728X90

0

0

0

0

0

0

0

0

0

ఈ వ్యాసంలో

యువకులకు గోప్యత అవసరమా?
49

యువకులకు గోప్యత అవసరమా?

తల్లిదండ్రులు టీనేజర్ల యొక్క గోప్యతను గౌరవించాలి. వారి కోసం సమయాన్ని కేటాయించాలి. వారి గదిలోకి వెళ్లాలంటే ఎలా ప్రవేశించాలో నిపుణులు కొన్ని సలహాలు ఇస్తున్నారు.

ముంబైకి చెందిన 16ఏళ్ల యువకుడు తన గది తలుపులు ఎల్లప్పుడూ మూసి ఉంచేందుకే ఇష్టపడతాడు. చివరకు అతని తల్లిదండ్రులు తన గదిలోకి ప్రవేశించడానికి ప్రయత్నించినా చిరాకు పడతాడు. యుక్తవయస్సు పిల్లలు ఉన్న ఇళ్లలో ఇది సాధారణ పరిస్థితి. తల్లిదండ్రులు కూడా తమ బిడ్డ ఎక్కువగా ఒంటిరిగా గడుపుతున్నాడని ఆందోళన చెందుతారు. అయితే యువకుడి గోప్యతను గౌరవించడం మరియు తల్లిదండ్రుల పర్యవేక్షణకు మధ్య సన్నని గీత ఉంది. గోప్యత మరియు విశ్వాసం ఒకదానితో ఒకటి కలిసిపోవాలని నిపుణులు అంటున్నారు.

యువకుడి గోప్యత ఎప్పుడు ఆందోళన కలిగిస్తుంది?

టీనేజర్లు తమగదిని ఎల్లవేళలా మూసి ఉంచడానికి ఇష్టపడతారు. ఇది మంచి సంకేతం కాదని ముంబైలోని ఫోర్టిస్ ఆస్పత్రి కన్సల్టెంట్ సైక్రియాటిస్ట్ డాక్టర్ ఫాబియన్ అల్మేడా పంచుకున్నారు. అద్విత్(పేరు మార్చాం)కి ఇదే సమస్య ఉంది. అతని తల్లిదండ్రులు కూడా అతను ఒంటరిగా ఎందుకు ఎక్కువ సమయం గడిపాడో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నారు. డాక్టర్ అల్మేడా.. తన తల్లిదండ్రలు ఆందోళనతో కౌన్సెలింగ్ కోసం తీసుకువచ్చారని, అతను దీర్ఘకాలిక డిప్రెషన్‌తో బాధపడుతున్నారని పంచుకున్నారు. తల్లిదండ్రులు అతడిలో ఎటువంటి సమస్యాత్మక సంకేతాలను గమనించలేదు. అతను తన చదువులో బిజీగా ఉన్నందున తనకు గోప్యత అవసరమని భావించి తనను వదలిపెట్టారని అతను పంచుకున్నారు.

మైసూరులోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ మంజు శర్మ, ఒక యువకుడి గది యొక్క మూసి ఉన్న తలుపు తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య అడ్డంకిగా ఉందని అంగీకరిస్తున్నారు. ఇటీవల తల్లిదండ్రుల నుంచి వినే సాధారాణ ఆందోళనలలో ఇది ఒకటి అని ఆమె జతచేశారు. ”తల్లిదండ్రులుగా, టీనేజర్లకు వారి గోప్యతను అందించాలి. అదే సమయంలో, నిర్ణీత సమయం(30-45 నిమిషాలు) దాటిత తర్వాత తల్లిదండ్రలు యువకుడిని తనిఖీ చేయాలి.

మూసిన తలుపులు వెనుక మీ టేనేజ్ ఏం చేస్తూ ఉండొచ్చు?

టీనేజర్ ఒంటరిగా ఉండటానికి ఇష్టపడవచ్చు. అయితే, యుక్తవయస్సు అనేది పిల్లల జీవితాల్లో గందరగోళ కాలంగా చూడొచ్చు. మూసి ఉన్న తలుపుల వెనుక పిల్లవాడు నిస్సహాయంగా ఉంటాడని, బెదిరింపు తర్వాత ప్రభావాలతో ఒంటరిగా వ్యవహరిస్తాడని లేదా ఇతర మానసిక ఆరోగ్య సమస్యలు ఉంటాయని డాక్టర్ అల్మేడా పంచుకున్నారు. పిల్లలు ఎక్కువ సమయం ఒంటరిగా గడుపుతారు కాబట్టి, వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడటానికి ఇష్టపడరు. టీనేజర్‌కు ఎవరిని సంప్రదించాలో, ఆందోళన గురించి ఎవరితో మాట్లాడాలో తెలియకపోవచ్చు. తల్లిదండ్రులు జోక్యం చేసుకుని వారితో మాట్లాడాలి అని డాక్టర్ అల్మేడా అన్నారు.

ఇవి కాకుండా, టీనేజర్లు అశ్లీల చిత్రాలు, ధూమపానం లేదా మాదకద్రవ్యాల వ్యసనానికి గురవుతారు. వారు ఆన్ లైన్ గేమింగ్ మరియు జూదానికి బానిస కావచ్చు.

ఒంటరిగా ఉండటాన్ని కట్టడి చేసేటప్పుడు వారి గోప్యతను ఎలా గౌరవించాలి?

