728X90

0

0

0

0

0

0

0

0

0

ఈ వ్యాసంలో

పిల్లల్లో ముక్కు నుంచి రక్తస్రావం: చేయాల్సినవి, చేయకూడనివి
94

పిల్లల్లో ముక్కు నుంచి రక్తస్రావం: చేయాల్సినవి, చేయకూడనివి

పిల్లల ముక్కు నుండి రక్తం కారుతున్నప్పుడు, వారిని ఎప్పుడూ ముందుకు వంగకుండా, వెనుకకు వంగేలా చేయండి - లేకపోతే రక్తం గొంతులోకి ప్రవేశించి ఉక్కిరిబిక్కిరి అవుతుందని వైద్యులు చెబుతున్నారు.

పిల్లలకి ముక్కు నుంచి రక్తం వచ్చినప్పుడు ప్రజలు తరచుగా చేసే తప్పేంటంటే రక్తస్రావం ఆపడానికి వారిని వెనుకకు వంగమని చెప్పడం. కర్ణాటకలోని మైసూరుకు చెందిన మోనికా కార్తీక్ అనే గ‌ృహిణి తన ఐదేళ్ల కొడుకుకు దాదాపు ఏడాదిపాటు రక్తస్రావం అయినప్పుడు వారి పిల్లల వైద్యుడు సరిదిద్దేవరకూ ఇలాంటి తప్పు చేశామని వారు గుర్తుచేసుకున్నారు.

”మొదటిసారి నా కొడుకు ముక్కు నుంచి రక్తం కారడం చూసినప్పుడు నేను భయపడ్డాను” అని ఆమె చెప్పింది. నేను తన ముక్కును గట్టిగా పట్టుకుని, రక్తస్రావం ఆపడానికి అతని తలను వెనక్కి వంచాను. కానీ రక్తస్రావం ఆగిపోవడానికి చాలా సమయం పట్టింది” అని ఆమె చెప్పారు.

ముక్కు నుంచి రక్తం కారడం లేదా ఎపిస్టాక్సిస్ అనేది ముక్కు ముందు భాగం నుంచి అకస్మాత్తుగా మరియు ఆకస్మికంగా రక్తస్రావం జరిగే పరిస్థితి. ఇది ఒక వైపు లేదా రెండింటిలో కూడా జరగవచ్చు.

ముక్కు నుంచి రక్తం కారడాన్ని ఎలా నివారించాలి?

బల్టిమోర్‌లోని యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో అత్యవసర వైద్యుడు, ఫ్యాకల్టీ సభ్యుడు, నాసాక్లిప్ యొక్క సీఈఓ మరియు వ్యవస్థాపకుడు డాక్టర్ ఎలిజబెత్ క్లేబోర్న్ ప్రకారం, తల్లిదండ్రులు మరియు సంరక్షకులు ముక్కు నుంచి రక్తస్రావం అయినప్పుడు తరచుగా తప్పుడు పద్ధతులను అనుసరిస్తారు. ముక్కుని అదిమిపట్టడం, రక్తం కారేటప్పుడు ముందుకు కాకుండా తల వెనుకకు వంచడం లేదా సరైన సమయం కోసం నిరంతర ఒత్తిడిని వర్తింపజేయడంలో విఫలం కావచ్చు అని ఆమె చెప్పింది.

ఆమెతో ఏకీభవిస్తూ.. బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలోని కన్సల్టెంట్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ సుప్రజా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. గడ్డం పైకి లేపడం వంటి తప్పుడు టెక్నిక్‌ని ఉపయోగించినప్పుడు, రక్తం ముక్కు వెనుకభాగంలోకి ప్రవేశించి, గొంతులోకి వెళ్లి ఉక్కిరిబిక్కిరి చేయగలదు.

