728X90

0

0

0

0

0

0

0

0

0

ఈ వ్యాసంలో

అతీత వృద్ధులు: 80 ఏళ్లు పైబడిన వారి సూపర్ మెదళ్ళను అర్థం చేసుకుందాం 
3

అతీత వృద్ధులు: 80 ఏళ్లు పైబడిన వారి సూపర్ మెదళ్ళను అర్థం చేసుకుందాం 

అతీత వృద్ధుల మెదడు కణాలలో పెద్ద-పరిమాణ న్యూరాన్లు వారి చురుకైన జ్ఞాపకశక్తి మరియు అభిజ్ఞా విధులను కాపాడటానికి సహాయపడతాయని పరిశోధకులు అంటున్నారు.
జ్ఞాపకశక్తి క్షీణత వృద్ధాప్యంలో సాధారణమైన విషయం. వయస్సు పైబడితే, వారు సమాచారాన్ని సరిగ్గా గుర్తుంచుకోగలరని గమనించవచ్చు
శ్యాలిమా దాస్‌చే గీయబడిన చిత్రం

అతీత వృద్ధుల మెదడు కణాలలో పెద్దపరిమాణ న్యూరాన్లు వారి చురుకైన జ్ఞాపకశక్తి మరియు అభిజ్ఞా విధులను కాపాడటానికి సహాయపడతాయని పరిశోధకులు అంటున్నారు. 

జ్ఞాపకశక్తి క్షీణత వృద్ధాప్యంలో సాధారణమైన విషయం. వయస్సు పైబడితే, వారు సమాచారాన్ని సరిగ్గా గుర్తుంచుకోగలరని గమనించవచ్చు: ఉదాహరణకు, చాలా మంది వృద్ధులు తరచుగా సమయానికి మందులు తీసుకోవడం మర్చిపోతారు. కళ్ళజోడు అలాగే ఇతర వస్తువులను కూడా పోగొట్టుకుంటారు. 

అయితే, ప్రస్తుతం ఉన్న సమాజ పరిస్థితులలో నిలదొక్కుకునే అతీత వృద్ధులు – 80 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న కొంతమందికి జ్ఞాపకశక్తి మరియు అభిజ్ఞా సామర్థ్యాలు వయస్సుతో పాటుగా క్షీణించవు. 

షోలాపూర్కు చెందిన రిటైర్డ్ టీచర్ వనమాల కినికర్ 12 ఏళ్ల వయసు నుంచే శాస్త్రీయ నృత్యకారిణి. 85 ఏళ్ల వయసులో కినికర్ నృత్య శాలను నడుపుతూ నృత్యం చేస్తూనే ఉన్నారు. ఆమె తన చిన్ననాటి రోజులను, సంఘటనలను సులభంగా గుర్తు తెచ్చుకుంటారు. 

నా ఏడవ తరగతిలో నేను కొరియోగ్రఫీ చేసిన నా మొదటి డాన్స్ సీక్వెన్స్ నాకు స్పష్టంగా గుర్తుందిఅని కినికర్ పేర్కొన్నారు. “నాకు కొత్త విషయాలు నేర్చుకోవడం, వంట చేయడం మరియు ఇంటి పనులు చేయడం అంటే ఇష్టంఅని అతీత వృద్ధురాలు పేర్కొన్నారు. అయితే ఆమె వయస్సు గల చాలా మందికి జ్ఞాపకశక్తి మరియు జ్ఞాన సంబంధ సమస్యలు చాలా సాధారణంగా వస్తాయి. 

సూపర్ న్యూరాన్లు 

కినికర్లానే చాలా మంది అతీత వృద్ధులు కూడా ఉన్నారు. పరిశోధకులు వారి వయస్సును అధిగమించి మెదడు పనితీరుకు కారణమయ్యే కారణాలను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారు. 

అమెరికాలోని ఇలినాయిస్లోని నార్త్ వెస్ట్రన్ యూనివర్శిటీ పరిశోధకుల వద్ద 80 ఏళ్లు పైబడిన వారిలో పదునైన జ్ఞాపకశక్తి మరియు అభిజ్ఞా పనితీరులో పాల్గొనే నాడీ యంత్రాంగాలను అధ్యయనం చేసే ప్రత్యేక సూపర్ ఏజింగ్ రీసెర్చ్ ప్రోగ్రామ్ ఉంది. 

