728X90

0

0

0

0

0

0

0

0

0

ఈ వ్యాసంలో

snoring: గురక పెట్టేవాళ్లు ఏ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి 
12

snoring: గురక పెట్టేవాళ్లు ఏ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి 

ఒక వ్యక్తి నిద్రిస్తున్నప్పుడు వారి గొంతులోని కొన్ని ప్రాంతాలు కంపించడం వల్లే గురక వెలువడుతుందని ఆస్ట్రేలియాలోని స్లీప్ హెల్త్ ఫౌండేషన్ పేర్కొంది. నాలుకకు సరిగ్గా వెనుక ఉండే స్వరపేటిక అనేది గొంతులోని కంపించే ప్రదేశంగా ఉంటుంది

అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా వల్ల వచ్చే గురక అనేది వ్యక్తుల గుండె, మెదడు మరియు లిబిడోను ప్రభావితం చేస్తుంది’

గురక అనేది సర్వసాధారణం – అత్యంత సాధారణం అని భావించడం వల్ల, అది దీర్ఘకాలిక ఆరోగ్య ప్రభావాలు కలిగిస్తుందని వ్యక్తులు తరచూ మరచిపోతుంటారు. 

గురక అనేది తరచుగా పెద్ద సమస్యగా మారుతుందిఅని బెంగుళూరులోని సక్రా వరల్డ్ హాస్పిటల్‌లో పల్మనాలజీ మరియు క్రిటికల్ కేర్ మెడిసిన్ సీనియర్ కన్సల్టెంట్‌గా ఉన్న డాక్టర్ సచిన్ కుమార్ అన్నారు. గురకపెట్టేవాళ్లు వారి గుండె ఆరోగ్యంలో మార్పులతో పాటు స్లీప్ ఆప్నియామరియుఅబ్‌స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా (OSA) మీద కూడా దృష్టి సారించాలన్నది నిపుణుల మాట. 

గురక మరియు గొంతు 

ఒక వ్యక్తి నిద్రిస్తున్నప్పుడు వారి గొంతులోని కొన్ని ప్రాంతాలు కంపించడం వల్లే గురక వెలువడుతుందని ఆస్ట్రేలియాలోని స్లీప్ హెల్త్ ఫౌండేషన్ పేర్కొంది. నాలుకకు సరిగ్గా వెనుక ఉండే స్వరపేటిక అనేది గొంతులోని కంపించే ప్రదేశంగా ఉంటుంది. మనం నిద్రించే సమయంలో, అనేక కండరాలు దానిని తెరచి ఉండేలా చేస్తాయి. దీంతో గొంతు తెరచి ఉండే పరిస్థితి పెరుగుతుంది. ఫలితంగా, అది మరింత సులభంగా కంపిస్తుంది. స్వరపేటిక శబ్దాన్ని సృష్టిస్తుంది మరియు ఊపిరి తీసుకున్నప్పుడు కంపిస్తుంది. స్వరపేటిక ఎంత ఇరుగ్గా ఉంటే, అంత తేలికగా కంపిస్తుంది మరియు ఆ వ్యక్తి గురక అంత బిగ్గరగా మారుతుంది. 

“గురక అనేది నిద్రపోతున్నప్పుడు సంభవించే కఠినమైన లేదా బొంగురు శబ్దంతో కూడిన శ్వాస” అని ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్స్‌లో ఛాతీ వ్యాధులు మరియు స్లీప్ మెడిసిన్ నిపుణుడిగా ఉన్న డాక్టర్ రాజేష్ చావ్లా అన్నారు. “గాలి ప్రయాణానికి అడ్డంకి ఏర్పడడమే దీనికి కారణం – మీకు టాన్సిల్స్ లేదా అడినాయిడ్స్ పెరిగినప్పుడు అడ్డంకి అనేది ముక్కులో ఉండవచ్చు [లేదా] అడ్డంకి మీ గొంతులో ఉండవచ్చు. లేదా మీకు ఊబకాయం ఉన్నప్పుడు (ఆ ప్రదేశంలో కొవ్వు ఎక్కువై, చోటు తగ్గడం వల్ల) ఆ పరిస్థితి రావచ్చు. ఈ పరిస్థితి ఉన్న వ్యక్తులు నిద్రపోయే సమయంలో, వారి మెడ కండరాల బలం తగ్గుతుంది. ఇవన్నీ శ్వాసనాళాల్లో అడ్డంకికి కారణమై, గురకకు దారితీస్తాయి. 