డాక్టర్ క్లేబోర్న్ ప్రకారం, ఇంట్లో బిడ్డకు రక్తస్రావం అవుతున్నట్లయితే, ముందుగా తుమ్ము ద్వారా గడ్డకట్టిన రక్తాన్ని బయటకు పంపండి. ఇలా చేయడం వల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని నివారించవచ్చని డాక్టర్ క్లేబోర్న్ చెప్పారు. ”తల్లిదండ్రులు ముక్కును శుభ్రం చేయడానికి స్ప్రేని ఉపయోగించవచ్చు. ఇది ఆరు సంవత్సరాలకంటే ఎక్కువ వయసున్న పిల్లలకు మాత్రమే వైద్యులు సిఫార్సు చేస్తారు అని ఆమె చెప్పింది. ”కనీసం 10 నిమిషాలు ముక్కుపై స్థిరమైన ఒత్తిడిని ఉంచండి. తల్లిదండ్రులు చేతితో తాకగలిగే ముక్కు యొక్క అస్థి భాగానికి కొంచెం దిగువన ఉన్న నాసికా కుహరంలోని మృదువైన భాగంపై వేళ్లతో నొక్కాలి. ఒత్తిడి సమానంగా మరియు ధృడంగా ఉండాలి. పిల్లవాడి యొక్క ముక్కుపై ఇలా ఒత్తిడి చేయడం ఎవరికైనా కష్టమే కానీ, సరిగ్గా చేస్తే ముక్క నుంచి రక్తం కారడం ఆగిపోతుంది.

హర్యానాలోని ఫరీదాబాద్‌లోని అమృతా ఆస్పత్రిలోని ఈఎన్‌టీ విభాగాధిపతి డాక్టర్ నీరజ్ నారాయణ్ మాథుర్ మాట్లాడుతూ, రక్తస్రావం ఆగకపోతే తల్లిదండ్రులు ఐస్ ప్యాక్‌ని ఉపయోగించవచ్చు లేదా టవల్‌లో ఐస్ క్యూబ్‌ను ఉంచి ముక్కు కొనలపై ఉంచొచ్చు. ఈచర్యలు రక్తస్రావాన్ని ఆపకపోతే పిల్లవాడికి ఆస్పత్రికి తీసుకెళ్లడం అవసరం అని ఆయన చెప్పారు.

ముక్కు నుంచి రక్తం కారడం అనేది తీవ్రమైన విషయం కాదు

ముక్కు నుంచి రక్తస్రావం ఒక హెచ్చరిక కావచ్చు. అయితే ఇవి చాలా వరకు తీవ్రమైనవి కావు అని డాక్టర్ క్లేబోర్న్ చెప్పారు.
”సుమారు 60 శాతం మంది జీవితంలో ఒక్కసారైనా ముక్కు కారడాన్ని అనుభవిస్తారు” అని డాక్టర్ క్లేబోర్న్ చెప్పారు. ”2 నుంచి 10 ఏళ్ల వయస్సుగల పిల్లలు మరియు 55 నుంచి 80 సంవత్సరాల వయస్సు గల వృద్ధులలో ముక్కు నుంచి రక్తం కారడానికి ఎక్కువగా జరుగుతుంటుంది. బ్లడ్ డిజార్డర్స్, హైబ్లడ్ ప్రెజర్ లేదా బ్లడ్ థిన్నర్స్ తీసుకునేవారిలో ముక్కు నుంచి రక్తస్రావం అనేది సర్వసాధారణం.

ముక్కు కారడంలో రకాలు

అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఎమర్జెన్సీ ఫిజీషియన్స్‌లో సభ్యుడు అయిన డాక్టర్ క్లేబోర్న్ ప్రకారం ముక్కు నుంచి రక్తస్రావం కావడానికి రెండు కారణాలు ఉన్నాయని చెప్పారు.
ముక్కు కారడం అనేది ఎక్కువగా ముందు భాగంలో జరుగుతుంది. ఇందులో నాసికా మార్గం లోపలి భాగంలో ఉండే శ్లేష్మపొర క్షీణిస్తుంది. అందువలన అవి ముక్కు ముందు భాగంలో చిరిగిపోయి రక్తస్రావం అవుతుంది. వెనుక ముక్కు నుంచి రక్తం కారడం అనేది తీవ్రమైన పరిస్థితి. ఇది ముక్కు వెనుక లోతైన పంపింగ్ రూపంలో విపరీతమైన ధమనుల రక్తస్రావంతో ఉంటాయి.