సెరెబ్రల్ కార్టెక్స్లో ప్రచురించబడిన 2021 అధ్యయనంలో, నార్త్ వెస్ట్రన్ విశ్వవిద్యాలయంలోని డాక్టర్ టామర్ గెఫెన్ మరియు ఆమె బృందం అతీత వృద్ధుల్లోని మెదడు కణాలలో టౌ టాంగిల్(tau tangle) మరియు అమిలాయిడ్ బీటా ప్రోటీన్(amyloid beta protein) పేరుకుపోలేదని గుర్తించారు. వారి జ్ఞాపకశక్తి  క్షీణించక పోవడానికి ఇది ఒక కారణం కావచ్చనే పరికల్పనను వారు ముందుకు తెచ్చారు. 

2022 లో పరిశోధనను కొనసాగిస్తూ, వారు జర్నల్ ఆఫ్ న్యూరోసైన్స్లో మరొక అధ్యయనాన్ని ప్రచురించారు. వివిధ వయసులు, పరిస్థితులకు చెందిన 24 మంది మెదడు స్కాన్లను పరిశీలించారు: వారు ఆరుగురు అతీత వృద్దులు, ఏడుగురు అభిజ్ఞా(కాగ్నిటివ్) సగటు వృద్దులు, 30-40 సంవత్సరాల వయస్సు గల ఆరుగురు వ్యక్తులు మరియు అల్జీమర్స్ వ్యాధి ప్రారంభ దశలో ఉన్న మరో ఐదుగురు ఇలా వివిధ గ్రూపులకు చెందిన వారు 

స్కాన్లన్నింటిలో, టౌ టాంగిల్ నిర్మాణాలను గమనించారు మరియు మెదడు మధ్య  భాగంలోని (ఎంటోరినల్ కార్టెక్స్) రెండవ పొరలోని న్యూరాన్ల పరిమాణాన్ని కొలిచారు. మెదడులోని ప్రాంతం జ్ఞాపకశక్తి, నావిగేషన్ మరియు సమయం యొక్క అవగాహన నియంత్రణకు బాధ్యత వహిస్తుంది. 

వారు రెండు ముఖ్యమైన అంశాలను గుర్తించారు: 

  • అధ్యయనంలో పాల్గొన్న అధిక వయసు అభిజ్ఞా వ్యక్తులు మరియు 30-40 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులతో పోలిస్తే అతీత వృద్దుల సమూహం యొక్క మెదడు కణాలు పెద్దగా ఉండి పెద్ద న్యూరాన్లను కలిగి ఉన్నాయి 
  • అల్జీమర్స్ వ్యాధి ఉన్నవారిలో, మెదడులో టౌ టాంగిల్ మరియు అమిలాయిడ్ బీటా ప్రోటీన్ పేరుకుపోవడం వల్ల న్యూరాన్లు చిన్నవిగా ఉన్నాయి. 

పెద్ద న్యూరాన్లు వాటి నిర్మాణాలను బాగా పొందుపరుచుకున్నాయని పరిశోధకులు గమనించారు. “అతీత వృద్దులలో పదునైన జ్ఞాపకశక్తికి ఒక కారణం ఏమిటంటే, పెద్ద న్యూరాన్లలు టౌ ప్రోటీన్ పేరుకుపోకుండా కాపాడబడతాయనిఅని డాక్టర్ గెఫెన్ హ్యాపీయెస్ట్ హెల్త్తో పేర్కొన్నారు 

ఏదేమైనా, “అతీత వృద్దులలో న్యూరాన్లు ఎందుకు పెద్దవిగా ఉన్నాయో లేదా వ్యక్తులు అల్జీమర్స్ వ్యాధి బారిన ఎందుకు పడలేదో నాకు ఖచ్చితంగా తెలియదు.” అని డాక్టర్ వెల్లడించారు. 

అతీత వృద్దులలో మెదడు ప్రత్యేకత ఏమిటి?’, ‘వృద్ధులలో అల్జీమర్స్ వ్యాధి బారిన పడకుండా నివారించడంలో సహాయపడటానికి వారి జీవ లక్షణాలను మనం ఎలా ఉపయోగించగలం?’ అనే కొన్ని ప్రశ్నలకు వారి బృందం సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది. 

