0

0

0

ఈ వ్యాసంలో

గర్భాశయ క్యాన్సర్: చికిత్స మరియు నివారణ
13

గర్భాశయ క్యాన్సర్: చికిత్స మరియు నివారణ

ప్రపంచ వ్యాప్తంగా మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ 4వ అత్యంత సాధారణ క్యాన్సర్ అయినప్పటికీ, ముందుగానే గుర్తిస్తే ఇది టీకాలతో నయం చేయగల క్యాన్సర్‌లలో ఒకటి.
Cervical Cancer: Treatment and Prevention

సర్విక్స్ అనేది గర్భాశయం యొక్క మెడ. ఇది యోని మరియ గర్భాశయాన్ని కలుపుతుంది. క్యాన్సర్ కణాలు గర్భాశయం యొక్క దిగువ భాగాన్ని ప్రభావితం చేసినప్పుడు లేదా ప్రాణాంతక కణితి ఏర్పడినప్పుడు దానిని గర్భాశయ క్యాన్సర్ అంటారు. ప్రపంచ వ్యాప్తంగా మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ 4వ అత్యంత సాధారణ క్యాన్సర్ అయినప్పటికీ, ముందుగానే గుర్తిస్తే ఇది టీకాలతో నయం చేయగల క్యాన్సర్‌లలో ఒకటి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, గర్భాశయ క్యాన్సర్ 2020లో ప్రపంచవ్యాప్తంగా 6,04,000 కొత్త కేసులు మరియు 3,42,000 మరణాలు సంభవించినట్లు అంచనా వేయబడింది. అయితే చాలా మంది మహిళలకు ఈ పరిస్థితి గురించి తెలియదని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

బెంగళూరులోని మదర్‌హుడ్ ఆస్పత్రిలోని కన్సల్టెంట్, ప్రసూతి మరియు గైనకాలజిస్ట్ డాక్టర్ సుహాసిని ఇనామ్‌దార్ మాట్లాడుతూ.. అవగాహన లోపం కారణంగా మహిళలు ప్రాథమిక దశలో పరీక్షలు మరియు రోగనిర్ధారణకు చాలా అరుదుగా వస్తారని చెప్పారు.

గర్భాశయ క్యాన్సర్ అంటే ఏమిటి?

గర్భాశయ క్యాన్సర్ అనేది గర్భాశయం యొక్క నోటి వద్ద స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థ లోపల అసాధారణ కణాల పెరుగుదల ప్రారంభ దశ. డబ్ల్యూహెచ్‌ఓ చెప్పినట్లుగా, 95 శాతం కంటే ఎక్కవ గర్భాశయ క్యాన్సర్ హ్యూమన్ పాపిల్లోమా వైరసస్ (HPV) కారణంగా ఉంది. అలాగే, హెచ్‌పీవీ లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్. పునరుత్పత్తి మార్గంలో సాధారణ ఇన్‌ఫెక్షన్‌కు కూడా కారణమవుతుంది.

గర్భాశయ కణజాలంలో అసాధారణ కణమార్పులతో గర్భాశయ క్యాన్సర్ ప్రారంభమవుతుంది. ఈ కణాలు చికిత్స చేయకుండా వదిలేస్తే క్యాన్సర్ కణాలుగా మారవచ్చు.

గర్భాశయ క్యాన్సర్ సాధారణ లక్షణాలు

”గర్భాశయ క్యాన్సర్ సాధారణంగా ప్రారంభదశలో గుర్తించదగిన సంకేతాలు మరియు లక్షణాలను చూపించదు. మహిళలు మరింత అధునాతన దశకు చేరుకున్నప్పుడు మాత్రమే సంకేతాలను గమనిస్తారు. కానీ ఇది అప్పటికే చాలా ఆలస్యం కావచ్చు” అని డాక్టర్ ఇనామ్‌దార్ వివరించారు.

ఇండియన్ క్యాన్సర్ సొసైటీ గర్భాశయ క్యాన్సర్ యొక్క అధునాతన దశలలో కొన్ని లక్షణాలను ప్రస్తావిస్తుంది, అవి..

  • రక్తస్రావంతో కూడిన క్రమరహిత బుుతుస్రావం
  • లైంగిక సంపర్కం మరియు పెల్విక్ పరీక్ష తర్వాత అసాధారణ యోని రక్తస్రావం
  • మోనోపాజ్ తర్వాత రక్తస్రావం
  • యోని అసౌకర్యం లేదా యోని నుంచి దుర్వాసనతో కూడిన డిశ్చార్జ్. ఇది పీరియడ్స్ మధ్య లేదా
  • మోనోపాజ్ తర్వాత సంభవించవచ్చు.
  • లైంగిక చర్య సమయంలో నొప్పి
  • వెన్ను, కాలు లేదా కటి నొప్పి
  • అలసట, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం
  • ఒక కాలులో వాపు

గర్భాశయ క్యాన్సర్ కారణాలు

సెర్వైకల్ క్యాన్సర్ లైంగికంగా చురుకుగా ఉండే స్త్రీలలో సర్వసాధారణం మరియు ఇది హెచ్‌పీవీ అనే వైరస్ వల్ల వస్తుంది. ఇది గర్భాశయం లేదా గర్భాశయ ముఖద్వారంపై ప్రభావం చూపుతుంది అని బెంగళూరులోని స్పార్ష్ ఆస్పత్రి ప్రసూతి మరియు గైనకాలజీ విభాగం డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ కన్సల్టెంట్ డాక్టర్ ప్రతిమా రెడ్డి చెప్పారు.

