728X90

0

0

0

0

0

0

0

0

0

ఈ వ్యాసంలో

పిల్లలలో ఒత్తిడి: తల్లిదండ్రులు ఎలా సహాయపడాలి?
15

పిల్లలలో ఒత్తిడి: తల్లిదండ్రులు ఎలా సహాయపడాలి?

తల్లిదండ్రులు ఒత్తిడి నిర్వహణలో తప్పనిసరిగా పిల్లలకు సహాయం చేయాలి. ఈ పోటీ పరీక్షల యొక్క ప్రయోజనాలను అర్థం చేసుకోవాలి. ఓటమిని అంగీకరించడం, కారణాలను కనుగొనడం అనేవి ఒత్తిడి నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తాయి
Poorva Ranade, Ph D, Child Psychologist and Counsellor; Neeraj Kumar, social entrepreneur on mental health, Mahesh Yadav, educationist at the session at Get Set Grow summit.

చదువు, పోటీ పరిక్షల ఒత్తిడి పిల్లలను ఆందోళనకు గురిచేయడంతో పాటు ఇతర మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్లో ఒత్తిడిని నియంత్రించేందుకు ప్రయత్నించాలి.

”ఒత్తిడి అవసరం, ఇది పనితీరును పెంచుతుంది. కానీ అది పనితీరు మరియు ఇతర రోజువారీ కార్యకలాపాలను ప్రభావితం చేసినప్పుడు, ఆ ఒత్తిడి ఒక సమస్యగా మారుతుంది” అని ఇటీవల బెంగళూరులో జరిగిన హ్యాపియెస్ట్ హెల్త్ చిల్డ్రన్ సమ్మిట్ గెట్ సెట్, గ్రో!లో చైల్డ్ సైకాలజిస్ట్ మరియు కౌన్సెలర్ పూర్వా రనడే అన్నారు.

అధిక ఒత్తిడి మానసిక శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది

”పిల్లలకు అనుభవం తక్కువ. వారికి ఒత్తిడితో కూడిన జీవిత అనుభవాలు పరిమితంగా ఉంటాయి. ముఖ్యంగా యుక్తవయసు వారు ఒత్తిడిని నిర్వహించడం చాలా కష్టంగా ఉంటుంది” అని డాక్టర్ రనడే వివరించారు.

పిల్లలపై మనం పెట్టుకునే అంచనాలు బలమైన పాత్ర పోషిస్తాయి. సహచరులు, తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయులు ఈ అంచనాలను ప్రభావితం చేస్తారు. ఈ అంచనాలను అందుకోలేనప్పుడు పిల్లవాడు ఒత్తిడికి లోనవుతారు అని బెంగళూరులోని అలెన్ కెరీర్ ఇనిస్టిట్యూట్, సౌత్ ఇండియా ఎడ్యుకేషన్ హెడ్ మహేష్ యాదవ్ చెప్పారు.

ఒత్తిడికి చికిత్స చేయండి.. లక్షణాలకు కాదు

కౌమారదశలో ఉన్నవారు శారీరక మరియు జీవసంబంధమైన మార్పులకు లోనవుతారు. ఈ మార్పుల మధ్య విద్యావేత్తలు, ముఖ్యంగా పోటీ పరీక్షలు, పిల్లలలో ఒత్తిడిని మరింత పెంచుతాయి. ఇది మానసిక శ్రేయస్సును మరింత ప్రభావితం చేస్తాయి. ”తల్లిదండ్రులు తరచరగా.. మీ పిల్లలలో కోపం, మొండితనం, ధిక్కారం, నిద్రలేమి లేదా నిద్రభంగం మరియు ఇతర ప్రవర్తనా వ్యక్తీకరణలకు మూలకారణం ఒత్తిడి అని గుర్తించడం చాలా ముఖ్యం అని రానడే వివరించారు. కాబట్టి ఒత్తిడి యొక్క మూల కారణాన్ని పరిష్కరించడం చాలా ముఖ్యం.

”పిల్లలు మానసికంగా క్షేమంగా ఉండటం చాలా ముఖ్యమని తల్లిదండ్రలు అర్థం చేసుకోవాలి. పిల్లలు మానసిక క్షేమాన్ని నిర్వహించడంలో సహాయం ఒక్కరాత్రిలో చేసే పనికాదు. స్ట్రెస్ మేనేజ్‌మెంట్ అనేది అధికారిక విద్య ద్వారా నేర్పించాలి” అని పీక్‌మైండ్ సీఈఓ మరియు వ్యవస్థాపకుడు నీరజ్ కుమార్ చెప్పారు.

పిల్లలతో మనసు విప్పి మాట్లాడుతుండాలి

”చాలా మంది పిల్లలకు తల్లిదండ్రులతో కమ్యూనికేట్ చేయడంలో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను బహిరంగ లేదా ఆరోగ్యకరమైన చర్చల ద్వారా పరిష్కరించాలి. దీనికోసం తల్లిదండ్రలు పిల్లలకోసం సురక్షితమైన, ఆత్మీయతతో కూడిన వాతావరణాన్ని సృష్టించాల్సిన అవసరం ఉంది. ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యే సమయంలో ఒత్తిడి, స్వీయ హాని ప్రవర్తన మరియు విద్యార్థుల ఆందోళనతో ముడిపడి ఉంటుంది. తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయులు కంటే పిల్లలు ఫీడ్ బ్యాక్‌ను ఎక్కువగా స్వీకరిస్తారు” అని ఆయన అన్నారు.