వైద్యుల వద్దకు వచ్చేవారిలో దాదాపు 45 శాతం మందిలో కొన్నిసార్లు గురక కనిపించడమే కాకుండా వారిలో దాదాపు 20 శాతం మందికి OSA కూడా ఉండడంతో పాటు సంబంధిత వ్యాధి కూడా ఉంటుందని ఆయన చెప్పారు. 

“ఒక వ్యక్తి ప్రతి రాత్రి గురక పెడుతుంటే, వారి ముక్కు మరియు గొంతు ద్వారా గాలి స్వేచ్ఛగా ప్రసరించడం లేదనేందుకు అది సంకేతం” అని డాక్టర్ కుమార్ చెప్పారు. “ఈ వ్యక్తుల్లో శ్వాస మార్గంలో కొంత మొత్తంలో అడ్డంకి ఉండే స్లీప్ అప్నియా అనే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి పరిస్థితి లేని వ్యక్తులతో పోలిస్తే, స్లీప్ అప్నియా ఉన్న రోగుల్లో హార్ట్ అరెథ్మియాస్ (అసాధారణ గుండె లయ) వచ్చే అవకాశం రెండు నుండి నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుందని అంచనా వేయబడింది. స్లీప్ అప్నియా అనేది గుండె వైఫల్యం ప్రమాదాన్ని 140 శాతం మరియు కరోనరీ గుండె జబ్బు ప్రమాదాన్ని 30 శాతం పెంచుతుంది. 

ఇమ్రే జాన్‌స్కీ మరియు ఇతరులు 2008లో సమర్పించిన ఒక పేపర్ ప్రకారం,, స్లీప్ అప్నియా అనేది కరోనరీ గుండె జబ్బు తీవ్రం కావడంతో ముడిపడి ఉంటుంది. ఈ రచయితల ప్రకారం, ఆ విధంగా శ్వాస తీసుకోవడం కారణంగా తలెత్తే తీవ్రమైన మయోకార్డియల్ ఇన్‌ఫ్రాక్షన్ పరిస్థితులనేవి ఈ సమస్య (గుండెపోటు)కే కాకుండా అనేక ఇతర మార్గాల్లోనూ ప్రభావితం చేయవచ్చు. 

అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా లక్షణాలు 

అలవాటుగా గురక పెట్టేవాళ్లలో OSAకి సంబంధించిన అనేక సంకేతాలతో పాటు లక్షణాలు ఉంటాయని డాక్టర్ కుమార్ చెప్పారు: 

  • పగటిపూట ఎక్కువ సమయం నిద్రపోవడం 
  • బిగ్గరగా గురకపెట్టడం 
  • నిద్రపోయే సమయంలో అప్పుడప్పుడూ శ్వాస తీసుకోవడం ఆపేయడం గమనించవచ్చు 
  • ఊపిరి పీల్చుకోలేకపోవడం లేదా ఉక్కిరిబిక్కిరి పరిస్థితితో నిద్ర నుండి ఆకస్మికంగా మేల్కొనడం 
  • నోరు ఎండిపోవడం లేదా గొంతు నొప్పితో మేల్కొనడం 
  • ఉదయం వేళ తలనొప్పి 
  • పగటివేళ ఏకాగ్రత పెట్టడంలో ఇబ్బంది 
  • కుంగుబాటు లేదా చికాకుతో మానసిక స్థితిలో మార్పులు 
  • అధిక రక్తపోటు. 

