728X90

0

0

0

0

0

0

0

0

0

ఈ వ్యాసంలో

మధుమేహం ఉందా.. వేసవిలో ఈ డ్రింక్స్ తాగండి
129

మధుమేహం ఉందా.. వేసవిలో ఈ డ్రింక్స్ తాగండి

మండే వేసవిలో శరీరాన్ని చల్లగా మరియు హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి తాజాగా తయారుచేసిన పండ్లరసాలను తాగడం ఉత్తమ మార్గం. కానీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు వేసవి పానీయాలు అన్ని సరిపోవు. ఎందుకంటే వారు తమ రక్తంలో గ్లూకోజ్ స్తాయిలను పెంచని పానీయాలను ఎంచుకోవాలి.
Summer beverages for people with diabetes

మండే వేసవిలో శరీరాన్ని చల్లగా మరియు హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి తాజాగా తయారుచేసిన పండ్లరసాలను తాగడం ఉత్తమ మార్గం. కానీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు వేసవి పానీయాలు అన్ని సరిపోవు. ఎందుకంటే వారు తమ రక్తంలో గ్లూకోజ్ స్తాయిలను పెంచని పానీయాలను ఎంచుకోవాలి.

బెంగళూరుకు చెందిన పోషకాహార నిపుణుడు నిధి నిగమ్ మాట్లాడుతూ.. జ్యూస్‌లు టెంప్టింగ్‌గా ఉన్నప్పటికీ, మధుమేహం ఉన్నవారు పండ్లను జ్యూస్‌గా తీసుకోవడం మానుకోవాలి. రసంలో మొత్తం పండులో ఉన్నంత పీచు ఉండదు. అంతేకాదు, డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగడానికి కూడా కారణం కావచ్చు. అయితే, మధుమేహం ఉన్నవారు తమ వేసవి తాపాన్ని తీర్చుకోవడానికి ప్రత్యామ్నాయ వేసవి పానీయాలను ఆస్వాదించకూడదని దీని అర్థం కాదు.

మధుమేహ వ్యాధిగ్రస్తులకు వేసవి పానీయాలు

“డయాబెటిక్స్ బ్లడ్ షుగర్ పెరగకుండా తమ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి కొన్ని సహజమైన మరియు ఆరోగ్యకరమైన వేసవి రసాలను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు” అని ఢిల్లీకి చెందిన పోషకాహార నిపుణుడు కవితా దేవగన్ సూచిస్తున్నారు.

నిగమ్ ప్రకారం, ఈ వేసవి పానీయాలను ఉదయం 11 నుంచి 12 గంటలు లేదా సాయంత్రం 4 నుంచి 4:30 గంటల మధ్య తీసుకోవడం ఉత్తమం.

మధుమేహం ఉన్న వారికోసం పోషకాహార నిపుణులు సిఫార్సు చేసిన కొన్ని శీఘ్ర మరియు సులభమైన వేసవి పానీయాల జాబితా ఇక్కడ ఉంది.

సబ్జా గింజలతో కొబ్బరి నీరు

కొబ్బరి నీరు శరీరాన్ని చల్లబరుస్తుంది మరియు యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుందని పోషకాహార నిపుణుడు నిగమ్ వివరిస్తున్నారు. దీనిని సబ్జాగింజలతో కలపవచ్చు. సబ్జా గింజలను నీటితో కలిపినప్పుడు జిలాటినస్ ఆకృతిలో ఉబ్బుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది ఉత్తమ వేసవి పానీయాలలో ఒకటి. ”కొబ్బరి నీళ్లలో సబ్జా కూడా హైడ్రేట్‌గా ఉంటుంది. సబ్జా గింజల్లో ఉండే పీచు షుగర్ లెవెల్స్‌ను మెయింటైన్ చేయడానికి కూడా సహాయపడుతుంది” అని నిగమ్ వివరించారు. దీనికి కొద్దిగా నిమ్మరసం కలిపితే రుచి, నాణ్యత పెరుగుతంది.

చియా సీడ్ డ్రింక్

దేవగన్ ప్రకారం, చియా సీడ్-ఇన్ఫ్యూజ్డ్ వాటర్ మరొక గొప్ప మధుమేహం-ఫ్రెండ్లీ వేసవి రసం. ఇందులో ఒమేగా 3 పుష్కలంగా ఉంటుంది. ఒక లీటరు నీటిలో రెండు టేబుల్ స్పూన్ల చియా గింజలు వేసి నానబెట్టాలి. దాహం వేసినప్పడు ఆ నీటిని తరచుగా తాగవచ్చు.

సత్తు పానీయం

నల్ల శెనగలను వేయించి, పై పొట్టు తీసి వాటిని గ్రైండ్ చేయడం ద్వారా సత్తు తయారు చేస్తారు. ఇది జీర్ణక్రియకు సహాయం చేయడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరచడం వంటి అనేక పోషక ప్రయోజనాలను కలిగి ఉంది. వేసవిలో శరీరాన్ని చల్లబరిచేందుకు సత్తు పొడిని నీటిలో కలిపి తాగాలని కవితా దేవగన్ సిఫార్సు చేస్తున్నారు. ఇది శరీరాన్ని చల్లబర్చడమే కాకుండా, ఆకలిని కూడా అణచివేస్తుందని ఆమె వివరిస్తున్నారు.

