728X90

0

0

0

ఈ వ్యాసంలో

గర్భధారణ తర్వాత బరువు తగ్గండిలా
95

గర్భధారణ తర్వాత బరువు తగ్గండిలా

గర్భధారణ సమయంలో సిఫార్సు చేసిన దానికంటే ఎక్కువ కిలోల బరువు పెరిగినట్లయితే లేదా గర్బధారణ తర్వాత వారి బరువు అనారోగ్యకరమైన స్థాయిలో ఉంటే.. అదనపు బరువును కోల్పోవడం అనేది వారి మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందని ఆమె చెప్పారు.

చాలా మంది మహిళలు గర్భం దాల్చిన తర్వాత బరువు తగ్గాలని అనుకుంటారు. అయితే ఇందుకోసం ఒక సరైన పద్ధతి అంటూ లేదు. గర్భధారణ తర్వాత బరువు తగ్గడం అనేది వ్యక్తి యొక్క ఆరోగ్యం, గర్భధారణకు ముందు, తర్వాత బరువు సహా అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది అని బెంగళూరులోని అపోలో క్లినిక్‌లోని ప్రసూతి మరియు స్త్రీ జననేంద్రియ నిపుణుడు డాక్టర్ బబితా మాటూరి వివరించారు. గర్భధారణ సమయంలో సిఫార్సు చేసిన దానికంటే ఎక్కువ కిలోల బరువు పెరిగినట్లయితే లేదా గర్బధారణ తర్వాత వారి బరువు అనారోగ్యకరమైన స్థాయిలో ఉంటే.. అదనపు బరువును కోల్పోవడం అనేది వారి మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందని ఆమె చెప్పారు.

అధిక బరువు ఉండటం వల్ల మధుమేహం, అధికరక్తపోటు మరియు గుండె జబ్బుల వంటి ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. అధిక బరువు కూడా కీళ్లు మరియు కండరాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. ముఖ్యంగా గర్భధారణ తర్వాత అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అందువల్ల బరువు తగ్గడం అనేది ఈ సమస్యలను కొంత వరకూ దూరం చేస్తుంది.

గర్భధారణ తర్వాత బరువు తగ్గడానికి చిట్కాలు

1.పోషకాహారానికి తగిన ప్రాధాన్యత ఇవ్వండి

ప్రసవం తర్వాత కోలుకోవడానికి మరియు ఆరోగ్యంగా ఉండటానికి సమతుల్య మరియు పోషకాహారంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. తల్లులు బిజీగా ఉన్నప్పుడు లేదా అలసిపోయినప్పుడు తక్కువ పోషకాహార ఎంపికలను నివారించకుండా, ముందుగానే ఆరోగ్యకరమైన భోజనం మరియు స్నాక్స్ సిద్ధం చేయవచ్చని డాక్టర్ మాటూరి పేర్కొన్నారు. ప్రాసెస్ చేసిన ఆహారం, చక్కెర మరియు కార్బోనేటెడ్ పానీయాలకు వారు దూరంగా ఉండాలని మంగళూరులోని కెఎంసీ ఆస్పత్రి కన్సల్టెంట్, ఎండోక్రినాలజీ డాక్టర్ శ్రీనాథ్ పి శెట్టి చెప్పారు.

మొదటిసారి తల్లి అయిన వారు ఎక్కవగా లీన్ ప్రోటీన్లు, పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు, ఐరన్ రిచ్ ఫుడ్, ఫైబర్ రిచ్ ఫుడ్స్ మరియు ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌తో కూడిన ఆహారం తీసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. రోజంతా పుష్కలంగా నీరు తాగడం కూడా చాలా అవసరం. హైడ్రేటెడ్‌గా ఉండటం అనేది జీవక్రియకు మద్దతు ఇస్తుంది. మీ భోజనంతో సంతృప్తి చెందడంలో మీకు సహాయపడుతుంది. ఇది అతిగా తినడాన్ని నిరోధిస్తుంది అని డాక్టర్ మాటూరి చెప్పారు.

పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి కానీ క్యాలరీలు అధికంగా ఉండే అరటి, జాక్ ఫ్రూట్ వంటి కేలరీలు ఎక్కువగా ఉండే వాటికి దూరంగా ఉండాలి అని డాక్టర్ శెట్టి తెలియజేశారు. భూమి లోపల పెరిగే చిలగడదుంపలు, బంగాళాదుంపలు మరియు ముల్లంగి వంటి కూరగాయలలో స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటి వినియోగాన్ని కూడా తగ్గించాలని ఆయన చెప్పారు.