హోమ్‌సిక్‌నెస్ అనేది ఒక ప్రధాన సమస్య కావచ్చు. కొంతమంది కౌమారదశలో ఉన్నవారు చదువుల కోసం ఇంటికి దూరంగా ఉండే పరిస్థితి వచ్చినప్పుడు వారికి తల్లిదండ్రుల మద్దతు అవసరం అని కుమార్ వివరించారు.

పిల్లలను ఆడుకోనివ్వండి

పిల్లలు ప్రతిరోజూ ఎనిమిది గంటల కంటే ఎక్కువ సమయం చదువుతున్నారని ప్రస్తావిస్తూ, వారికి సంతోషంగా ఉండటానికి, విశ్రాంతి తీసుకోవడానికి మరియు ఆడుకోవడానికి సమయం లేదని యాదవ్ చెప్పారు. “ముఖ్యంగా, మీ బిడ్డ ప్రతిరోజూ కొంత ఆట సమయాన్ని కలిగి ఉండాలి. ఇది మెరుగైన ఒత్తిడి నిర్వహణ మరియు విద్యా పనితీరు కోసం మెదడులోని న్యూరాన్‌లను ప్రేరేపిస్తుంది, ”అని యాదవ్ చెప్పారు.

పిల్లల స్థానంలో మిమ్మల్ని మీరు ఊహించుకోండి

టీనేజర్ల సమస్యలను అర్థం చేసుకోవడానికి తల్లిదండ్రులు తగిన ప్రయత్నాలు చేయనప్పుడు సంఘర్షణ ఏర్పడుతుంది. ముఖ్యంగా మానసిక ఆరోగ్యం మరియు జీవితంలోని ఇతర అంశాల గురించి తల్లిదండ్రులు కొన్ని ముందస్తు ఆలోచనలు మరియు అభిప్రాయాలను కలిగి ఉంటారని నిపుణులు అంటున్నారు. పిల్లలలో ఒత్తిడి నిర్వహణను ఈ క్రింది మార్గాల్లో ఎదుర్కోవాలని కుమార్ తల్లిదండ్రులకు సలహా ఇస్తున్నారు.

-మీ పిల్లల కోసం ఆరోగ్యకరమైన లక్ష్యాలను సెట్ చేయండి. అదే విధంగా వారికి శిక్షణ ఇవ్వండి.
-అవసరమైనప్పుడు కెరీర్ కౌన్సెలర్ల సహాయం తీసుకోండి.
-పిల్లలతో బహిరంగంగా నిజాయితీగా, మంచి చర్చల కోసం ప్రయత్నించండి. అది మీ మధ్య బంధాన్ని కూడా బలోపేతం చేస్తుంది.
-నిర్దిష్టసంస్థ ఫీజులు మరియు సంబంధిత సమస్యల గురించి పిల్లలతో బడ్జెట్ మరియు డబ్బు సమస్యలను చర్చించండి.
-మద్దతుగా మరియు అవగాహనతో ఉండండి.
– మీ పిల్లల బలాలు, బలహీనతలను అర్థం చేసుకోవడంలో సహాయపడే సైకోమెట్రిక్ పరీక్ష ద్వారా వెళ్లమని అడగండి.

నైపుణ్యాలను పరిశీలించండి

చాలా మంది పిల్లలు ఇంజినీరింగ్ మరియు వైద్య వృత్తిలో ప్రవేశించాలనుకుంటున్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులను మాత్రమే తప్పుపట్టడం లేదని కుమార్ చెపపారు. పిల్లలు వారి వృత్తిని ఎంచుకోవడానికి తల్లిదండ్రులు వారితో చర్చించి ఇష్టాయిష్టాలను, నైపుణ్యాలను వెలికి తీయండి.

కమ్యూనికేషన్ ముఖ్యమైనది

తల్లిదండ్రులు ఒత్తిడి నిర్వహణలో తప్పనిసరిగా పిల్లలకు సహాయం చేయాలి. ఈ పోటీ పరీక్షల యొక్క ప్రయోజనాలను అర్థం చేసుకోవాలి. ఓటమిని అంగీకరించడం, కారణాలను కనుగొనడం అనేవి ఒత్తిడి నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తాయి అని యాదవ్ వివరించారు. కుమార్ ప్రకారం.. ”మీరు చెప్పేది కాదు, మీరు చెప్పే విధానం విద్యార్థుల ఒత్తిడిని నిర్వహించడానికి సహాయపడుతుంది”

గుర్తుంచుకోవాల్సిన అంశాలు

-పోటీ పరీక్షలు, విద్యాపరమైన ఒత్తిడి పిల్లలలో తీవ్రమైన మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది.
-తల్లిదండ్రులు మాత్రమే కాదు, సమాజం కూడా పిల్లలను వారి వృత్తిని ఎంచుకోవడానికి ప్రభావితం చేస్తుంది.
-మీరు మీ పిల్లలను ఏవైనా విద్యా కార్యక్రమాలకు పంపేటప్పుడు బలమైన మద్దతుగా ఉండండి.
-మీ పిల్లల సామర్థ్యాలను గుర్తించి ఉన్నత లక్ష్యాలను సెట్ చేయండి. ఒత్తిడి నిర్వహణలో పిల్లలకి శిక్షణ ఇవ్వండి.

సంబంధిత ట్యాగ్‌లు
సంబంధిత పోస్టులు

మీ అనుభవాన్ని లేదా వ్యాఖ్యలను పంచుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ట్రెండింగ్

వ్యాసాలు

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient
We use cookies to customize your user experience, view our policy here

మీ అభిప్రాయం విజయవంతంగా సమర్పించబడింది.

హ్యాపీయెస్ట్ హెల్త్ టీమ్ వీలైనంత త్వరగా మిమ్మల్ని సంప్రదిస్తుంది