728X90

0

0

0

0

0

0

0

0

0

ఈ వ్యాసంలో

సైక్లింగ్ vs వాకింగ్: బరువు తగ్గడానికి ఏది మంచిది?
9

సైక్లింగ్ vs వాకింగ్: బరువు తగ్గడానికి ఏది మంచిది?

సైక్లింగ్ మరియు నడక హృదయం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడే గొప్ప ఫిట్‌నెస్ కార్యకలాపాలు. మధుమేహం వంటి దీర్ఘకాలిక పరిస్థితులను అభివృద్ధి చేసే అవకాశాలను తగ్గిస్తుంది. బరువు నిర్వహణలో సహాయపడుతుంది.

సైకిల్ తొక్కడం లేదా నడవడం అనేది ప్రజల రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా ఉండే వాటిల్లో ఒకటి. కాలక్రమేణా సౌకర్యాలు పెరగడంతో అవి ఇప్పుడు అభిరుచి లేదా వ్యాయామంలో భాగంగా మారాయి. ప్రస్తుత కాలంలో నిశ్చల జీవనశైలి కారణంగా ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. నిపుణులు ఈ కార్యకలాపాలను రోజువారీ దినచర్యలో భాగంగా చేయాలని సిఫార్సు చేస్తున్నారు. వాటిని వ్యాయామంలో భాగంగా చేయడం లేదా పనులకు వెళ్లడం, నడక లేదా సైక్లింగ్ చేయడం కూడా మంచి పద్ధతులు.

శరీరంపై ఈ రెండు కార్యకలాపాల యొక్క సానుకూల ప్రభావం ఒకే విధంగా ఉంటుంది. అదే సమయంలో వారి డైనమిక్స్, వ్యాయామ శరీరధర్మశాస్త్రం మరియు బయోమెకానిక్స్ మరియు వ్యాయామం మరియు కేలరీల వినియోగం పరంగా భిన్నంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకు ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది. సైక్లింగ్ Vs వాకింగ్ రెండింటిలో ఏది మంచిది?.

సైక్లింగ్ Vs నడక ప్రయోజనాలు:

సైక్లింగ్ మరియు నడక రెండూ కూడా విస్తృత ప్రయోజనాలను కలిగిస్తాయి. అనేక ఆరోగ్యప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఇవి కార్డియో వాస్కులర్ ఫిట్‌నెస్‌ను మెరుగుపరుస్తాయి. బరువు నిర్వహణలో సహాయపడతాయి. మానసిక స్థితి, మానసిక శ్రేయస్సు మరియు ఓర్పును మెరుగుపరుస్తాయి. గుండె జబ్బులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక పరిస్థితుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

సైక్లింగ్ మీలోని ఓర్పు స్థాయిని పెంచుతుంది. ఇది గుండె మరియు ఊపిరితిత్తులకు కూడా మంచిది. ఇది రక్తప్రసరణ మరియు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇది మీ క్వాడ్రిస్ప్ లేదా క్వాడ్‌ల బలాన్ని పెంచుతుంది అని బెంగళూరులోని అవుట్‌ఫిట్ జిమ్‌లో ఫిట్‌నెస్ కోచ్ దీక్షిత్ గౌడ అన్నారు.

సైక్లింగ్ ప్రధానంగా క్వాడ్స్, హామ్ స్ట్రింగ్స్ వంటి కాలు కండరాలకు పనిచేస్తుంది. నడక మరోవైపు దిగువ శరీరం, కోర్ మరియు కొంతవరకు పైభాగంలో ఉన్న కండరాలతో సహా విస్తృత శ్రేణి కండరాలను నిమగ్నం చేస్తుంది. మీరు పూర్తి శరీర వ్యాయామం కోసం చూస్తున్నట్లయితే నడక చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఎందుకంటే ఇది బహుళ కండరాల సమూహాలను కలిగి ఉంటుంది.

క్వాడ్రిసెప్స్ గ్యాస్ట్రోక్నిమియస్ కండరం రెండు కార్యకలాపాలలో పనిచేస్తుంది. నడుస్తున్నప్పుడు, మీరు చురుగ్గా నడవడం లేదా ఎక్కువ వేగంతో కదులుతుంటే తప్ప ఈ కండరాలు తక్కువ ఉపయోగంలో ఉంటాయి. సైక్లింగ్‌లో లోడ్ ప్రధానంగా క్వాడ్‌లపై ఉంటుంది అని గౌడ పేర్కొన్నారు.

సైక్లింగ్ మరియు నడక: బరువు తగ్గడానికి

సైక్లింగ్, నడక రెండింటిలోనూ కొవ్వును కరిగించే సామర్థ్యం వ్యవధి, తీవ్రత మరియు వ్యక్తిగత ఫిట్‌నెస్ స్థాయిలతో సహా వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. అధిక తీవ్రతగల సైక్లింగ్ తక్కువ సమయంలో ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది. ఇది కార్యాచరణ సమయంలో మరింత కొవ్వును కోల్పోయే అవకాశం ఉంది. నడక స్థిరంగా మరియు ఎక్కువ కాలంపాటు చేస్తే కొవ్వ తగ్గడానికి కూడా ప్రభావవంతంగా ఉంటుంది.

బెంగళూరులోని ఎఫ్ఐటీటీఆర్‌లో ఫిట్‌నెస్ కోచ్ మరియు పోషకాహార నిపుణుడు బిస్వజిత్ సాహూ మాట్లాడుతూ.. నడక మరియు సైక్లింగ్ కొవ్వును బర్న్ చేయడానికి దోహదం చేస్తాయి. అవి కొవ్వుగా నిల్వ చేయబడిన వాటితో సహా కేలరీలను బర్న్ చేయడంలో ఏరోబిక్ వ్యాయామాలు సహాయపడతాయి అన్నారు.