గురక మరియు అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియాను అర్థం చేసుకోండి 

“OSA అనే వ్యాధి ఉన్నప్పుడు నిద్రపోయే సమయంలో ఎగువ వాయు మార్గాల్లో అడ్డంకుల కారణంగా, శ్వాసనాళాల్లో అడ్డంకి ఏర్పడుతుందిఅని డాక్టర్ చావ్లా చెప్పారు. “నాలుక వెనక్కి వెళ్లిపోవడం, ఊబకాయంతో ఉన్నవారిలో శ్వాస కోసం తక్కువ స్థలం మాత్రమే ఉండడం ఇందుకు కారణమవుతాయి. వాయు నాళాల్లోకి గాలి వెళ్లినప్పుడు, అవి కంపిస్తాయి మరియు ఆ పరిస్థితి పెరిగే కొద్దీ గురక శబ్దం వస్తుంది. ఈ పరిస్థితి ఉన్న చాలామందిలో 10 సెకన్లు లేదా 20 సెకన్ల వరకు శ్వాస తీసుకోవడం ఆగిపోతుంది. ఆ సమయంలో ఆక్సిజన్ తగ్గిపోవడం వల్ల ఆ వ్యక్తి మేల్కొంటాడు. ఈ రకమైన OSA అనేది ఒక గంటసేపు నిద్రలో దాదాపు 50 నుండి 60 సార్లు సంభవించవచ్చు. 

ఊబకాయం లేనప్పటికీ, OSA ఉన్నవారిలో గురక సమస్య ఉంటుందని ఆయన చెప్పారు. 

దవడ, ముక్కు మరియు గొంతు నిర్మాణం అసాధారణంగా ఉన్నవారు మద్యం సేవిస్తే, వారిలో OSA వచ్చే తీవ్రత పెరుగుతుందిఅని డాక్టర్ చావ్లా చెప్పారు. “OSA ఉన్నవారు నిద్ర మధ్యలో మేల్కొంటారు. వారిలోని ఈ పరిస్థితి కారణంగా, ఆక్సిజన్ తగ్గిపోవడం వల్ల వారి మెదడు వారిని మేల్కొల్పడమే అందుకు కారణం. కొందరు వ్యక్తుల్లో మేల్కొన్నామనే స్పృహ లేనప్పటికీ, వారి మెదడు మేల్కొనడం వల్ల వారి గాఢ నిద్ర ప్రభావితమవుతుంది. 

ఈ కారణంగా, మరుసటి రోజు ఆ వ్యక్తికి పగటిపూట ఎక్కువసేపు నిద్రపోవాలనిపిస్తుందిఇది OSA లక్షణంఇది గుండె, మెదడు మరియు లిబిడో మీద ప్రభావం చూపుతుందని ఆయన చెప్పారు. 

గురకతో పాటు ఉండే OSAతో పోరాడడం 

OSA ఉన్న వ్యక్తుల కోసం డాక్టర్ చావ్లా క్రింది చర్యలు సూచిస్తున్నారు: 

  • బరువు తగ్గడం 
  • ఆ వ్యక్తి తన నిద్రను అధ్యయనం (పూర్తిస్థాయి పాలిసోమ్నోగ్రఫీ అని పిలుస్తారు) చేయాలి. ఈ పరీక్ష ఫలితాల్లో రోగికి OSA ఉన్నట్లు తేలితే, వారికి CPAP అనే పరికరం అమర్చుతారు. వాళ్లు నిద్రపోతున్నప్పుడు దీనిని తప్పనిసరిగా ఉపయోగించాలి. ఆ తర్వాత, వారిలో గురక ఉండదు, వాయుమార్గం తెరిచి ఉంటుంది, వ్యక్తి సుఖంగా నిద్రపోతాడు మరియు వారి రక్తపోటు కూడా మెరుగవుతుంది. 
  • కొన్ని ఇతర చికిత్సా ఎంపికలు – దంత ఉపకరణాలు లాంటివి – అందుబాటులో ఉన్నప్పటికీ, పెద్దగా విజయవంతం కాలేదు. కొంతమందికి శస్త్రచికిత్స కూడా చేశారు. కానీ, అంత ప్రభావవంతమైన ఫలితాలు రాలేదు. 