కాకపోతే, మీరు 4 టేబుల్ స్పూన్ల సత్తు పొడి, 4 టీస్పూన్ల పెరుగు, చిటికెడు పసుపు, చాట్ మసాలా, జీలకర్ర పొడి మరియు చిటికెడు కొత్తిమీర ఆకులను జోడించడం ద్వారా రిఫ్రెష్ మరియు రుచికరమైన రసాన్ని తయారు చేసుకోవచ్చు. ఇందులో టేబుల్ సాల్ట్‌కు బదులుగా రాక్ సాల్ట్ జోడించడం వల్ల జీర్ణక్రియకు, కడుపు ఉబ్బరాన్ని నివారించడానికి సహాయపడుతుంది. వేసవి కాలంలో హీట్ స్ట్రోక్‌ను నివారించడానికి సన్నగా తరిగిన ఉల్లిపాయలను జోడించడం కూడా మంచి ఆలోచన అని ఆమె చెప్పారు.

వెలగపండు లేదా వుడ్ యాపిల్ డ్రింక్

వెలగపండు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడానికి చాలా మంచిది. వీటిలో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటిని ఉపయోగించి సమ్మర్ జ్యూస్‌లు తయారు చేయడం చాలా సులభం అని నిధి నిగమ్ వివరించారు. దాని కోసం, మీరు గుజ్జును బయటకు తీసి నీటితో కలపండి. ”వేసవి కాలంలో చాలా మంది ప్రజలు చక్కెర రసాలను తీసుకుంటే, మధుమేహ వ్యాధిగ్రస్తులు జీలకర్ర పొడి మరియు చాట్ మసాలతో ఆరోగ్యకరమైన పళ్ల రసాలను ఎంచుకోవచ్చు” అని వారు సూచిస్తున్నారు.

కోకుమ్ షర్బత్

కోకుమ్ ఒక చిన్న, గుండ్రని పండు. దాదాపు చెర్రీ టొమాటోల పరిమాణంలో ఉంటుంది. ఈ పుల్లని పండుని అనేక భారతీయ కూరలను రుచిగా చేయడానికి పొడిగా లేదా పచ్చిగా ఉపయోగిస్తారు. వేసవిలో శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి మరియు చల్లబరచడానికి చక్కెర మరియు నీటితో కలిపి రసం చేయడానికి దీనిని ఉపయోగిస్తారు.

అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు చక్కెర లేకుండా కోకుమ్ జ్యూస్ తీసుకోవడం మంచిది. పులుపు తగ్గేందుకు కొబ్బరి పాలను కలిపితే సరిపోతుంది. కావాలనుకుంటే కొద్దిగా బెల్లం కూడా వేయొచ్చు. అయితే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. దీనితో పాటు మీరు సబ్జా గింజలను జోడించినట్లయితే, అందులోని ఫైబర్ అకస్మాత్తుగా ఇన్సులిన్ స్పైక్స్‌ను కలిగించదు. అలాగే వీటికి పంచదార కలిపి తీసుకుంటే పోషక విలువలు తగ్గిపోతాయని నిధి నిగమ్ వివరించారు.

మజ్జిగ

”ఇంట్లోనే మజ్జిగ చేయడానికి సులభమైన మార్గం పెరుగుతో నీటిని కలపడం, ఉప్పు మరియు జీలకర్ర పొడి, తాజా కరివేపాకు లేదా కొత్తిమీర వంటి మసాలా దినుసులతో మసాలా చేయడం. ఇది ఒక అద్భుతమైన ప్రోబయోటిక్, ఇది పేగు ఆరోగ్యం, జీర్ణక్రియను ప్రభావితం చేయడంతో పాటు, మిమ్మల్ని హైడ్రేట్ చేస్తుంది” అని దేవగన్ చెప్పారు.

క్రాన్‌బెర్రీ జ్యూస్

స్వచ్ఛమైన మరియు తియ్యని క్రాన్‌బెర్రీ జ్యూస్‌ను ఎంచుకోవాలని దేవగన్ సిఫార్సు చేస్తున్నారు. వీటిలో విటమిన్ సి, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఇది పుల్లగా ఉంటుంది కాబట్టి మీరు దానిని కొబ్బరి నీళ్లతో కలపవచ్చు.

కూరగాయల రసాలు

దేవగన్ ప్రకారం, సమ్మర్ డ్రింక్ ఎంచుకునేటప్పుడు కూరగాయల రసాలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన ఎంపిక. మధుమేహ వ్యాధిగ్రస్తులకు సరిపోయే రంగురంగుల కూరగాయల శ్రేణి ఉంది. విటమిన్లు మరియు ఖనిజాలతో నిండిన టమోటా మరియు మిరియాలు(ఎరుపు, పసుపు లేదా ఆకుపచ్చ) లేదా ఆకుపచ్చ ఆపిల్, దోసకాయ లేదా ఆమ్ల రసం వంటి కలయికలు ఉంటాయి. మరొక ఆకుపచ్చ రసం బచ్చలికూర మరియు దోసకాయల మిశ్రమం కావచ్చు. దోసకాయ రసాన్ని అల్లం మరియు నిమ్మరసంతో కలపి కూడా తీసుకోవచ్చు అని దేవగన్ చెప్పారు.

పొట్లకాయ మరియు బీట్‌రూట్‌తో తయారు చేసిన జ్యూస్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా చాలా మంచిది. ఇది రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది అని దేవగన్ వివరించారు.

మీ అనుభవాన్ని లేదా వ్యాఖ్యలను పంచుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ట్రెండింగ్

వ్యాసాలు

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient
We use cookies to customize your user experience, view our policy here

మీ అభిప్రాయం విజయవంతంగా సమర్పించబడింది.

హ్యాపీయెస్ట్ హెల్త్ టీమ్ వీలైనంత త్వరగా మిమ్మల్ని సంప్రదిస్తుంది