బొడ్డు కోవ్వును ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకోవడానికి వ్యాయామంతో పాటు తక్కువ కేలరీల ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. అధిక తీవ్రత గల సైక్లింగ్ కేలరీలను బర్న్ చేయడంలో కొంచెం ఎక్కువ ప్రభావవంతంగా ఉండొచ్చు. కానీ కొవ్వు తగ్గడానికి స్థిరత్వం చాలా ముఖ్యమైనది.

సైక్లింగ్ Vs వాకింగ్: ఏది ఎక్కువ బలాన్ని పెంచుతుంది?

నడక, సైక్లింగ్ కండరాల ఓర్పు మరియు బలాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ముఖ్యంగా దిగువ శరీరం మరియు కోర్‌లో, కానీ మీ లక్ష్యం కండరాల బలాన్ని (కండరాల నిర్మాణం) నిర్మించడం అయితే సైక్లింగ్, నడక ప్రభావవంతంగా ఉండవు. ఎందుకంటే అవి కార్డియోవాస్కులర్ ఫిట్‌నెస్ మరియు ఓర్పుపై ద‌ృష్టి పెడతాయి. అటువంటి లక్ష్యాన్ని సాధించడానికి బరువులు లేదా ప్రతిఘటన శిక్షణతో కూడిన శక్తి శిక్షణ వ్యాయామాలు అటువంటి లక్ష్యాన్ని సాధించడానికి మరింత అనుకూలంగా ఉంటాయి.

సైక్లింగ్ మరియు నడక వంటి తేలికపాటి వ్యాయామాలతో కూడా కండరాలు అభివ‌ృద్ధి చెందుతాయి. నిపుణులు దానిని మంచి బరువు శిక్షణా రోటీన్‌తో కలపాలని సిఫార్సు చేస్తున్నారు. ఇది బలం మరియు కార్డియోవాస్కులర్ ఫిట్‌నెస్ పరంగా శరీరం యొక్క మొత్తం అభివృద్ధిని నిర్ధారిస్తుంది.

గాయం నుంచి కోలుకున్నాక ఏ చర్య ఉత్తమం?

గాయం తర్వాత ఏదైనా శారీరక శ్రమను ప్రారంభించడానికి ఒక వైద్యుని వద్దకు వెళ్లాలి. సాహు మాట్లాడుతూ.. గాయం నుంచి కోలుకున్న తర్వాత సైక్లింగ్, నడక మధ్య ఎంపిక గాయం యొక్క స్వభావంపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా, నడక తక్కువ ప్రభావం చూపుతుంది కనుక తిరిగి ప్రారంభించడానికి కూడా సురక్షితమైన ఎంపిక కావచ్చు. ముఖ్యంగా మోకాలికి గాయమైతే సైక్లింగ్ కూడా చేయవచ్చు. ఉదాహరణకు మోకాలి కణజాలానికి గాయాల నుంచి కోలుకుంటున్నవారికి ఇది సిఫార్సు చేయబడిందని అన్నారు.

మీ దినచర్యలో ఏది భాగంగా ఉండాలి?

నడక, సైక్లింగ్‌లో ఏది మన దినచర్యలో భాగమవుతుందనే విషయంలో మన సౌలభ్యం ముఖ్య కారకంగా చెప్పవచ్చు. ఇది వ్యక్తిగత ప్రాధాన్యతలు మరియు పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. నడక సాధారణంగా సులభం మరియు ఎక్కువ పరికరాలు అవసరం లేదు. మీరు దీన్నిదాదాపు ఎక్కడైనా చేయవచ్చు అని సాహూ పంచుకున్నారు. సైక్లింగ్‌కు వాహనం మరియు కొన్ని సందర్భాల్లో నిర్ధిష్ట భూభాగం లేదా మౌలిక సదుపాయాలు అవసరం కావచ్చు. మీ స్థానం మరియు వ్యక్తిగత ప్రాధాన్యాతలను బట్టి రెండూ సౌకర్యవంతంగా ఉంటాయి.

సారాంశం

-సైక్లింగ్ మరియు నడక హృదయం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడే గొప్ప ఫిట్‌నెస్ కార్యకలాపాలు. మధుమేహం వంటి దీర్ఘకాలిక పరిస్థితులను అభివృద్ధి చేసే అవకాశాలను తగ్గిస్తుంది. బరువు నిర్వహణలో సహాయపడుతుంది.
-సైక్లింగ్, నడక రెండింటిలోనూ కేలరీల బర్న్ వ్యవధి, తీవ్రత, వ్యక్తిగత ఫిట్‌నెస్ స్థాయిలు మరియు స్థిరత్వం వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది.
-మెరుగైన కండరాల బలం మరియు ఓర్పును లక్ష్యంగా పెట్టుకునేవారు సాధారణ నడక, సైక్లింగ్‌తో పాటు బరువు శిక్షణను దినచర్యగా కలిగి ఉండాలి.

మీ అనుభవాన్ని లేదా వ్యాఖ్యలను పంచుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ట్రెండింగ్

వ్యాసాలు

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient
We use cookies to customize your user experience, view our policy here

మీ అభిప్రాయం విజయవంతంగా సమర్పించబడింది.

హ్యాపీయెస్ట్ హెల్త్ టీమ్ వీలైనంత త్వరగా మిమ్మల్ని సంప్రదిస్తుంది