గురక మరియు గుండె 

గురక అనేది నేరుగా గుండె జబ్బులకు  దారితీయనప్పటికీ, ముక్కు మరియు నోటి ద్వారా గాలి ప్రవాహ మార్గం కుచించుకుపోవడం లేదా అడ్డంకులు ఏర్పడడం వల్ల ఆ పరిస్థితి సంభవిస్తుంది. ఈ పరిస్థితిలో నోటి నుండి శబ్దం వస్తుందిఅని బెంగళూరులోని ఆస్టర్ ఆర్.వి హాస్పిటల్‌లో కన్సల్టెంట్, హార్ట్ ఫెయిల్యూర్ స్పెషలిస్ట్ మరియు ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్‌గా ఉన్న డాక్టర్ దివ్య మరీనా ఫెర్నాండెజ్ చెప్పారు. “గురక అనేది శ్వాసకు అడ్డంకి సమస్యే అయినప్పటికీ, అది ఆ తర్వాత గుండె సంబంధింత సమస్యగా మారవచ్చు. OSA పరిస్థితి ఉన్నప్పుడు, గాలి ప్రవాహానికి ఇబ్బంది ఏర్పడుతుంది. ఆ కారణంగా, నిద్ర సమయంలో వాళ్లు శ్వాస తీసుకోవడంలో విరామం చోటుచేసుకుంటుంది. ఈ విరామాల సంఖ్య పెరిగినప్పుడు [తలెత్తినప్పుడు], అది తక్కువ ఆక్సిజన్ స్థాయిలు మరియు హృదయ స్పందన రేటు మరియు రక్తపోటులో ఆకస్మిక మార్పులకు దారితీస్తుంది. తద్వారా, ఇది పరోక్షంగా ఒత్తిడి హార్మోన్ల విడుదలకు కారణమవుతుంది. అవి గుండె మీద ఒత్తిడి పెరగడానికి దారితీస్తుంది [మరియు] అధిక రక్తపోటు, గుండెపోటు మరియు పక్షవాతానికి కారణమవుతుంది. 

గురకకు చికిత్స 

మధుమేహం, రక్తపోటు మరియు స్థూలకాయం ఉన్న వ్యక్తులకు OSA కూడా తోడైతే, ఆ వ్యక్తిలో గుండె సంబంధిత సమస్యలకు దారితీసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. “ధూమపానం మానేయడం, మద్యం తీసుకోవడం తగ్గించడం, పీచు పదార్థాలు, ప్రోటీన్లు మరియు కూరగాయలతో నిండిన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు సరైన బరువును నిర్వహించడం లాంటివి ఈ లక్షణాలను తగ్గించడంలో కీలకమైనవిఅని డాక్టర్ ఫెర్నాండెజ్ చెప్పారు. 

వైద్యుడిని సంప్రదించండి 

గురక ఎక్కువగా వస్తుంటే, సదరు వ్యక్తి OSA కోసం పరీక్ష చేయించుకోవాలి. “పల్మనాలజిస్ట్‌ను కలవండి మరియు మీ పరిస్థితిని నిర్ధారించడానికి నిద్రపై స్లీప్ స్టడీ చేయండిఅని డాక్టర్ ఫెర్నాండెజ్ చెప్పారు. “BIPAP ఆమోదించబడిన పక్షంలో, శ్వాస సమయంలో విరామాలు తగ్గించడంలో మరియు తగినంత ఆక్సిజన్ స్థాయిలు నిర్వహించడంలో అది సహాయపడుతుంది. ఫలితంగా ప్రమాదాన్ని తగ్గిస్తుంది.” 

సారాంశం 

  • గురక పెట్టేవారు వారి పరిస్థితిని నిర్లక్ష్యం చేయకూడదు. వైద్యులను సంప్రదించి శ్వాస పరీక్ష చేయించుకోవడం ద్వారా, వారికి నిద్ర రుగ్మతలు ఉన్నాయా అని తెలుసుకోవాలి 
  • ఇలాంటి సందర్భాల్లో ఔషధాలు పనిచేయవు; గురక వెనుక అసలు కారణం తెలుసుకునే ప్రయత్నం చేయాలి 
  • ఒక వ్యక్తి వారి గురక సమస్యలను పరిష్కరించుకోగలిగితే, వారి గుండె ఆరోగ్యాన్ని చక్కగా నిర్వహించవచ్చు. 

 

మీ అనుభవాన్ని లేదా వ్యాఖ్యలను పంచుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ట్రెండింగ్

వ్యాసాలు

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient
We use cookies to customize your user experience, view our policy here

మీ అభిప్రాయం విజయవంతంగా సమర్పించబడింది.

హ్యాపీయెస్ట్ హెల్త్ టీమ్ వీలైనంత త్వరగా మిమ్మల్ని సంప్రదిస్తుంది