ముక్కు నుంచి రక్తం ఎందుకు వస్తుంది?

స్కూల్‌కు వెళ్లే పిల్లల్లో ముక్కు నుంచి రక్తం కారడం సర్వసాధారణం. తక్కువ తేమ ఉన్న సీజన్లలో అంటే చలికాలంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు లేదా వేసవిలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ముక్కు నుంచి రక్తస్రావం జరుగుతుందని డాక్టర్ మాథుర్ చెప్పారు. నోస్ బ్లీడ్స్ సెప్టం యొక్క పూర్వ ప్రాంతం (నాసికా రంధ్రాల మధ్య ప్రాంతం) నుంచి వచ్చినవి. దీనిని లిటిల్ ప్రాంతం అని పిలుస్తారు. 99.9 శాతం ముక్కు నుంచి రక్తం కారే వాటికి ఇంట్లోనే సులభంగా చికిత్స చేయవచ్చు అని ఆయన చెప్పారు. అతని ప్రకారం, నాసికా క్రస్టింగ్‌ను తొలగించడం ద్వారా కొన్నిసార్లు వేళ్ల గోళ్ల ద్వారా స్క్రాచ్‌కు దారితీస్తుంది. ఇది పిల్లల్లో రక్తస్రావం కూడా కలిగిస్తుంది.

వాతావరణ మార్పు కూడా ఒక అంశంగా పనిచేస్తుందని డాక్టర్ క్లేబోర్న్ చెప్పారు. ”ముక్కు నుంచి రక్తం కారడం సాధారణం- శరదృతువులో మరియు చలికాలం అంతటా” ఆమె చెప్పింది. దీనికి కారణం గాలి చల్లగా మరియు పొడిగా ఉండటం. అంతేగాక ప్రజలు ఆ సమయంలో ఎక్కడైనా సరే వెచ్చగా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఇది ముక్కును మరింత పొడిగా చేస్తుంది. దీని వలన ముక్కు నుంచి రక్తం వస్తుంది. కాలానుగుణంగా సీజనల్ అలర్జీలు వస్తాయి. దీని కారణంగా, ముక్కు యొక్క శ్లేష్మ పొరలో చికాకుపెడుతుంది. ముక్కు రక్తస్రావం వారానికి ఒకసారి లేదా నెలకు మూడు, నాలుగు సార్లు కారడం సాధారణ విషయం.

డాక్టర్ మాథుర్ ప్రకారం, పెద్దలు మరియు వృద్ధులలో రక్తపోటు లేదా పెళుసుగా ఉండే నాళాల కారణంగా నాసికా రక్తస్రావం కనిపిస్తుంది. కాబట్టి కొంచెం ఉద్రిక్తత ఉన్నప్పుడు, నాళాలు పగిలి రక్తస్రావం ప్రారంభమవుతాయి.

మీరు ఎప్పుడు ఆందోళన చెందాలి?

ఒక వైపు నుంచి మాత్రమే నిరంతరాయంగా ముక్కు కారడం మరియు అది దుర్వాసనతో సంబంధం కలిగి ఉంటే తల్లిదండ్రులు తప్పనిసరగా శిశువైద్యుడిని సంప్రదించాలి.

సంబంధిత ట్యాగ్‌లు
సంబంధిత పోస్టులు

మీ అనుభవాన్ని లేదా వ్యాఖ్యలను పంచుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ట్రెండింగ్

వ్యాసాలు

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient
We use cookies to customize your user experience, view our policy here

మీ అభిప్రాయం విజయవంతంగా సమర్పించబడింది.

హ్యాపీయెస్ట్ హెల్త్ టీమ్ వీలైనంత త్వరగా మిమ్మల్ని సంప్రదిస్తుంది