2.క్రమం తప్పకుడా వ్యాయామం

వ్యాయామాన్ని క్రమంగా రోజువారి దినచర్యలో భాగంగా చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మొదటిసారి తల్లయిన వారు ప్రతిరోజూ కనీసం అరగంటపాటు నడవడం వంటి సాధారణ కార్యకలాపాలను ప్రారంభించవచ్చు. వ్యాయామం చేయడం మొదట సవాలుగా ఉంటుంది. అయితే ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం తర్వాత.. తల్లి ఏరోబిక్స్ వంటి వ్యాయామాలలో నిమగ్నమై, తర్వాత మరింత కష్టతరమైన శిక్షణ తీసుకోవచ్చు అని డాక్టర్ శెట్టి వివరించారు. శరీరం కోలుకున్నప్పుడు వ్యాయామాల తీవ్రతను, వ్యవధిని పెంచుకోవచ్చు. గర్భం మరియు ప్రసవం వల్ల బలహీనపడగల కోర్ మరియు పెల్విక్ ఫ్లోర్ కండరాలను బలోపేతం చేయడంపై దృష్టి సారించే వ్యాయామాలను పరిగణించాలని డాక్టర్ మాథురి చెప్పారు. కాబట్టి పెల్విక్ టిల్ట్స్, కెగెల్స్ మరియు సున్నితమైన కోర్ వ్యాయామాలు ఉపయోగపడతాయి.

3.తగినంత సమయం నిద్రపోవాలి

తగినంత నిద్రపొందడం చాల ముఖ్యం. ఎందుకంటే మీరు ఒత్తిడికి గురైనప్పుడు శరీరానికి అవసరమైన విశ్రాంతిని పొందడంలో ఇది సహాయపడుతుంది. ఇది బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా, ఆరోగ్యంగా ఉండటానికి కూడా సహాయపడుతుంది. నిద్రసరిపోకపోతే శరీరానికి శక్తి అవసరాన్ని పెంచుతుంది. దీనికి కొవ్వు మరియు కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారం కారణంగా చెప్పవచ్చు. వీలైతే మీ బిడ్డ నిద్రపోతున్నప్పుడు తగినంత విశ్రాంతి తీసుకోవడం లేదా నిద్రించడానికి ప్రయత్నించండి అని మాటూరి చెప్పారు.

4. ఆహారంపై నియంత్రణ ఉండాలి

అతిగా తినే అలవాటును నివారించడానికి మీరు ఎంత పరిమాణంలో భోజనం చేస్తున్నారు అనే విషయంపై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. అందుకోసం చిన్న ప్లేట్లు మరియు గిన్నెలను ఉపయోగించాలని డాక్టర్ మాటూరి తెలిపారు. పెద్ద మొత్తంలో ఆహారాన్ని తీసుకోవడానికి బదులుగా, తక్కువ మొత్తంలో ఆహారాన్ని తీసుకునే ప్రణాళికను కలిగి ఉండటం మంచిదని డాక్టర్ శెట్టి చెప్పారు. ఆకలి మరియు తృప్తి సూచనలపై శ్రద్ధ చూపడం ద్వారా మనస్ఫూర్తిగా తినడం సాధన చేయాలని డాక్టర్ మాటూరి వివరిస్తున్నారు. మీకు ఆకలిగా లేనప్పుడు తినడం మానేయండి. మీరు సంతృప్తి చెందినపుడు అతిగా తినడం ఆపివేయండి.

5.లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోండి

గర్బధారణ తర్వాత బరువు తగ్గే ప్రక్రియ నెమ్మదిగా మరియు స్థిరంగా ఉండాలని బెంగళూరులోని రెయిన్ బో చిల్డ్రన్స్ ఆస్పత్రి బర్త్‌రైట్ కన్సల్టెంట్ ప్రసూతి మరియు గైనకాలజీ డాక్టర్ శ్రీవిద్య గుడ్డేటి రెడ్డి అన్నారు. మీ శరీరం గణనీయమైన మార్పులకు గురైందని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం అని నిపుణులు పేర్కొంటున్నారు. అందువల్ల దీనిని సరిచేయడానికి కొంత సమయం కావాలి. తొమ్మిది నెలల గర్భధారణ సమయంలో పెరిగిన బరువు డెలవరీ తర్వాత వెంటనే కోల్పోలేము. దీనికి ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం సమయం పట్టొచ్చు. కనుక క్రమంగా బరువు తగ్గించే ప్రయాణాన్ని లక్ష్యంగా చేసుకోవాలని డాక్టర్ మాటూరి చెప్పారు.

6.వైద్యుడిని సంప్రదించండి

మీ ఆహారం లేదా వ్యాయామ దినచర్యలో ఏవైనా మార్పులు చేసే ముందు వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం అని నిపుణులు అంటున్నారు. అప్పుడు వారు మీ పరిస్థితిని అంచనా వేసి శారీరక శ్రమకు సిద్ధంగా ఉన్నారో లేదో నిర్ధారించి తగిన సలహాలను అందిస్తారని డాక్టర్ మాటూరి వివరించారు.

మీ అనుభవాన్ని లేదా వ్యాఖ్యలను పంచుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ట్రెండింగ్

వ్యాసాలు

0

0

0

Opt-in To Our Daily Newsletter

* Please check your Spam folder for the Opt-in confirmation mail

Opt-in To Our
Daily Newsletter

We use cookies to customize your user experience, view our policy here

మీ అభిప్రాయం విజయవంతంగా సమర్పించబడింది.

హ్యాపీయెస్ట్ హెల్త్ టీమ్ వీలైనంత త్వరగా మిమ్మల్ని సంప్రదిస్తుంది