”ధూమపానం అలవాటు, వైద్య చికిత్సల కారణంగా బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ లేదా హెచ్‌ఐవీ సంక్రమణ.. ఈ కారకాలు ఇప్పటికే ఉన్నట్లయితే గర్భాశయ క్యాన్సర్‌కు గురయ్యే అవకాశం ఉంది. 25 మరియు 49 సంవత్సరాల మధ్య వయసున్న మహిళలు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పాప్ స్మెర్ పరీక్ష చేయించుకోవాలి. అయితే ప్రమాద కారకాలు ఉన్నవారు తరచూ పాప్ స్మియర్ పరీక్షలను చేయిస్తుండాలి” అని డాక్టర్ ఇనామ్‌దార్ చెప్పారు.

కణాల మార్పులను తనిఖీ చేయడానికి స్క్రీనింగ్

సర్వైకల్ క్యాన్సర్‌ను గుర్తించడానికి పాప్ పరీక్ష మరియు హెచ్‌పీవీ అనే రెండు ప్రధానమైన పరీక్షలు ఉన్నాయి.
హెచ్‌పీవీ వైరస్ ఉనికిని మరియు గర్భాశయ కణజాలంలో కణమార్పులను హెచ్‌పీవీ పరీక్ష ద్వారా తనిఖీ చేయవచ్చు.
పాప్ పరీక్షలు గర్భాశయ క్యాన్సర్ అభివృద్ధి ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
పాప్ స్మెర్ పరీక్ష 25 మరియు 64 మధ్య వయసున్న మహిళలందరికీ అందించబడుతుంది. పాప్ స్మెర్ అనేది గర్భాశయం లేదా గర్భాశయ నోటికి సంబంధించిన పరీక్ష. దీనిలో వైద్యుడు గర్భాశయం నుంచి కణాల నమూనాను తీసుకుంటాడు. వాటిని సూక్ష్మదర్శిని కింద పాథాలజిస్ట్ పరీక్షిస్తాడు. అయితే పాప్ స్మియర్‌లు క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడటమే కాకుండా క్యాన్సర్‌ను గుర్తించకుండా చేయడంలో కూడా సహాయపడుతుందని గుర్తుంచుకోవాలని డాక్టర్ రెడ్డి చెప్పారు.

చికిత్స

గర్భాశయ క్యాన్సర్ చికిత్సలో ప్రాణాంతక కణితి మరియు చుట్టుపక్కల కణజాలాలను తొలగించే శస్త్రచికిత్స ఉంటుంది. గర్భాశయ ముఖద్వారంలోని క్యాన్సర్ స్థితిని బట్టి, బాధిత స్త్రీలు గర్భాశయాన్ని తొలగించడం (హిస్టెరెక్టమీ) కూడా చేయించుకుని ఉండవచ్చు. వైద్యలు కొన్ని సందర్భాల్లో, కీమోథెరపీ మరియు రేడియేషన్ థెరపీని కూడా ఇస్తారు.

నివారణ చర్యలు

“HPV టీకా ద్వారా గర్భాశయ క్యాన్సర్‌ను నివారించవచ్చు, రెగ్యులర్ స్క్రీనింగ్ క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించడంలో సహాయపడుతుంది, ఇది చికిత్స యొక్క విజయవంతమైన రేటును పెంచుతుంది” అని డాక్టర్ ఇనామ్‌దార్ చెప్పారు.

గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడానికి 9 – 14 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలకు సిఫార్సు చేయబడిన టీకాలలో HPV టీకాను భారత ప్రభుత్వం జాబితా చేసింది.

మీ అనుభవాన్ని లేదా వ్యాఖ్యలను పంచుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ట్రెండింగ్

వ్యాసాలు

0

0

0

Opt-in To Our Daily Newsletter

* Please check your Spam folder for the Opt-in confirmation mail

Opt-in To Our
Daily Newsletter

We use cookies to customize your user experience, view our policy here

మీ అభిప్రాయం విజయవంతంగా సమర్పించబడింది.

హ్యాపీయెస్ట్ హెల్త్ టీమ్ వీలైనంత త్వరగా మిమ్మల్ని సంప్రదిస్తుంది