భవిష్యత్ పరిష్కారాలు ఏమిటి?  

పరిశోధన భవిష్యత్తు అధ్యయనాలకు దారులు తెరిచిందిఅతీత వృద్దులలో న్యూరాన్ల విధి ఎలా, ఎందుకు సంరక్షించబడుతోందో అర్థం చేసుకోవడానికి; మరియు కణాల జీవక్రియ, రసాయన మరియు జన్యు కారకాలపై దృష్టి పెట్టాలి 

బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లోని న్యూరోసైన్స్ సెంటర్ అసోసియేట్ ప్రొఫెసర్ శ్రీధరన్ దేవరాజన్ వివరిస్తూ, “టౌ టా౦గిల్ ఏర్పడటం వల్ల న్యూరాన్ పరిమాణం తగ్గడం, న్యూరాన్లను నష్టపోవడం మరియు వాటి మధ్య సమాచార ప్రసారం ఆగిపోవడం జరుగుతుంది. అల్జీమర్స్ వంటి వ్యాధులు అభివృద్ధి చెందడానికి ఇవి కీలక కారణాలు కావచ్చు. సూపర్ న్యూరాన్లను అసాధారణంగా మార్చేదేదో పరిశోధకులు కనుగొనగలిగితే, న్యూరోడెజెనరేటివ్ వ్యాధులకు పరిష్కారాన్ని కనుగొనడంలో ఇది సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు 

సూపర్ న్యూరాన్ యొక్క న్యూరోప్రొటెక్టివ్ మెకానిజం కనుగొనబడినప్పుడు, మతిభ్రంశం (dementia) మరియు  అల్జీమర్స్ వ్యాధి మొదలయ్యే దశ నుండి మరింత బలహీన వ్యాధిగ్రస్తుల మెదడులోని న్యూరాన్లను రక్షించే సామర్థ్యం  లభిస్తుందిఅని డాక్టర్ దేవరాజన్ పేర్కొన్నారు. 

బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లోని న్యూరోసైన్స్ సెంటర్ అసోసియేట్ ప్రొఫెసర్ శ్రీధరన్ దేవరాజన్ మాట్లాడుతూ, సూపర్ న్యూరాన్లను అసాధారణంగా మార్చేదేదో పరిశోధకులు కనుగొనగలిగితే, న్యూరోడెజెనరేటివ్ వ్యాధులకు పరిష్కారాన్ని కనుగొనడంలో ఇది సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు 

పరిష్కారం దొరికే వరకు, న్యూరోడెజెనరేటివ్ వ్యాధులు ప్రస్తుతం జీవనశైలి మార్పులు మరియు లక్షణాలకు కొన్ని మందులతో నిర్వహించబడుతున్నాయి. శారీరకంగా మరియు మానసికంగా చురుకుగా ఉండటం వలన వ్యాధి పురోగతిని తగ్గించడానికి బాగా సాయపడుతుంది. 

నృత్యకారిని కినికర్, ఆమెకు చురుకైన మెదడు ఎలా సాధ్యపడిందని అడిగితే, “పుస్తకాలు చదవడం, రాయడం మరియు కళను అభ్యసించడం వంటి కార్యకలాపాలతో పాటు మనం సానుకూలంగా ఉండటం వంటివి సహాయపడతాయి. క్రమం తప్పకుండా చేసే వ్యాయామం, పౌష్టికాహారం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుందిఅని సమాధానమిచ్చారు. ఆమెలా మానసికంగా యవ్వనంగా మరియు చురుకుగా ఉండటానికి ఎవరైనా తన దినచర్యను ఉదాహరణగా తీసుకోవాలి 

మీ అనుభవాన్ని లేదా వ్యాఖ్యలను పంచుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ట్రెండింగ్

వ్యాసాలు

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient
We use cookies to customize your user experience, view our policy here

మీ అభిప్రాయం విజయవంతంగా సమర్పించబడింది.

హ్యాపీయెస్ట్ హెల్త్ టీమ్ వీలైనంత త్వరగా మిమ్మల్ని సంప్రదిస్తుంది