యుక్తవయస్కులు వారి యొక్క రోజువారి కార్యకలాపాలు, స్నేహితులు మరియు సినిమాల వంటి యాదృచ్ఛిక విషయాలను కూడా వారి తల్లిదండ్రులతో చర్చించగలగాలి అని శర్మ చెప్పారు. మీరు నమ్మకమైన బంధాన్ని ఏర్పాటు చేసుకున్నతర్వాత, మీ టీనేజ్‌లు మీతో ఏదైనా మాట్లాడగలరు. ఇది వారు ఎదుర్కొంటున్న అభద్రతా భావం లేదా మరేదైనా ఆందోళన కావచ్చు” అని ఆమె చెప్పింది.

తల్లిదండ్రులుగా మేం యుక్తవయస్సులో ఉన్నవారి గోప్యతను గౌరవిస్తున్నప్పుడు, వారు సరిగ్గా ఉండేలా చూసుకోవాల్సిన ఉందని డాక్టర్ అల్మేడా చెప్పారు. తల్లిదండ్రలు వారి గోప్యతకు భంగం కలిగించకుండా, పర్యవేక్షించడానికి వారి పిల్లల గదిలోకి వెళ్లే ముందు తలుపు తట్టవచ్చని అతను సూచిస్తున్నారు.

ఒకసారి తల్లిదండ్రులు పిల్లల గోప్యతలో జోక్యం చేసుకుంటే, పిల్లలు వారిపై నమ్మకం కోల్పోవచ్చు. కాబట్టి మీరు వారి గోప్యతను గౌరవిస్తారని వారికి గుర్తు చేయండి మరియు వారికి ఏదైనా ఇబ్బంది ఉంటే వారిని అడగండి. తలుపులు మూసివేయడం ఎందుకు అవసరమో వారిని అడగండి. వారు చెప్పేది మీరు వినండి మరియు వారి తర్కాన్ని అర్థం చేసుకోండి.

పరస్పరం విశ్వాసాన్ని ఎలా పెంపొందించుకోవాలి?

-వారి గదిలోకి ప్రవేశించే ముందు ఎల్లప్పుడూ తలుపు తట్టండి.
-వారి అనుమతి లేకుండా వారి మొబైల్‌‌లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు లేదా కంప్యూటర్‌లను తనిఖీ చేయవద్దు.
-స్నేహితులు మరియు కుటుంబసభ్యులతో ప్రైవేట్ సంభాషణలు చేయడానికి వారినిఅనుమతించండి. స్నేహం, నమ్మకాన్ని పెంచుకోండి. దానిని మీకు వెల్లడించే వరకు వేచి ఉండండి.
వారి గదుల్లో ఒంటరిగా గడిపేందుకు వారికి గోప్యత ఇవ్వండి. కానీ పూర్తిగా డిస్‌కనెక్ట్ అయినప్పుడు ఎక్కువ గంటలు ఉండకూడదు. పిల్లలు చదువుకుంటున్నా లేదా మరేదైనా పని చేస్తున్నా.. తలుపులు మూసివేయడం లేదా తాళం వేయడం అవసరం లేదు అని శర్మ చెప్పారు. వారు ఎక్కువ గంటల గదిలో ఉంటే, కుటుంబంతో కలిసి స్నాక్స్ కోసం బయటకు వెళ్లమని వారిని ప్రోత్సహించండి. మీరు వారితో మాట్లాడటానికి విశ్రాంతి తీసుకోమని, కూర్చోమని అడగొచ్చు. తల్లిదండ్రులు యుక్తవయస్సు వారిని తనిఖీ చేయడం మంచిది అయినప్పటికీ, టీనేజ్ పిల్లలు విశ్రాంతి తీసుకుంటున్నట్లు లేదా చదువుతున్నారనే సాకుతో నిద్రపోతున్నట్లు కనిపిస్తే వారు చెడుగా స్పందించకూడదని ఆమె సూచించింది. బదులుగా, తల్లిదండ్రుల అవసరాన్ని సున్నితంగా చెప్పాలని నొక్కి చెప్పింది.

గుర్తుంచుకోవాల్సిన అంశాలు

టీనేజర్లు గోప్యత కోసం పట్టుబట్టడం మరియు తమ గదుల్లో తమను తాము అన్ని సమయాల్లో లాక్ చేయడం ఒక హెచ్చరిక సంకేతం.
-యుక్త వయస్కులతో బహిరంగ సంభాషణ తల్లిదండ్రుల-పిల్లల బంధంలో నమ్మకాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది.
-టీనేజ్ గోప్యతను గౌరవించడం చాలా ముఖ్యం. అయితే వారి గది తలుపులు మూసి ఉంటే మీరు వారి గదిలోకి ప్రవేశించే ముందు తలుపు తట్టడం ద్వారా ఎప్పటికప్పుడు వారిని తనిఖీ చేయవచ్చు. సున్నితమైన సంతాన పద్ధతులు, బహిరంగ సంభాషణలు సఖ్యతను పెంచడంలో సహాయపడతాయి.

సంబంధిత ట్యాగ్‌లు
సంబంధిత పోస్టులు

మీ అనుభవాన్ని లేదా వ్యాఖ్యలను పంచుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ట్రెండింగ్

వ్యాసాలు

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient
We use cookies to customize your user experience, view our policy here

మీ అభిప్రాయం విజయవంతంగా సమర్పించబడింది.

హ్యాపీయెస్ట్ హెల్త్ టీమ్ వీలైనంత త్వరగా మిమ్మల్ని సంప్రదిస్తుంది